Severe Cold Wave Grips Telangana
చలి పంజా…….చలి పంజా.. పగటి, రాత్రిపూట పతనమైన ఉష్ణోగ్రత…. వణికిస్తున్న చలి
◆-: జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతల నమోదు
◆-: ఉదయం 9 గంటలు దాటినా తగ్గని చలి తీవ్రత
◆-: ఇండ్ల నుంచి బయటికి రావాలంటే జంకుతున్న జనం
◆-: ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం
◆-: ఆరోగ్య జాగ్రత్తలు అవస రమంటున్న వైద్యులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కోహిర్, జహీరాబాద్ లో 6.6, అల్గోల్ 6.8, న్యాల్కల్ 7.1, మొగుడంపల్లి 7.2, మల్ చల్మా 7.8, కడపల్ 8.0, నల్లవల్లి, పుల్కల్ 8.5, సదాశివపేట 8.7, సిద్ధాపూర్ 8.9, కంగ్రి 9.1, దిగ్వాల్ 9.3, జిన్నారం, కొండాపూర్, రామచంద్రపురం, హత్నూర 9.4, నాగల్ గిద్ద 9.5, కంది 9.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ సమాచారం వాతావరణ పరిస్థితులను తెలియజేస్తుంది.

సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత చలి పంజా విసురుతోంది. చలిగాలుల ఉధృతి పెరగడంతో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రతకు తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు వణుకుతున్నారు. పొగమంచు వల్ల వాహనదారులు కొంత ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకొని కాచుకుంటున్నారు. పట్టణాల్లో సాయంత్రం నుంచే రహదారులపై రద్దీ క్రమ క్రమంగా తగ్గిపోతోంది. పల్లెలలో ఉదయం పొగమంచు కమ్మేస్తుంది. దీంతో వ్యవసాయదారులు ఉదయాన్నే పొలానికి వెళ్లాలంటే జంకుతున్నారు. ఎండ వచ్చి చలి తీవ్రత తగ్గాకే పనులకు వెళ్తున్నారు. చలి తీవ్రతకు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల్లో చర్మవ్యాధులతోపాటు కంటి వ్యాధులు సోకే ప్రమాదముందంటున్నారు. వృద్ధుల్లో అస్తమా, లోజ్వరం, చర్మవ్యాధులు, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రధాన కూడళ్లలో ఒకొక్కటిగా స్వెటర్ల దుకాణాలు వెలుస్తున్నాయి.

వారం రోజులుగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో జనం గజగజ వణుకుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చల్లగాలులు వీస్తున్నాయి. చలికి జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉదయం చలితీవ్రతతో పాటు పొగ మంచు కమ్ముకుంటోంది. ముఖ్యంగా పిల్లలు, వద్ధులు, శ్వాసకోస సంబందిత వ్యాధిగ్రస్తులు చలిగాల్పులకు ఇబ్బంది పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా నమోదైంది. ఈ నేపథ్యంలో చలి నుంచి రక్షణ పొందేందుకు జనం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. స్వెటర్లు, మఫ్లర్లు ధరించడం, మంట కాచుకోవడం చేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. శ్వాస కోస సంబంధిత వ్యాధి గ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రయాణికులకు తప్పని వెతలు
ఉదయం వేళల్లో రహదారులన్నీ పొగమంచు కప్పుకోవడంతో.. ప్రయాణికులు తమ రాకపోకలకు ఇబ్బంది పడుతోన్నారు. ప్రతి రోజూ ఉదయం నుంచే శీతల గాలలు మొదలవుతున్నాయి. సాయంత్రం 6 గంటల తర్వాత చలి తీవ్రత క్రమ క్రమంగా పెరుగుతోంది. దీంతో త్వరగానే పనులు ముగించుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. ఉదయం 9 గంటల వరకు జనం బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, పాల వ్యాపారులు, మార్నింగ్ వాక్ చేస్తున్న వారంతా చలి తీవ్రతతో ఇబ్బందులకు గురవుతున్నారు. సూర్యుడు ఉదయించాక… ఎండ వేడిమికి కూర్చుంటున్నారు. ఉదయం న్యూస్ పేపర్ వేసే బారుతోపాటు పాల వ్యాపారులు, రైతులు ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారు.
వామ్మో చలి.. రోజంతా చలే.. చలి పులి పంజా విసురుతున్నది. వేకువజాము మొదలు దట్టమైన పొగమంచు కమ్మేస్తూ ఉదయం 9 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సెద్దర్లు కప్పుకున్నా..స్వెటర్లు వేసుకున్నా.. మంకీ క్యాపు పెట్టుకున్నా.. మఫ్లర్లు కట్టుకున్నా.. ప్రజలు గజగజ వణికిపోతున్నారు. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు.
కంది పొరుక.. తాటి కమ్మలు, కట్టెలు, చెత్తతో మంట పెట్టుకుని జనం చలికాగుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6.6 డిగ్రీలకు పడిపోయింది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, పనులకు వెళ్లే జనం అవస్థలు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి తీవ్రత పెరుగుతుండడంతో ఫుట్‌పాత్‌ల వెంట అమ్మే స్వెటర్లు, జర్కిన్లు, మంకీ టోపీలకు గిరాకీ పెరిగింది.
దీనికితోడు చల్లని గాలులు వీస్తుండడంతో జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు కమ్మేసి ఉంటుండటంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగు లు, వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు, కూలీలు అవస్థలు పడుతున్నా రు. మరో నెల రోజు ల వరకు చలి తీవ్రత ఇలాగే ఉండే అవకా శం ఉన్నందున ఆరో గ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రాత్రి 8 గంటలకే మూతబడుతున్న షాపులు
కొన్ని రోజులుగా సూర్యుడి జాడ లేక రోజంతా వాతావరణం చల్లగానే ఉంటున్నది. తెల్లవారు జా మున కురుస్తున్న మంచుతో చలి తీవ్రత మరింత ఎక్కువై ప్రజలకు వణుకు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో జనసంచారం సైతం తక్కువగా ఉంటున్నది. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధుల నిమి త్తం దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న ఉద్యోగులు తీవ్ర చలిలోనూ వెళ్లాల్సి రావడంతో అవస్థ లు పడుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే మొదలవుతున్న చలి తీవ్రత వ్యాపారంపై కూడా ప్రభావం చూపుతున్నది. పట్టణాల్లో వ్యాపారులు రాత్రి 8 గంటలకే దుకాణాలను మూసి వేస్తున్నా రు. చిరు వ్యాపారులు రాత్రి 7 గంటలకే వ్యాపారాన్ని ముగించుకుని ఇంటి బాట పడుతున్నారు.
ఉన్ని దుస్తులకు భలే గిరాకీ..
చలి పెరుగడంతో శీతాకాలం దుస్తులకు గిరాకీ పెరిగింది. రోడ్డు పక్కల ఉన్ని దుస్తుల షాపులు కోకొల్లలుగా వెలిశాయి. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి మరీ వ్యాపారాన్ని నడుపుతున్నారు. అన్ని వయస్కుల వారికి అనుగుణంగా స్వెటర్లు, జర్కిన్లు, మంకీటోపీలు అందుబాటులో ఉన్నాయి. దుకాణాల్లో కన్నా తక్కువ ధరకు లభిస్తుండడంతో వినియోగదారులు ఎక్కువగా ఫుట్‌పాత్ వెంట అమ్ముతున్న వస్ర్తాలనే కొంటున్నారు. చలి ఎక్కువగా ఉండడంతో ఈసారి ఉన్ని దుస్తుల వ్యా పారం బాగా ఉన్నదని వ్యాపారులు పేర్కొంటున్నారు.
ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం..
చలి కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యురాలు డాక్టర్ రమ్య సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వారు చలి ప్రభావానికి లోనుకాకుండా ఉండాలంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, జ్వరం, దగ్గు, దమ్ములాంటి సమస్యలు ఉన్నవారు వెచ్చని వాతావరణంలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎం తైన ఉంది. అలాగే వృద్ధులు, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వర్షాలతో గాలి లో తేమ పెరిగే అవకాశం ఉన్నందున బయటి వాతావరణంలో తిరగకపోవడమే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందాలని, ఆహారం వేడిగా ఉన్నప్పుడే భుజించాలని వారు సూచిస్తున్నారు.
◆-: డాక్టర్ రమ్య ఝరాసంగం మండల వైద్య అధికారి
