పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు సన్మానం
బడుల బాగుకు నిధులు
ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ
శాయంపేట నేటి ధాత్రి:
ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.శాయంపేట బాలికల పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేశారు బడిబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో ప్రతి గల్లీ ప్రతి ఇల్లు తిరుగుతూ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అభ్యసించి ప్రయోజకులు అయిన వారు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాల ప్రత్యేకతలను సాధించిన ప్రగతిని పాఠశాల గల వసతుల గురించి తెలియజేస్తూ డబ్బులను ప్రైవేటు పాఠశాలకు ఖర్చు పెట్టకుండా నాణ్యత కలిగిన ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలని తిరగడం జరిగింది.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం. పిల్లల చదువుల్లో లోటు పాట్లు తెలుసుకొని ప్రత్యేక శ్రద్ధలతో గత సంవత్సరం ముగించడం జరిగింది. పదో తరగతి ఫలితాల్లో 100% ఫలితాలు సాధించాం రాబోయే పదవ తరగతిలో 10 జీపీ సాధించడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాలు సమస్యను పిల్లలకు కోతుల బెడద ఉన్నందున జాలి సహకారం చేయాలని ఎమ్మెల్యేను కోరడమైనది. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజక వర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పిస్తూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దాలని తెలిపారు. విద్యకు అధిక ప్రాథమిక ఇస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరడమైనది. నియోజక వర్గంలోని అన్ని పాఠశాలల్లో వసతులు లేకుంటే ప్రభుత్వం తరఫున కల్పిస్తామని సభాముఖంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, విద్యాశాఖ అధికారులు ,ప్రజా ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్నాయకులు ,అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.