అవినీతి ఉద్యోగుల భరతం పట్టేనా…?
వరంగల్ అర్బన్జిల్లా ఇంటర్మీడియట్ క్యాంపు కార్యాలయంలో పేపర్ వాల్యుయేషన్ పేరుతో అవినీతికి పాల్పడి, ప్రభుత్వ సొమ్మును మెక్కేసిన సూపరింటెండెంట్ సాయిబాబా, డిఐఈవో లింగయ్యలను ఎట్టి పరిస్థితిలోను వదలొద్దని, వారి అవినీతిని బయట పెట్టడానికి తక్షణమే విచారణ కమిటిని వేసి కాజేసిన సొమ్మును రికవరీ చేయడంతో పాటు వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా ప్రజలు, ప్రజిసంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాస్వామికవాదులు, సీనియర్సిటిజన్లు, మేధావి వర్గం కోరుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై కొందరు అన్ని ఆదారాలు సేకరించినట్లు సమాచారం. ఆదారాలను తీసుకొని అన్ని సంఘాలను కలుపుకొని సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్పిస్తున్నామని తెలిపారు.ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో సీఎం కేసీఆర్ను కలవటం కుదరలేదని ఎన్నికల బీజీ అయిపోయినందున, ఇప్పుడు కలువడానికి అపాయింట్మెంట్ కొరకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఆర్జేడికి ఫిర్యాదుచేసినా పట్టించుకోని వైనం
అవినీతిపై విచారణ కమిటినీ వేయాలని, బాధ్యులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై ‘నేటిధాత్రి’లో వచ్చిన కథనాలను జతపరుస్తూ వరంగల్ ఆర్జేడి ప్రదానకార్యాలయంలో నేటిధాత్రి ప్రతినిధి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఫిర్యాదుపై ఎలాంటి స్పందన లేదని, అవినీతికి పాల్పడిన వారికి ఆర్జేడి కార్యాలయంలో ఎవరైనా సహకరిస్తున్నారా? అనే అనుమానం లుగకమానదు.ఓ వైపు ఇంటర్బోర్డులో నిర్లక్ష్యం వెటాడుతుండగా మరో వైపు వరంగల్ ఆర్జేడి కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కాని పరిస్థితి నెలకొన్నది. అసలు ఫిర్యాదు ఆర్జేడికి అందించారా? అందించలేదా అన్న సందేహం కలుగుతున్నది.
కేసీఆర్ పాలనపై ప్రజలకు అపారనమ్మకం
రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనై ప్రజలకు అపారనమ్మకం ఉన్నది. ఆయన చేపడుతున్న అబివృద్ది కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నేపధ్యంలో వరంగల్ అర్బన్జిల్లా ఇంటర్మీడియట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై కూడా చర్యలుంటాయని ప్రజలు భావిస్తున్నారు. తక్షణమే విచారణ కమిటిని నియమించి అవినీతిని బయటపెట్టి బాధ్యులను ఉద్యోగాల నుండి సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
అధికార యంత్రాంగం నమ్మకాన్ని వమ్ముచేయొద్దు
సీఎం కేసీఆర్పై ప్రజలకు ఉన్న నమ్మకాన్నివమ్ముచేయకుండా ప్రభుత్వ అధికార యంత్రాంగం పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాయలాల్టో ఉద్యోగులు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్ ఆదేశాలను అధికారయంత్రాంగం తూ.చ. తప్పకుండా పాటించినప్పుడే కేసీఆర్ ఆదేశాలను పాటించినట్టవుతుందని, అప్పుడే కేసీఆర్పై ప్రజల్టో మరింత విశ్వసనీయత పెరుగుతోందని ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో వరంగల్ ఇంటర్మీడియట్ అర్బన్జిల్లా క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై అధికార యంత్రాంగం కేసీర్ ఆదేశాలను గౌరవిస్తుందా? పెడచెవినపెడుతుందా వేచి చూడాల్సిందే…!