వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పిఎసిఎస్ చైర్మన్
నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాదారం పిఎసిఎస్ చైర్మన్ నల్లెల లింగమూర్తి.ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి మద్దతు ధర పొందాలని సూచించారు, అలాగే రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వజీర్, డిపి సదానందం,సీఈఓ రాజేందర్,నవీన్,రైతులు, తదితరులు పాల్గొన్నారు.
