సిద్ధాపూర్ ఏఈఓకి ఉత్తమ పురస్కారం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలంలోని సిద్ధాపూర్ క్లస్టర్ ఏ ఈ ఓ సుకుమార్ కి ఉత్తమ సేవ అవార్డు లభించింది , జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకలు భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ప్రవీణ్యా ఎస్పీ పారితోష్ పంకజ్ టిజిఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ చేతుల మీదుగా సుకుమార్ అవార్డు అందుకున్నారు,ఈ సందర్భంగా ఏఈఓ మాట్లాడుతూ 8 ఏళ్లుగా రైతులకు విశిష్ట సేవలు అందించిన ఉద్యోగానికి గుర్తింపు వచ్చిందన్నారు, అవార్డు రావడం వల్ల క్లస్టర్ రైతులు మరియు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.