కేంద్రంలో పాంచ్ న్యాయ్ పథకాలతో కాంగ్రెస్ పార్టీ…

# ఎన్నికల పోరాటంలో పంచ పాండవులుగా కాంగ్రెస్ పార్టీ..

# చరిత్రకు విడ్డూరంగా మోడీ అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట..

# కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు..

# ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్. టి పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి
ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్.

నర్సంపేట,నేటిధాత్రి :

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువ న్యాయం, నారి న్యాయం, రైతు న్యాయం,శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం అనే పాంచ్ న్యాయ్ పథకాలతో మేనిఫెస్టో విడుదల చేసి దేశ వ్యాప్తంగా ఎన్నికల బరిలో దిగిందని ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్. టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి,మహబూబాబాద్,వరంగల్,భువనగిరి పార్లమెంట్ పరిది ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఇంఛార్జి
ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ అన్నారు.శుక్రవారం నర్సంపేట పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.అమరుల త్యాగాలతో రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు వెన్నుపోటుగా బీఅర్ఎస్ పార్టీ ఇతర రాష్ట్రాలతో కలిసిందని దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
అందుకే ఓడిపోయిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఇక్కడి ప్రజలకు న్యాయం చేసిందన్నారు.ఆనాటి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వారి పదవుల త్యాగం తెలంగాణ ప్రకటనకు మార్గం అయ్యిందని తెలిపారు.దేశంలో అనేక కాంగ్రెసేతర ప్రధానిలు ఇప్పటి వరకు మతాల పేరుతో మాట్లాడలేదని,హిందూ ముత్తైదువుల తాళిబొట్టు, హిందూ సమాజాన్ని పిరికి సమాజంగా తయారు చేసింది ప్రధాని మోడీ కాదా అని ప్రశ్నించారు.
భర్త లేడని రాష్ట్రపతి ద్రౌపతి మూర్మాను అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్టకు పిలువని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన బార్య ఉండి కూడా సనాతన ధర్మానికి,చరిత్రకు విరుద్ధంగా రామ మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ట ఎలా చేసావు అని ప్రధానిపై మండిపడ్డారు.అనాడు యజ్ఞం చేయడానికి రాముడు కూడా బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకొని యాగం చేశాడని మరోసారి గుర్తుకు చేశారు.మూడు నల్లచట్టాలను తెచ్చి వందలాది రైతులకు పొట్టన పెట్టుకున్న ది మోడీ ప్రభుత్వం ఇప్పుడు మతాల పేరుతో విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చామని నేడు కేంద్రంలోని ఐదు గ్యారంటీల పథకాలతో అధికారంలోకి రాబోతున్నాయని ఇప్పటికే ఆయా రాష్ట్రంలో జరిగిన మొదటి పేజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ,రెండో ఫేజ్ లో జరిగిన ఎన్నికల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నామని అలాగే మూడో దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీలో ఉన్నామని తెలుపుతూ ఇప్పుడు జరుగబోయే ఎన్నికల్లో కలిపి ఇండియా కూటమి ఐదు గ్యారంటీలతో 300 సీట్లతో హస్తినను హస్తగతం చేసి ఎర్రకోటపై జెండా ఎగురవేస్తామని వెంకటస్వామి గౌడ్ ధీమా వ్యక్తంచేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరానికి 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డ మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో నడుస్తున్నదని దీంతో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగటం తప్పదని ఫ్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు.నేను గత 35 ఏండ్ల క్రితం అర్ఎస్ఎస్ లో పనిచేశానని హిందూ సనాతన ధర్మాల గురించి మాకు తెలువదా అని ప్రధాని మోడీ,కేంద్ర మంత్రి అమిత్ షా లను ఆయన ప్రశ్నించారు.మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మాలోతు కవితకు ఓటు వేస్తే వృదానే అని గతంలో ఇక్కడి నుండి గెలిచి కేంద్ర మంత్రిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ అని తెలుపుతూ మరోసారి ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గౌడ్ కోరారు.ఈ సమావేశంలో పీసీసీ కో ఆర్డినేటర్ కొర్ర రాజన్న,వెంకన్న,లింగారెడ్డి,తిరుమల్,రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!