అంగన్వాడి టీచర్లకు మొబైల్స్ పంపిణీ

అంగన్వాడి టీచర్లకు మొబైల్స్ పంపిణీ

అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సరైన పోషణ – ఆరోగ్య తెలంగాణ లక్ష్యం అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోషణ పక్వాడ కార్యక్రమం ప్రారంభోత్సవం అంగనవాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై,జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించినారు.మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. సి.డి.పి.ఓ ఇంచార్జీ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి మల్లీశ్వరి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,రాష్ట్రంలోని అన్ని అంగనవాడి కేంద్రాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.అంగనవాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీ ద్వారా సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని చెప్పారు. గర్భిణీలు,బాలింతలు, చిన్నారుల ఆరోగ్య వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయడం సులభతరం

అవుతుందని,గతంలో 16 రిజిస్టర్లలో నమోదు చేయాల్సిన పనిని ఇప్పుడు సాంకేతికత ద్వారా సులభతరం చేసినట్లు తెలిపారు.పోషణ పక్వాడ కార్యక్రమం ద్వారా 15 రోజుల పాటు పౌష్టికాహారంపై అవగాహన కల్పించడంతో పాటు, గర్భిణీలు, బాలింతలు,చిన్నారుల ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించనున్నట్లు చెప్పారు.ప్రతి నెల మొదటి వారంలో పిల్లల ఎత్తు, బరువులను కొలిచి డిజిటల్ యాప్స్‌లో నమోదు చేస్తే పోషణ లోపాలను త్వరగా గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లేశ్వరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ ఆర్. టి.ఏ సభ్యులు సుంకరి రామచంద్రయ్యా స్థానిక కౌన్సిలర్లు,మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు,అంగన్వాడి టీచర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version