పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు
జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలోని దుబ్బ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను సోమవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలకు మేరకు మంచిర్యాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ రిక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో ఎస్సీ సబ్ ప్లాన్ కింద డ్రైనేజ్ పనులకు 22 లక్షల రూపాయలు మంజూరు అవడంతో డ్రైనేజీ లకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
