వనభోజనాలకు ముదిరాజ్ కులస్తులు.

వనభోజనాలకు ముదిరాజ్ కులస్తులు

నర్సంపేట నేటిధాత్రి:

shine junior college

నర్సంపేట మండలంలోని భానోజీపేట గ్రామానికి చెందిన ముదిరాజ్ కులస్తులు వారి ఆరాధ్య కులదైవమైన పెద్దమ్మతల్లి వనభోజనాలకు తరలివెళ్లారు.జలాభిషేకాలు నిర్వహించిన అనంతరం దూపదీప నైవేద్యాలతో మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు భీమగాని మల్లయ్య, రాజమౌళి, విట్టల రాజన్న,భూషణబోయిన రమేష్, వెంకటయ్య, రవి, పిట్టల అశోక్, బిక్షపతి, ఉప్పుల బిక్షపతితో పాటు మహిళలు పాల్గొన్నారు.

వేశ్యలంటూ వెర్రి వాగుళ్లు!మేధావుల ముసుగులో వెదవలు?

`నాలుగు రోజులు జర్నలిస్టులుగా పని చేస్తే మేధావులు కారు.

`సమాజాన్నే కించ పర్చే వ్యాఖ్యలు చేస్తే గొప్ప వారు కారు.

`అమరావతి దేవతల రాజధాని!

`కనిపించే తల్లి కన్నా గొప్ప దైవం విశ్వంలో ఎవరూ వుండరు.

`అమరావతి అంటే ఇది కాదు అనడానికి సిగ్గు పడాలి.

`మన కళ్ల ముందు కనిపించేదే అమరావతి అనుకోవాలి.

`అదే దేవతల రాజధానిగా భావించాలి.

`అమరావతి పరిసర ప్రాంతాలు వేశ్యల రాజధాని అన్న వాడికి శిక్ష పడాలి.

`అమరావతి ప్రాంతాన్ని అవమానించడమే!

`ముఖ్యంగా మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడే!

`రాజధాని ప్రాంతాన్ని ఈ రకంగా చిత్రీకరించడం నేరమే!

`వేశ్య చేసేది కూడా కాయకష్టమే!

`మన సమాజంలో అలాంటి పరిస్థితులపై వ్యవస్థ సిగ్గుపడాలి.

`శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో వేశ్య పన్ను అమలు చేశారు.

`వేశ్య వృత్తి తప్పే..వారు తప్పుడు మహిళలు కాదు.

`పొట్ట కూటి కోసం తప్పని పరిస్థితులలో గడిపే కాలం!

హైదరాబాద్‌,నేగిధాత్రి:

తమదే జర్నలిజం..తాము చెప్పిందే సుభాషితం అనుకునేవాళ్లు చాల మంది మోపయ్యారు. ముఖ్యంగా ఎలక్రానిక్‌ మీడియా వచ్చిన తర్వాత వారి పైత్యం మరీ ఎక్కువైంది. నోరుంది కదా? అని ఏది పడితే అది వాగకు..అన్నది తెలుసు. అయినా తాము సత్యాలే చెబుతాం…ప్రజలకు నిజాలే అందిస్తామన్నట్లు కొన్ని దుష్టపర్వాలు ఉచ్చరిస్తుంటారు. ఇలాంటి వాళ్లను సమాజం కూడా వెలివేయాలి. ఇక్కడ అసలు విషయాన్ని ముందు తెలుసుకుందా. ఈ మధ్య ఓ ఆంగ్ల దినపత్రికలో ఆరోగ్యపరమైన అంశాలను వివరించే క్రమంలో ఓ ఆర్టికల్‌ వచ్చింది. అందులో వ్యభిచారం ఎక్కువగా జరుతున్న రాష్ట్రాల క్రమాన్ని వివరించారు. దానికి లేనిపోనివి ఆపాదించి, సాక్షి టీవిలో అసందర్భ చర్చను చేపట్టారు. నిజానికి అలాంటి విషయాలను చర్చించాల్సిన అవసరం లేదు. సమాజంలో ఎన్నో దారుణాలున్నాయి. సమస్యలున్నాయి. ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే,ప్రజలకు మేలు జరుగుతుంది. అంతే కాని వ్యభిచారం గురించి సోది మొదలు పెట్టి ఏకంగా ఆంధ్ర ప్రదేశ్‌ రాజధానిపై నిందలు మోపడం అన్నది సరైంది కాదు. పైగా మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడం అసలే మంచిది కాదు. ప్రపంచంలో వ్యభిచారం అనేది ఎక్కడలేదు? అమెరికా లాంటి దేశాల నుంచి చాలా పేద దేశాల్లో కూడా వుంది. వేశ్యా వృత్తి రాజుల కాలం నుంచి వుంది. అదేమీ తప్పు కాదు. మన దేశంలో చట్ట పరంగా నేరం. దానిని ఏ ప్రభుత్వాలు ప్రోత్సహించడం లేదు. మన సమాజంలో అనాదిగా అవలంభిస్తున్న వృత్తుల్లో వ్యభిచారం కూడా వుండేది. ఇప్పుడు మన సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఆ వృత్తిని ఎప్పుడో వదిలేశారు. కాని ఏకంగా ఏపి రాజధాని ప్రాంతాన్ని వేశ్యల రాజధాని అంటూ సీనియర్‌ జర్నలిస్టు అనే ముసుగులో వున్న కృష్ణం రాజు అనే వ్యక్తి మాట్లాడడం తప్పు. నేరం కూడా. అంతే కాకుండా సాక్షి టివీలో యంకర్‌గా పనిచేసే సీనియర్‌ జర్నలిస్టు కృష్ణం రాజును మాటలను అడ్డుకోకపోవడం, తప్పని చెప్పకపోవడంతోపాటు, సమర్ధించినట్లే వ్యవహరించడమే అసలు సమస్యకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఏపిలోని అమరావతి ప్రాంతానికి ప్రత్యేకమైన విశిష్టత వుంది. అది బుద్దుడు నడయాడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి బుద్దుడు వచ్చి అక్కడ చాలా కాలం పాటు వున్నట్లు కూడా చరిత్ర చెబుతోంది. పైగా బుద్దిజం విలసిల్లిన ప్రాంతం. అంతే కాకుండా ఆ ప్రాంతాన్ని ధాన్య కటకము అనికూడా చరిత్రచెబుతోంది. తెలుగు మొట్టమొదటి రాజులైన శాతవాహనుల తొలి రాజధాని అమరావతి అయితే, రెండో రాజదాని దాన్య కటకము అని చరిత్రలో వుంది. అయితే మరో అమరావతి ప్రస్తుతం మహారాష్ట్రలో వుంది. అది శాతవాహనుల రాజదాని. తర్వాత రెండో రాజధాని అయిన ధాన్యకటకము. అది గుంటూరు జిల్లాలో వుంది. తర్వాత కాలంలో ధాన్యకటకాన్ని అమమరావతి అని పిలుస్తూ వచ్చారు. అంతే కాకుండా అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కృష్ణా నది ఒడ్డున వుంది. అందుకే అమరావతి అనే పేరు అలా కూడా వచ్చింది. అంతటి పవిత్రమైన ప్రాంతాన్ని గురించి నోరుంది కదా? కృష్ణంరాజు వెర్రి వాగుడు వాగి ఇరుక్కుపోయాడు. అయితే తాము క్షమాపణ చెప్పాం..అర్దం చేసుకోకలేపోతే మేమేం చేయలేమంటూ మళ్లీ కొమ్మినేని శ్రీనివాస్‌ రావు మళ్లీ గిల్లాడు. దాంతో ప్రజలకు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 40 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో వుండి తాము రాసిందే వార్త అనే దుర్మార్గపు పైత్యం వారిలో నిండిపోయింది. అందుకే ఇలాంటి మాటలు వదిలేశారని చెప్పకతప్పదు. అమరావతి దేవతల రాజధాని. దానికి దేవేంద్రుడు రాజు. కాని ఇది మన రాష్ట్రంలో అమరావతి. దానికి దీనికి సంబంధం లేదంటూ నోటి దూలను ప్రదర్శించారు. దాంతో ఇరుక్కున్నారు. అయినా వేశ్యా వృత్తిని ప్రోత్సహించిన రాజుల కాలం కూడా వుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వేశ్య పన్ను కూడా విధించిన సందర్భాలున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వేమన శతకాలు. వేమన పద్యాలు తెలియని వారు ఎవరూ వుండదు. వేమన కూడా ఒక వేశ్యను ఆరాదించిన సంగతి తెలిసిందే. ఆమె పేరు మీదనే పద్యాలు కూడా రాశారు. వృత్తి తప్పుకావొచ్చు కాని వారి మనసు తప్పని ఎలా చెప్పగలం. ఒక మహిళ వేశ్యగా మారడానికి ఎవరు కారణం? మన సమజం కాదా? సమాజంలో వున్న హెచ్చు తగ్గులు కాదా? కుల వ్యవస్ధ కాదా? ఎప్పుడో దాసి అనే సినిమా వచ్చింది. రాజుల కాలంలో వేశ్యా నర్తకిలు వుండేవారు. నాడైనా, నేడైనా సమాజంలో వున్నారు. అది తప్పుకాదు. కాలే కడుపుకు తిండి దొరకాలంటే కొన్నిసార్లు తప్పు కాదు. ఏదైనా పని చేసుకొవచ్చు కదా? అని నీతులు చెప్పేవారు కూడా వున్నారు. సగటు మహిళ పది మంది మధ్య పని చేయాలంటే ఆ చుట్టూ వుండే చూపులు చేసే గాయం ఎంత ప్రమాదరకమో తెలియందా? ఇంత విద్యా, విజ్ఞానవంతమైన సమాజంలోనే నిత్యం అనేక అకృత్యాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు జరుగున్నాయి. చెప్పలేనటు వంటి దారుణాలు జరుగుతున్నాయి. మగాడి కోరికకు బలౌతున్న ఎంతో మంది అబలల జీవితాలు ఆగమౌతున్నాయి. వేశ్య వృత్తిని స్వీకరించిన వారిని సమాజం దూరం కొడుతుంది. రోడ్డు మీద కనిపిస్తే చీత్కరించుకుంటారు. రాత్రి పూట వాళ్ల దగ్గరకు సుఖానికి వెళ్తాడు. మగాడిలోనే రెండు రకాల వేశ్య దాగివున్నాడు. అలాంటి మగాడికి వేశ్య గురించి మాట్లాడే అర్హత లేదు. అయినా వేశ్య అని ముద్ర వేసి, వారిని కించపర్చే హక్కు ఎవరికీ లేదు. వారిని నీచంగా మాట్లాడే హక్కు లేదు. ఎవరి వృత్తి వారిది. వారి వృత్తిని శంకించే హక్కు ఎవరికీ లేదు. మేధావుల ముసుగులో కృష్ణం రాజు వాగడం, దాన్ని కొమ్మినేని ఆపకపోవడం రెండూ నేరాలే. గత ఐదేళ్ల కాలంలో అమరాతిని ఏ కొంచెం పట్టించుకున్నా, ఇప్పుడు ఎంతో గొప్ప రాజదానిగా అడుగులు పడేవి. అమరావతిని అభివృద్ది చేస్తే సిఎం. చంద్రబాబుకు ఎక్కడ పేరొస్తుందో అని మూడు రాజధానులంటూ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు లేనిపోని కూతలు కూస్తున్నారు. ఆ ప్రాంత మహిళలపై అభాండాలు వేశారు. ఇది మన్నించలేంత ఘోరం. ఎట్టకేలకు కొమ్మినేని అరెస్టు చేశారు. కృష్ణం రాజును అరెస్టు చేస్తామంటున్నారు. ఏ మీడియా అయినా సరే మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేయడానికి ఈ సంఘటనతో భయపడాలి. అంతే..

సఫియా సుల్తానా,SCERT .బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక

సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎంపిక

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ మండలం, రేజింతల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సఫియా సుల్తానా, ఎస్.సి.ఈ.ఆర్.టి. బెస్ట్ ప్రాక్టీసెస్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రస్థాయిలో ఎంపికై, తన వినూత్న బోధనా పద్ధతులతో అందరి ప్రశంసలు అందుకున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి మండల విద్యాధికారుల సమావేశంలో,సఫియా సుల్తానా తన పాఠశాలలో అమలు చేసిన సృజనాత్మక బోధనా పద్ధతులు, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన కార్యక్రమాలు, మరియు వీటి ద్వారా పాఠశాలలో సాధించిన గణనీయమైన ప్రగతిని అత్యంత ఆకర్షణీయమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ జి. రమేష్, ఆర్.జె.డి. విజయలక్ష్మి, మల్టీ జోన్-2కు చెందిన 350 మందికి పైగా మండల విద్యాధికారులు హాజరయ్యారు. శ్రీమతి సఫియా సుల్తానా గారి అద్భుతమైన ప్రదర్శనను తిలకించిన ఎస్.సి.ఈ.ఆర్.టి. డైరెక్టర్ రమేష్ మరియు ఆర్.జె.డి. విజయలక్ష్మి గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే, ఎస్.సి.ఈ.ఆర్.టి.సురేష్ బాబు, శ్రీ సురేందర్, మరియు న్యాల్కల్ మండల విద్యాధికారి శ్రీ మారుతి రాథోడ్ కూడా ఆమె కృషిని అభినందించారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ.

దేవుని తిరుమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ

వనపర్తి నేటిధాత్రి

 

 

 

కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపురం గ్రామంలో భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్య శిక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు .

ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ గోశాల ఆవుల పరిరక్షణ నిమిత్తం పోషణకై దాతల వస్తూ రూపములో వచ్చిన వాటితో కొంతమంది ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

గవ్య ఉత్పత్తులను తయారుచేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో ఆవువుల ను రక్షించడానికి వాటికి అయ్యే ఖర్చు ఈ ఉత్పత్తుల ద్వారా ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఉత్పత్తులను తిరుమలాపురము ఆలయంలో తయారు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ తెలిపారు.

 

Lord Venkateswara Swamy Temple, Tirumalapuram.

 

పంచగవ్య ఉత్పత్తుల ఉత్పత్తుల ద్వారా దూప్ స్టిక్స్ దోమల అగర్బత్తీలు క్లీన్ ఆయిల్ ఇంకా సోప్స్ హోలీ పండుగకు ప్రత్యేకంగా పూర్ణిమ సందర్భంగా ఎటువంటి కెమికల్స్ రసాయన ద్రవ్యాలు కలుషితం లేకుండా పూలతో చెట్ల దినుసులతో రంగులు తయారు చేస్తున్నామని ప్రజలు రంగులు వాడిన ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా చర్మవ్యాధులు లేకుండా ఉంటాయని ఆయన తెలిపారు తల వెంట్రుకలకు సంబంధించి ఆయిల్స్ కూడా తయారవుతాయని ప్రజలు ఆయిల్స్ ధూప్ స్టిక్స్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ గ్లాసులు వాడడం వల్ల క్యాన్సర్ ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇది కాకుండా పురాతన కాలంలో మోత్కాకుతో ఇస్తరాకులో ఉండేవి అదే ఆకులతో పేపర్ ప్లేట్లు కూడా యంత్రాలతో భవిష్యత్తులో తయారు చేయించి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు ఇది బాగుంది కంగ్రాట్స్ ఈ పేపర్ ప్రింట్ గాని గిలాసలు గాని తిడతాడు గ్లాసులు మొత్తం 15 వస్తువులు తయారవుతాయని ఆయన తెలిపారు

పార్టీ పదవులు కొలిక్కి..మంత్రి పదవులు వెనక్కి!!

`మంత్రి పదవుల కోసం మరింత సమయం!

`పార్టీ పదవులు మాత్రం సిద్దం!

`దాదాపు కార్యవర్గ పదవుల జాబితా సిద్ధం!

`పార్టీ పదవులు కూడా మరో మూడురోజుల తర్వాత విడుదలయ్యే అవకాశం.

`రోహిన్‌ రెడ్డి కి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

`సీనియర్లకు పార్టీ పదవులలో సముచిత స్థానం.

`నాయకులలో అసంతృప్తి లేకుండా పదవుల పంపకం.

`పార్టీ క్రియాశీల బాధ్యతలతో నాయకులు సంతృప్తి చెందుతారని అధిష్టానం నమ్మకం.

`అన్ని జిల్లాల నాయకుల సూచనల మేరకు పార్టీ నిర్మాణం.

`స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యం.

`ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు తక్కువ రాకుండా నాయకత్వం పటిష్టం.

`ప్రతి పక్షాల కన్నా ముందే ప్రజల్లోకి నాయకులు వెళ్లాలని ఆదేశం.

`ప్రభుత్వ పథకాలపై, నిర్ణయాలపై పకడ్బందీగా ప్రచారం.

`సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్‌ యువ వికాసం, రేషన్‌ కార్డులపై ప్రజల్లో అవగాహన పెంచడం.

`మంత్రి వర్గ విస్తరణపై ఎటూ తేల్చలేకపోతున్న అధిష్టానం!

`ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర యంత్రాంగం.

`కావాలనే వాయిదా పడుతున్నట్లు సంకేతం.

`తప్పని పరిస్థితుల్లోనే దూరం జరుపుతున్నట్లు సందేశం.

`ఆరు పదవులు అందరికీ పంచలేక తల పట్టుకుంటున్న అధిష్టానం

హైదరాబాద్‌ ,నేటిధాత్రి:
ఒక రకంగా కాంగ్రెస్‌ పార్టీలో వున్న కొంత మంది నాయకులకు సంతోషకమైన వార్త. మరో రకంగా మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులకు కొంత చేదు గుళిక. ఎందుకంటే మంత్రి పదవుల పంపకం మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఎంత వడబోసినా, ఎక్కడో సరైన సమ ప్రాధాన్యత అందరికీ కలిగించాలన్న ఆలోచనతోనే కాస్త ఆ ముహూర్తం దూరం జరుగుతోంది. కాకపోతే ఎంత ఆలస్యమైనా, సరే బెస్ట్‌ అనిపించుకునేలా విస్తరణ వుండాలన్నదే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కోరుకుంటోంది. సహజంగా ఎమ్మెల్యేలందరికీ మంత్రులు కావాలని కోరిక వుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అయ్యేదాకా అదో తంటా. ఏళ్లకేళ్లు ఎదురుచూసి, చూసి, అవకాశం వచ్చినా రాజకీయ పరిస్ధితులు అనుకూలించక ఎమ్మెలు కాని వాళ్లు చాల మంది వుంటారు. వాళ్లలో అనేక సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి, ఓడిపోయి, గెలిచిన వాళ్లుంటారు. మరికొంత మంది ఎమ్మెల్యే కావడానికి పెద్దగా ఇబ్బందులు పడే పరిస్ధితి రాదు. అలాంటి వారు మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేలు అవుతుంటారు. రాజకీయ పరిస్దితులు రాష్ట్రంలో ఎలా వున్నా, ఎమ్మెల్యేలుగా గెలుస్తూనే వుంటారు. అటు ఓడిపోయిన వారైనా, ఇటు ఎప్పుడూ గెలుస్తుండేవారైనా పార్టీకి సేవ చేస్తూనే వుంటారు. అలా అవకాశాలు వచ్చి, ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రులు కావాలనుకోవడం తప్పు కాదు. మంత్రులు కావాలన్న వారి కోరిక మొదటిసారే తీరే వారు కొందరుంటారు. ఎన్ని సార్లు ఎమ్మెల్యేలు అయినా మంత్రులు కాని వారు కూడా చాలా మంది వుంటారు. అయినా ఎక్కడో ఆశ వారిలో సజీవంగా వుంటంది. ఒక్కసారైనా మంత్రి కావాలని బలంగా కోరుకుంటారు. కాని ఇక్కడ మరో మతలబు వుంటుంది. ఒక్కసారి మంత్రి అయిన నాయకుడు సీనియర్‌ మంత్రిగా పదే పదే పార్టీ అధికారంలో వున్నంత కాలం మంత్రులుగా పనిచేయాలని కోరుకుంటారు. అలా అవకాశాలు దక్కుతుంటాయి. ఇప్పుడున్న కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అందరికన్నా ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నాయకుడిగా చిరిత్ర సృష్టించారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో మంత్రిగా వున్న తుమ్మల నాగేశ్వరరావు కూడా అంతే..ఆయన ఏ పార్టీలో వున్నా మంత్రిగా వుంటూ వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి, తర్వాత బిఆర్‌ఎస్‌ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్‌ నుంచి మంత్రి పదవి అందుకున్నారు. ఇలాంటి అవకాశం అందిరికీ రాదు. చాలా అరుదుగా వస్తుంది. గతంలో మంత్రిగా పనిచేసిన మంధని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఇప్పుడు మరోసారి మంత్రి అయ్యారు. ఇలా కొంత మందిని పదవులు వాటంతటవే వరిస్తుంటాయి. చాలా మందికి మంత్రి పదవి దక్కినట్లే దక్కి చేజారిపోతుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడో మంత్రి కావాల్సిన కమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ 2009 ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. నల్లగొండ నుంచి మరో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కూడా అలా అవకాశాలు కలిసివచ్చి ఇప్పుడు కూడా మంత్రులుగా పనిచేస్తున్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, ఇప్పుడు మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో పలుసార్లు మంత్రిగాపనిచేసిన నిజాబామాద్‌ ఉమ్మడి జిల్లాకు చెందిన మైనార్టీ నాయకుడు షబ్బీర్‌ అలీ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో వున్నా అదృష్టవంతుడు అనే పేరు వుంది. కాని ఈసారి ఆయన మంత్రి కాలేకపోతున్నారు. కాని ఆయన పేరు కూడా వినిపిస్తూనే వుంది. కాని ఆయనకు దక్కకపోవచ్చు. అయితే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అదికారంలోకి వస్తే, తాను గెలిస్తే మంత్రి కావాలనుకున్న మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన గతంలో విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీని వదిలి బిజేపిలో చేరారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ పార్టీకి వీర విధేయుడు అనే పేరు వుంది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండేది. కాని దురదృష్టవశాత్తు ఎమ్మెల్యే కాలేకపోయారు. నిజంగా ఆయన గత ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌ రాజకీయమే వేరేలావుండేదని ఆయన సన్నిహితులు అంటుంటారు. అలా అదృష్టం ఖాతలో మొదటిసారి ఎమ్మెల్యే అయినా బిసి నాయకుడు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌ మంత్రి అయ్యారు. అంటే రాజకీయ పదవులు కూడా అదృష్టంతో ముడిపడి వుంటాయని చెప్పడానికి ఇవన్నీ సాక్ష్యాలనే అని చెప్పాలి. గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడూ కూడా గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆందోల్‌ ఎమ్మెల్యే దామోదర రాజనర్సింహ ఈసారి మంత్రి అయ్యారు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఎవరు మంత్రులౌతారన్న వాటికి కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు దాటితేనే మరి కొంత మందికి అవకాశం వస్తుంది. మంత్రులయ్యే ఛాన్సు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆరు మంత్రి పదువులు ఖాళీగా వున్నాయి. వాటిలో ఓ నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు. ఎందుకంటే మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా, ఒకసారి ఎమ్మెల్సీగా, పిపిసి. అధ్యక్షుడుగా పనిచేసిన వి. హనుమంతరావు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. కాని ఆయన పలుసార్లు టికెట్‌ ఇచ్చినా గెలవలేదు. ఆయనకు చాలా కాలంగా కాలం కలిసి రావడం లేదు. ఆయన ఆశ తీరే పరిస్దితి ఇక కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడున్న పరిస్దితుల్లో నిజామాబాద్‌ జిల్లాకు ప్రాదాన్యత లేకపోవడంతో సుదర్శన్‌రెడ్డి పేరులో ఎలాంటి మార్పు లేకుండా వినిపిస్తోంది. అయితే షబ్బీర్‌ అలీ పేరును ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటారన్నది వేచి చూడాలి. ఇక కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయన ఆశ తీరుతుందా? లేదా? అన్నది ఎవరూ చెప్పలేని పరిస్ధితి. ఇటీవల పార్టీ అధిష్టానం భుజ్జగించిందని, ఆయన అందుకు ఒప్పుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అది ఎంత వరకు నిజమన్నది ఎవరికీ తెలియదు. ఆయనను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి తీసుకొమ్మని చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి. కాకపోతే చాల మందికి తెలియని విషయం ఏమిటంటే జాతీయపార్టీలలో ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేలు సహజంగానే పార్టీ ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటారు. ఎంత మంది ఎమ్మెల్యేలున్నారో వాళ్లంతా ఉపాధ్యక్షులే అవుతారు. అలాంటి వారికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు ఇచ్చినంత మాత్రాన బాద్యతలు ఎక్కువగా వుండకపోవచ్చు. కాని గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా వున్న జగ్గారెడ్డికి ప్రత్యేకంగా వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చారు. దాంతో ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి ఇచ్చి బుజ్జగించే అవకాశాలున్నాయి. కాకపోతే వర్కింగ్‌ ప్రెసిడెంటు అనేది ఆరో వేలు లాంటిదే..అలాంటి పదవిని రాజగోపాల్‌రెడ్డి తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి. ఇక మరో జిల్లా ఆదిలాబాద్‌ నుంచి ఎమ్మెల్యే గడ్డం సోదరులు ఇద్దరూ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాని వివేక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పేర్లు మాత్రంపదే పదే వినిపిస్తున్నాయి. కాని పదవులు పంపకాలు ఆలస్యమౌతున్నాయి. ఇదే సమయంలో పార్టీ పదవుల పంపకాలకు మాత్రం ముహూర్తం ఫిక్స్‌ అయిందనే అంటున్నారు. నిజానికి మంగళవారం పార్టీ పదవుల జాబితా విడుదలౌతుందన్న ప్రచారం విసృతంగా జరిగింది. అందులో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు వున్నట్లు తెలుస్తోంది. పూర్తి జాబితాను ఈ నెల 30లోగా ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం వుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఖైరతాబాద్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డికి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటు పదవి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఏది ఏమైనా మంత్రి పదవులు ఇంకా ఆలస్యమైనా సరే, పార్టీ పదవులు తొందరగా పంపకాలు జరుగుతాయని తెలుస్తున్నందుకు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

పరకాల క్లస్టర్ ఏఈఓ ఎం.శైలజ

పరకాల నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పరకాల క్లస్టర్ పరిధిలోని పరకాల,మాదారం,మల్లక్కపేట గ్రామలకు చెందిన పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల క్లస్టర్ వ్యవసాయ విస్తరాణాధికారి(ఏఇవో) ఎం.శైలజ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు, సబ్సిడీలు,బీమా వంటివి ఈ గుర్తింపు కార్డు ద్వారా సులభంగా అందుతాయని,ఆకస్మికంగా వచ్చే ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితులలో సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుందని,ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పథకాలకు ఈ గుర్తింపు కార్డు ఆధారంగా రైతులకు సాయం అందజేస్తారని అన్నారు.

దినామ్‌ ఆరోపణలే..ఎల్ల కాలం రాజకీయాలే!!

`అభివృద్ధికి ఏది సమయం.. చెప్పుకోవడానికి ఏది సందర్భం.

`నిన్నటి దాకా వీళ్లు..ఇప్పుడు వాళ్లు!

`అవినీతి ఆరోపణలు రాకుండా రాజకీయాలు చేయలేరా?

`దోచుకున్నారన్న విమర్శలు లేకుండా పాలన సాగించలేరా?

`మీరంటే మీరు దోచుకున్న ముచ్చట్లు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడరా?

`దోచుకు తింటున్నారనే నాయకులు తప్ప ప్రజలకు దిక్కులేదా!

`నిన్నటి దాగా బిఆర్‌ఎస్‌ లక్షల కోట్లు దోచుకుందన్నారు

`రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ దివాలా తీయించిందన్నారు

`నిరూపించమని ప్రతి అంశంలోనూ బిఆర్‌ఎస్‌ సవాలు చేస్తూనే వుంది

`సంవత్సరంన్నరైనా ఏది నిరూపించింది లేదు

`ఎవరికీ శిక్ష పడిరది లేదు

`పత్రికలకు వార్తలకు కొదువ లేదు

`ఇప్పుడు బిఆర్‌ఎస్‌ ఆరోపణలు మొదలయ్యాయి

`కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దోచుకుంటున్నారంటున్నారు

`నిజాయితీగా ఏ పార్టీ ప్రజాసేవ చేయలేదా?

`ప్రజలకు ప్రత్యామ్నాయం వీళ్లు తప్ప ఇంకెవరూ లేరా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఏ రాజకీయ పార్టీ నాయకుడి గురించి విన్నా ఏమున్నది గర్వకారణం సమస్తం అవినీతి ఆరోపణల మయం. ఇప్పుడున్న రాజకీయ పార్టీలైనా, నాయకులైనా సరే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వాళ్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు. వాళ్లు నిజంగా సంపాదించారా? లేదా? అన్నది ఎవరికీ తెలియదు. కాని ఆస్ధులు కూడబెట్టుకున్నారన్నది నిజం. జనంలో ఆ దర్పం కనిపిస్తున్నది నిజం. కాని రాజకీయ అవినీతి ద్వారా సంపాదించారా? అన్నది మాత్రం పూర్తిగా నిజంకాకపోవచ్చు. ఒకప్పుడు నాయలంటే కేవలం ప్రజా ప్రతినిధులుగానే కొనసాగుతూ వుండేవారు. ప్రజా సేవ తప్ప మరో వ్యాపకం వుండేది కాదు. వుంటే గింటే అంతో ఇంతో వ్యవసాయం వుండేది. అంతే తప్ప పెద్దగా వ్యాపారాలుండేవి కాదు. సంపాదనపై పెద్దగా వారికి ఆసక్తి వుండేది కాదు. ఎన్నికల సమయాల్లో కూడా వారికి వ్యాపారులు సహకరించేవారు. ఎన్నికల తంతు పూర్తి చేసుకునేవారు. కాని ఎనభైవ దశకం నుంచి పార్టీలపైన విమర్శలు, నాయకుల మీద అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయి. అవి ఇప్పుడు తారాస్దాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు లక్షల రూపాలయలు సంపాదించారంటే అది పెద్ద విషయంగా చెప్పుకునే వారు. తర్వాత కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు, ఇప్పుడు ఏకంగా లక్షల కోట్లు అనే మాటలు తప్ప తక్కువ వినిపించడం లేదు. నిజంగా నాయకులు అంత సంపాదిస్తారా? అంటే అవును ఎవరూ సమాదానం చెప్పలేరు. విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నామనే వారు కూడా వున్నారు. అయితే ఆ విమర్శించే వాళ్లు కూడా ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్నవాళ్లే..అందులో ఎవరూ సుద్దపూసలు కాదన్న మాటలు పడుతున్నవాళ్లే..ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఆరోపణలు ఎదుర్కొని నాయకులు ఒక్కరు కూడ లేదు. కాకపోతే ఇప్పటికీ కనిపిస్తున్న ఒక్కరో, ఇద్దరో నాయకులు వున్నప్పటికీ వారు క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఎన్నికల్లో పోటీచేసినా వాళ్లు ఇప్పుడు గెలవలేరు. గతంలో నాలుగుసార్లు, ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి ఎలాంటి అవినీతి మరకలు అంటని వారు, ఇప్పుడు ఎన్నికల్లో పోటీచేసినా తప్పకుండా వాళ్లు కూడా ఆరోపణలు ఎదుర్కొక తప్పని పరిస్దితులు వచ్చేశాయి. రాజకీయాల్లో అవినీతి అనే పదం అంతకు ముందుఎలా వున్నా..ఎంత వున్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే పుట్టిందని చెప్పకతప్పదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ కాలంలో గురించిగొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ అప్పట్లో ఎన్టీఆర్‌ అవినీతి మీద, ఆశ్రిత పక్షపాతం మీద, అదికార దుర్వినియోగం మీద, కుటుంబ పాలన మీద అనేక సిని మాలు వచ్చాయి. నేరుగా ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ సినీ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ అనేక సినిమాలు తీశాడు. కాని ఇప్పుడు ఎన్టీఆర్‌ కాలం గొప్పదనట్లు చెబుతుంటారు. అదే నిజమైతే అప్పట్లో అలాంటి సినిమాలు వచ్చేవి కాదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ది అనే మాట అటకెక్కింది. నిత్యం రాజకీయ పరమైన ఆరోపణలతోనే కాలం గడిచింది. నిజమైన అభివృద్దిని ఆనాడు చేసిందేమీ లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు తొమ్మిదేళ్ల కాలంలో పెద్దగా వ్యవసాయపరమైన ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ఎంత సేపు పారిశ్రామికీకరణ, ప్రభుత్వ రంగ సంస్ధల ప్రైవేటీ కరణ, ప్రభుత్వ కంపనీల అమ్మకాలులతో వచ్చే ఆదాయాల్లో కమీషన్లు అనే ఆరోపణలు అనేకం ఎదుర్కొన్నారు. రైతులకు సబ్సిడీలు తగ్గించారు. విపరీతమైన కంరటు చార్జీలు పెంచారు. వ్యవసాయం లాభసాటి నుంటి గిట్టుబాటు కాదన్నంత దూరం తెచ్చాడు. వ్యవసాయం పంగడ కాదు, దండగ అన్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ది ఏమిటని బూతద్దం పెట్టి వెతికినా ఒక్క ప్రాజెక్టు కనిపించదు. రాష్ట్రాదాయమేమో కాని, ఆయన ఆస్దులు మాత్రం పెరిగిపోయాయన్న ఆరోపణలుఅనేకం వచ్చాయి. రెండు ఎకరాల చంద్రబాబు, ఇరవై వేలకోట్లు సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చిన అప్పులతో, అవసరం లేని పనులు చేపట్టి, రైతులను ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. కమ్యూనిస్టుల చేత ప్రపంచ బ్యాంకు జీతగాడు అని పుస్తకాలు కూడా ప్రచురించారు. తర్వాత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన ఐదేళ్లలలోనే లక్ష కోట్లు సంపాదించారన్న ఆరోపణలుఎదుర్కొన్నారు. ఆయన హయాంలో కూడా పెద్దగా చేసిన పనులేమీ లేదు. కాని నిత్యం అవినీతి ఆరోపణలు ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. తర్వాత మరో ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కొని రోశయ్య, రాష్ట్రం విడిపోయే సయమంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి పెద్దఎత్తున సంతకాలు పెట్టి సంపాదించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. దాదాపు ఆ ముప్పై ఎళ్ల కాలంలో వచ్చిన మార్పులు ఏమిటంటే అంతా హైటెక్‌ హంగులు తప్ప మరేం కనిపించడం లేదు. కేవలం ఐటి తప్ప మరేం కొత్త పుంతలు తొక్కిన ఆర్ధిక పరిస్దితి లేదు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి కేసిఆర్‌ పరిపాలన చేసిన పదేళ్ల కాలం పాటు కాంగ్రెస్‌ నుంచి అనేక ఆరోపణలు, విమర్శలే. తొలి ఐదేళ్ల కాలంలో కొంత ప్రతిపక్షాల నుంచి పెద్దగా నిరసనలు, ఆరోపణలు వినిపించలేదు. కాని కేసిఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక ఆర్ధికపరమైన ఆరోణలతోనే కాలం గడిచింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ గాని, బిజేపి గాని నిత్యం ఆరోపణలే తప్ప కేసిఆర్‌ తోపాటు, బిఆర్‌ఎస్‌కు చెందిన నాయకుల ఆర్ధికపరమైన దోపిడీ గురించి స్పష్టమైన ఆధారాలు సంపాదించిందేమీ లేదు. ముఖ్యంగా సోషల్‌ మీడియా యుగం మొదలైన తర్వాత బిఆర్‌ఎస్‌ పతనం మొదలైంది. పిపిసి. అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి నియాకంతో బిఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ అమాంతం పడిపోయింది. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలతోనే కాలం గడిచిపోయింది. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ వంతు వచ్చింది. ఏడాదిన్నర కాలం పూర్తవుతోంది. గతంలో నాయకులు చేసిన ఆరోపణలు మీడియా గుర్తు చేస్తే తప్ప వాటి గురించి ఆలోచనలు వుండేవి కాదు. ప్రజలు కూడా పట్టించుకునేంత తీరిక వుండేది కాదు. కాని నేడు ఆ పరిస్దితి లేదు. సోషల్‌ మీడియా ప్రభావం ఎక్కువైంది. నాయకులు మర్చిపోయినా, సోషల్‌ మీడియా నిత్యం ప్రశ్నిస్తూనే వుంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిఆర్‌ఎస్‌ హాయంలో జరిగిన, ప్రతిపక్షంలో వున్నప్పుడు చేసిన ఆరోపణల మీద నిజా నిజాలు తేలుతాయని అందరూ అనుకున్నారు. కాళేశ్వరంలో లక్ష రూపాయలు తిన్నారన్నది ప్రదాన ఆరోపణ కేసిఆర్‌ మీద వుంది. అంతే కాకుండా కేసిఆర్‌ ఫామ్‌ హౌజ్‌లో వందల ఎకరాలున్నాయన్నాదానిపై విమర్శలున్నాయి. కేసిఆర్‌ పాలనా సమయంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులు అనేవి ఇప్పటికీ సజీవంగా సాగుతున్న ఆరోపణలు. మరి ఆ ఆరోపణలు ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోతోంది. ఏడాదిన్న కాలం గడిచిపోతోంది. యాదాద్రి విద్యుత్‌ ప్రాజెక్టుతోపాటు, అనేక ఇరిగేషన్‌ ప్రాజెక్టుల మీద ఆరోపణలున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి దీనిపై చర్యలు తీసుకుంటామని చెబుతూనే వున్నారు. మీరు ఎలాంటి దర్యాప్తులైనా చేసుకోండని బిఆర్‌ఎస్‌ ఎదరు సవాలు చేస్తూనే వుంది. బిఆర్‌ఎస్‌ హాయాంలో కేసిఆర్‌ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసిందని అంటున్నారు. వాటి లెక్కలు చెప్పరు. అందులో జరిగిన అవినీతి చెప్పరు. ఇక బిఆర్‌ఎస్‌ వంతు వచ్చింది. ఏడాదిన్న కాలంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇన్ని వేల కోట్లు దోచుకున్నాడు? ఆయన సోదరులు ఇన్ని తిన్నారు? ఫలానా మంత్రి ఇలా వసూలు చేస్తున్నాడు? అని ఆరోపణలు మొదలు పెట్టారు. కాని వివరాలు చెప్పమంటే మాత్రం సమయం వచ్చినప్పుడు అన్నీ బైట పెడతామంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. వారికి వివరాలు చెప్పడానికి సమయం, సందర్భం అవసరామా? అంటే పార్టీలు ఏవైనా సరే నాయకులంతా ఎల్ల కాలం రాజకీయాలు తప్ప మరేం చేయారా? ఎమ్మెల్యేలు ఎవరూ తమ నియోజకవర్గాలలో వున్న సమస్యలు ప్రస్తావించారా? వాటి పనుల పూర్తి గురించి, అబివృద్ది గురించి మాట్లాడరా? చేసిన అభివృద్ది గురించి చెప్పరా? దినాం..అధికార పార్టీ నాయకులతోపాటు, ప్రతిపక్ష నాయకులంతా అవినీతి ఆరోపణలు తప్ప మరేం మాట్లాడుకోరా? నువ్వుంటే,నువ్వు అని నిత్యం ఒకరిపై ఒకరు చేసుకునే అవినీతి ఆరోపణలు వింటూ ప్రజలు కూడాపంచ తంత్ర కథలు వింటున్నట్లు సంబరపడి పోతున్నారు. ఇది కూడా తమ మంచికే అని నాయకులు లోలోన నవ్వుకుంటున్నారు..అంతే అంతకు మించి ఈ కథ ఒక్క అడుగు కూడా ముందుకు పోదు..అవినీతి నిరూపణలు అన్నవి ఆమడదూరం…అంతే!!!

గంజాయి తాగిన గుట్కాలు అమ్మిన కేసులు.

గంజాయి తాగిన గుట్కాలు అమ్మిన కేసులు

పోలీసుల గట్టి నిఘా

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లాను నషాముక్తి జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నార్కోటిక్, నషాముక్త్ భారత్ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.
మత్తు పదార్థాల సేవించడం వల్ల జరిగే నష్టం పై యువతకు అవగాహన కల్పించాలని, విద్యా శాఖ అధికారులతో తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు గట్టి నిఘా ఉంచాల ని గంజాయి తాగే వారిని రవాణా, చేసే వారిని అరికట్టాలని సూచించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య మాట్లాడుతూ తమ పిల్లలు మత్తుపానియాల బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలపై నిఘావేసి ఉంచాలని కోరారు. విద్యాలయాలు, ఆసుపత్రుల దగ్గర వ్యాపారులు గుట్కాలు , సిగరెట్ వంటి పదార్థాలు అమ్మకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Gutkhas

స్పెషల్ క్యాంపెయిన్ లు నిర్వహించి యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల ఆవరణలో మత్తు పదార్థాలు గంజాయి తాగడం వల్ల జరిగే నష్టలపై ఫ్లెక్సీ లు ఏర్పాట్లు చేసి అవగాహన కల్పించాల్సిందిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు డి.సి.ఆర్.బి. డి.ఎస్పీ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాలో 2017 నుంచి గంజాయి కేసులు నమోదు అవుతున్నాయని, ఇటీవల వీపనగండ్ల మండలంలో ఒక పశువుల కాపరి గడ్డి వాములో గంజాయి దాపెట్టి ఉంచిన ఉదంతం వచ్చిందని అన్నారు గంజాయి తాగే వారు, రవాణా చేసే వారి పై పోలీస్ శాఖ గట్టి నుఘావేసి ఉంచిందని వారు దొరికిన వెంటనే కేసులు బుక్ చేసి జైలుకు పంపిస్తున్నట్లు తెలిపారు జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, పి.డి. డీఆర్డిఒ ఉమాదేవి, ఆబ్కారీ శాఖ, విద్యా శాఖ అధికారులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చైనా వ్యూహాత్మక చట్రంలో పాకిస్తాన్‌

ప్రతివ్యూహంతో చైనాకు చెక్‌ పెడుతున్న భారత్‌
ఫలితం భారత్‌ నిర్దేశిందిగానే వుంటుంది

ప్రపంచ దేశాలకు భారత్‌ అత్యంత అవసరం

భారత్‌ను వదులుకోవడానికి ఏదేశం సిద్ధంగా లేదు


తన స్థానాన్ని ఆక్రమిస్తున్న భారత్‌పై చైనా అక్కసు

యుద్ధం కోరుకుంటున్న పాకిస్తాన్‌

భారత్‌ వ్యూహంతో పాక్‌ ఉక్కిరిబిక్కిరి

చైనా కూడా ఎక్కువకాలం మద్దతివ్వలేని స్థితి

చివరకు భారత్‌కు అనుకూలంగానే రానున్న ఫలితం

పరిశ్రమల్లో ప్రధాన వస్తువుల ఉత్పత్తి జరిగే సమయంలో కొన్ని ఉప ఉత్పత్తులు కూడా ఉత్పన్నవడం సహజం. అదేవిధంగా ఒక లక్ష్యంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, దానివల్ల కొన్ని అ నుబంధ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. పహల్గామ్‌ సంఘటన నేపథ్యంలో భారత్‌ చేపట్టిన ఉగ్రవాదుల ‘ఉత్పత్తి’ కేంద్రాలపై జరిపిన దాడులు విజయవంతం కావడమే కాదు, ప్రపంచానికి భారత్‌ను ఒక కొత్తకోణంలో చూపాయి. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్‌గా, పెట్టుబడులకు అనుకూల దేశంగా తనను తాను నిరూపించుకున్న భారత్‌ ఇప్పుడు సీమాంతర ఉ గ్రవాదం పీచమణచడంలో మరే ఇతర దేశం అనుసరించని రీతిలో వ్యవహరించి పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి తన సత్తాలోని ప్రత్యేకత ఏంటో ప్రపంచానికి చూపింది. ఒక లక్ష్య సాధనలో వ్యవస్థల సమన్వయం ఎంత పకడ్బందీగా వుండాలనేది చెప్పడంలో ప్రపంచానికే ఒక మార్గదర్శకంగా వ్యవహరించింది. ఆధునిక ఎలక్ట్రానిక్‌ యుద్ధనీతిలో తనకు తిరుగులేదని రుజువుచేసింది. ఇక అసలు విషయానికి వస్తే, కుంచించుకుపోతున్న ఆర్థిక వ్యవస్థ ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు అప్రతిహతంగా ప్రపంచ మార్కెట్లను శాసించిన చైనా, తనను సవాలు చేసే రీతిలో భారత్‌ ఎదగడం ఎంతమాత్రం తట్టుకోలేక పోతున్నది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య యుద్ధం, యూరప్‌ సహా ఇతర దేశాల మార్కెట్లలో ప్రవేశం క్రమంగా కుం చించుకు పోతున్న తరుణంలో, తన మార్కెట్‌ను క్రమంగా ఆక్రమిస్తున్న భారత్‌పై ఆగ్రహంతో రగిలిపోతున్న చైనా విచిత్ర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కోపంతో మనపై దాడి చేయలేదు, అట్లాగని అక్కున చేర్చుకోలేదు, ఇదే సమయంలో విస్మరించనూ లేదు. విరోధాభాసలాంటి ఈ పరిస్థితిని అధిగమించి భారత్‌పై కక్ష తీర్చుకోవాలంటే దానికి వున్న మార్గం పాకిస్తాన్‌! తాను ఏది చేయాలనుకున్నా పాక్‌ ద్వారానే సాధించడానికి ప్రయత్నిస్తుంది. ‘డ్రాగన్‌’ ఈ జిత్తులమారితనానికి ‘ఏనుగు’ (భారత్‌) రెచ్చిపోవడంలేదు. ఆగ్రహంతో ఊగిపోవడంలేదు కూడా. కానీ ఒక పద్ధతి ప్రకారం తనదైన వ్యవహారశైలితో నిశ్శబ్దంగా పనిచేసుకొని పోతూ, క్రమంగా ఎక్కడికక్కడ ‘నట్లు’ బిగించుకుంటూ వూపిరి ఆడకుండా చేస్తున్నది. దీన్ని ‘డ్రాగన్‌’, ‘ఏనుగు’ అనే దిగ్గజ ప్రత్యర్థుల మధ్య కొనసాగుతున్న ‘ప్రచ్ఛన్న’ పోరాటం అనుకోవచ్చు.
పాక్‌ దుస్సాహసం వెనుక ‘అండ’
పహల్గాం సంఘటన వెనుక పాకిస్తాన్‌ హస్తమున్నదనేది తిరుగులేని సత్యం. అమాయకులైన ప ర్యాటకులను దారుణంగా చంపేయడం ద్వారా భారత ప్రభుత్వాన్ని, ప్రజలను రెచ్చగొట్టాలన్నది దాని ఉద్దేశం. అయితే ఇక్కడ పాక్‌ ఆశించిన స్థాయిలో ఉగ్రవాదులు వ్యవహరించలేకపోయారు. మరి పాకిస్తాన్‌ ఇటువంటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టిందనేది సహజంగా ఉదయించే ప్రశ్న. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గతంలో చేపట్టిన ఉగ్రవాద చర్యలకు ప్రతిక్రియ ఏవిధంగా ఉన్నదీ పాకిస్తాన్‌కు అనుభవైకమే. మళ్లీ ఇటువంటి దుస్సాహసానికి పాల్పడితే పరిస్థితి దారుణంగా వుంటుందనేది కూడా పాక్‌కు తెలియంది కాదు. దేశంలో అల్లకల్లోలం చెలరేగుతున్నప్పుడు నియంతలు, సైనిక పాలకులు సాధారణంగా బాహ్య శత్రువును చూపి దేశాన్ని ఐక్యంగా వుంచ డానికి యత్నిస్తారు. ప్రస్తుతం పాకిస్తాన్‌ కూడా అదే చేసి ప్రజల దృష్టిని మరల్చాలనుకున్న వ్యూ హం బూమరాంగ్‌ అయింది. మోదీ ప్రభుత్వం ఇంతటి తీవ్రస్థాయిలో స్పందిస్తుందని బహుశా ఊహించి వుండకపోవచ్చు. ఈ ప్రతిక్రియను తట్టుకునే ఆర్థిక సామర్థ్యం పాక్‌కు లేదు. సైనిక సామర్థ్యం అంతకంటే లేవు. అయినప్పటికీ కొరివితో తలగోక్కోవడానికి సిద్ధపడిరదంటే దానికి ఏదో ఒకరకమైన మద్దతు కచ్చితంగా వున్నట్టే! అదే చైనా!
చైనాభారత్‌ సంబంధాల్లో సందిగ్ధత
2020లో గల్వాన్‌ సంఘటన తర్వాత భారత్‌ాచైనాల మధ్య దారుణంగా దెబ్బతిన ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడిప్పుడే గాట్లో పడుతున్నాయి. అమెరికాతో వాణిజ్య వైరం కూడా చైనాను దిగొచ్చే లా చేసింది. మానససరోవర యాత్ర తిరిగి ప్రారంభం, దౌత్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. పైకి సజావుగా, అంతా ప్రశాంతంగా సాగిపోతున్నట్టు కనిపిస్తున్నా, చైనా హృదయాంతరాళాల్లో ఎక్కడో వ్యక్తం చేయలేని భయంతో కూడిన ఆందోళన! వేగంగా ఎదుగుతున్న భారత్‌ ముందు ఇక ఎంతోకాలం తన ఆధిపత్యం నిలవదన్న సత్యం దాని మెదడును తొలిచేస్తోంది. మరోవైపు భారత్‌ను నిరోధించలేదు అట్లాగని విస్మరించనూ లేదు. ఇదొక విచిత్ర సందిగ్ధ పరిస్థితి! నిజం చెప్పాలంటే 21వ శతాబ్దంలో భారత్‌ాచైనాల మధ్య ఎంతమాత్రం పొంతన లేని దశ కొనసాగింది. చైనా ఒక స్థాయికి చేరుకోగా, భారత్‌ ఇంకా తన స్థాయిని మరింత పెంచుకోవడానికి అలుపెరుగని పోరాటం చేస్తూనే వుంది. 2010 తర్వాత మౌలికసదుపాయాలు, సాంకేతికరంగం మరియు వాణిజ్య రంగాల్లో భారత్‌ను పూర్తిగా వెనక్కు నెట్టేసింది. ఇక భారత్‌ను ప ట్టించుకోవాల్సిన అవసరం లేదనకుంటున్న తరుణంలో 2017లో డోక్లాం సంఘటన పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. భారత సైన్యం ఢీ అంటే ఢీ అనే స్థాయిలో నిలబడేసరికి, చైనా వెనక్కు త గ్గాల్సి వచ్చింది. 2020లో జరిగిన గల్వాన్‌ సంఘనలో భారత్‌ తన కార్యశీలతను రాజకీయ దృఢత్వాన్ని విస్పష్టంగా ప్రదర్శించడం చైనాను కలవర పరచింది. ఆ తర్వాత కోవిడ్‌ మహమ్మారి ఒక్కసారి విజృంభించడంతో చైనాతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలి పోయా యి. ఈ అఘాతం నుంచి భారత్‌ చాలా వేగంగా బయటపడగా, చైనా తన చురుకుదనాన్ని కో ల్పోయి వెనుకబడిరది. ముఖ్యంగా ఎన్ని ఉద్దీపన చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోగా, ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనం చేసింది. మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోవడం, రుణ సంక్షోభం చైనాను అతలాకుతలం చేశాయి. అప్పటివరకు భారత్‌ను తనతో సరిసమాన దేశంగా చైనా ఎప్పుడూ పరిగణించలేదు. కేవలం ప్రాంతీయ శక్తి స్థాయికే పరిమితం చేసి తాను గ్లోబల్‌ స్థాయికి ఎదగడానికి అమెరికాతో పోటీపడటం మొదలుపెట్టింది. కానీ అమెరికాతో పోటీపడాలన్న ఆకాంక్ష మాట అట్లా వుంచి, భారత్‌ వేగంగా పుంజుకొనడంతో, ప్రపంచ యవనికపై భారత్‌ాచైనాలను సరిసమానంగా చూడటం మొదలైంది. 2025లో ట్రంప్‌ హయాం వచ్చిన త ర్వాత వాణిజ్య యుద్ధం మొదలుకావడంతో చైనా పరిస్థితి మరింత తల్లక్రిందులైంది. ఈ వాణిజ్య యుద్ధంలో రెండుదేశాలు నష్టపోయినప్పటికీ, దెబ్బ అధికంగా తగిలింది చైనాకే! మొత్తం వాణిజ్య సరఫరా శృంఖలాలు దెబ్బతినడం, దేశంలో ఉత్పత్తుల నిల్వలు అమాంతం పెరిగిపోవడం,మార్కెట్ల కొరతతో చైనా ఆర్థికంగా అతలాకుతలమైంది.
ప్రత్యామ్నాయంగా భారత్‌
ప్రతి లావాదేవీలో తనకు లాభం లేకుండా అడుగు ముందుకేయని అమెరికా, ఈ వాణిజ్యయు ద్ధంలో ముందుకే వెళ్లడానికి ప్రధాన కారణం భారత్‌ ప్రత్యామ్నాయంగా కనబడటం! అమెరికా వ్యూహాత్మక అవసరాలు తీర్చే స్థితిలో భారత్‌ వుండటంతో, చైనాపై ఒత్తిడి పెరిగింది. భారత్‌కు వాణిజ్యపరంగా విస్తృతమవుతున్న సరఫరా శృంఖల వ్యవస్థ, భౌగోళిక సమతుల్యతను సాధించ డం వంటి అంశాలను చైనా మీడియా సంస్థలు క్రమంగా గుర్తించడం మొదలైంది. కేవలం భారత్‌ వుండటం వల్లనే అమెరికా తనను ఒక చట్రంలో బిగించగలుగుతోందన్న సత్యం కూడా చైనాకు అర్థమవసాగింది. ఈ నేపథ్యంలో తనకు పొరుగునే వుంటూ, తన ఆధిపత్యాన్ని సవాలు చే స్తూ, గ్లోబల్‌ పవర్‌గా ఎదుగుతున్న భారత్‌ ఒక పెద్ద సవాలుగా మారింది. దీన్ని ఏదోవిధంగా కట్టడి చేయకపోతే నిండా మునగడం ఖాయమన్నది కూడా అవగతమైంది.
1980 దశకంలో చైనా ఎదుగుదలకు అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్యదేశాలు ఎంతగానో స హకరించాయి. కానీ భారత్‌ పరిస్థితి అదికాదు. తాను పశ్చిమదేశాల ప్రభావానికి లోనుకాకుండాస్వతంత్రంగా, తన సొంత పంథాలో ముందుకెళుతూ ఎదుగుతోంది. స్వతంత్రంగా ఎదుగుతున్నభారత్‌ను కట్టడిచేయడం చైనాకు సాధ్యంకాని పని! ఒకవేళ అట్లా చేయాలనుకుంటే భారత్‌`యుఎస్‌లు మరింత సన్నిహతమవుతాయి. సైనికంగా బెదిరిద్దామను కుంటే, డోక్లామ్‌, గల్వాన్‌ సం ఘటనలు చైనాకు తన పరిమితేంటో స్పష్టం చేశాయి. మరో సంఘర్షనకు దిగడమంటే ఆత్మహ త్యా సదృశమేనన్న సంగతి చైనాకు బాగా తెలుసు.
భారత్‌ సహకారం తప్పనిసరి
ఈ నేపథ్యంలో అమెరికాను పక్కనబెట్టే విధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక, వాణిజ్య వ్యవస్థను నిర్మిస్తే ప్రస్తుత దుస్థితినుంచి బయటపడవచ్చు. అందుకు బ్రిక్స్‌ వంటి వేదికలు అవసరం. ఈ వేదికను ఉపయోగించుకొని బ్రిక్స్‌కు ప్రత్యేక కరెన్సీ రూపకల్పన, డాలర్‌కు ప్రత్యామ్నాయ చెల్లింపుల వి ధానాన్ని అమల్లోకి తేవడం వంటి ప్రక్రియలు చేపట్టాలి. ఇందుకు మళ్లీ భారత్‌ సహకారం తప్పనిసరి. ఇండియా ముందుకు రాకపోతే చైనా వ్యూహాలు చెత్తబుట్టలోకి వెళ్లిపోతాయి. ఎందుకంటే వాణిజ్యపరంగా భారత్‌ లేకుండా, యు.ఎస్‌.కు ప్రత్యామ్నాయంగా అనుసరించే మార్గాలను ప్రపంచం విశ్వసించదు. రష్యాకు ఇది బాగా అర్థమైంది. చైనాకు తెలిసొచ్చింది. అయినప్పటికీ చై నాలోని అహంకారం భారత్‌ ఎదుగుదలను అడ్డుకోవాలనే కోరుతుంది. ఇందుకోసం కొంత రిస్క్‌ను భరించడానికి కూడా సిద్ధమే! వేగంగా ఎదుగుతున్న భారత్‌ తనకు పెను సవాలుగా మారక తప్పదు. అట్లాగని పశ్చిమదేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని నిరోధించాలంటే భారత్‌ సహాయం తప్పదు! అందువల్లనే మనదేశంపై దాడిచేయలేదు, అట్లాగని కౌగిలించుకోనూ లేదు, ఇదేసమయంలో విస్మరించడం అసలు సాధ్యమూ కాదు. ఈ విచిత్రపరిస్థితి నేపథ్యంలోనే తనకు అత్యంత విశ్వాస పాత్రుడైన పాకిస్తాన్‌ను పావుగా ఉపయోగించుకొని భారత్‌ను దెబ్బకొట్టే వ్యూహాన్ని అనుసరిస్తోంది.
పహల్గాం సంఘటనలో పాక్‌కు మద్దతు
వ్యూహాత్మకంగా ఇటువంటి జటిల పరిస్థితిలో, పాకిస్తాన్‌ను ఒక ఉపకరణంగా వాడుకునే సాను కూలత చైనాకు లభించింది. పహల్గాం సంఘటనలో పాకిస్తాన్‌కు కేవలం మద్దతివ్వడమే కాదు, మనదేశంలోకి పాక్‌ చొరబాట్లకు గట్టి మద్దతునిస్తోంది. పహల్గామ్‌ దాడిలో ఉగ్రవాదులు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు తేలింది. ముఖ్యంగా హువావే ఉపగ్రహ ఫోన్లు, చైనాకు చెందిన అత్యాధునిక ‘ఆల్ట్రాసెట్‌ ఎన్‌క్రిప్షన్‌ టెక్నాలజీ’ ఈ ఉగ్రవాదులకు అందు బాటులోకి రావడం గమనార్హం. ఈ సాంకేతిక పరిజ్ఞానం తమను గుర్తించకుండా సహాయపడు తుంది. ఈ ప్రత్యేక ఉపకరణాలను చైనా కంపెనీలు తయారుచేశాయి. వీటిని పాక్‌ సైన్యం ఉపయోగిస్తుంటుంది. ఇవి సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ స్టేషన్‌ల ఫ్రీక్వెన్సీకి అను సంధానమై పనిచేస్తుంటాయి. వీటి సహాయంతో కుదించిన సమాచారాన్ని చైనా ఉపగ్రహాల ద్వారా పాకిస్తాన్‌కు అందజేస్తుంటారు. కేవలం సైన్యానికి పరిమితమయ్యే ఈ అత్యాధునిక సాంకేతికపరిజ్ఞానం, కశ్మీర్‌లో ఉగ్రవాద చర్యలకు పాల్పడే మిలిటెంట్ల చేతికి రావడం చైనా అధికార్లకు తెలియదంటే అంతకంటే అమాయకత్వం మరోటుండదు. దౌత్యపరంగా పాకిస్తాన్‌కు పూర్తిస్థాయి మద్దతునిస్తోంది. ఐక్యరాజ్య సమితిలో పాక్‌ మిలిటెంట్లను అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ప్రకటించనీయకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటోంది. అంతేకాదు పహల్గాం సంఘటనకు పాక్‌ మిలిటరీకి సంబంధమున్నదన్న సంగతి స్పష్టమైనా, పాకిస్తాన్‌ చెబుతున్న ‘నిష్పాక్షిక విచారణ’కు మద్దతివ్వడం గమనార్హం. అంతకంటే మరో ముఖ్య విషయమేంటంటే, పాకిస్తాన్‌ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లితే తాము అండగా నిలుస్తామని చైనా వ్యూహకర్త విక్టర్‌ గావో పేర్కొనడం కూడా ఇక్కడ ప్రస్తావనార్హం.
యుద్ధం కోరుకుంటున్న దేశాలు
నిజం చెప్పాలంటే ప్రంపంచంలోని ప్రతి బలీయమైన దేశం పైకి ఎన్ని మాటలు చెప్పినా అంతర్గతంగా భారత్‌`పాక్‌ల మధ్య యుద్ధం రావాలనే కోరుకుంటున్నాయి. ఈయుద్ధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయి, ప్రపంచంలో భారత్‌`పాకిస్తాన్‌ అనే స్థాయికి దిగజారాలన్నది చైనా కోరిక! ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారత్‌ను తనతో సమానంగా పరిగణించడం చైనాకు ఎంతమాత్రం ఇష్టంలేదు. పాకిస్తాన్‌తో యుద్ధం వస్తే, భారత్‌ తనతో బేరసారాలాడే బలీయతను కోల్పోయి, కాళ్లబేరానికి వస్తుందన్నది అమెరికా అంచనా. ఇక రష్యా విషయానికి వస్తే ఇప్పటికే యుక్రెయిన్‌ యుద్ధంలో ఏకాకిగా మారిన తాను, ప్రస్తుతం భారత్‌కు నమ్మకమైన మిత్రుడుగా కొనసాగుతు న్నప్పటికీ మరో భౌగోళిక రాజకీయ సంక్షోభంలోకి తలదూర్చి మరింత ఒంటరి కావడానికి ఇష్ట పడటం లేదు. ఇక పాకిస్తాన్‌కు ఇప్పుడు యుద్ధం అత్యవసరం. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రిగ్గర్‌ను నొక్కేసింది. పదేపదే భారత్‌ను రెచ్చగొడుతోంది. యుద్ధం వస్తేనే తనకు మద్దతిస్తామ న్న దేశాలనుంచి ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతుంది. కానీ ఎక్కడెక్కడో ఉన్న సైన్యాన్ని సరి హద్దులకు తరలించడం దానికి తలకు మించిన భారంగా మారింది. భారత్‌ ఆలస్యం చేసినకొద్దీ,తరలించిన సైన్యం యుద్ధసన్నద్ధత నిర్వహణకు విపరీతంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫలితంగా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్‌ మరింత దిగజారే పరిస్థితి ఏర్పడక మానదు. ఆవిధంగా ఒక్క బుల్లెట్‌ కూడా పేల్చకుండా పాక్‌ ‘రక్తమోడక’ తప్పదు. భారత్‌ను ‘వెయ్యి గాయాలతో రక్త మోడిస్తాం’ అని ప్రతిజ్ఞ చేసిన పాక్‌ ఇప్పుడు తాను అదే దుస్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకనే పాకిస్తాన్‌ ప్రతి చిన్న విషయానికి భారత్‌ సహనాన్ని పరీక్షించే రీతిలో రెచ్చగొడుతోంది.
భారత్‌ను తక్కువగా అంచనా వేస్తున్న ప్రపంచం
నిజం చెప్పాలంటే ప్రపంచ దేశాలు భారత్‌ అనుసరించే భౌగోళిక రాజకీయాన్ని చాలా తక్కువగాఅంచనా వేస్తున్నాయి. రష్యా`చైనా ఒకవైపు, పశ్చిమ దేశాలను మరోవైపు ఏ కారణం లేకుండా నే మనదేశం అయోమయంలో వుంచుతుందనుకోవడం అమాయకత్వమే అవుతుంది. బ్రిక్స్‌ నుంచి క్వాడ్‌ వరకు భారత్‌ సభ్యురాలే అన్న విషయం మరచిపోకూడదు. అన్ని భౌగోళిక రాజకీయ కూటముల్లో భారత్‌ భాగస్వామి. అందువల్ల ఏ దేశమూ భారత్‌ లేకుండా ముందడుగు వేయడంసాధ్యంకాదు. అట్లాగని ఏకాకినీ చేయలేవు. ఒకరకంగా చెప్పాలంటే భారత్‌ రెండంచుల కత్తిపై చిన్న గాయం కాకుండా నడిచే రీతిలో దౌత్యాన్ని కొనసాగిస్తోంది. భారత్‌ వేసే ప్రతి అడుగులో భావావేశం వుండదు, కేవలం ఒక పద్ధతిప్రకారం, వ్యూహాత్మకత మాత్రమే వుంటుంది. పాకిస్తాన్‌పై నీటి ఒత్తిడిని క్రమంగా పెంచుతూ వచ్చింది. 2016 నుంచి సింధూనది ఉపనదులపై భారత్‌ డ్యామ్‌లు నిర్మిస్తూ వస్తున్న సంగతి కొందరికే తెలుసు. ఇప్పుడు ఈ నీటిపై ఆధిపత్యం సాధించడం ద్వారా, పాక్‌లో వ్యవసాయాన్ని, విద్యుత్‌ను, ఆహార భద్రతను నియంత్రించవచ్చు. ఇదే సమయంలో భారత సైన్యం ఫార్వర్డ్‌ పోస్టుల్లో కొనసాగుతాయి. దీని వల్ల పాక్‌ సైన్యం అనుక్షణం అప్రమత్తంగా వుండాలి. ఇది దానికి ఆర్థిక భారం! ఇదేసమయంలో భారత దౌత్యప్రతినిధులు తమపని కానిచ్చేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ దేశాల ఒత్తిడి కేవలం పాకిస్తాన్‌పై మాత్రమే కాదు దాని మద్దతుదార్లపై కూడా బాగా పెరిగిపోయింది. ఇక చైనా విషయానికి వస్తే, ఇప్పటికే పన్నుల యుద్ధంలో కుదైలైన ఆర్థిక వ్యవస్థ నేపథ్యంలో, ఈ పాకిస్తాన్‌ ‘వ్యూహాత్మక భారాన్ని’ మోసే పరిస్థితిలో లేదు. ఇది మరింతకాలం కొనసాగితే చైనా పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఇప్పటికే యూరప్‌, అమెరికా, రష్యాల్లో జాతీయవాద భావాలు పెరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సరిహద్దుల్లో మాత్రమే కాదు ప్రపంచ వ్యవస్థపై కూడా భారత్‌ తన ముట్టడిని కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌పై సైనిక చర్య వుండవచ్చు. ఎన్నో భారమైన నిద్రలేని రాత్రులు గడిచిన తర్వాత, నీ రు`ఆహారం కొరత ఏర్పడినప్పుడు, ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న తర్వాత, నిరంతరం సైనికుల తరలింపు వల్ల సైన్యం బలహీనమైనప్పుడు దాని నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అప్పుడుభారత్‌ చేసే దాడి తీవ్రతను అంచనా వేయడానికుండదు. పాకిస్తాన్‌ను ఒక పేపర్‌ మాదిరిగా మడత పెట్టేస్తుంది. అప్పుడు ప్రపంచానికి తామకు కావలసింది లభిస్తుంది. కానీ అది భారత్‌ నిర్దే శించిన పరిధిలో మాత్రమే వుంటుంది!

సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముస్లిములను ఉగ్రవాదులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ముస్లిం యువకులు బుధవారం ఫిర్యాదు చేశారు. వందశాతం ముస్లిములు ఉగ్రవాదులే అని పవన్ ద్వేషపూరిత ప్రకటన చేశారని పేర్కొన్నారు. ముస్లింల టోపీలు, గడ్డాలు, కుర్తాలు ఉగ్రవాదానికి చిహ్నాలుగా పవన్ ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఆయనపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

‘‘అంతం కాదిది’’…’’ఆరంభం!’’

 

-ఆపరేషన్‌ సిందూర్‌ సక్సెస్‌!

-ఆపరేషన్‌ సింధూర్‌…ఉగ్ర స్థావరాలు మటాష్‌!

-పహల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సింధూర్‌తో ప్రతీకారం.

-భారతీయుల్లో వెల్లి విరుస్తున్న ఆనందం.
-దేశమంతా మన సైనికులకు సలామ్‌.

 

-జై హింద్‌ ట్విట్లతో దేశంమంతా మారుమ్రోగిపోతోంది.

-పాకిస్తాన్‌ లో వున్న 4 ఉగ్ర స్థావరాలు, పివోకేలో 5 బంకర్లు ధ్వంసం.

-మసూద్‌ కుటుంబం, బంధువులు మృతి.

-100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.

-26 ఉగ్రస్థావరాలు గుర్తింపు.

-పాకిస్తాన్‌ మాయమయ్యే సమయం ఆసన్నమైంది.

-ఇప్పుడే మొదలైంది…ఇక పాకిస్తాన్‌కు మూడిరది.

-ఉగ్రవాద స్థావరాలపై అర్థరాత్రి మొదలైన భారత్‌ దాడులు.

-25 నిమిషాలలో ఆపరేషన్‌ పూర్తయ్యింది.

-9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు.

-అంతర్జాతీయంగా పాక్‌ ఇప్పుడు ఏకాకి!

-పాక్‌కు మిగిలేది ఇక భవిష్యత్తు కాళరాత్రి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇండియా అంటేనే శాంతి సందేశం. శాంతికి నిలయం. పరహితం. పరోపకారం. ప్రపంచశాంతిని కోరుకునే దేశం. అలాంటి మన దేశం మీద ప్రతి క్షణం విషం చిమ్ముతూ బతకడమే పాకిస్తాన్‌కు అలవాటుగా మారింది. దేశం విడిపోయిన నాటి నుంచి ఏదో ఒక రకంగా గిచ్చి కయ్యం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నది. ఇప్పటికి నాలుగు సార్లు జరిగిన యుద్దంలో ఓడిపోయినా ఆ పాకిస్తాన్‌కు బుద్ది రావడం లేదు. 1972లో ఏకంగా 90 వేల మంది పాకిస్తాన్‌ సైనికులు లొంగిపోయి, యుద్దంలో ఓడిపోయారు. అయినా ఆ దేశానికి సోయి రావడం లేదు. ఎన్ని సార్లు ఆ దేశం పీచమణిచినా మారడం లేదు. తినడానికి తిండికి దిక్కులేకపోయినా సరే, మనతో యుద్ధం కోరుకుంటూ పతనం అంచుల్లో వున్నా దాని బుద్ది మారడం లేదు. మన దేశంలో ఎన్ని కవ్వింపులు చేసినా క్షమిస్తూ పోతూనే వున్నాం. పైగా ఆ దేశంలో విపత్కర పరిస్ధితులు ఎదురైన ప్రతిసారి సాయం చేస్తూ ఆదుకుంటూనే వున్నాం. అయినా ఆ దేశానికి కృతజ్ఞతలేదు. ఎన్నొసార్లు భూకంపాలు వచ్చిన పాకిస్తాన్‌ అతలా కుతలమైపోయిన సందర్భాలలో ఆదుకుంటూ వచ్చాం. ఇప్పటికీ నిత్యం గోదుమ పిండి పంపకపోతే , తిండికి దిక్కులేకపోయినా, మన తిండి తింటూ మన దేశంపైనే ప్రతికారం కోరుకుంటుంది. అలాంటి దేశానికి ఇక బుద్ది చెప్పే తరుణం ఆసన్నమైంది. ఇక పాకిస్తాన్‌ను కోలుకోకుండా, తేరుకోకుండా చేస్తే తప్ప పాకిస్తాన్‌ దారికి వచ్చే పరిస్ధితి లేదు. దాయాది దేశమని సాయం చేసినా, ఎన్ని పాలు పోసినా పాము విషమే కక్కుతుందన్నట్లు తన పాపపు బుద్దిని పాకిస్తాన్‌ ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే ఇక ఆట మొదలైంది. ఉగ్రవాదులు వేట మొదలైంది. తనకు దిక్కులేకపోయినా, ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ, మన దేశంలో అశాంతిని రేపుతామని చూస్తున్న పాకిస్తాన్‌ను ఇక వదిలిపెట్టకూడదన్న గట్టి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. ఆరేళ్ల క్రితం మన సైనికులు 60 మందిని పొట్టన పెట్టుకున్నా, సర్జికల్‌ స్ట్రైక్‌తో ఆపేశాం. కాని ఆసారి పెహల్గావ్‌లో ముష్కరులు హిందువులను టార్గెట్‌ చేసి చంపడం అన్నది ప్రపంచంలో ఏ దేశం సహించలేదు. మన 140 కోట్ల మంది భారతీయుల రక్తం మరిగిపోయింది. ఇప్పటికీ కూడా పాకిస్తాన్‌ ప్రేజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండానే, ముష్కర స్ధావరాలను కూకటి వేళ్లతో పెలికించి, ప్రపంచం ముందు మరోసారి భారత్‌ గొప్పదనాన్ని చాటుకున్నది. కాకపోతే పాకిస్తాన్‌ పాపాలకు ఎక్కడో అక్కడ పుల్‌ స్టాప్‌ పడాలి. పాకిస్తాన్‌ ఇక భారత్‌ వైపు కన్నెత్తి చూడాలంటే కలలో కూడా అక్కడి పాలకులు ఉలిక్కి పడాలి. పాకిస్ధాన్‌కు మన దేశపు దెబ్బ అంత గట్టిగా పడాలనే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. ఓ వైపు ప్రపంచంలో అభివృద్దిలో పోటీ పడాలని మనం ఆలోచిస్తుతంటే, ప్రతిసారి పాకిస్తాన్‌ కవ్వింపుల కోసం ఇక ఆలోచించే రోజు వుండకూడదు. అంటే పాకిస్తాన్‌ వరల్డ్‌ మ్యాప్‌లో లేకుంటా చేస్తేనే దారి వస్తుంది. పాక్‌ ఆక్రమించుకున్న పిఓకే స్వాధీనంతోపాటు, పాక్‌ను అష్ట దిగ్భందనం చేస్తే తప్ప దానికి ఊరిరి ఆడదు. మన కేంద్ర ప్రభుత్వం అదే ఆలోచన చేస్తోంది. పాకిస్తాన్‌ కూసాలు కదిలిపోయేలా చేస్తోంది. భవిష్యత్తులో యుద్దం అన్న ఆలోచన వస్తేనే పాకిస్తాన్‌ గుండెలు అదిరిపోవాలి. అంతే కాదు మీరు తప్ప మాకు దిక్కులేదని కాళ్లబేరానికి రావాల్సిన అవసరం వుంది. అంత దూరం తీసుకుపోతే తప్ప పాకిస్తాన్‌ మాట వినదు. ఇప్పుడున్న పరిసి ్దతుల్లో పాకిస్తాన్‌పై కనికరం అన్నది చూపకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. హిందూస్తాన్‌ వైపు తొంగి చూసినా తునాతునకలైపోతామన్న భయం పాకిస్తాన్‌కు రుచి చూపించాలి. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. ఆ అవకాశాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా జార విడువాలనుకోవడం లేదు. పాకిస్తాన్‌తో ఈ తలనొప్పి ఇక వుండదకూడదనే నిర్ణయానికి వచ్చింది. సరిహద్దును చూస్తే పాకిస్తాన్‌ ఇక జడుసుకోవాలి. ముష్కరులకు తావివ్వాలంటేనే పాకిస్తాన్‌కు తడిసిపోవాలి. అందుకే ఇక అసలు ఆట మొదలైంది. అంతం కాదిది..ఆరంభం. ఆపరేషన్‌ సింధూర్‌ సక్సెస్‌. 9 ఉగ్రవాద స్ధావరాలు మాటాష్‌. పలహాల్గావ్‌ దాడికి ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత్‌ తీర్చుకున్న ప్రతికారం. భారతీయుల్లో ఆనందం వెల్లిరిస్తోంది. ఇలాంటి మాట కోసం అమాయకులైన 25మందిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న నాటి నుంచి ఎదురుచూస్తున్నారు. ప్రతీకారంతో దేశ ప్రజలు రగిలిపోతున్నారు. ప్రభుత్వం ప్రతికారం తీర్చుకోకుంగా జాప్యం చేస్తుందని మధనపడినవ వారు కూడా వున్నారు. మన దేశ ప్రభుత్వ ఆలోచన, యుద్ద వ్యూహాలు అర్ధం చేసుకోలేక, బావోద్వేగాలతో ఎదురుచూసిన ప్రజలకు కూడా ఎంతో సంతోషాన్నిచ్చిన సందర్భమిది. దేశమంతా ఒక రకంగాచెప్పాలంటే పులకించిపోతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని, మన సైనికులను కీర్తిస్తోంది. దేశమంతా జేజేలు పలుకుతోంది. ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరుపెట్టి మరీ ఉగ్ర స్ధావరాలను ధ్వంసం చేయడాన్ని దేశమంతా ఉద్వేగంతో సంబరాలు చేసుకుంటోంది. భారత్‌ మాతాకీ జై అని జై కొడుతోంది. జై హింద్‌ అంటూ దేశమంతా నినదిస్తోంది. దేశమంతా మన సైనికులు సలాం చేస్తోంది. జై హింద్‌ ట్విట్లతో దేశమంతా మారు మ్రోగిపోతోంది. పాకిస్ధాన్‌ ఆక్రమించుకున్న పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనే కాదు, ఏకంగా పాకిస్తాన్‌ గడ్డ మీదకు వెళ్లి మరీ ఉగ్ర స్ధావరాలను మన వైమానిక దళం ద్వంసం చేసింది. పాకిస్తాన్‌ కేంద్రంగా వున్న 26 ఉగ్ర స్ధావరాలను గుర్తించినట్లు సమాచారం. అందులో కీలకమైన 9 స్దావరాలను గుర్తించి ధ్వంసం చేశారు. పిఓకెలో వున్న 5 ఉగ్రవాద స్ధావరాలు, పాకిస్తాన్‌ గడ్డ మీద వున్న 4 స్ధావరాలను నామరూపాలు లేకుండా చేశారు. పాకిస్తాన్‌ గడ్డ మీద మన సైనికులు త్రివర్ణ పతాకం ఎగరవేడం గొప్ప శుభ పరిణామం. మన దేశమంతా సగర్వంగా సైనికులకు సలాం చేసింది. తీవ్ర వాద నాయకుడైన మసూద్‌ కుటుంబం మొత్తం చనిపోయింది. వారితోపాటు బంధువులు, ఇతర ఉగ్ర వాదులు మొత్తం 100 మందికిపైగా భారత్‌ జరిపిన వైమానికదాడిలో చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక మన కంటిలో నలుసులా, చెప్పులో రాయిలా తయారైన పాకిస్తాన్‌ కూడా మాయమయ్యే సమయం ఆసన్నమైంది. అయితే మన దేశం అనుసరిస్తున్న యుద్ద వ్యూహాలు అర్దం కాక ఇప్పటికే పాకిస్తాన్‌ తలలు పట్టుకుంటోంది. పాకిస్తాన్‌ విషయంలో ప్రపంచమంతా ఒకవైపు, పాకిస్తాన్‌ ఒక వైపు అనేలా యుద్ద తంత్రాన్ని నెరిపిన ఘనత మన ప్రదాని నరేంద్ర మోడీకే దక్కింది. గతంలో పాకిస్తాన్‌కాలు దువ్విన ప్రతి సందర్భంలోనూ ఏదోఒక దేశం మద్దతు ప్రకటిస్తూ వచ్చేవి. కాని ఈసారి 80 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్‌కు అగ్రరాజ్యాలేవీ పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. ఒక రకంగాచెప్పాలంటే పాకిస్తాన్‌ ఏకాకి అయ్యింది. మన ప్రధాని నరేంద్ర మోడీ యుద్ద తంత్రాన్ని ఇప్పుడే మొదలు పెట్టారు. అయితే నిజానికి పహల్గావ్‌ దాడి మరుసటి రోజు నుంచే మన దేశం యుద్దతంత్రాన్ని మొదలు పెట్టింది. ముందు పాకిస్తాన్‌ను ఆర్ధికంగా కుదేలు చేసింది. ఆ దేశానికి ఎగుమతులు అన్నీ రద్దు చేసింది. తర్వాత వైమానిక దారులు మూసేసింది. పాకిస్తాన్‌కు సిందు నది నీళ్లను ఆపేసింది. దాంతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరైంది. ఇప్పటికే మూలిగే నక్కలాంటి పాకిస్తాన్‌ మీద మన ప్రభుత్వం కొట్టిన దెబ్బతో పాకిస్తాన్‌ గిలగిలాడుతోంది. నిజానికి పాకిస్తాన్‌ ప్రజలు కూడా మన దేశంతో యుద్దం వద్దని ఆ దేశ సైనికులు కూడా పాకిస్తాన్‌ను కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. యుద్దం చేయడానికి ఇష్టపడక ఎంతో మంది పాకిస్తాన్‌ సైనికులు కూడా తమ ఉద్యోగాలు రాజీనామా చేశారన్న వార్తలు కూడా విన్నాం. అయినా పాకిస్తాన్‌కు బుద్ది రాలేదు. ఆ దేశ రాజకీయ నాయకులకు సోయి రావడం లేదు. ఇండియా మీద గెవడం అన్నది పాకిస్తాన్‌కు కలలో కూడా జరగనిది. యుద్దమంటే క్రికెట్‌ లాంటి ఆటలో గెలవడం కాదు. అయినా ఆటలో కూడా ఎప్పుడూ పాకిస్తాన్‌ పెద్దగా గెలిచింది లేదు. అలాంటిది యుద్దంలో పాకిస్తాన్‌ కనీసం చెప్పుకునే రణ తంత్రం లేదు. సైనిక సంపత్తి చాలదు. మన దేశ ప్రజలంతా ఒక్క సారి జై హింద్‌ అంటే ఆ సౌండ్‌కే పాకిస్తాన్‌ సగం గుండె ఆగిపోతుంది. అలాంటి పాకిస్తాన్‌ కొన్ని అగ్ర రాజ్యాల అండ చూసుకొని ఎగురుతూ వుండేది. కాని ఇప్పుడు ఏ దేశం పాకిస్తాన్‌కు సాయం చేయడానికి ముందుకు రావడం లేదు. అంతే కాదు అఫ్గనిస్తాన్‌ తాలిబన్లు కూడా పాకిస్తాన్‌కు మద్దతు పలకలేదు. అయినా పాకిస్తాన్‌కు సిగ్గు రావడం లేదు. మన దేశ నుంచి విడిపోయిన ముక్కకే అంత వుంటే, ఆ ప్రాంతాన్ని దానం చేసిన మనకు ఎంత వుండాలి? మన సైనిక శక్తి కింద వారి సంఖ్య ఎంత? గతంలో ఊ అంటే అణ్వాయుదాలున్నాయంటూ పదే పదే పాకిస్తాన్‌ బెదిరిస్తూ వచ్చేది. అయినా మన దేశం ఎంతో సంయమనంతో వుండేది. మన మంచితనం పాకిస్తాన్‌కు చేతగాని తనంగా కనిపిస్తోంది. ఈసారి అసలు పాకిస్తాన్‌ అనేదే లేకుండా చేస్తే తప్ప దారికి రాదు. 1972 తర్వాత మళ్లీ మనదేశంలో సైనిక మాక్‌ డ్రిల్‌ జరిగిందంటే మన ప్రభుత్వం ఎంత స్ధిర నిర్ణయంతో వుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రశాంతతను దెబ్బతీసేలా పక్కలో బల్లెంలా నిత్యం కొర్రీలు పెడుతుంటే ఇంకా చూసుకుంటూ ఊరుకునే పరిస్దితి లేదని మన ప్రభుత్వం హెచ్చరిక జారీచేసింది. ఓ వైపు పాక్‌ మన దేశ భూగాగాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతాన్ని ఉగ్రవాదులకు అడ్డగా చేసి పెట్టి మారణ హోమం సృష్టించాలని ఇప్పటి వరకు పాకిస్తాన్‌ చూసింది చాలు. ఇకపై మన దేశం ఉపేక్షించే పరిస్దితి లేదని ప్రదాని మోడీ తేల్చి చెప్పేశారు. ఆఖరుగా ఐక్య రాజ్య సమితి సమావేశంలో పాకిస్తాన్‌ ఈ విషయాన్ని లెవనెత్తి పై చేయి సాధించాలిన చూసింది. మన దేశం చెప్పిన సమాధానం విని పాకిస్తాన్‌ బిత్తర పోయింది. ప్రపంచ దేశాలతోపాటు, ఐక్య రాజ్య సమితికూడా మన దేశానికి మద్దతు పలికింది. పాకిస్తాన్‌ చేత కూడ ఉగ్ర వాదులను తుదముట్టించేందుకు సహకరిస్తామని చెపాల్సి వచ్చింది. పాకిస్తాన్‌ ఐక్యరాజ్యసమితిలో తమ దేశంపై భారత్‌ దాడిచేయాలని చూస్తోందని చెప్పి సానుభూతి పొందాలని చూసింది. కాని మన ప్రభుత్వం మాత్రం మేం ఉగ్రవాదుల ఏరి వేత మాత్రమే చేస్తున్నామని చెప్పడంతో ఐక్యరాజ్య సమితిలో పాక్‌ పరువు పోయింది. లేనిపోనివి చెప్పి సానుభూతి పొందాలనుకున్నా చెల్లలేదు. అదే రోజు అర్ధరాత్రి అంటే 7తేదీన ఆలస్యం చేయకుండా 9 ఉగ్ర వాద స్ధావరాలను ధ్వసం చేసింది. పాకిస్తాన్‌లాగా దొంగ దెబ్బ మనం తీయలేదు. ప్రపంచానికి చెప్పి మరీ మన ప్రభుత్వం ఉగ్ర స్ధావరాలను టార్గెట్‌ చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ పేరుతో 25 నిమిషాలలో పని పూర్తి చేసింది. అయితే ఇక్కడితో ఆగిపోయేది కాదు. మనదేశం ఆగేది కాదు. అందుకే హోం మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్‌ సింధూర్‌ 2 వుంటుందని ప్రకటించారు. అంటే ఆట ఇప్పుడే మొదలైంది. ఇంకా ఇ ంకా వుందని అమిత్‌షా సంకేతాలిచ్చినట్లైంది. ఏ రకంగా చూసినా అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ఏకాకి. ఇక ప్రతి రాత్రి పాకిస్తాన్‌కు కాళరాత్రే..! జై భారత్‌. జై హింద్‌!!

ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా?

`సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా?

`రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు?

`వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు?

`‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు?

`వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా?

`హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా?

`‘‘రోహిణి’’ ఆసుపత్రికి అనుకూలంగా ‘‘కోర్టు ఆర్డర్‌’’ కాపీ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు?

`ప్రభుత్వం జారీ చేసిన ‘‘జీవో’’, జాబితా మీడియాలో ప్రచురితం కోసమే విడుదల చేశారు.

`మీడియా తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది.

`మీడియాకు గడువు ఇచ్చే హక్కు ‘‘రోహిణి’’కి లేదు.

`ప్రభుత్వ ‘‘జీవో’’ ఆధారంగానే మీడియా వార్తలు రాసింది.

`‘‘రోహిణి’’ ఆసుపత్రి తప్పు చేయకపోయినా ‘‘సిఐడి’’ విచారణ తప్పని యాజమాన్యం చెబుతోంది!

`‘‘సిఐడి’’ వ్యవస్థనే ‘‘రోహిణి’’ యాజమాన్యం శంకిస్తోంది!

`తప్పు ‘‘సిఐడి’’ మీద నెట్టేసి ‘‘రోహిణి’’ తప్పించుకోవాలనుకుంటోంది!

`ఒక రకంగా ప్రభుత్వాన్నే లిరోహిణి’’ యాజమాన్యంసవాలు చేసినట్లైంది!

`మీడియా మీద తోసేస్తే సరిపోతుందా?

`మీడియా కోరుకునేది కూడా అదే నిజమేమిటో నిగ్గు తేలాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
‘‘రోహిణి ఆసుపత్రి’’ యాజమాన్యం నుంచి ప్రజలకు, పత్రికా విలేకరులకు స్పష్టీకరణ పేరుతో ఒక నోట్‌ విడుదల చేశారు.అందులో ఇటీవల కొన్ని డిజిటల్‌ పత్రికలు, యూట్యూబ్‌ ఛానల్స్‌ రోహిణి ఆసుపత్రి యాజమాన్యం మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు.ఇదే మాట మీద ఆసుపత్రి యాజమాన్యం నిలబడుతుందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.మీడియాలో వచ్చినవి అబద్దాలు, ఆరోపణలు, వాస్తవ విరుద్దాలని రోహిణి ఆసుపత్రి చెబుతోంది. ఇక్కడ యాజమాన్యం గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియాలో వచ్చిన వార్తలు అబద్దాలు కాదు. ఆరోపణలు అసలే కాదు. వాస్తవ విరుద్దమైనవి అని దులిపేసుకుంటే సరిపోదు.’’సిఐడి’’ ద్వారా చేసిన విచారణ తర్వాత రూపొందించిన జాబితాలో ఆసుపత్రి పేరు అనుమానాస్పదంగా వుందని నింద ప్రభుత్వం మీద వేస్తున్నారా? లేక ‘‘సిఐడి’’ విచారణ లోప భూయిష్టంగా వుందని యాజమాన్యం భావిస్తుందా? అదే నిజమైతే యాజమాన్యం ప్రభుత్వం మీద కూడా దావా వేయవచ్చు. ‘‘సిఐడి’’కి కూడా నోటీసులు పంపవచ్చు. యాజమాన్యం ఆ దిశగా ముందుకు సాగుతుందా? స్పష్టం చేయాలి. ఎందుకంటే యాజమాన్యం నేరుగా ‘‘ప్రభుత్వాన్నే స్పష్టంగా దోషి’’ అంటోంది. అనుమానాస్పదంగా జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుందని చెప్పడం ‘‘రోహిణి’’ ఆసుపత్రి చేస్తున్న మరో నేరం. ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధుల అక్రమాల నేపథ్యంలో ‘‘రోహిణి’’ ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు, లేదా సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడమంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా నిధులు విడుదల చేశారని సూటిగా ఆరోపణలు చేసినట్లు భావించాల్సి వుంటుంది. ప్రభుత్వం ‘‘సీఐడి’’ విచారణకు ఆదేశించినది నిజమే. కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్‌ను అధికారికంగా విడుదల చేయలేదు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి వర్గాలు నిర్థారణకు వచ్చిందా? ఏ అధికారిక సమాచారం మేరకు ఈ విషయం స్పష్టం చేస్తున్నారో చెప్పాలి. ఇక ‘‘సిఐడి’’ నివేదిక అనేది పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టేది కాదు.రహస్య విచారణలకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయదు.ఈ విషయం యాజమాన్యానికి తెలియకపోవడం విడ్డూరం.’’సిఐడి’’ నేరుగా తన నివేదికను బహిరంగ పర్చదు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా జివో విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జివో కాపీలోనే ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును చేర్చడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుంది. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును అనుమానాస్పదంగా ‘‘సిఐడి’’ చేర్చిందనడం కూడా నేరంగా పరిగణిస్తారు. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరుతో ఎవరో నకిలీ స్టాంపులు, బిల్లులు తయారు చేసినట్లు చెప్పి యాజమాన్యం తప్పించుకోవాలని చూసినా చెల్లదు. మరింత కఠినమైన శిక్ష బాధ్యులౌతారు. అంతేకాకుండా ‘‘సిఐడి’’ బోగస్‌ విచారణ చేపట్టిందని, ‘‘సిఐడి’’ విచారణ సరైన పద్ధతిలో జరగలేదని యాజమాన్యం సూటిగా ఆరోపణలు చేసినట్లౌతుంది. ఎవరు నకిలీ, ఏది నకిలి అని తేల్చలేనంత అసమర్థంగా ‘‘సిఐడి’’ విచారణ చేసిందని యాజమాన్యం ప్రతికా ప్రకటన ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీనిని ‘‘సిఐడి’’ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి ఏకంగా ‘‘సిఐడి’’ వ్యవస్థనే శంకిస్తోంది. అంటే నేరుగా ప్రభుత్వానికే సవాలు విసిరింది. ‘‘సిఐడి’’ చేసిన విచారణ తప్పు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి అంటోంది.’’సిఐడి’’ వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. లేకుంటే ‘‘సిఐడి’’ వ్యవస్థకే మచ్చ వస్తుంది. ‘‘సిఐడి’’ నివేదికే బైటకు రాలేదంటున్న ‘‘రోహిణి’’ యాజమాన్యం నివేదికలో ‘‘సిఐడి’’ పొందుపర్చిన పేర్లు ఎలా తెలిసింది? ఆ పేషెంట్లు మా ఆసుపత్రిలో చికిత్స చేసుకోలేదని ఎలా చెబుతున్నారు? మీడియా వద్ద ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ వుందా? అని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘జివో’’ కూడా ‘‘బోగస్‌’’ అని యాజమాన్యం నిర్థారించినట్లేనా? ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ లో వున్న పేర్లు యాజమాన్యానికి ఎలా తెలిశాయి. ‘‘సిఐడి’’ రోహిణి ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారణకు పిలువలేదా?ఆసుపత్రికి వచ్చి విచారణ చేయలేదా? మా ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించకుండానే ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ తయారు చేసిందని ‘‘రోహిణి’’ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా? ‘‘సిఐడి’’ రాలేదని నిర్థారిస్తున్నారా? అందుకు ఐదు రోజుల గడువు సిఐడికి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తున్నారా? ఎందుకంటే మీడియాకు గడువు విధించే అధికారం రోహిణి యాజమాన్యానికి లేదు. ప్రభుత్వమే మీడియాకు ‘‘జీవో’’ తో పాటు జాబితాను ప్రచురణ కోసమే విడుదల చేశారు. అధికారికంగా విడుదల చేసిన జాబితాను అనుసరించే మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. యాజమాన్యానికి నిజంగా ధైర్యం వుంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితా తప్పు అని ప్రకటన చేయాలి. మీడియా మీద తోసేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఇక ‘‘సీఎంఆర్‌ఎఫ్‌’’ నిధులు రోగుల ఖాతాలకు నేరుగా వెళ్లేలా వ్యవస్థ ఉంది. నిజమే…మరి ఈ ఆసుపత్రి పేరుతో నిధులు విడుదల జరుగుతుంటే ఇంత కాలం యాజమాన్యం ఏం చేసినట్లు? ‘‘సిఐడి’’ విచారణకు వచ్చినప్పుడు ఆ బిల్లులు మా ఆసుపత్రికి సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు? చెబితే ‘‘సిఐడి’’ విచారణ ఆ దిశగానే జరిగేది. తెలంగాణలో ఇన్ని ఆసుపత్రులు వుండగా 28 ఆసుపత్రులు తప్పులు చేసినట్లు తేలింది? ఇక మీడియాను సవాలు చేసిన యాజమాన్యం కోర్టు ఉత్తర్వులు ఎందుకు పొందుపర్చలేదు? రోహిణి యాజమాన్యం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి.

‘పాపం ఎవరో అభాగ్యుడు.. గుర్తు పడితే చెప్పండి’.

‘పాపం ఎవరో అభాగ్యుడు.. గుర్తు పడితే చెప్పండి’

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గల సాదు వెంకటరెడ్డి వెంచర్ సమీపంలోని దుందుభి వాగులో మంగళవారం ఉదయం 10 గంటలకు గుర్తు తెలియని ఓ వ్యక్తి నీటిపై తేలియాడుతూ కనిపించాడు. వెంటనే స్థానికులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. మృతుడు (44) ఆనవాళ్లను బట్టి హిందు మతానికి చెందిన వాడని, ఐదు ఫీట్ల రెండు ఇంచుల ఎత్తు కలిగి ఉన్నాడని, మృతుడి శరీరంపై ఆకుపచ్చని టీ షర్టు, పాయింట్ ధరించి ఉన్నాడన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించమన్నారు. పంచాయతీ కార్యదర్శి జగన్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. ఎవరికైనా.. మృతుడి ఆచూకీ తెలిస్తే.. బాలానగర్ ఎస్సై లెనిన్ ఫోన్ నెంబర్ 87126 59346 సంప్రదించాల్సిందిగా కోరారు.

జన జాతర సభను జయప్రదం చేయాలి.

జన జాతర సభను జయప్రదం చేయాలి

కెవిపిఎస్. జిల్లా కార్యదర్శి అరూరి కుమార్

నర్సంపేట,నేటిధాత్రి:

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 30 న వరంగల్ మహానగరంలో జరగబోవు పూలే అంబేద్కర్ జన జాతర సభను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం నర్సంపేట పట్టణ కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జన జాతర సెమినార్ నిర్వహించారు. అరూరి కుమార్ మాట్లాడుతూ
మనువాదుల చెర నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని అణిచివేత ఆధిపత్యంపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు.
రైతు సంఘం నాయకులు కోరబోయిన కుమారస్వామి మాట్లాడుతూ
జిల్లాలో కులవివక్ష అంటరానితనం ఎక్కడ ఉన్న ఆయా జిల్లాలోని కెవిపిఎస్ నాయకులను కలిసి వివక్షను తెలియజేయాలన్నారు. టౌన్ కార్యదర్శి ములుగురి రాజు అధ్యక్షత వహించగ ఈ సమావేశంలో డివైఎఫ్ఐ నాయకులు కలకోటి అనిల్, ఐద్వా నాయకురాలు స్వప్న, దారా మహేందర్, సాయిచంద్, సుధాకర్ విజయ నాగమణి ఫరీదా,కెవిపిఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు.!

ఎమ్మెల్యే గారి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు నీయులు కొనింటి మానిక్ రావు గారి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడం పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి ,తాజా మాజీ సర్పంచులు చిన్నారెడ్డి, విజయ్, నాయకులు లక్ష్మణ్ యాదవ్,బాబు మియ తదితరులు.

ధర్మం వైపు వెళ్ళండి.!

ధర్మం వైపు వెళ్ళండి…!

– జహీరాబాద్ సివిల్ కోర్ట్ జడ్జ్

జహీరాబాద్  నేటి ధాత్రి:

ఝరాసంగం: విద్యార్థులందరూ ధర్మం వైపు వెళ్లాలని, అది మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ గంట కవితా దేవి దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులకు సూచించారు. గురువారం సాయంత్రం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద వైదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలు, దత్తాత్రేయ స్వామి, పంచవృక్షాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 29న శనైశ్వర స్వామి జయంతి కరపత్రాన్ని విడుదల చేశారు. వారికి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.

ధర్మం వైపు వెళ్ళండి.!

ధర్మం వైపు వెళ్ళండి…!

– జహీరాబాద్ సివిల్ కోర్ట్ జడ్జ్

జహీరాబాద్. నేటి ధాత్రి:

చేశారుఝరాసంగం: విద్యార్థులందరూ ధర్మం వైపు వెళ్లాలని, అది మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ గంట కవితా దేవి దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులకు సూచించారు. గురువారం సాయంత్రం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద వైదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలు, దత్తాత్రేయ స్వామి, పంచవృక్షాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 29న శనైశ్వర స్వామి జయంతి కరపత్రాన్ని విడుదల . వారికి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.

సంగారెడ్డి జిల్లాలో వింత బ్రహ్మంగారి.!

సంగారెడ్డి జిల్లాలో వింత.. బ్రహ్మంగారి భవిష్యవాణి నిజమవుతోందా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన
చోటు చేసుకుంటుంది. ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి గ్రామ శివారులో ఉన్న ఒక రావి చెట్టు నడిమధ్య నుండి ఒక ఈత చెట్టు మొలకెత్తి పెద్దగా పెరిగింది. ఒక చెట్టు మొదలు నుండి వేరొక చెట్టు పెరగడం చాలా అరుదు. కానీ ఇక్కడ రెండు రకాల చెట్లు ఒకే చోట పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అద్భుతం చూసిన స్థానికులు, బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు నిజమవుతున్నాయని అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ చెట్లు ఇక్కడ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందని గ్రామ ప్రజలు అంటున్నారు

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల.!

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి..

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా క్యాతనపల్లి మునిసిపాలిటీకి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ లు కరీంనగర్ జిల్లా పరిశీలకులుగా తనను నియమించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామం, మండలం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే తీరును పరిశీలించేందుకు పరిశీలించేందుకు జిల్లా పరిశీలకునిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

చోరవాణి అందజేత.!

చోరవాణి అందజేత

ఇబ్రహీంపట్నం, నేటిధాత్రి:

మండల కేంద్రానికి చెందిన బోడ కుల్దీప్ అతను తేదీ 06.04.2025 రోజున అతని యొక్క సెల్ ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 07.04.2025 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్నతన ఫోనును ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఏఎస్ఐ S.ఆంజనేయులు  తెలిపినారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version