
మీరైతైనే మాకు ఓకే!
మీరే కావాలి… మీరే రావాలి. కొన్ని సార్లు రాజకీయాలలో అరుదైన సంఘటనలు ఎదురౌతుంటాయి…నాయకులను ఆశ్చర్య పరుస్తుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ నాయకుడికి పట్టలేని సంతోషాన్ని కల్గిస్తుంటాయి. ఇంత కాలం ప్రజల మనసుల్లో ఎంత గూడుకట్టుకొని వున్నానో అన్న ఆనందం ఆ నాయకుడికి జీవితాంతం గుర్తుంటుంది. జ్ఞాపకమై జీవితం మరింత గొప్పగా కనిపిస్తుంది. అలాంటి ఘటన ఒకటి స్టేషను ఘన్ పూర్ లో జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఆశ్చర్యపర్చింది. తనపై ప్రజలకు…