భద్రాచలం నేటి ధాత్రి
ఈనాడు రామోజీరావు మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
భద్రాచలం కాంగ్రెస్ మండల అధ్యక్షులు పరిమి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య క్యాంపు కార్యాలయంలో సోమవారం రామోజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిర్యాల రవికుమార్ మాట్లాడుతూ
పత్రికా రంగానికి రామోజీ రావు చేసిన సేవలను కొనియాడారు. జర్నలిజానికి ఆయన దిక్సూచి లాంటివారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమ్మళ్ల వెంకటేశ్వరావు,బంధం శ్రీనివాస్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చింతిర్యాల సుధీర్, మణి రాంప్రసాద్, కాపుల శ్రీను, బసవరాజు, మహిళా కాంగ్రెస్ నాయకులు సరిత,హసీనా, వసీమ, మౌనిక, జయ సేవాదళ్ అశోక్, శీలం రామ్మోహన్ రెడ్డి, ఐఎన్టీయూసీ సింగ్ నాగేశ్వరరావు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు