జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీలో శుక్రవారం రోజున చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు పెద్దపల్లి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కి మద్దతుగా స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతి గడపగడపకి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీల పేరుతో అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఇంతవరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, విద్యుత్ కోతలు, మంచినీటి ఇబ్బందులు మళ్ళీ మొదలయినవని, కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని,అందుకని ప్రజలందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.అలాగే ఉపాధి హామీ పనులను చేస్తున్న కూలీలను కలిసి మే 13న జరిగే ఎన్నికలలో కారు గుర్తుకే ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు పాల్గొన్నారు.