రైతులకు పంట రుణాలు ఇవ్వాలి

అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
పంట రుణాలు కావాలని రైతులు గత ఆరు నెలల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) బ్యాంకులో రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే ఇప్పటి వరకి పంట రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని ఇందుమూలంగా రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తుందని ఇప్పటికీ ఎస్బిఐ బ్యాంకులో 400కు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే దరఖాస్తులు చేసుకున్న రైతులకు పంట రుణాలు ఇవ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) మండల అధ్యక్ష కార్యదర్శులు బచ్చల సారన్న, కొమరం సీతారాములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి అఖిలభారత రైతు కూలి సంఘం గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) బ్యాంకు ముందు ధర్నా నిర్వహించి బ్యాంకు మేనేజర్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ స్పందించి రీజనల్ మేనేజర్ ఆర్ఎం తో శరవాణి ద్వారా మాట్లాడించారు.ఈ సందర్భంగా రైతులతో రీజినల్ మేనేజర్ ఆర్ ఎం శరవాణి ద్యారా మాట్లాడుతూ వెంటనే గుండాల ఎస్బిఐ బ్యాంకును సందర్శించి రైతులు పెట్టుకున్న దరఖాస్తులను పరిశీలించి వీలైనంత తొందరగా ఎస్బిఐ బ్యాంకు ద్వారా రైతులకు రుణాలందే విధంగా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు.రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం పంట రుణాలు మంజూరు చేయకపోతే రైతులతో కలిసి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) మండల నాయకులు ఈసం మంగన్న,పెండకట్ల పెంటన్న, వజ ఎర్రయ్య, మోకాళ్ళ బుచ్చయ్య, కుంజ గిరిజయ్య, కల్తి నరసింహారావు, బోడ వీరు, కల్తీ రామ్మూర్తి, పూనెం పొట్టయ్య, తాటి రమేష్, కల్తీ ప్రమోద్, అరెం రామారావు, ఈసం సుధాకర్, మోకాళ్ళ పోతయ్య, అరెంమంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *