రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
* జనుము విత్తనాలను పంపిణీ చేసిన చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య
చేవెళ్ల,నేటిధాత్రి :
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామం పిఏసిఎస్ సొసైటీ యార్డులో సోమవారం రైతులకు జనుము విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యత్తిదిగా హాజరై
రైతులకు జనుము విత్తనాలను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటగా జనుము విత్తనాల పంపిణీ చేసిన నియజకవర్గం చేవెళ్ల నియోజకవర్గమేనని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించి వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జనుము విత్తనాల పూర్తి ధర క్వింటాలుకు 15,550 రూపాయలు ఉండగా , ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 50 శాతం అంటే రైతు 7,775 రూపాయలకు
అందజేస్తుందని తెలిపారు.
రైతుకు 40 కేజీల జనుము విత్తనాల బ్యాగును 3110 రూపాయలకే ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి డైరెక్టర్ చింపుల సత్యనారాయణ రెడ్డి, ముడిమ్యాల, చేవెళ్ల పిఏసిఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి,డిసిసి మాజీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి,పిఏసిఎస్ సభ్యులు, వ్యవసాయ అధికారులు,కాంగ్రెస్ నాయకులు, రైతులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
