Co-option Members Elected in Sircilla Municipality
సిరిసిల్ల పురపాలక సంఘంలో కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తి
సిరిసిల్ల (నేటి ధాత్రి):
సిరిసిల్ల పురపాలక సంఘంలో కో-ఆప్షన్ మరియు మైనారిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం ఉదయం 11.00 గంటలకు చైర్పర్సన్ అధ్యక్షతన పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సాఫీగా పూర్తయ్యింది.
ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా నాలుగు మందిని కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఎన్నికైన వారు వివరాలు ఇలా ఉన్నాయి:
జనరల్ (మగ): నంది శంకర్ (తండ్రి: నర్సయ్య)
జనరల్ (ఆడ): కొండ అనూష (భర్త: శ్రీనివాస్)
మైనారిటీ (మగ): సయ్యద్ సోహెల్ (తండ్రి: సాదిక్)
మైనారిటీ (ఆడ): తస్లీమ్ (తండ్రి: సాబీర్)
ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని, అన్ని నిబంధనలు పాటిస్తూ సమావేశాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికైన సభ్యులకు చైర్పర్సన్ మరియు కౌన్సిల్ సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు.
