
ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్వితీయ వార్షిక ఉత్సవాలు
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ద్వితీయ వార్షిక ఉత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శనివారం రోజున మహాగణపతి పంచగవ్య పోషణ స్వస్తి పుణ్యాహవాచనం తదితర పూజలు ప్రారంభమయ్యాయి. ఆదివారం శ్రీలక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ ఉత్సవం జరుగుతుందని, కళ్యాణ ఉత్సవంలో భాగంగా స్వామి వారికి ఎదురుకోలు డప్పు చప్పుళ్ల వాయిద్యం మధ్య ఘనంగా జరుగుతుందని, కళ్యాణోత్సవం తనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, సోమవారం రోజున అష్టోత్తర శతకళాభిషేకం…