నష్టపరిహారం ఇప్పించాలని వేడుకొంటున్న రైతులు
శాయంపేట, నేటి ధాత్రి:
శాయంపేటమండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పలువురు రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారు. వరి పంట వేసి నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు పొట్ట దశకు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం శాయంపేట ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించి గోడును వెల్లబోసుకున్నారు. మైలారం గ్రామానికి చెందిన శ్రీరాముల నరేష్ ఏజెంట్ హుజురాబాద్ మండలం బోర్నపల్లి గ్రామానికి చెందిన వజ్జిన పల్లి మొగిలి అనే ఇద్దరు సంయుక్తంగా కర్నూల్ సీడును 15 మంది రైతులకు 35 బ్యాగులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. మంచి ఫలితం ఉంటుందని నమ్మబలికినట్లు తెలిపారు. జనవరిలో విత్తనాలు వేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. వారు చెప్పిన పద్ధతి ద్వారానే వరి నారు వేసినట్లు తెలిపారు. పక్కన ఉన్న వేరే రైతుల పంట పొలాలు మంచి దిగుబడి వచ్చిందని, కానీ మేము వేసిన వరి నారు ఇప్పటివరకు పచ్చగా ఉండి పొట్ట దశకు రాలేదని అన్నారు. వర్షాకాలం మొదలు కావడం వల్ల మేము వేసిన వరి పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. మేమందరం 37 ఎకరాలలో తీవ్రంగా నష్టపోయాం. రైతుల పక్కకు ఉన్న భూమిలో పంటలు అయిపోయి అమ్ముకోవడం జరిగింది ఇది చూసిన రైతులు పంటజనులు కంకి రాకపోగా పచ్చగా ఉన్న దానిని చూసిన రైతులు కండ్లు కన్నీరు పెట్టుకున్నాయి. ఏజెంట్లకు,కంపెనీ యాజ మాన్యానికి తెలియజేసి నప్పటికీ వారు స్పందించడం లేదు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలని రైతులు వేడుకున్నారు. విచారణ జరిపి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డమీది కర్ణాకర్, నాలికె మధుసూదన్, అంబాల మల్లయ్య, బుర్రి మహేందర్, అన్నేబోయిన రఘుపతి, నాలికే మహేందర్, రామ్ తదితర రైతులు పాల్గొన్నారు.