డిఐఈవో ఆఫీసులో పడకగదా…సిగ్గు..సిగ్గు
వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో కొందరు రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిగా మార్చుకొని ఉంటున్న విషయాన్ని ‘నేటిధాత్రి’ ప్రభుత్వకార్యాలయమా..? పడకగదా..? అనే శీర్శికతో పాఠకుల ముందుకు తీసుకువచ్చింది. రాత్రి వేళలో కార్యాలయాన్ని పడకగదిలా మార్చుకొని ఉంటుండడాన్ని ప్రజలు, ఉద్యోగ సంఘాల నేతలు, విధ్యార్థి నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బాధ్యతగా, హుందాగా వ్వవహరించాల్సిన డిఐఈవో ఈ విదంగా కార్యాలయానికి చెడ్డ పేరు తేవడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కార్యాలయానికి వెళ్లాలంటేనే సిగ్గుగా ఉందని వాపోతున్నారు. ఇప్పటికి కార్యాలయంలో ఉంటున్నది ఎవరనేది అంతుచిక్కడంలేదని ఇంతలా దిగజారి కార్యాలయానికి తలవంపు తెస్తారని అనుకోలేదని ఉద్యోగులు సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.
తలవంపులు తెస్తున్నా డిఐఈవోపై చర్యలు శూన్యం
విలువలను, హూందాతనాన్ని, ఉద్యోగుల నైతికతను, బాధ్యతను, గౌరవాన్ని, వృత్తిధర్మాన్ని మంటగలుపుతూ డిఐఈవో కార్యాలయ పరువును బజారుకీడుస్తున్న డిఐఈవో ఒంటెద్దుపోకడతో ఉగ్యోగలమంతా తలదించుకున్నంత పని అయిందని, కార్యాలయానికి వెళ్లాలంటేనే చాలా సిగ్గుగా ఉందని కొందరు ఉద్యోగులు అంటున్నారు. ఓ వైపు అవినీతి అక్రమాలు జరుగుతున్నాయంటూ, మరో వైపు నీతిమాలిన పనులు ఏకంగా కార్యాలయాన్నే అడ్డగా మార్చుకొని వ్యవహరిస్తున్నారా..? అనే కోణంలో ‘నేటిధాత్రి’లో కథనాలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిఐఈవోకు ఉన్నతాధికారుల అండదండలు ఉండటం వల్లనే ఆయన వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
మండిపడుతున్న విద్యార్థి, ఉపాద్యాయ సంఘాలు
ప్రభుత్వ కార్యాలయమా…? పడక గదా..? అనే కథనం బయటికి రావడంతో జిల్లా వ్యాప్తంగా డిఐఈవో కార్యాలయం గురించి, లీలలపై, అవినీతి, అక్రమాలపై ప్రతిఒక్కరు చర్చించుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగ, ఉపాద్యాయ, లెక్చరర్ల సంఘాల నేతలు డిఐఈవోపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం కొన్ని ఉపాద్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ విషయంపై కలెక్టర్‌కు, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్‌కు కలిసి వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిసింది.