చలి పిడుగు మిగిల్చిన విషాదం
ఐనవోలు మండలంలోని వెంకటాపురం గ్రామశివారులో గొర్రెల మందపై పిడుగుపడడంతో పెద్దఎత్తున 35గొర్రెలు మతువాత పడ్డాయి. చీర రాజారామ్‌కు చెందిన భూమిలో మందను నిర్వహించారు. గురువారం రాత్రి అకాలవర్షంలో చలి పిడుగు గొర్రెల మండపై పడింది. పెద్దసంఖ్యలో చిన్న, పెద్ద గొర్రెలు చనిపోవడంతో గొర్రెల కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇందులో మజ్జిగ రాజుకు చెందిన 8గొర్రెలు, దయ్యాల రాజుకు చెందిన 20గొర్రెలు, బండారి చంద్రుకు చెందిన 5గొర్రెలు మృతిచెందాయి. అందులో భాగంగా ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ మజ్జిగ జయపాల్, సర్పంచ్ దయాకర్, ఎంపీటీసీ కావ్య తిరుపతి, చీర గణేష్ తదితరులు జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వెంకటాపురం గ్రామానికి చెందిన నీలం ఫకీర్ యాదవ్(50) పిడుగుపాటుకు మతిచెందారు.