స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యం.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో అసాధ్యం

◆  ఒకవైపు 2024 జనాభా లెక్కలు  42% బిసి రిజర్వేషన్ల ప్రక్రియ కీలకం.

◆  ఒక నెలలోపే నిర్వహించాలని హైకోర్టు. రెండు నెలల సమయం కావాలన్న ప్రభుత్వం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

స్థానిక సంస్థల ఎన్నికలు జూన్ వివరి వారంలో జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు సూత్ర ప్రయకంగా ఆదేశించారు, రైతు భరోసా డబ్బులు వారి రైతుల ఖాతాలో జమ చేసినందున ఇదే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే పార్టీకి కలిసి వస్తు వస్తుందని భావించారు. కాని స్థానిక సంస్థల ఎన్నికలనిర్వహణకు పలు సాంకేతిక కారణాలు ఎదురవుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో తేల్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు తమకు రెండు నెలల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫున హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

ఈ రెండు నెలలో కూడా స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ చేయడం అంత సాధ్యమయ్యే పని కనిపించడం లేదు.

ఎందుకంటే 2024 లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తమ అధికారంలోకొస్తే 2024 లో జనాభా లెక్కలు తెలుస్తామని…

దాని ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటిస్తామంటూ హామీ ఇచ్చారు.

కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో జనాభా లెక్కలు నిర్వహించినప్పటికీ అందులో చాలా లోపాలు ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు సైతం ఆధారాలతో సహా బయటపెట్టాయి.

మరోసారి జనాభా లెక్కలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ లెక్కనా ప్రభుత్వం కొత్తగా జనాభా లెక్కలు చేయాలంటే కనీసం నెల రోజుల సమయం అయినా పడుతుంది. ఇప్పట్లో జనాభా లెక్కలు చేయడం అనేది కూడా సాధ్యమయ్యే పని కాదు.

ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్న కుటుంబాలు అధికంగా ఉంటాయి.

అధికారులు వచ్చిన సమయంలో ఇళ్ల వద్ద ఇంటి యజమానులు కానీ, ఇతరులు ఎవరు లేకపోవడంతో వాలంటీర్లు డోర్ లాక్ పేర్తో వెళ్ళిపోతున్నారు. గతంలో జరిగిన తప్పిదంలో కూడా ఇదే ప్రధాన కారణమని చెప్పవచ్చు.

ఈ లెక్కన 2025 డిసెంబర్ నాటికి కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదని చెప్పవచ్చు.

రిజర్వేషన్ల ను ఎలా ప్రకటిస్తారు..?

జనాభా లెక్కలను తేల్చిన ప్రభుత్వం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా తెలుస్తారనేది ప్రధాన ప్రశ్న ముందుగా జిల్లాను యూనిటీగా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తారా…

గ్రామ పంచాయతీల ఆధారంగా ఉన్న జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను కేటా ఇస్తారా అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేని కారణంగా రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకుండా ఎన్నికలకు పోవడం సాధ్యమయ్యే పని కాదు.

అందుకే పంచాయతీ కానీ, ఎంపిటిసి జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ జరగాలంటే జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను

ప్రకటించవలసి ఉంటుంది, ఉమ్మడి మెదక్ పంచాయతీలు 1140…

ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యాప్తంగా 1140 గ్రామ పంచాయతీలు ఉండగా 3358 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో రెండు కోట్ల 46 లక్షల 32 వేల ఓటర్లు ఉన్నారు.

ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం. 2024 జనాభా లెక్కల ప్రకారం తీస్తే 25 శాతం మేర ఓటర్ల సంఖ్య పెరగడంతో పాటు సుమారు ఐదు నుంచి 1000 గ్రామపంచాయతీలో కొత్తగా ఏర్పడే అవకాశం ఉన్నాయి. ఈ లెక్కన రిజర్వేషన్లను ప్రకటించకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యేది. కాదు. రిజర్వేషన్లు ప్రకటించాలంటే జనాభా లెక్కలను తేల్చవలసి ఉంటుంది. దాని తర్వాతనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభవుతుందని స్పష్టంగా చెప్పవచ్చు. ఏది ఏమైనాప్పటికీ డిసెంబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదనేది స్పష్టం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version