గూడూరి చైతన్యకు డాక్టరేట్ ప్రదానం

గూడూరి చైతన్యకు డాక్టరేట్ ప్రదానం

పరకాల, నేటిధాత్రి

హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన గూడూరి చైతన్యకు డాక్టరేట్ ప్రదానం జరిగింది.ఆంగ్ల విభాగంలో పరిశోధకురాలిగా భారతీయ మరియు పాశ్చాత్య సాహిత్య విమర్శలు అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఈ గౌరవం లభించింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆమెకు డాక్టరేట్ ప్రకటించారు. ఈ పరిశోధనను ఆంగ్ల విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజా అంబేద్కర్ పర్యవేక్షణలో పూర్తి చేశారు.ప్రస్తుతం గూడూరి చైతన్య హనుమకొండ జిల్లా తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా సేవలందిస్తున్నారు.ఆమెకు డాక్టరేట్ లభించిన సందర్భంగా కుటుంబ సభ్యులు,సహచర ఉపాధ్యాయులు, మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version