బాల్యనికి అంగన్వాడీ సేవలు ఎంతో ముఖ్యం…

బాల్యనికి అంగన్వాడీ సేవలు ఎంతో ముఖ్యం

అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ

దామెర బండ్ ని ఆకర్షనీయ ప్రదేశంగా తీర్చి దిద్దుతా

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో అంగన్‌వాడీ సిబ్బందికి స్మార్ట్‌ఫోన్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌లను అందజేశారు.ప్రభుత్వ పథకాల అమలులో అంగన్‌వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.చిన్నారుల పోషణ,ఆరోగ్యం,విద్య వంటి అంశాల్లో అంగన్‌వాడీ సేవలు ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధి నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగపడతాయని అప్పారు.స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా డిజిటల్ యుగంలో సమాచారాన్ని వేగంగా అందించుకోవడం,ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం ద్వారా అంగన్‌వాడీ సిబ్బంది పనితీరు మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంగన్వాడీలను మరింత బలోపితం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

దామెర బండ్ పునరుద్ధరణ పనుల పరిశీలన

పట్టణ కేంద్రంలో రూ 3.14 కోట్లతో చేపట్టనున్న దామెర బండ్ పునరుద్ధరణ పనులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దామెర బండ్‌ను ఆధునికంగా బ్యూటిఫికేషన్ చేసి ప్రజలకు ఆకర్షణీయ ప్రదేశంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే లక్ష్యంతో చెరువును అభివృద్ధి చేస్తామని,అలాగే చెరువు చుట్టూ రింగ్ బండ్ ఏర్పాటు చేసి,ప్రజలకు సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యాక పట్టణానికి ప్రత్యేక గుర్తింపు లభించడంతో పాటు ప్రజలకు విశ్రాంతి,వినోదానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని అన్నారు.ఈ పరిశీలనలో స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version