రాజ్యాంగం అంటే ప్రశ్నించే హక్కు

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మహనీయుడు

గజ్జ చందు
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్

కాశిబుగ్గ నేటిధాత్రి

భారత రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ గజ్జ చందు అన్నారు.
మంగళవారం 75వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని టాక్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల నాగరాజు తో కలిసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సుద్దాల నాగరాజు మరియు గజ్జ చందు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని,రాజ్యాంగం లోని ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గొప్ప మేధస్సు గల వ్యక్తి అని,అనేక కష్ట,నష్టాలు పడి భవిష్యత్తు తరాల వారికి ఇబ్బందులు కలగకుండా పలు చట్టాలను రూపొందించిన మహనీయుడని కొనియాడారు.రాజ్యాంగాన్ని రూపొందించిన ఆ మహానీయుడు పండిత్ జవహర్ లాల్,సర్దార్ వల్లభాయ్ పటేల్ తో కలిసి పార్లమెంట్లో ఆమోదింప చేశారని, కొంతమంది వ్యక్తులు రాజ్యాంగ చట్టాలను తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంటరానితనం నిర్మూలన, ప్రతి ఒక్కరు విద్య నేర్చుకోవాలనే తపనతో ముందు సాగారని, మహనీయులు రూపొందించిన రాజ్యాంగ చట్టాలు అమలు కాని పక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ లకే కాకుండా మానవులందరికీ నష్టం జరుగుతుందని అన్నారు.ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో టాక్స్ నాయకులు,ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!