ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేపట్టాలి

ఫిర్యాదులపై పారదర్శకంగా విచారణ చేపట్టాలి

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

చెన్నరావుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించిన సీపీ

నర్సంపేట,నేటిధాత్రి:

పోలీస్ స్టేషన్ అధికారులు పారదర్శకంగా ఫిర్యాదుల విచారణ నిర్వహించి భాదితులకు బాసటగా నిలవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ తెలిపారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ పరిధిలోని చెన్నరావుపేట పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం సందర్శించారు చేశారు. ఉదయాన్నే చెన్నరావుపేట పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పోలీస్ కమిషనర్ కు మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ రిసెప్షన్, ఐటీ సిబ్బంది, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును సీపీ సిబ్బందిని పని తీరును అడిగి తెలుసుకన్నారు.

స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులతో పాటు, రౌడీ షీటర్లు, అనుమానితుల రికార్డులు, ప్రస్తుతం పెండింగ్ కేసుల రికార్డ్ లకు సీపీ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుకున్నారు.పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి కానిస్టేబుల్ గ్రామాలను సందర్శించి శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రతి గ్రామస్తుడు తప్పని సరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించే విధంగా ట్రాఫిక్ రూల్స్ పై అవగహనా కల్పించాలన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకై ముందస్తు చర్యలు తీసుకోవాలని,అక్రమ ఇసుక రవాణా, పాఠశాలల పరిసరాల్లో పోగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహారించాలని పోలీస్ కమిషనర్ అధికారులు, సిబ్బందికి తెలిపారు.ఈ తనిఖీల్లో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, నెక్కొండ సిఐ శ్రీనివాస్ చెన్నరావుపేట, నెక్కొండ ఎస్.ఐలు రాకేష్ రెడ్డి, మహేందర్ వున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version