
రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి..
రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి మాజీ సర్పంచ్ నాగరాజు మల్లాపూర్ మార్చి 17 నేటి ధాత్రి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రుణమాఫీ కానీ రైతులతో మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులందరూ రాజకీయ పార్టీలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని…