
ప్రజాస్వామ్య విలువలుపెంచిన నేత ఓంకార్
ఘనంగా అసెంబ్లీ టైగర్ ఓంకార్ వర్ధంతి నర్సంపేట,నేటిధాత్రి : రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలుపెంచిన నేత మద్దికాయాల ఓంకార్ అని ఎంసిపిఐ యు నర్సంపేట డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజా సాహెబ్ అన్నారు. ఎంసిపిఐ యు పార్టీ అధినేత దివంగత మాజీ ఎమ్మెల్యే ఓంకార్ 14 వ వర్ధంతి పక్షోత్సవాలలో భాగంగా శనివారం దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామంలో తడుక కౌసల్య అధ్యక్షతన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు ఓంకార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి…