కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలి
సిద్దిపేట పట్టణంలో రేపు జరిగే ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక (ఆత్మీయుల సమ్మేళనం) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నర్సంపేట ఆర్టీసీ డిపో మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిశెట్టి ప్రవీణ్, గొలనకొండ వేణులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు, ఆర్టీసీ కండక్టర్లు పోరాటం చేసినా నేడు ఫలితం లేకుండా పోయిందని, ఏదో ఒక కారణంతో ఉద్యోగాలు తొలగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం చర్చించి ఉద్యోగులకు సంపూర్ణ భద్రత కల్పించాలని ప్రకటన ద్వారా కోరారు. రేపు సిద్దిపేటలో జరిగే కండక్టర్ల ఐక్య వేదికను విజయవంతం చేయాలని అన్నారు.