మాజీ ఎంపీటీసీ ఆకుతోట లక్ష్మి-కుమారస్వామి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
సామాన్య పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో అనునిత్యం..ప్రజాసేవకై అంకితమై..పేద ప్రజల సమస్యల్లో మేమున్నామంటూ..అధికారంలో ఉన్న లేకపోయినప్పటికీ బహుజన నాయకురాలిగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న గుణంలో సీతాదేవిలాంటి అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ తాను ఇన్చార్జి మంత్రిగా ఉన్న సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా పాల్గొన్న సమావేశంలో బిజెపి ఎంపీ రఘునందన్ రావు అక్కడి సమస్యలను మంత్రి కొండా సురేఖమ్మ దృష్టికి తీసుకెళ్లి సోదర.సోదరీ భావంతో..అక్క అంటూ నూలు పోగులకు సంబంధించి దండ తీసుకురాగా..అప్పటికే రెండు రంగుల దండాగా భావించిన సురేఖమ్మ రఘునందన్ రావును అడగగా..మన జాతీయ జెండా 3వ కలర్ తెలుపు రంగు కూడా ఉంది అక్క అని రఘునందన్ రావు సమాధానం ఇచ్చి..సమస్యల రూపంలో దండా వేయగా..దానిని బీఆర్ఎస్ నీతిమాలిన కుక్కలు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు తీసుకున్న విధంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ..బీసీ మహిళా మంత్రిని అవమానిస్తున్న తీరును యావత్తు మహిళలోకం తీవ్రంగా ఖండిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం మాజీ ఎంపీటీసీ ఆకుతోట లక్ష్మి తీవ్రంగా విమర్శించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. పేద ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకునే ఒక బీసీ మహిళా మంత్రిపైనే అగ్రవర్ణ కులాలకు చెందిన దోరహంకారులు ఇలాంటి నీచమైన కార్యక్రమాలకు పాల్పడుతూ..కొండా సురేఖమ్మను మానసికంగా వేధించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. పోరాటంలో ఓరుగల్లు రుద్రమదేవిగా..ధీరత్వంలో ఝాన్సీ రాణిగా..సహనంలో భూమాతగా..రూపంలో పార్వతీ దేవిగా..పేద ప్రజల పిన్నిధిగా పేరు ప్రఖ్యాతులు గాంచిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా ఫైర్ బ్రాండ్ కొండా సురేఖమ్మను టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ కుక్కలకు పుట్టగతులుండవన్నారు. ఇప్పటికైనా నీతిమాలిన కుక్కలు కొండా సురేఖమ్మకు క్షమాపణలు చెప్పాలని..లేకుంటే బీసీల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.