పరకాల నేటిధాత్రి
మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరకాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కే సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగమని ఈ రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగిందని రాజ్యాంగం గూర్చి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యాంగం మరియు చట్టాలను ప్రజాస్వామ్యమును పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎండి సర్దార్,అధ్యాపకులు మాధవి,మైపాల్ రెడ్డి, కృష్ణమోహన్,వీర్య ప్రసాద్, రమాదేవి,భవాని,రవీందర్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.