భూపాలపల్లి లో మెడికల్ షాప్ లో బంద్ సంపూర్ణం

భూపాలపల్లి లో మెడికల్ షాప్ లో బంద్ సంపూర్ణం

మందుల షాపులు బంద్ చేసి నిరసన తెలిపిన యజమానులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఆన్‌లైన్ ఫార్మసీల అక్రమ కార్యకలాపాలు, కార్పొరేట్ సంస్థల విపరీతమైన డిస్కౌంట్లు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఫార్మాస్యూటికల్ ట్రేడర్స్, కెమిస్ట్‌లు డ్రగ్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిరసన తెలుపడం జరుగుతుందని జిల్లా అధ్యక్షుడు వి శ్రీనివాస్ అన్నారు
జిల్లా కేంద్రంలోని మందుల షాపు యజమానులు కెమిస్ట్రీ అండ్ డ్రగ్ హిస్టరీ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ వారి పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మందుల షాపుల యజమానులు అందరూ షాపులు బంద్ చేయడం జరిగింది కరోనా సమయంలో ఆన్లైన్లో మందులు కొనుగోలు చేయొచ్చని ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది అదే జీవో ఇప్పటికీ కొనసాగుతుంది 18 సంవత్సరాలు నిండిన వారి నుండి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో మందులు కొంటున్నారు దానితో వారి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఆస్పత్రి డాక్టర్స్ పర్యవేక్షణలో మందులను కొనుగోలు చేసి మందులు వాడాలి కానీ ప్రజలు వారికి ఇష్టం వచ్చినట్టు మందులను ఆన్లైన్లో కొనుగోలు చేసి వాడుతున్నాడు దానివల్ల వారి ఆరోగ్యాలు కరాబ్ అవుతున్నాయి అలాగే చిన్న పిల్లలకు జ్వరం జలుబు వచ్చిన ఆన్లైన్లో జ్వరం సిరప్ గాని స్థానికలు గాని ఆన్లైన్లో కొంటున్నారు దానివల్ల చిన్న పిల్లలు అనారోగ్య పాలు అవుతున్నారు కావున కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆన్లైన్ మందుల వ్యాపారాన్ని బందు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో డ్రగ్ హిస్టరీ కెమిస్ట్రీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి శ్రీనివాస్ జనరల్ సెక్రెటరీ రామకృష్ణారావు కోశాధికారి రమేష్ గౌరవ అధ్యక్షుడు తౌటం ప్రభాకర్ సదానందం తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version