స్థానిక అశోక్ నగర్ కాలనీ నందు మహాజన మహిళ
సమైఖ్య
భద్రాచలం నేటి ధాత్రి
(ఎంఎంఎస్ )ముఖ్య కార్యకర్తల సమావేశం ఎస్.కె సల్మా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహాజన మహిళా సమైఖ్య ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మేకల లత పాల్గొని మాట్లాడుతూ… జూలై 7న వరంగల్ పట్టణంలో జరిగే ఎమ్మార్పీఎస్ 30 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆత్మగౌర కవాతు ను జయప్రదం చేయాలని మహాజన నేత మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపుని జయప్రదం చేసేందుకు మహాజన మహిళా లోకం సనాదం కావాలని, వరంగల్లో జరిగే ఆత్మగౌర కవాతుకు మహాజనులంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాజన మహిళ సమైఖ్య (ఎంఎంఎస్) నూతన నిర్మాణం నూతన కమిటీల నిర్మాణం చేసేందుకు చైతన్యమైన మహిళా యువ నాయకత్వం సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకునేందుకు ప్రజా పోరాటానికై ఐక్యం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాజన మహిళ సమైఖ్య (ఎంఎంఎస్) జిల్లా అధికార ప్రతినిధి తెల్లంసమ్మక్క జిల్లా ఉపాధ్యక్షురాలు కంచర్ల కుమారి, కొప్పుల నాగమణి , రహిమ, నిర్మలమ్మ, బుర్ర నాగలక్ష్మి , తదితరులు పాల్గొన్నారు.
సామాజిక ఉద్యమ వందనాలతో
మహాజన మహిళా సమైఖ్య.
భద్రాచలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా