ఉత్తర తెలంగాణ మాల జేఏసీ కన్వీనర్ పీక కిరణ్ డిమాండ్
కాటారం నేటి ధాత్రి
ఉత్తర తెలంగాణ మాల జేఏసీ కన్వీనర్ పీక కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి అభ్యర్థిగా యువ నేత గడ్డం వంశీకృష్ణను ప్రకటించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల కొరకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో విశాఖ ట్రస్ట్ నుండి అనేక సేవా కార్యక్రమాలు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడమే గవర్నమెంట్ స్కూల్ లలో ఫర్నిచర్ పేద ప్రజలకు తాగునీరు కొరకు బోర్లు వేయించుట తన ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఇలా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉన్నటువంటి వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరు కలిసి భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటారని తెలిపారు అలాగే త్వరలోనే వంశికృష్ణకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. పెద్దపల్లి పార్లమెంట్ ఇన్చార్జి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క. కరీంనగర్ జిల్లాల ఇన్చార్జి ఉత్తంకుమార్ రెడ్డి. అలాగే ఇండియా కూటమి సిపిఐ. తెలంగాణ జన సమితి. సిపిఎం. ప్రజా సంఘాల. నాయకులను కలవనున్నామని పీక కిరణ్. తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్తర తెలంగాణ మాల జేఏసీ నాయకులు వావిళ్ళ రమేష్. బోడ బాపు. శ్రీనివాసు. తదితరులు పాల్గొన్నారు.