గణపురం మండలంలో ఐకెపి సెంటర్ల నిర్లక్ష్యం
రైతుల ఇబ్బందులు దృష్టి పెట్టని అధికారులు
మరో రెండు రోజుల్లో తెలంగాణలో భారీవర్ష సూచన
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గత నాలుగు రోజుల నుండి లారీలు రాకపోవడంతో కాంటాలైన ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నిల్వ వుంటుందని రైతులు ఆరోపిస్తున్నారు లారీలు రాక ధాన్యం బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే నిలిచిపోయాయి అదేవిధంగా సకాలంలో కాంటాలు కాకపోవడంతో రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్లు కిరాయిలకు తీసుకొని దగ్గర్లో ఉన్నటువంటి మిల్లులకు తరలించినప్పటికీ ట్రాక్టర్ల దిగుమతి కావడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు ఇప్పటికైనా స్థానిక గణపురం పిఎస్ఎస్ చైర్మన్ స్పందించి జిల్లా ఉన్నత అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించి కాంటాలైన ధాన్యం మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని గణపురం మండల రైతులు వేడుకుంటున్నారు