ప్రజాసమస్యల పరిష్కారం దిశగా పని చేయాలి

  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బోయినపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిరిసిల్ల జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ… ప్రతి జనరల్ బాడీ మీటింగ్ జిల్లా అధికారులు పాల్గొనాలి.జనరల్ బాడీ అంటే తూతుమంత్రంగా వచ్చి వెళ్తున్నారు ఇలా ఇంకోసారి కాకుండ అధికారులకు ఆదేశించారు…. బోయినపల్లి మండల అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలి రాష్ట్ర ప్రభుత్వం మనకు…

Read More

గడ్డం.రాణి చిత్రపటానికి నివాళులు అర్పించిన టీపీసీసీ సభ్యులు నాగాసీతారాములు

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,నేటిధాత్రి: కొత్తగూడెం నియోజకవర్గం, సుజాత నగర్ లో గడ్డం.రాజశేఖర్, సురేందర్,రాజేందర్ సోదరుల మాతృమూర్తి అయిన గడ్డం.రాణి చిత్రపటానికి పూలమాల వేసి,నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపిన టిపిసిసి సభ్యులు నాగా సీతారాములు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ మడిపల్లి. శ్రీనివాసులు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు పంజాల. శ్రీనివాసరావు. పాలకుర్తి.అంజి దొంచవరపు.శ్రీను, వెంకన్న,జానిమియా తదితరులు పాల్గొన్నారు.

Read More

పోలీస్ అమర వీరుల త్యాగాలు చిరస్మరణీయం

రక్తదానం మహాదానం,రక్తదానంపై అపోహలు వద్దు : ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం, నేటిధాత్రి: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని కొత్తగూడెం పట్టణంలోని ఐఎంఏ ఫంక్షన్ హాలు నందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ పాల్గోన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజం కోసం,దేశం కోసం,రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు…

Read More

ఘనంగ మహనీయుల జయంతి వేడుకలు

గోదావరి ఖని,నేటిధాత్రి: గోదావరిఖని లక్ష్మీనగర్ లోని న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఆదివాసుల హక్కుల కోసం అలాగే నిజాం నిరంకుశ పాలనను ప్రశ్నించిన గోండు బెబ్బులీ కొమరం భీము మరియు నిజాయితి కి మారు పేరు అయిన మాజి ఐఏఎస్ ఎస్ఆర్ శంకరన్ జయంతి పార్టీ కార్యాలయంలో ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జె వీ రాజు మాట్లాడుతూ ఎస్.ఆర్.శంకరన్ సేవలను కొనియాడుతూ ప్రభుత్వ ఫలాలు ,సేవలు ప్రతి ప్రజకు అందేలా మరియు…

Read More

కొత్తగూడెం ఏరియా జి.కె.ఓ.సి. నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి: చుంచుపల్లి మండలం. రుద్రంపూర్.జి.కె.ఓ.సి నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 2021 సందర్బముగా జరిగినవి. మేనేజర్ కరుణాకర్ రావు అధ్యక్షతన ఏర్పటు చేసిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌ శ్రీ జక్కం రమేశ్ . జి.ఎం. హెచ్‌ఆర్‌డి బి‌హెచ్ వెంకటేశ్వర రావు, టి‌బి‌జి‌కే‌ఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ . ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి గారు, జి.కె.ఓ.సి ప్రాజెక్టు…

Read More

త్రివేణి స్కూల్లో ముందస్తు దీపావళి

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి: భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో గల త్రివేణి స్కూల్ నందు ముందస్తు దీపావళి వేడుకలు జరుపుకున్నారు, ఈ యొక్క దీపావళి గురించి ప్రిన్సిపాల్ జంగాల మంజుల మాట్లాడుతూ పిల్లలు, పెద్దలు, జరుపుకునే పండుగల లో దీపావళి పండుగ కూడా ఒకటని ఎంతో ప్రాముఖ్యత కూడుకున్నదని నరక చతుర్దశి నాడు సత్యభామ నరకాసురుని ఏ విధంగా వధించినది ఎందుకు వధించాల్సి వచ్చింది అని దీపావళి యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు అర్థమయ్యే రీతిలో…

Read More

ఫైర్ వర్క్ షాప్ ప్రారంభించిన వోరగంటి

  శంకరపట్నం నేటిధాత్రి :మండల కేంద్రంలో,తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ సదాశివ ఫైర్ వర్క్ దీపావళి టపాకాయల దుకాణమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడంచాలా సంతోషం అని,వారిని ప్రశంసిస్తూ,హర్షం వ్యక్తం చేసి, యువకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్థులు, యువకులు, వోరగంటి యువసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

  డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి కరీంనగర్ నేటిధాత్రి :కరీంనగర్ పట్టణ కేంద్రం లో ప్రభుత్వ మాత శిశు హాస్పిటల్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలి సమయపాలన పాటించని వైద్యులపై చర్యలు తీసుకొని విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న డాక్టర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. స్థానిక మాత శిశు ఆస్పటల్ ముందు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్ష ప్రధాన…

Read More

పేద వ్యక్తి అంతక్రియలకు ఆర్థిక సహాయం

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా),22 అక్టోబర్ (నేటిధాత్రి): సమాజంలో గొప్ప వాళ్ళు ఇంకా గొప్పగా, పేదవారు ఇంకా పేదలు అవుతున్నారు అనడానికి ఇదే నిదర్శనం. మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని పటేల్ నగర్ లో నివసిస్తున్న ప్రమోద్(21) పవన్ (17) ఇద్దరు అన్నదమ్ములు, పెయింటింగ్, డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆరు సంవత్సరాల క్రితం తల్లి విజయలక్ష్మి అనారోగ్యంతో మరణించింది. అద్దె ఇంట్లో తండ్రి నరసింహులు (45) తో జీవనం కొనసాగిస్తున్న అన్నదమ్ములకు విధి రాతవల్ల ఊహించని…

Read More

ప్రతిభా విద్యాలయంలో  దీపావళి వేడుకలు

  చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ప్రతిభా విద్యాలయంలో ముందస్తుగా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొడగంటి గంగాధర్, ఉపాధ్యాయులు పిల్లలు ఆనందంగా పాల్గొన్నారు దీపావళి పండుగను జరుపుకున్నారు.

Read More

అక్షర ద స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు

నర్సంపేట,నేటిధాత్రి :నర్సంపేట పట్టణంలో బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన అక్షర ద స్కూల్ , బిట్స్ స్కూల్ ల లో దీపావళి పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, దీపాలు వెలిగించి, క్రాకర్స్ బాణా సంచా కాల్చారు. చిన్నారి విద్యార్థిని విద్యార్థులు కృష్ణుడు, సత్యభామ నరకాసుడు వేషధారణతో అందరిని అలంరించారు.ఈ సందర్భంగా నరకాసుర వధ నిర్వహించి దీపావళి ప్రాముఖ్యతను నాటక రూపంలో ప్రదర్శించారు. బాలాజీ విద్యా సంస్థల…

Read More

ఉపాద్యాయుడి వికృత షష్ఠ!

వేములవాడ,నేటిధాత్రి:రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు జక్కుల శివప్రసాద్ ను నిర్బంధించిన గ్రామస్తులు.. –విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు, వ్యక్తిగత విషయాలు ఆరా తీయడాన్ని ఆగ్రహించి ప్రశ్నించిన గ్రామస్తులు.. –మందలించేందుకు వెళ్లిన తల్లిదండ్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు.. –సహనం కోల్పోయి సదరు ఉపాధ్యాయుని కుర్చీని ఎత్తేసి ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. –ప్రభుత్వ పాఠశాలలో ఉద్రిక్తత వాతావరణం.. — పాఠశాలకు చేరుకున్న పోలీసులు.. — ఉపాధ్యాయుడిని, సస్పెండ్ చేస్తా అని…

Read More

గీత కార్మికుల కోసం బాధ్యతాయుతంగా పనిచేస్తాం

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా బబ్బురి ఉప్పలయ్య,మోడెం వెంకటేశ్వర్లు ఎన్నిక   కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:  ఈనెల 19, 20, 21 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, కేసముద్రం మండలం నుండి బబ్బురి ఉప్పలయ్య, మోడెం వెంకటేశ్వర్లను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారని బబ్బురి ఉప్పలయ్య మోడెం వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా స్థానం కల్పించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ,…

Read More

మళ్ళీ బావిలో పాకురు, నిండిన చెత్త

  గతంలో తాత్కాలిక చర్యలు, తొంగి చూడాలి అధికారులు నిర్లక్ష్యంపై గ్రామ ప్రజల అసహనం కొడిమ్యాల, నేటిధాత్రి:జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మంచినీటి బావిలో పాకూరు, చెత్తతో నిండి ప్రజల పాలిట శాపంగా మారింది. కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు వార్డులకు మంచి తాగు నీరు అందించే మంచి నీళ్ల బావి పడువడ్డ బావిలా చెత్త, పాకురు నిండి భయంకరంగా అయింది. అ బావి నీళ్ళే నిత్యం ప్రజలు తాగడం, కనీసం బావిని…

Read More

ఉద్యమ వీరుడు స్ఫూర్తితో పోరాటాలు చేయాలి

కొమరం భీం జయంతి వేడుకల్లో గిరిజన సేవ జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటిధాత్రి:భద్రాద్రి కొత్తగూడెం.మాన్య వీరుడు అదివాసి గోండు బెబ్బులి కొమరం భీం జయంతి సందర్భంగా జల్ జంగిల్ జమీన్ నిదానంతో తిరుగుపాటు పోరాట ఉద్యమ వీరుడు స్ఫూర్తితో ఆయన ఆశయాలు సాధించుట కొరకు నేటి యువత అందరూ కూడా కొమరం భీం ఉద్యమాలు పోరాటాలు చేయాలని ఆదివాసి హక్కులు చట్టాలు సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు వైద్య విద్య ఉపాధి ఉద్యోగం…

Read More

మునుగోడు నియోజకవర్గంలో ఎంపీ వద్దిరాజు విస్త్రత ప్రచారం

  మర్రిగూడలో ఇంటింట ప్రచారం,నామాపురం,గుజ్జలలో ఆత్మీయ సమ్మేళనాలు కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావలసిందిగా ఇతర పార్టీల నాయకులతో మంతనాలు జరిపిన రవిచంద్ర మునుగోడు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డికి ఘన విజయం చేకూర్చేందుకు శనివారం విస్త్రత ప్రచారం నిర్వహించారు.మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మున్నూరుకాపు ప్రముఖులు సర్థార్ పుట్టం పురుషోత్తం,చల్లా హరిశంకర్,ఆకుల రజిత్ లతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.మొదట గట్టుప్పల్ మండలం…

Read More

టిడిపి బలోపేతానికి కృషి చేయాలి

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నేటిధాత్రి, కైరతాబాద్ :తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని మాజీ శాసనమండలి సభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనను శుక్ర వారం కొర్రపాటి కిషోర్, అయ్యప్ప, రాజేంద్ర, రిషి వర్మ, హనీష్, సాయి తదితరులు అమీర్ పేట్ లోని తన నివాసంలో మర్యాదగా కలిసి అభినందనలు తెలియజేశారు.

Read More

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  కరీంనగర్:నేటిధాత్రి  కరీంనగర్ నగర అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ వై.సునీల్ రావు 3వ డివిజన్ లో పర్యటించారు.కిసాన్ నగర్ లో నూతనంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్,డ్రైనేజీ,సిసి రోడ్ల పనులను కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ తో కలిసి భూమిపూజ చేసి ప్రారంభించారు.అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా అన్ని రంగాల్లోని ముందుకు తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నడని మేయర్ సునీల్ రావ్ తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు,మున్సిపల్…

Read More

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

  కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చెన్నబోయిన రవి అన్నారు ఖరీఫ్ సీజన్ లో పండించిన వరి పంట కోతలు ప్రారంభమయు 15 రోజులు గడిచిన ఇప్పటివరకు గ్రామాల్లో రైతులు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు వాతావరణం సహకరించక భారీగా కురుస్తున్న వర్షాలకు రైతులు భయపడి క్వింటల్ 1500 రూపాయలకు దళారులకు అమ్ముకొని నష్టపోతున్నారు అని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంకు మునుగోడు…

Read More

నేటి నుంచే జిల్లాలో బాలమిత్ర వారాంతపు శిక్షణ

  – ఎఫ్ ఎల్ ఎం లో భాగంగా అమలు – ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా కలెక్టర్ చేపట్టిన వినూత్న కార్యక్రమం -తెలంగాణ లోనే మొట్ట మొదటి సారిగా జిల్లాలో అమలు -బాల మిత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్లజిల్లా, నేటిధాత్రి: తెలంగాణ లోనే ప్రాథమిక స్థాయి విద్యార్ధుల అభ్యసన స్థాయి, నైపుణ్యాలను పెంపొందించేందుకు మొట్ట మొదటి సారిగా రాజన్న సిరిసిల్ల జిల్లా…

Read More
error: Content is protected !!