బుల్లెట్ బైక్ సైలెన్సర్ల మోత.

బుల్లెట్ బైక్ సైలెన్సర్ల మోత

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్లో బుల్లెట్ బైక్ సైలెన్సర్ సౌండ్ పొల్యూషన్తో ప్రజలు భయభ్రాంతుల గురవుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో విచ్చలవిడిగా యువత రోడ్లపై రెచ్చిపోతూ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. బుల్లెట్టు వాహనాలు నడుపుతూ భీకరమైన సైలెన్సర్ సౌండ్లతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైన పోలీసులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

డాక్టర్ నర్సన్,మారుపాక కృష్ణకు విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు.

డాక్టర్ నర్సన్,మారుపాక కృష్ణకు విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ కవులకు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్,భారతీయ అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో,ప్రముఖ గజల్ కవయిత్రి డాక్టర్ పి.విజయలక్మి పండిట్ సారాధ్యములో విశ్వపుత్రిక జాతీయ పురస్కారాలు ప్రధానాలు.. అందించడం జరిగినది.
జాతీయపురస్కారాలకు, వేములవాడనుండి తెలంగాణ అవార్డు గ్రహీత,డాక్టర్ నర్సన్,
గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారగ్రహీత,
మారుపాక కృష్ణకు విశ్వ పుత్రిక జాతీయ పురస్కారం అందించడం జరిగినది. అందుకుగాను కమిటీ సభ అధ్యక్షులు సామ్రాట్ కళారత్న డాక్టర్
బిక్కికృష్ణ, ఆధ్వర్యంలో పురస్కారలు అందించడం జరిగినది. ఐ.ఆర్. యస్ ప్రిన్సిపాల్ చీఫ్ సెక్రటరీ నరసింహప్ప, ఇన్కమ్ టాక్స్ అధికారి కంఠం నేని రవిశంకర్, సినిమా ప్రొడ్యూసర్ శ్రీమతి కాంతి కృష్ణ,శ్రీమతి యేలవర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొని వారికి అభినందనలు తెలపడం జరిగినది.

విద్యుత్ ఘాతంతో కాడెద్దు మృతి.

విద్యుత్ ఘాతంతో కాడెద్దు మృతి.

పంచనామా నిర్వహిస్తున్న పశు వైద్యాధికారులు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

విద్యుత్ ఆగాధంతో కాడెద్దు మృతి చెందిన సంఘటన కేసముద్రం మండలం మర్రితండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మర్రితండ గ్రామానికి చెందిన బాధిత రైతు భూక్యా లక్ష్మణ్ రోజు మాదిరిగానే కాడెద్దును మేతకు గ్రామ శివారు తీసుకువెళ్లారని గడ్డి మేస్తూ విద్యుత్ స్తంభం పక్కకు వెళ్లడంతో ఎర్త్ వైర్ కరెంట్‌ షాక్‌ తగలడంతో అక్కడికక్కడే కాడెద్దు మృతి చెందినట్లుగా బాధిత రైతు కన్నీరు మున్నీరయ్యాడు. విద్యుత్ శాఖ, పశు సంరక్షణ శాఖ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆర్థికంగా ఆదుకోవాలని బాధిత రైతు భూక్యా లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన కాడెద్దు సుమారు 65 వేల విలువ ఉంటుందని స్థానిక రైతులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ రవీందర్, లైన్మెన్ వాంకుడోత్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.

టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) 3 మడలాల కన్వీనర్ గా పుల్లరవితేజ.

టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) 3 మడలాల కన్వీనర్ గా పుల్లరవితేజ.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టి యు డబ్ల్యూ జె ఐ జెయు చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మూడు మండలాల కన్వీనర్గా పుల్ల రవితేజను (ఆర్ బి న్యూస్ )నియమించినట్లు జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి సామంతల శ్యామ్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి కోసం గత కొన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్న రవితేజను నియమించమని జర్నలిస్టుల సమస్యల కోసం కృషి చేయాలని అన్నారు అనంతరం ఎన్నికైన రవితేజ ను అభినందించారు, ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు ఐజేయు జిల్లా నాయకులు కాట్రేవుల ఐలన్న ప్రెస్ క్లబ్ నాయకులు కట్కూరి శ్రీనివాస్ బుర్ర రమేష్ గుర్రపు రాజమౌళి సరిగోమ్ముల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ.

జ్ఞాన సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ

మరిపెడ /సిరోలు నేటిధాత్రి.

 

 

 

 

మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రంలో ని కొత్తూరు సి గ్రామానికి చెందిన
దాత దయ్యాల నాగేశ్వర్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఏర్పాటుచేసిన మాత జ్ఞాన సరస్వతి విగ్రహం మరియు సభ వేదికను,ఘనంగా ఆవిష్కరించారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ హాజరై,సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యా ప్రాధాన్యతను వివరించారు. “విద్య వల్లే వ్యక్తి వికాసం సాధ్యం అన్నారు, మాత జ్ఞాన సరస్వతి ఆశీస్సులతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి,” అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కురవి మండల పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం గౌడ్,సిరోల్ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి,డిఇఓ రవీందర్ రెడ్డి,ఎంఈఓ లచ్చిరామ్ నాయక్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మలిశేటి వేణు,పాఠశాల ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు, ఇటువంటి సత్కార్యాలు గ్రామాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రజల అభిప్రాయపడ్డారు,దాత నాగేశ్వర్ గౌడ్ అందించిన ఈ సహకారం పాఠశాల విద్యార్థులపై మంచి ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది.

పౌర హక్కుల పరిరక్షణలో కామ్రేడ్ ఓంకార్ పాత్ర ఎనలేనిది

మోడీ పాలనలో పౌర హక్కులకు ప్రమాదం

“పౌర హక్కుల పరిరక్షణ- ఓంకార్ గారి పాత్ర” అనే రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:

పౌర హక్కులు రాజ్యాంగ పరిరక్షణ కోసం కామ్రేడ్ ఓంకార్ చేసిన ఉద్యమాలు త్యాగాలు ఎనలేనివని ఆయన స్ఫూర్తితో ప్రమాదంలో ఉన్న భారత రాజ్యాంగాన్ని పౌర హక్కులను రక్షించుకునేందుకు ప్రతి పౌరుడు పూనుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సిపిఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు నున్న అప్పారావు, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు బానోతు సంగులాల్ లు పిలుపునిచ్చారు. ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణ ఓంకార్ పాత్ర అనే అంశంపై వామపక్ష కమ్యూనిస్టు సామాజిక ప్రజా సంఘాల బాధ్యులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని వరంగల్ అండర్ బ్రిడ్జి ప్రాంతంలోని ఓంకార్ భవన్ లో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పౌర హక్కుల పరిరక్షణకై కామ్రేడ్ ఓంకార్ పాత్రను వివరిస్తూ అధ్యక్షత వహించిన పెద్దారపు రమేష్ నోట్ ప్రవేశపెట్టారు.
అనంతరం సమావేశానికి హాజరైన వక్తులు ప్రసంగిస్తూ కేంద్రంలో ఏర్పడిన బిజెపి ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఈడి సిబిఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెట్టుతున్నదని అర్బన్ నక్సలైట్లని టెర్రరిస్టులని రకరకాల పేర్లతో నిర్బంధం ప్రయోగిస్తూ మావోయిస్టుల పేరుతో బూటకపు ఎన్కౌంటర్లతో అడవిలో మూలవాసులైన ఆదివాసీలను కాల్చి చంపుతున్నారని అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు కట్టబెడుటకు దోచిపెడుటకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ఆర్టికల్స్ 14 నుంచి 24 లో పొందుపరచబడిన స్వేచ్ఛ సమానత్వ మత విద్య సాంస్కృతిక రాజ్యాంగ ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులుగా స్వేచ్ఛగా జీవించలేని స్థితికి నెట్టివేస్తున్నారని 1975 ఎమర్జెన్సీ కంటే భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజాస్వామిక పత్రిక స్వేచ్ఛను సైతం హరించి వేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనాడు కామ్రేడ్ ఓంకార్ పౌర హక్కులు శాంతిభద్ర సమస్యలపై అసెంబ్లీలో సుమారు రెండు గంటలకు పైగా మాట్లాడి ప్రజా పోరాటాల పరిరక్షణకై హక్కులకై గలమెత్తి చట్టసభలకు వన్నె తెచ్చి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా భార్గవ కమిషన్ వేయించి సాక్షులను ప్రవేశపెట్టి పాలకవర్గాల గుట్టు రట్టు చేసిన గొప్ప యోధుడు కామ్రేడ్ ఓంకార్ ను ఆయన పౌర హక్కుల రక్షణ కోసం చేసిన కృషి నేటికీ ఎంతో అనుసరణీయమని ఈ క్రమంలో ప్రమాదంలో ఉన్న పౌర హక్కులను కాపాడుకునేందుకు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆ దిశలో ప్రతి పౌరుడు ఉద్యమాల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎంసిపిఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబా బాబురావు, నగర కార్యదర్శి సుంచు జగదీశ్వర్, అసంఘటిత కార్మిక సంఘాల నాయకులు నలిగంటి చంద్రమౌళి, ప్రజాసంఘాల నాయకులు ఓదెల రాజన్న, అనిత,ఎండి ఇస్మాయిల్, ఐతం నాగేష్, మైదం సంజీవ్, ఎండి సలీం, ఎగ్గని మల్లికార్జున్, మాలి ప్రభాకర్, అప్పన్నపూరి నరసయ్య, నలివెల రవి, పరిమళ గోవర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు.

తాడిచెట్టు పై నుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

 

ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుండి పడి గీతా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన రేగొండ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఓరుగంటి సాయిలు తాడిచెట్లు ఎక్కి కళ్ళు గీసి జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తాడిచెట్టి ఎక్కి దిగుతుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. ఈ సంఘటనలో సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వైద్య చికిత్సల కోసం 108లో పరకాల సివిల్ ఆస్పత్రికి అక్కడి నుండి హనుమకొండలోని ఎంజీఎం తరలించినట్లు తెలిపారు.

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి.

రాష్ట్ర బి సి పొలిటికకల్ జె ఏ సి చైర్మన్ రాచాల కా రుపై రాళ్లతో దాడి

జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన రాచాల

వనపర్తి నెటిదాత్రి :

ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నానని. అది నచ్చని వారు ఇలాంటి దాడులకు దిగుతున్నారని వారికి భయపడబోనని.ప్రజల సమస్యలపై పోరాటాన్ని ఆపేది లేదని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ స్పష్టం చేశారు
గురువారం రాత్రి 12 గంటల సమయంలో తన స్వగ్రామమైన వడ్డెవాటకు వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన కారుపై రాళ్లతో దాడి చేశారని, కారు డ్రైవర్ చాకచక్యంతో కారు ముందుకు వేగంగా పోనివ్వడంతో తృటిలో తనకు ప్రాణాపాయం తప్పిందన్నారు డాడీ సంఘటన పై శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను కలిసి ఫిర్యాదు చేశామని రాచాల యూగంద ర్ గౌడ్ తెలిపారు
దాడి చేసిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టొద్దని చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ ని కోరారు.

BC Political.

ఎన్ని దాడులు చేసినా అదిరేది లేదు, బెదిరేది లేద.నిప్రజల కోసం ప్రాణ త్యాగానికైనా తాను సిద్ధమని రాచాల స్పష్టం చేశారు.
రాచాల వెంట బీసీ పొలిటికల్ జెఎసి నాయకులు పాండురంగ యాదవ్, వివి గౌడ్, నరసింహ యాదవ్, స్వప్న, దేవర శివ, అంజన్న యాదవ్, మహేందర్ నాయుడు, అరవింద చారి, బత్తుల జితేందర్, ధర్మేంద్ర సాగర్, అస్కని రమేష్, నాగరాజు, చెలిమిల్ల రామన్ గౌడ్, బీసీ కుల సంఘాల జెఎసి నాయకులు రాములు యాదవ్, సత్యం యాదవ్, వెంకటన్న గౌడ్, నజీర్, తిరుపతన్న గౌడ్, కొత్త గంగాధర్ తదితరులు ఉన్నారు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టాలి..

హౌసింగ్ ఏఈ అభినయ్ గౌడ్.

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ ఏఈ బొమ్మగాని అభినయ్ గౌడ్ అన్నారు. శుక్రవారం పెనుగొండ గ్రామంలోని రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు మంజూరి పత్రాలు వచ్చినటువంటి వారు మాత్రమే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్లానింగ్ ముగ్గు పోసిన అనంతరం గ్రామంలోని కార్యదర్శి ద్వారా ఫోటోను యాప్ లో అప్లోడ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వ నిబంధనల ప్రకారం 400పీట్ల నుండి 600 ఫీట్ల లోపు మాత్రమే ఇంటి నిర్మాణం చేపట్టాలని, ఇంటి నిర్మాణ లబ్ధిదారులకు ఉచిత ఇసుక కూపన్లు మంజూరు చేయబడతాయని ఎటువంటి రుసుములు లేకుండా పూర్తిగా ఉచితంగా 8 ట్రాక్టర్లు అందజేయడం జరుగుతుందన్నారు. 150 బస్తాల సిమెంటు, 8 క్వింటాల స్టీల్ (సలాక), 20 ఎంఎం కంకర నాలుగు ట్రాక్టర్లు, 40 ఎంఎం కంకర రెండు ట్రాక్టర్లు, బేసుమెంటు రాయి మూడు ట్రాక్టర్లు , సిమెంట్ ఇటుకలు 2,150 లతో నిర్మాణం చేయాలని తప్పనిసరిగా గృహ నిర్మాణంలో టాయిలెట్ నిర్మాణం చేపట్టాలని, మేస్త్రీలు గోడ కొలతల ప్రకారం చదరపు అడుగుకి 300 చొప్పున మాత్రమే తీసుకోవాలని,ప్రభుత్వ నిబంధనలు ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

ఎన్నికలు ఏవైనా ముదిరాజ్ లే పైచేయి సాధించాలి.

స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే పోరాటం ఆగదు.

ముదిరాజులను బీసీ.డి నుండి ఏ మార్పించడమే లక్ష్యం

శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్

దుగ్గొండి మండలంలో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం

నర్సంపేట నేటిధాత్రి:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఏ ఎన్నికలైనా ముదిరాజ్ కులస్తులు ప్రజా ప్రతినిధులుగా పై చేయి సాధించాలని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ స్పీకర్,ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం దుగ్గొండి మండలంలోని గిర్నిబావి గ్రామాల్లో గల వందన గార్డెన్ లో ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు,నర్సంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి అధ్యక్షతన జరిగింది.ముఖ్య అతిథులుగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు,శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లేబోయిన అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా ముదిరాజ్ కులస్తులను బీసీ.డీ నుండి బీసీ.ఏ లోకి మార్చడం కోసం అనేక ప్రయత్నాలు జరిగాయని ఆనాటి దిగంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవో ద్వారా అమల్లోకి తీసుకచ్చామని ఐనప్పటికీ హైకోర్టులో వేసిన పిటిషన్ ద్వారా సాధించుకోలేకపోయామని తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ కోసం పోరాటం మరోసారి కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

గతంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సకల జనుల సర్వేతో పాటు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి కులగణన సర్వేలో కూడా
ముదిరాజ్ జాతి అత్యున్నత స్థాయిలో ఉన్నదని సర్వేలు చెప్పుతున్నాయని
బండ ప్రకాష్ వివరించారు.రాష్ట్రంలో ముదిరాజ్ కులస్తులు పటిష్టంగా ఉన్న ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం లేని పరిస్థితి నెలకొన్నదని రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఏకమైతే అన్ని పంచాయితీలు మనవే అని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ ల సంఖ్యను పెంచుకోవడానికి ఏపార్టీ ఐనా ఐక్యతతో సీట్లు సాధించుకోవాలని తెలిపారు.రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వకున్న ముదిరాజ్ జెండాతో ప్రజా ప్రతినిధులుగా గెలువాలే అని శాసన మండలి డిప్యూటీ స్పీకర్ బండా ప్రకాష్ పిలుపునిచ్చారు.
సర్పంచులు,జెడ్పీటీసీలు,ఎంపీటీసీ కోసం గెలిపించుకోవడం కోసం ప్రధాన బిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలతో పాటు అన్ని రాజకీయ పార్టీల నుండి సీట్లు సాధించుకోవాలన్నారు.మహిళా రిజర్వేషన్ ప్రకారం మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఎక్కువగా ఉన్నాయని ఈ నేపథ్యంలో ఆకాశాలను కల్పించుకోవాలని సూచించారు.పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముదిరాజ్ బిడ్డలు పొటీచేయాలన్నారు.గతంలో 150 మత్స్య శాఖ సొసైటీలు ఉంటే తెలంగాణ వచ్చాక 6 వేల సొసైటీలను తీసుకువచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముదిరాజ్ కులస్తుల రిజర్వేషన్ అమలు కోసం ప్రధాన,ప్రతిపక్ష పార్టీలలో ఉన్న ముదిరాజ్ ప్రజా ప్రతినిధులతో హైదారాబాద్ లో సమావేశం పెట్టబోతున్నట్లు తేల్చిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఒక్క పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ముందుకొస్తున్నారని ఇదే తరహాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తుల ఐక్యతచాటాలని శాసనమండలి డిప్యూటీ స్పీకర్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ మాట్లాడుతూ ఐక్యతతో ఉంటే అన్ని హక్కులకు సాధించుకోవచ్చని తెలిపారు. కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు సాదించుకోవచ్చని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్ ముదిరాజ్ రాష్ట్ర ముదిరాజ్ కులస్తులు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయితీ ఉంటే ముదిరాజ్ కులస్తులు ముదిరాజ్ సొసైటీలతో పటిష్టంగా ఉన్నారన్నారు.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న ముదిరాజ్ కులస్తులు కీలకమని పేర్కొన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కులబలం ఉంటేనే రాజకీయ పార్టీల్లో సీట్లు లభిస్తాయి.సీట్లు సాధించి ప్రజా ప్రతినిధులుగా ఎదగచ్చని తెలిపారు.

సామాజికంగా,ఆర్థికంగా ఎదగాలన్న సమిష్టిగా ఉండాలి.గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముదిరాజ్ లకు బీసీ డి నుండి బీసీ ఏ కు మార్చాలని ప్రత్యేక జీఓను ప్రస్తుత శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్ తెప్పించారు.నేడు ఆయన వెంటే ఉంటూ హక్కులను సాధించుకోవాలని ముదిరాజ్ కులస్తులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గొనెల రవీందర్, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గోనెల పద్మ, జిల్లా మత్స్య శాఖ ప్రమోటర్ సోమయ్య, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు బుస మల్లేశం జిల్లా గౌరవాధ్యక్షుడు జిలుకల కొమ్మాలు, నీరటి సదానందం, గుంటిక సోమయ్య పోలు అమర్ చందు,గుండా రాకేష్, ముద్రపోయిన సుధాకర్,భీమ్ రాజ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పల్లె రమేష్, నూనె నర్సయ్య హంస విజయరామరాజు ముద్రబోయిన వెంకన్న రావుల రాజు తోట సాంబయ్య పిట్టల భాస్కర్ అన్నబోయిన లింగయ్య పంబాల కోటి కెవ్వు శివకాశి బోనాల భరత్, జిల్లా పరిధిలోని మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న.

వ్యవసాయ బావుల వద్ద రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై గత ఆరు నెలల నుండి పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డిఈ బిక్షపతి అన్నారు.

వర్దన్నపేట (నేటిధాత్రి):

 

 

 

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ క్షేత్రాలలోని పలు ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు పలు సూచనలు చేశారు. విద్యుత్ సరఫరా పైన ఎలాంటి సమస్యలున్న తమ దృష్టికి తీసుకురావాలని దీంతో వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్తంభాలు కుంగిపోవడం, ట్రాన్స్ఫార్మర్ మీద లోడు ఎక్కువగా ఉండడం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ అధికారుల ప్రమేయం లేకుండా స్టార్టర్లను, వైర్లను, ట్రాన్స్ఫార్మర్లను, ఫీజులను ముట్టుకోరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ నటరాజ్, ఏఈ తరుణ్, ఎస్ ఎల్ ఐ చంద్రమోహన్ రాజు, విద్యుత్ సిబ్బంది, రైతులు ఎల్లగౌడ్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ.

రామ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ

అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో ఇటీవలే అనారోగ్యం వల్ల అకస్మాత్తుగా మరణించిన రామ సమ్మక్క జరిగింది 9వ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ సమ్మక్క కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని ఇచ్చారు అనంతరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయసి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించిన చంద్రమౌళి మాదిగ రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబ సభ్యులందరికీ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ మాదిగ జిల్లా సీనియర్ నాయకులు రామ్ రామ్ చందర్ మాదిగ వికేసి విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు మారపల్లి చిన్న రాయకొమూరు గ్రామ సభ్యులు బండ బిక్షపతి రామ యాకుబ్ రామ్ సమ్మక్క కుటుంబ సభ్యులు రామ్ కృష్ణ కుమార్ రామ్ ధనుష్ రామ్ వర్ధన్ బొట్ల రవి రామ్ దేవేందర్ రామ్ ప్రశాంత్ బోట్ల కేశవులు బొట్ల అఖిల్ ఎలుకటి అన్వేష్ గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

రోడ్లు విస్త‌రించి ఇబ్బందులు లేకుండా చూస్తా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు.

రోడ్లు విస్త‌రించి ఇబ్బందులు లేకుండా చూస్తా ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

తిరుప‌తి(నేటి ధాత్రి) జూన్ 27:

న‌గ‌రంలోని 44, 43 డివిజ‌న్ ప‌రిధిలోని రోడ్ల‌ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు శుక్ర‌వారం ఉద‌యం ప‌రిశీలించారు. ముఖ్యంగా 44వ డివిజ‌న్ ప‌రిధిలోని న‌ర్శ‌రీ వీధిని ఇంజినీరింగ్ అధికారులు, టౌన్ ఫ్లానింగ్ అధికారుల‌తో క‌లిసి వీధి మొత్తం ప‌రిశీలించారు. రోడ్డు ఆక్ర‌మ‌ణ‌ల‌తో అంబులెన్స్ వ‌చ్చే ప‌రిస్థితి వీధిలో లేక‌పోవ‌డంతో ఇటీవ‌ల ఇద్ద‌రు చ‌నిపోయిన‌ట్లు స్థానిక మ‌హిళ‌లు ఎమ్మెల్యే దృష్టి తీసుకు వ‌చ్చారు. అలాగే డ్రైనీజీ స‌మ‌స్య‌తో దుర్వాశ‌న‌కు తోడు దోమ‌ల బెడ‌ద ఎక్కువుగా ఉన్న‌ట్లు వారు ఎమ్మెల్యేకి చెప్పారు. వ‌ర్షం ప‌డితే డ్రైనేజీ నీరు నిల్వ ఉండిపోతుండ‌టంతో ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు ఆ ప్రాంతవాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువ‌చ్చారు.మ‌రోవైపు రోడ్డును పూర్తిస్థాయిలో విస్త‌రిస్తే త‌మ ఇళ్ళు దెబ్బ‌తింటాయ‌ని న‌ర్శ‌రీ వీధి వాసులు ఎమ్మెల్యే కి తెలిపారు. న‌ర్శ‌రీ వీధిలో రోడ్డు,డ్రైనేజీ నిర్మాణం కోసం 76 ల‌క్ష‌లు మంజూరు చేసిన‌ట్లు ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. రోడ్డు విస్త‌ర‌ణ ఎలా చేయాలి అనేది ఇంజినీరింగ్, టౌన్ ఫ్లానింగ్ అధికారుల‌తో చ‌ర్చిం నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యం క‌ల‌గుండా రోడ్డు, డ్రైనేజి స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. 43వ డివిజ‌న్ లో డ్రైనీజి స‌మ‌స్య‌ను త్వ‌ర‌లో ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న చెప్పారు.ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్ ఆర్సీ మునికృష్ణ‌, కార్పోరేట‌ర్లు వ‌రికుంట్ల నారాయ‌ణ‌, న‌ర‌సింహాచ్చారి, న‌రేంద్ర‌, సికే రేవ‌తి, శైల‌జ‌, దూది కుమారి, రాధ‌,రాజా రెడ్డి,మహేష్ యాదవ్, దూది శివ, కార్పొరేషన్ ఎస్ ఈ శ్యామ్ సుందర్, డీసీపీ మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన CITU నాయకులు.

చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ కలిసిన సిఐటియు నాయకులు

శంకరపల్లి, నేటి ధాత్రి :-

 

 

 

 

చేవెళ్ల నూతన మున్సిపల్ కమిషనర్ ని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలిసి శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నూతన కమిషనర్ ని కోరడం జరిగింది. కార్మికులకు ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తామని నూతన కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, సిఐటియు చేవెళ్ల డివిజన్ ఉపాధ్యక్షులు ముంజ గళ్ళ ప్రభుదాస్, చేవెళ్ల మున్సిపల్ యూనియన్ నాయకులు నరసింహ జనార్ధన్ దస్తగిరి విమలమ్మ తదితరులు పాల్గొన్నారు

జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు.

“జూరాల ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు తగవు’

బీఆర్ఎస్ నాయకుల దొంగ ఏడుపు మానుకోవాలి.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ కుట్రలు

ఎమ్మెల్యేలు జి.మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి

మహబూబ్ నగర్/ నేటి ధాత్రి

 

 

 

 

జూరాల ప్రాజెక్ట్ గురించి పని పాట లేని బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు, రేపే ప్రాజెక్టు కూలిపోతుందాన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ను పార్టీ ప్రతిష్టను దెబ్బ చేసేందుకు, BRS పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక తప్పుడు రాతలు రాసిందన్నారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంను కాంగ్రెస్ హయంలో 1981లో ప్రారంభిస్తే.. 1995లో ప్రాజెక్ట్ పూర్తి అయ్యిందన్నారు.
62 గేట్లతో నిర్మించిన ప్రాజెక్టు జూరాల ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడటానికి సబ్జెక్ట్ లేక, జూరాల గేట్ల అంశాన్ని గోరంతది కొండంత చేసి చూపిస్తున్నారన్నారు.
పని పాటా లేకుండా ఖాళీ తిరుగుతున్న కేటీఆర్ వాస్తవాలకు సంబంధం లేకుండా, ఏదీ దొరికితే దాన్ని ట్విట్టర్ లో పెట్టి శునకానందం పొందుతున్నారన్నారు.
జూరాల పైన మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లు తుప్పు పట్టినట్లు 2019లో బయటపడ్డ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు.
2021లో గేట్ల నుంచి పెద్ద ఎత్తున నీళ్లు లీక్ అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
గేట్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులు 2018లో రూ.19 కోట్ల అంచనాలతో అధికారులు నివేదికను ప్రభుత్వానికి పంపించారు, అయిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.
అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో 2022లో రూ.11 కోట్లతో టెండర్లు అప్పటి ప్రభుత్వం పిలిచి, చేతులు దులుపుకుందన్నారు.
గత రెండేళ్ల నుంచి కృష్ణా ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి. ఇప్పటికిప్పుడు జూరాల గేట్ల కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, 10 లక్షల క్యూసెక్ ల వరద నీరు వచ్చినా గేట్ల కు ఏమీ కాదని ఇంజనీర్లు తెలియజేశారు. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు.
ప్రస్తుతం ప్రాజెక్ట్ కు లక్ష క్యూసెక్ ల వరద మాత్రమే వస్తోంది.. జూరాల పైన బీఆర్ఎస్ నాయకులు దొంగ ఏడుపులు ఆపాలన్నారు. 10 ఏళ్ల పాటు జూరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు దావత్ చేసుకోవడానికి వెళ్లి, జూరాల వద్ద షో చేశారు. ప్రాజెక్ట్ వద్ద అసలు మోటర్లే బిగించలేదు, పైగా కరెంటు బిల్లు వస్తుందన్న కారణంతో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్లు ప్రారంభించడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించడం  తగదన్నారు.

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కామ్రేడ్ గాజర్ల రవి మృతి సమాజానికి తీరని లోటు

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు

భూపాలపల్లి నేటిధాత్రి:

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి సమాజానికి, వెలిశాల గ్రామానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు అన్నారు. ఈనెల 18న జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యులు, ఏఓబి కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ తో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి గత 35 సంవత్సరాల క్రితం ఉద్యమంలో చేరి..పీడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాటం చేసిన అమరుడు గాజర్ల రవి అని పోలినేని లింగారావు అన్నారు. శుక్రవారం ఆయన గాజర్ల రవి స్వగ్రామమైన వెలిశాలకు చేరుకొని గాజర్ల రవి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సోదరుడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతు, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట వెంగల రమేష్, పెరుమాండ్ల మహేందర్, కుమార్ గౌడ్, తిరుపతిరెడ్డి, రామస్వామి తదితరులున్నారు.

అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.

అర్హులందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం.

#ములుగు ప్రజల రుణం తీర్చుకుంటాం.

#అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి,
గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా నేటిధాత్రి:


ములుగు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని, అర్హులందరికీ కచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
శుక్రవారం ములుగు మండల కేంద్రం నుండి జీవింతరావు పళ్లి గ్రామం మీదుగా గణేష్ పళ్లి వరకు మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్డు విస్తరణ పనులు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఉద్దేశంతో మొదటి దఫాగా ప్రతి నియోజకవర్గానికి ఐదువేల ఇండ్లను కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని, ములుగు నియోజకవర్గానికి సంబంధిత మంత్రి మరో వెయ్యి ఇండ్లను అదనంగా కేటాయించనున్నారని వివరించారు. ఎక్కడ అభివృద్ధి చెందని ప్రాంతాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి రోడ్లు వేయడం, రోడ్లు విస్తరణ పనులు చేపట్టడం ముఖ్యమంత్రి ఆదేశాలతో జరుగుతున్నాయని తెలిపారు. తాము ఇచ్చిన హామీ మేరకు ములుగును మున్సిపాలిటీగా, మల్లంపల్లి గ్రామాన్ని జేడి మల్లంపల్లిగా మండలం గా ఏర్పాటు చేశామని అన్నారు. తాము అధికారికంగా ఆమోదం పొంది ఇచ్చిన హామీలను చూపిస్తున్నామని అన్నారు.
తాను ఎంపీ బలరాం నాయక్ కలిసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటామని, జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు.
ఎంపీ బలరాం నాయక్ మాట్లాడుతూ తాను గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, నేడు మంత్రి సీతక్కతో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వెదజల్లే పద్దతిలో తక్కువపెట్టుబడితో అధిక దిగుబడి.

వెదజల్లే పద్దతిలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుంది…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

వెదజల్లే పద్దతిలో విత్తనాలు నేరుగా పొలంలో చల్లడం ద్వారా, నారు తీసి నాటడం అవసరం ఉండదని కూలీల ఖర్చు, విత్తనాల అవసరం తగ్గి తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి సాధించవచ్చు అని గార్ల వ్యవసాయధికారి కావటి రామారావు అన్నారు.శుక్రవారం దుబ్బగూడెం గ్రామం లో రైతులకు నేరుగా విత్తనాలు వెధజల్లే పద్ధతి పై అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,తక్కువ పెట్టుబడితో నాటు అవసరం లేకుండా నారు మడి ఖర్చు లేకుండా నేరుగా విత్తనాలు వేదజల్లుకోవాలని సూచించారు.ఈ విధానం లో కూలీల అవసరం ఉండదని ఎకరాకు 6 వేల నుండి 8 వేల వరకు పెట్టుబడి ఆదా అవుతుందని,రైతులకు ఎంతో శ్రేయస్కరం లాభదయాకమని అందరూ ఈ విధానాన్ని అవలంభించి లాభాలు గడించాలని సూచించారు.ఈ పద్దతిలో విత్తనాలు చల్లిన 2 రోజుల్లో ఒక ఎకరాకు పెండిమెతలిన్ ఒక లీటర్ పిచికారీ చేయాలనీ,విత్తనాలు చల్లిన 25 రోజుల తర్వాత నామినీ గోల్డ్ కానీ కౌన్సిల్ యాక్టీవ్ గాని వివాయ గాని పిచికారీ చేసి కలుపు నివారించుకోవాలని తెలిపారు.ఎరువులు ఆఖరి దుక్కిలో డిఏపి ని 20 రోజులు తర్వాత యూరియా తో పాటు పొటాస్ 20కేజీ లు వేసుకోవాలని అన్నారు.చిరుపొట్ట దశలో 30 కేజీ లు యూరియా తో పాటు 15 కేజీ ల పొటాష్ వాడాలని, అవసరం మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని సూచించారు.ఈ పద్ధతి లో నాటు పద్ధతి కంటే 10 రోజులు ముందుగా వరి కోతకు వస్తుందని అన్ని కంకులు ఒకే సారి ఈనిక దశకు వస్తాయని, చీడ పీడల నివారణ సాధ్యమవుతుందని సూచించారు.ఈ కార్యక్రమం లో ఏఈఓ మేఘన,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

శుక్రవారం కాటారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీని ప్రారంభించి, సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ప్రాథమిక పాఠశాలలకు సిఎస్ఆర్ నిధుల ద్వారా విద్యార్థుల కోసం 600 డ్యూయల్ డెస్క్ బెంచీలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలలకు కావలసిన అవసరాలు గురించి మంత్రి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా రెండు జతల బట్టలు, పుస్తకాలు, అందిస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచేందుకు మొట్టమొదటి సారిగా కాటారం మండలం నుండి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను, ఉపాధ్యాయులను సంక్రాంతి, దసరా సెలవుల్లో హైదరాబాద్, ఢిల్లీ లాంటి నగరాలకు తీసుకువెళ్ళే కార్యక్రమం చేపడతామని తెలిపారు.

ప్రైవేట్ పాఠశాలను తలదన్నేలా విద్యార్థులు విద్యను అభ్యసించాలని స్పష్టం చేశారు.

ప్రతి ఒక్క విద్యార్ధి ఇంగ్లీషులో మాట్లాడాలని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

జిల్లా, మండల స్థాయి విద్యా శాఖ అధికారులు ప్రతి పాఠశాలను పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలలకు కావలసిన సౌకర్యాలు, అవసరాలు గురించి తెలుసుకొని నివేదికలు అందించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను అధునాతంగా తీర్చి దిద్దడానికి సహకరించాలని ఆదేశించారు.

కాటారాం జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అధ్యాపకులు కోరిన విధంగా ప్రహరీ గోడ పునర్నిర్మాణం, సైన్స్ ల్యాబ్ కెమికల్స్ ను అందిస్తామని అన్నారు.

లైబ్రరీ లో పుస్తకాలు, బెంచీలు, కంప్యూటర్ లను సమకురుస్తామని మంత్రి తెలిపారు.

హై స్కూల్ లలో కూడా డ్యూయల్ డెస్క్ బెంచీలు అందించడానికి విద్యాశాఖ అధికారులు నివేదిక ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version