జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాలను ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ కు తరలింపుపై పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు