కారుకే ఓటేస్తం..సునీతనే గెలిపిస్తం!

`జూజ్లిహిల్స్‌లో జనమంతా అంటున్న మాట.

`ఎక్కడ విన్నా కేసీఆర్‌ ముచ్చటే.

`ఎక్కడ విన్నా సారే రావాలంటూ కోరుకుంటున్న పాట.

`కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఆగమే!

`అధికారంలోకి కాంగ్రెసోళ్లు గోసపెడుతున్రు.

`ఆరు గ్యారెంటీలు అంతా ఉత్తమాట.

`ఇంక నమ్ముతమా కాంగ్రెస్‌నంటున్న ఆడపడుచులు.

`ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నరు.

`ఇదీ జూబ్లీ హిల్స్‌ జనం మాట.

`బీఆర్‌ఎస్‌ నాయకులకు విక్టరీ సింబల్‌ చూపిస్తున్న మహిళలు.

`మా ఓటు కారుకే అంటున్న బస్తీల వాసులు.

`కేసీఆర్‌ వున్నప్పుడే మంచిగుండె అని ప్రజలే చెప్తున్నరు.

`కాంగ్రెస్‌ గెలిస్తే రౌడీ రాజ్యమే అని బాహటంగానే అంటున్న మహిళలు.

`బీఆర్‌ఎస్‌ నాయకులకు జనం నుంచి అడుగడుగునా నీరాజనాలు.

`కాంగ్రెస్‌ను నమ్మితే కాటగలిసినట్లే.

`బస్తీ మహిళలు కాంగ్రెస్‌ నాయకుల ముఖం మీదే చెబుతున్న మాట.

`మారు మాట్లాడకుండా జారుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు.

`పదేళ్లు మంచి నీళ్ల కరువు లేదు.

`సారున్నప్పుకు నీళ్లకు ఇబ్బంది పడలేదు.

`ఇప్పుడు మంచినీళ్లు సక్కగొస్తలేవు.

`కేసీఆర్‌ సారున్నప్పుడు కరంటు పోలేదు.

`ఇప్పుడు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతందో తెలుస్తలేదు.

`మోరీలు సక్కగ సాఫ్‌ చేస్తలేరు.

`కాంగ్రెస్‌ అంటే కూలగొట్టుడే..పేదోళ్ల బతుకు బజారే.

`అడుగడుగునా కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్న మహిళలు.

`కాంగ్రెస్‌ నాయకులతోనే మీకెయ్యం..కారుకే ఏస్తమంటున్న జనం.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
కారు గుర్తుకే ఓటేస్తాం. సునీతనే గెలిపించుకుంటాం. మాగంటి గోపీనాధ్‌ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నారు. బస్తీలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కాంగ్రెస్‌ వచ్చి కష్టాలు తెచ్చింది. జనాన్ని గోస పెడుతోంది. ఇంకా కాంగ్రెస్‌ను నమ్ముతామా? బరాబర్‌ సునీతనే గెలిపించుకుంటం..సునీతను బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తం. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్‌ ప్రజలు. గల్లీలు, బస్తీలు, కాలనీల ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్న మాటలు. కాంగ్రెస్‌ విచ్చనంక పడుతున్న గోసలు అన్నీ ఇన్నీ కావు. నీళ్లు రావు. కరంటు సక్కగ రాదు. తెలంగాణ రాకముందు వారం పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేటివి. ఎండాకాలమొస్తే బోరు నీళ్లు తప్ప మంచినీళ్లు గతి వుండేవి కాదు. మున్సిపల్‌ నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం పోయి, క్యాన్లలో తెచ్చుకునేటోల్లం. గంటలు గంటలు క్యూలో నిలబడి ఒక్క క్యాన్‌ నీళ్ల కోసం రోజంతా క్యూలో నిల్చున్న రోజులున్నయి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ రోజూ నీళ్లిచ్చిండు. ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చిండు. రోజూ ఇరవై వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇచ్చిండు. ఒక్కనాడు కూడా నీళ్ల గోసలేకుండా చూసుకున్నడు. ఎండాకాలమైనా, వానా కాలమైనా సరే నీళ్లకోసం ఎదురుచూసింది లేదు. మళ్ల కాంగ్రెస్‌ వచ్చింది. రెండేళ్లుగా ఎండా కాలంలో పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మున్సిపల్‌ నీళ్లు మూడు రోజులకోసారి కూడా సక్కగ వస్తలేవు. ఎండాకాలంలో వారం రోజులకు ఓసారి వచ్చినయ్‌. తెలంగాణ రాకముందు కరంటు కష్టాలు చూసినం. అప్పుడు సక్కగ కరంటే వుండేది కాదు. తెలంగాణ వచ్చినంక కేసిఆర్‌ ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చిండు. కరంటు ఎప్పుడూ పోయేది కాదు. బస్తీలలో దోమలుంటాయి. కరంటు లేకపోతే రాత్రి పూట నరకం చూస్తాం. కాంగ్రెస్‌ వచ్చింది.. కరంటు కష్టమొచ్చింది. కేసిఆర్‌ వున్నప్పుడు ఎంత వాన పడుతున్నా కరంటు పోయేది కాదు. ఇప్పుడు చినుకు పడితే ఖతం కరంటు పోతది. ఎప్పుడొస్తదో తెల్వది. కరంటు కోతలు. దోమలుతో జరాలు వస్తున్నయి. కాంగ్రెస్‌ సక్కదనానికి ఉచిత కంరటు అన్నది. ఎవలికి వస్తలేదు. ఉచిత ఆరు గ్యారెంటీలు చెప్పిండ్రు. ప్రజలను మోసం చేసింన్రు. కల్యాణ లక్ష్మి లక్షరూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. ఏది ఒక్కలికి కూడా ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు కూడా సక్కగ వస్తలేవు. ఆడపిల్లలకు స్కూటీలిస్తన్నరు. మహిళలందరికీ రూ.2500 ఇస్తమన్నరు. ఒక్కలికన్నా ఇచ్చిండ్రా.. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ అన్నరు. ఇచ్చింది లేదు. సచ్చింది లేదు. ఇదీ జూబ్లీహిల్స్‌లో వున్న పేద ప్రజలు కాంగ్రెస్‌ నాయకులు ముఖం పట్టుకొని అంటున్న మాట. ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులతో ఈ మాటలు అంటుంటే వాళ్లు సమాధానం చెప్పలేక, అక్కడి నుంచి జారుకుంటున్నారు. పైగా కాంగ్రెస్‌ పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను తిడుతుంటే నవ్వుకుంటున్నరు. ఇంకా తిట్టకు అనుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇదీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పరిస్తితి. ఇదిలా వుంటే పెద్దఎత్తున బిఆర్‌ఎస్‌ పార్టీలోకి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. బిఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తామని శపధం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌కూడా రానివ్వమని బిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు అంటున్నారు. ఇక బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం సాగిస్తుంటే ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఇటీవల ఓ బస్తీలో ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డిని చూసిన ఓ మహిళ విక్టరీ సింబల్‌ చూపించి ఆహ్వానించింది. జగదీశ్వరెడ్డి ప్రచారంలో బాగంగా ఓటు గురించి చెబుతుంటే కారే..కారే మాది అంటూ చెప్పడంతో బిఆర్‌ఎస్‌ నాయకుల మోములో నవ్వులు మెరిశాయి. నా పెద్ద కొడుకు కేసిఆర్‌ అంటూ ఓ ముసలవ్వ చెబుతూ, జై కేసిఆర్‌ అంటూ నినదించింది. ఇక సర్వేలు చేస్తున్న వారికి కూడా ప్రజలు స్పష్టమైన సమాధానం చెబుతున్నారు. సహజంగా సర్వేలకు వెళ్లిన వారికి గాని, ప్రచారానికి వెళ్లిన వారికి గాని తమ మనోగతాన్ని చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయరు. కాని ఎక్కడికెళ్లినా కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు చెప్పడం అంటే వారిలో ఎంత చైతన్యం వుందో అర్దం చేసుకోవచ్చు. ఏ మాత్రం భయపడుకుండా మహిళలు సునీతనే గెలిపిస్తామని చెబుతుంటే కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎక్కడ విన్నా కేసిఆర్‌ పాటే. సారే రావాలంటున్నది అంటూసాగే పాటనే గల్లీ గల్లీలో వినిపిస్తున్నది. గులాబీల జెండలమ్మా అంటూ సాగే పాట అడుగడునా వినిపిస్తున్నది. ఆరు గ్యారెంటీలు ఉత్త మాట. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చేది లేదు. సచ్చేది లేదంటూ మహిళలు కాంగ్రెస్‌ నాయకుల ముఖం మీద చెబుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ముస్లిం, మైనార్టీ ప్రజలు కూడా కారు గుర్తుకే ఓటు అంటూ చెబుతున్నారు. బిజేపి, కాంగ్రెస్‌ నాయకులకు జనమే చుక్కలు చూపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున సెక్యూటితో తిరుగుతున్నారు. జనాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. అయినా జనం జంకడం లేదు. ఓటేస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తమని రాసిస్తరా? అంటూ మంత్రులను కూడా జనం నిలదీస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారంలో ప్రజల కన్నా, సెక్యూరిటీలే ఎక్కువ వుంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారనికి వెళ్లలేక, జనంతో చీవాట్లు పడలేక సతమతమౌతున్నారు. కాంగ్రెస్‌ ఎంచుకున్న అభ్యర్ధి కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. బస్తీలలో నవీన్‌ యాదవ్‌, ఆయన అనుచరుల మూలంగా పడుతున్న ఇబ్బందులను గురించి కూడా జనం చెప్పుకుంటున్నారు. నవీన్‌ అనుచరులు రాత్రి సమయాల్లో చేసే హంగామాలను గురించి కధలు, కథలుగా జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడే నవీన్‌ యాదవ్‌, ఆయన అనుచరులతో పడరాని పాట్లు పడుతున్నామని, పొరపాటున గెలిపిస్తే నిత్యం నరకం చూడాల్సిందే అని మహిళలు అంటున్నారు. దాంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక అవస్ధలు ఎదుర్కొంటున్నారు. ఇక చిరు వ్యాపారులు కాంగ్రెస్‌ అభ్యర్ధి మీద చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. మామూళ్ల వసూళ్లతో తమ జీవితాలను ఆగం చేస్తున్నారంటూ చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అందుకే తాము బిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామంటున్నారు. కేసిఆర్‌ వున్నప్పుడు గల్లీలల్ల సప్పుడు వుండేది కాదు. లొల్లి లేకుండా బస్తీలు ప్రశాంతంగా వుంటేటివి. ఇప్పుడు రోజుకో లొల్లితో నిద్రలు కూడా వుంటలేవని జనం అంటున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఈ చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోలేమంటూ చిరు వ్యాపారులు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రౌడీల రాజ్యమౌతుందని జనం భయపడుతున్నారు. సునీతను గెలిపించుకొని ప్రశాతంగా వుంటామంటున్నారు. సునీత గెలుసుడు పెద్ద కష్టం కాదని ప్రజలే అంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బిజేపిలకు డిపాజిట్‌ కూడా దక్కదని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ వస్తే జూబ్లీహిల్స్‌లో పేదల బస్తీలుండవు. పేదలను బస్తీలలో వుండనివ్వరు. హైడ్రా పేరుతో కూల్చివేతలు మొదలు పెడతారని జనం భయపడుతున్నారు. కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తాము ప్రశాంతంగా వుంటామని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version