Grand Felicitation in Ward 20
చైర్ పర్సన్,వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు 20వ వార్డులో ఘన సన్మానం….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా క్యాతనపల్లి లో ఛైర్మెన్ ,వైస్ చైర్మన్ పీఠం దక్కించుకున్న బిఆర్ఎస్, సిపిఐ పార్టీల కూటమి కౌన్సిలర్లను క్యాతనపల్లి మున్సిపాలిటీలో గల 20 వ వార్డ్ బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ, అధైర్య పడకుండా గెలిచిన కౌన్సిలర్లకు అండగా నిలబడుతూ, నిరంతరం పార్టీ కోసం కష్టపడి పని చేసే 20వ వార్డు బిఆర్ఎస్ నాయకులు మంద వేణుగోపాల్ గెలిచిన కౌన్సిలర్ల ను, చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి- రాజా రమేష్,వైస్ చైర్మన్ మిట్టపల్లి సరిత- శ్రీనివాస్ లను ఘనంగా సన్మానం చేశారు. 20వ వార్డు ఇంచార్జ్ మద్ది శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ లకు సైతం శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మున్సిపాలిటీలో కూటమి నాయకులు స్పష్టమైన మెజారిటీతో గెలిచినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల 51 రోజుల అనంతరం చైర్మన్ పీఠం దక్కించుకోవడం జరిగిందని పుర ప్రజలందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. గెలిచిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మునిసిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములై మున్సిపాలిటీని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలలో గెలుపోటములు సహజమేనని 20 వార్డులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, వార్డు అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని మంద వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బిఆర్ఎస్, సిపిఐ నేతలు పాల్గొన్నారు.
