`ఇక కాంగ్రెస్ ప్రచారం నుంచి ఎప్పుడో తప్పుకున్నది.
`పాల్వాయి స్రవంతిని ఒంటరిని చేశారు.
`నాయకులంతా రాహుల్ గాంధీ భజనకు వెళ్లారు.
`మునుగోడు ప్రచారం చేసినా గెలిచేది లేదన్నది తెలిసిపోయింది.
`టిఆర్‌ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.
`ప్రజలు టిఆర్‌ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారు.
`రాజగోపాల్ ను నమ్మి మోసపోయామంటున్నారు.
`మునుగోడు జనమంతా టిఆర్‌ఎస్ వైపే…
`కేసీఆర్ నాయకత్వం కోసమే…
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ గెలుపు ఎప్పుడో డిసైడైపోయింది. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేసినందుకు మధనపడుతున్నామని కూడా చెబుతున్నారు. ఏదేమైనా ఆఖరుకు మంచే జరుగుతోందని, ప్రజలకు సేవ చేయలేనని రాజగోపాల్‌రెడ్డి చేతులెత్తేయడమే మంచిదైదందని ప్రజలు చెబుతున్నారు. అభివృద్ధి చేసే ఎమ్మెల్యేను కాదనుకున్నందుకు నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. అందుకే ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మునుగోడు నియోజకవర్గ ప్రజలు డిసైడైపోయారు. ఇప్పుడు బిజేపి, కాంగ్రెస్‌లు ఎంత మొత్తుకున్నా లాభం లేదు. అంటున్న వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో మునుగోడు ప్రచార సరళిని పరిశీలిస్తున్న కట్టా రాఘవేంద్రరావు. ఈ సందర్భంగా నన్నపనేని మాటల్లోనే…
మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ విజయం ఆగేది కాదు. ఆపేంత శక్తి బిజేపి, కాంగ్రెస్‌లకు లేదు. ప్రజల్లో వారికి స్ధానమే లేదు. ప్రజలు వారిని దగ్గరకు కూడ రానివ్వడం లేదు. ముఖ్యంగా రాజగోపాల్‌నైతే ప్రజలు ఆయా గ్రామాల్లో అడుగుపెట్టనివ్వడం లేదు. ఆయన వస్తున్నారని తెలిసిన వెంటనే ఊరు శివారులోనే ఆయన ఆపేస్తున్నారు. నిలదీస్తున్నారు. తరుముతున్నారు. రూ.18వేల కోట్ట కాంట్రాక్టుకోసం మునుగోడు ప్రజల ఆత్మాభిమానం తాకట్టు పెట్టావంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా సాగనంపుతున్నారు. ఇదే దశలో ఓ గ్రామంలో రాజగోపాల్ రెడ్డి ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేయడంతో వున్న ఏ కొద్దోగొప్పే సానుభూతి కూడా లేకుండా చేసుకున్నాడు. టిఆర్‌ఎస్‌ది వన్ సైడ్ గెలుపుగా మారేందుకు ప్రజలే రాజగోపాల్‌రెడ్డిని అడుగు కూడ పెట్టనీయడంలేదు. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారంలో మెజార్టీ ఎంత వస్తుందన్నదానిపై లెక్కలేసుకుంటున్నామంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఏ ఇంటికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసిఆర్ గురించే చెబుతున్నారు. తెలంగాణ రాకముందు మునుగోడు ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుందనేది ప్రజలే విరిస్తుంటే ఎంతో సంతోషమనిస్తుంది. మునుగోడు ప్రజల్లో వున్న చైతన్యం అంతా ఇంతా కాదు. తాను ప్రచారం చేస్తున్న చౌటుప్పల్‌లో ప్రజలు ఎంతో విజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. సహజంగా ఎక్కడైనా సరే… ఏ ఎన్నికల్లోనైనా సరే…ప్రచారానికి వెళ్లిన సందర్భాలలో సరే..సరే అంటుంటారు. కాని మునుగోడు నియోజకవర్గంలో ప్రజలే తమకు హమీ ఇస్తున్నారు. ప్రచారం చేసేవారు చెప్పాల్సిన మాటను, ప్రజలు మాకు చెప్పి మాట ఇస్తున్నారు. మీరు నిశ్చింతగా వుండడి. మేము టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని మాలోనే మరింత ఆత్మస్ధైర్యాన్ని నింపుతున్న మునుగోడు ఓటర్లపై మరింత గౌరవం పెరిగింది. తెలంగాణ రాక ముందు వారి గోసలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అదే సమయంలో తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల తాము ఎంత లబ్ధిపొందామో ఒక్కక్కటీ చెబుతున్నారు. సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాక ముందు మంచనీళ్లు తాగాలన్నా భయపడే పరస్దితి. కాని ఇప్పుడు ఫ్లోరైడ్ అన్నది లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎంత మొత్తుకున్నా గుక్కెడు మంచినీళ్లు ఇయ్యలే…ఇప్పుడు నిత్యం మంచినీళ్లు వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఒకప్పుడు మునుగోడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలకు పిల్లనియ్యాలంటే ప్రజలు భయపడేవారు. అలాంటిది ఇప్పుడు మునుగోడులోని అన్ని గ్రామాలు సురక్షితమైన మంచినీరు అందుతోంది. ఇదీ ప్రజలు చెబుతున్న మాట.
ఇక తన స్వార్ధం కోసం మునుగోడులో రాజీనామా చేసి, ఉప ఎన్నిక తెచ్చిన రాజగోపాల్ మళ్లీ అబద్దాలు షురూ చేశాడు. అవి కనీసం నమ్మశక్యంగానైనా వుండాలి. నిజానికి పార్లమెంటు నియోజకర్గ ఉప ఎన్నికైతే జాతీయ స్దాయిలో అధికారంలో వున్న పార్టీ అభ్యర్ధి అయితే ఏవైన వాగ్ధానాలు చేస్తే కొంత వరకు నమ్మొచ్చు. అంతే కాని అసెంబ్లీ నియోజకరవర్గానికి పోటీ చేస్తూ, కేంద్రం నుంచి నిధులు తెస్తానంటే సాధ్యమయ్యే పనేనా? ప్రజలు ఆ మాత్రం ఆలోచించుకోలేరా? ప్రజలను ప్రతీసారి మోసం చేయలేరు. ఇక్కడ ఓ విచిత్రమైన విషయం చెబుతాను. చౌటుప్పల్‌లో పది పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి తెప్పిస్తానని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల మ్యానిఫెస్టో విడుదల చేశాడు. ఎక్కడైనా పది పడకల ఆసుపత్రి అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? అందులోనూ పది పడకల ఆసుపత్రికి ఈఎస్‌ఐ ఆసుపత్రి సౌకార్యలు ఇవ్వడం సాధ్యమౌతుందా? రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ఆసుపత్రులు కనీసం ముప్పై పడకలు వుంటాయి. ఇక కేంద్రం ప్రకటించే ఆసుత్రులు ఎయిమ్స్ స్ధాయిలో వుండాలి. రాజగోపాల్‌రెడ్డి అన్న అయిన వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా వున్నాడు. ఆయన బీబీ నగర్ నిమ్స్‌కు ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని నిధులు తెచ్చాడు. నిమ్స్‌లో వైద్య సేవలు మొదలయ్యేలా ఎంత కృషి చేయలేదు. ఈ విషయం చెప్పే దమ్ము రాజగోపాల్‌కు వుందా? ఆలు లేదు..చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్లు మునుగోడులో మళ్లీ గెలిచినట్లు, కేంద్రం నుంచి నిధులు తెచ్చినట్లు రాజగోపాల్ ఇప్పుడే పగటి కలలు కంటున్నాడు. అవన్నీ అబద్దాలని ప్రజలకు తెలుసు. రాజగోపాల్‌రెడ్డి వల్ల ఏదీ కాదని కూడ తెలుసు. అందుకే ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌కు చుక్కెదురౌతుంది. ప్రచారమే చేసుకునే వీలు లేకుండాపోతున్నది.
ఇక ఇదిలా వుంటే రాష్ట్ర రాజకీయాల్లో అనైతిక రాజకీయాలకు బిజేపి పార్టీ పాల్పడుతుందో కనిపిస్తోంది. ప్రజలు బిజేపిని చీ కొడుతున్నారు. అబద్దాల పునాదుల మీద పార్టీని ఎల్ల కాలం బిజేపి నడలేదు. ఎమ్మెల్యేలకు వల వ్యవహారంలో తొలి రోజు బిజేపి నాయకులు చెప్పిందేమిటి? ఇప్పుడు చెబుతున్నదేమి? సాక్ష్యాత్తు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సైతం ఆ రోజు అసలు ఆ ఫోటోల్లో వున్నవారు ఎవరో తెలియదన్నాడు. ఈరోజేమో! అందులో తప్పేముంది? అంటున్నాడు. ఇంత కన్నా నీచాతి నీచమైన రాజకీయాలు ఎవరైనా చేస్తారా? ఇంత దిగజారుడు తనం అవసరమా? రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలంటే ప్రజల మద్దతుండాలి. వారి ఆశీర్వాదం కావాలి. ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. అంతే కాని ప్రజల్లో మద్దతు లేకున్నా, వారి ఆశీర్వాదం లేకుండా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం దుర్మార్గం. మహారాష్ట్ర, గోవా, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, త్రిపుర, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో ఏం జరిగిందో తెలంగాణలో కూడా చేద్దామనుకున్నారు. కాని ఇక్కడు వున్నది తెలంగాణ సాధకుడు. సుధీర్ఘమైన పోరాట యోధుడు. తెలంగాణ ఉద్యమ కారుడు. రాజకీయ చాణక్యుడు. కేసిఆర్ వున్నాడు. ఆయను సూటిగా చూడడమే ఎవరి వల్లా కాదు. ఆయన రాజకీయ చతురత ముందు ఎవరూ నిలబడలేరు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని , అమలు కానటువంటి సంక్షేమ పథకాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్. అలాంటి తెలంగాణ మేమూ భాగస్వాములం కావలంటే మా ప్రాంతాలను కూడా తెలంగాణలో కలపమని పొరుగు రాష్ట్రాల ప్రాంతాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాంటి తెలంగాణలో అస్ధిర రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలే బిజేపిని చీరి చింతకు కట్టేస్తారు. తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు ఇవ్వకుండా, తెలంగాణకు గతంలో కేటాయించిన ప్రాజెక్టులు తరలించుకుపోయారు. తాజాగా విమానాల తయారీ ప్రాజెక్టును కూడా గుజరాత్‌కే కేటాయించుకున్నారు. అడుగడుగునా తెలంగాణను మోసం చేస్తున్న బిజేపికి తెలంగాణలో చోటు లేదు. వచ్చే ఎన్నికల్లో ఆపార్టీకి ఓటు కూడా పడదు. మునుగోడులో బిజేపి గోడు ఎవరూ పట్టించుకోరు సరి కదా…ఓటంటూ ఎవరైనా వస్తే ప్రజలు గోడకేసి కొడుతున్నారు. టిఆర్‌ఎస్ గెలుపును ప్రజలే ఖాయం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో సగరులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని
కోరుతూ తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును శుక్రవారం కలిశారు.
రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నాయకులు కలిసి సమస్యలను వివరించారు.
ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో బిసి ‘డి’ లో ఉన్న సగరులను బిసి ‘ఎ’ లోకి మార్చాలని, నిర్మాణ రంగం పై ఆధారపడి జీవిస్తున్న సగరులను నిర్మాణ రంగ
కార్మికులుగా గుర్తించాలని, గతంలో ఇచ్చిన జీఓ 29 ను పునరుద్దరిస్తూ సగరులకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులలో 15 శాతం పనులను
రిజర్వేషన్ ద్వారా ధరావతు సొమ్ము లేకుండ ఇవ్వాలని కోరారు. 60 సంవత్సరాల వయస్సు పైబడిన సగరులకు ఫెన్షన్ పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మ గౌరవ భవనం కోసం కోకాపేటలో ముందుగా కేటాయించిన స్థలాన్ని కొనసాగిస్తూ ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు. మంత్రి హరీష్ రావు గారు సానుకూలంగా స్పందిస్తూ కోకాపేట స్థలం మార్చకుండా ముందు కేటాయించిన స్థలాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో రిజర్వేషన్ల పై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుంటానని తెలిపారు. ఇతర సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి తో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సగర ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, కోశాధికారి నలుబాల బిక్షపతి సగర, గౌరవ రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆర్.బి. అంజనేయులు సగర, సలహాదారులు రాంసగర, యాదాద్రి అన్నదాన సత్ర సంఘం అధ్యక్షులు కెపి రాములు సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్డేపల్లి రాములు సగర, రాష్ట్ర యువజన సంఘం కోశాధికారి రాము సగర, మూసాపేట్ జడ్పీటీసీ గడ్డమీది ఇంద్రయ్య సగర, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, మహబూబ్నగర్ జిల్లా సగర సంఘం అధ్యక్షులు సాయి ప్రణీల్ చందర్ సగర, గ్రేటర్ హైదరాబాద్ సంఘం అధ్యక్షులు మోడల రవిసగర, గౌరవాధ్యక్షులు అస్కాని వెంకటస్వామి సగర, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఏరుకొండ ప్రసాద్ సగర, నల్గొండ జిల్లా అధ్యక్షులు సందుపట్ల లక్ష్మణ్ సగర, ప్రధాన కార్యదర్శి ఆలేటి శివప్రసాద్ సగర, కోశాధికారి దయాసాగర్, మహబూబ్ నగర్ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సగర, నర్సింలు గూడెం సర్పంచ్ విష్ణు కుమార్ సగర, మెదక్ జిల్లా అధ్యక్షులు, ఎంపీటీసి సాయికుమార్ సగర, వెంకటాయపల్లి సర్పంచ్ సక్కెర ఆంజనేయులు సగర, టీఅర్ఎస్ సీనియర్ నాయకులు బోషెట్టి భాస్కర్ సగర, గంట కృష్ణ సగర, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యం సగర, సంఘం సీనియర్ నాయకులు రామకృష్ణ సగర, ఆంజనేయులు సగర, శివ సగర, చామలపల్లి మాజీ సర్పంచ్ నేర్లకంటి యాదయ్య సగర, గ్రామ కమిటీ అద్యక్షులు సగర, నాయకులు నరేష్ సగర, బల్గూరి శ్రీనివాస్ సగర, నర్సింలగూడెం గ్రామ శాఖ అద్యక్షులు లక్ష్మయ్య సగర, కల్లెట్ల శ్రీకాంత్ సగర, శంకర్ సగర, మారయ్య సగర, బిక్షమయ్య సగర, నాగరాజు సగర, నర్సింహ సగర, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షులు సీతారాం సగర, గ్రేటర్ సంయుక్త కార్యదర్శి శేఖర్ సగర, కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నయ్య సగర, మూసాపేట్ వార్డు సభ్యులు రాజు సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గౌరవ సలహాదారులు మోడల నర్సింహ్మ సగర తదితరులు పాల్గన్నారు.
`ప్రజాస్వామ్యంలో సంక్షేమ నాయకుడు కేసిఆర్ కు మునుగోడు ప్రజల బహుమతే…
`కట్టాతో వద్దిరాజు రవిచంద్ర మునుగోడు నుంచి
`ప్రజల స్పందన చూస్తుంటే మెజారిటీ చాలా వుండే అవకాశం వుంది.
`ప్రజలు ధైర్యంగా టిఆర్‌ఎస్ కే ఓటు వేస్తామని చెబుతున్నారు.
`ముఖ్యమంత్రి కేసిఆర్ మీద అచంచలమైన విశ్వాసంతో వున్నారు.
`ప్రభుత్వ పథకాలతో ప్రతి కుటుంబం సంతోషంగా వుంది.
`మిషన్ భగీరథ తో నీళ్ల కష్టాలు తీరాయి.
`ఫ్లోరైడ్ రక్కసి పీడ వదిలిపోయింది.
`పెన్షన్ లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్ వైపే!
`రైతుబంధు రైతన్నకు వెన్నుదన్ను.
`కళ్యాణ లక్ష్మీతో పేదింట పెళ్ళికి ఎంతో భరోసా.
`బిజేపి మునుగోడులో అంతంత మాత్రమే….
`కాంగ్రెస్ ఎప్పటిలాగే కష్టమే…
`తెలంగాణ లో టిఆర్‌ఎస్ కు తిరుగులేదు…
`కేసిఆర్ నాయకత్వానికి ఎదురులేదు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగులేదు. ఎదురు లేదు. ప్రతిపక్షాలకు అసలు తెలంగాణలో తావు లేదు. ప్రజలు వారిని నమ్మే పరిస్ధితి అసలే లేదు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకి లేదు. దేశం మొత్తం మీద కేసిఆర్ లాంటి సంక్షేమ సారధి మరొకరు లేదు. తెలంగాణ అమలౌతున్నన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. తెలంగాణలో ప్రజలకు అందుతున్న పధకాలలో కనీసం పదో వంతు సంక్షేమ పథకాలు కూడా మరే రాష్ట్రంలోనూ లేవు. అమలు కావడం లేదు. అలాంటిది మునుగోడు ఉప ఎన్నికపై తర్జన భర్జన ఎందుకు? మునుగోడు మాదే…గెలిచేది మేమే…ప్రతిపక్షాలకు మునుగోడులో స్ధానమే లేదు. బిజేపికి క్షేత్రస్ధాయి బలం లేదు. బలగం లేదు. యంత్రాగం లేదు. కాంగ్రెస్‌ను వీడి బిజేపిలో చేరిన రాజగోపాల్‌రెడ్డి అంటే ప్రజల్లో నమ్మకం లేదు. ఆయనపై విశ్వాసంలేదు. ఆయన పార్టీ ఎందుకు మారిండో మునుగోడు నియోజకవర్గంలో చిన్న పిల్లవాడినడిగినా చెబుతాడు. ఇక ఆయన కోసం గత ఎన్నికల్లో పనిచేసిన వాళ్లు ఎంత కోపంతో వున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య నాంపల్లి అనే గ్రామంలో ప్రచారానికి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డిని గ్రామస్ధులంతా తరిమేసినంత పనిచేశారు. ఆయనను కనీసం పది నిమిషాలు కూడా అక్కడ వుండన్విలేదు. అలాంటిది తాను మళ్లీ గెలుస్తానన్న భీరాలు తప్పతే, గెలిచేది లేదు. ఆయనకు ఓట్లు పడేది లేదు. ఇక కాంగ్రెస్ పరిస్ధితి అంతకన్నా మెరుగైన పరిస్దితి కూడా ఏమీ లేదు. ఆ పార్టీకి నాయకత్వం లేదు. ప్రజల్లో ఆదరణ లేదు. మొత్తం మీద కాంగ్రెస్‌కు ఎలాంటి సీన్ లేదు. మొన్ననే రేవంత్‌రెడ్డి మునుగోడులోని ఓ తండాకు ప్రచారం పేరుతో వెళ్తే ఏం జరిగిందో తెలిసిందే. రేవంత్ రెడ్డి ముఖం పట్టుకొని ఓ మహిళ ఇక్కడి నుంచి వెళ్లిపో… అని గర్జించింది. ఆ కోపం చూసి అక్కడినుంచి రేవంత్ రెడ్డి జారుకోవడం తనవంతైంది. కాంగ్రెస్ నాయకుల ముందు ఆయన పరువు పోయినంత పనైంది. అదంతా మీడియాలో వచ్చిందే…జనమంతా చూసిందే… కాంగ్రెస్‌కు మింగుడుపడందే…ఆదిలోనే రేవంత్ అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో అందరూ చూసిందే…అయినా పార్టీ అంతా లుకలుకలే…అంతే కాదు ఆపార్టీకి చెందిన స్టార్ క్యాంపైనర్ తమ్ముడే బిజేపి తరుపున పోటీ చేస్తున్నాడు. అన్న వెంకటరెడ్డి తన తమ్ముడికి ఓట్లేయాలని కోరుతున్నారన్న వార్తలు వినిపిస్తూనే వున్నాయి. ఇంకే ముంది కాంగ్రెస్‌కు మునుగోడులో ఏం మిగిలింది. రాజగోపాల్ రెడ్డి రూపంలో వున్నదే పోయింది. కొత్త గా కాంగ్రెస్‌కు వచ్చేదిలేదు. ఆ పార్టీకి ఓట్లు పడేది లేదు….అయినా మేం మెహర్భానీకి వెళ్తాం…తమను తాము మోసం చేసుకుంటామని అనుకుంటే చేసేదేముంది? జనం కూడా ఆ రెండు పార్టీలను చూసి జాలి పడుతున్నారే తప్ప, వారి ముఖం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు.
తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలమైన పార్టీ. త్వరలో జాతీయ స్ధాయిలో వెలుగొందేందుకు సిద్ధమౌతున్న పార్టీ. దేశమంతా తెలంగాణలో అమలౌతున్న పథకాలన్నీ తమ రాష్ట్ర ప్రజలకు కూడా కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో తెలంగాణతో సరిహద్దు కల్గిన ప్రాంతాలన్నీ తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. అంతే కాదు కర్నాకటకు చెందిన ఓ ఎమ్మెల్యే కూడా తమను తెలంగాణలో కలపాలని కోరినట్లు వార్తలు చూసిందే. ఎందుకుంటే తెలంగాణలో అమలౌతున్న ఏ ఒక్క పధకం కూడా కర్నాటకలో లేదు. కేసిఆర్‌లా రాజనీతిజ్ఞత వున్న నాయకుడు లేదు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడు లేదు. పాలకులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నట్లు లేదన్నది పొరుగు రాష్ట్రాలలో వినిపిస్తున్న మాటే…
మునుగోడు విషయంలో అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలంగా వున్నాయని చెబుతున్నాయి. అంతే కాదు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చేయించే సర్వేల్లో కూడా టిఆర్‌ఎస్సే గెలుస్తుందని చెబుతున్న సంగతి తెలిసిందే. టిఆర్‌ఎస్ సుమారు 41శాతంతో అన్ని పార్టీలంటే ముందుంజలో వుంది. అన్ని సర్వేల్లోనూ ఇదే తేలుతోంది. మునుగోడులో సుమారు 2లక్షల40వేల ఓట్లు వున్నట్లు సమాచారం. అందులో సంక్షేమ పధకాలు అందుకుంటున్న కుటుంబాలన్నీ టిఆర్‌ఎస్‌కే ఓటు వేస్తాయన్నది జగమెరిగిన సత్యమే. ఎందుకంటే రైతుబంధు నుంచి మొదలు, ఆసరా పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, కళ్లుగీత కార్మికుల పెన్షన్లు, చేనేత పెన్షన్లు, బీడి కార్మికుల పెన్షన్లు అందుకునే వారు మెజార్టీ ప్రజలున్నారు. వారంతా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంపై సంపూర్ణమైన విశ్వాసంతో వున్నారు. ఇక ఇరవై నాలుగు గంటల కరంటు సరఫరాలో చిన్నా చితక వ్యాపారాలు చేసుకునేవారికి ఉపాధి మరింత పెరిగింది. గతంలో కరంటు లేక ఇన్వర్టర్ల మీద ఆధారపడిన వారు ఇప్పుడు వాటి అవసరం లేకుండాపోయింది. నాణ్యమైన కరంటు అందుతోంది. ఇక రైతులకు కూడా ఇరవై నాలుగు గంటల కరంటు అందుతోంది. ఓ వైపు పెరిగిన భూగర్జ జలాలు, మరో వైపు నిరంతరంగా నాణ్యమైన కరంటు…పెట్టుబడి సాయం కింద రైతు బంధు…అన్ని రకాల సౌకర్యాలు గతంలో సమకూర్చాలన్న ఆలోచన చేసిన నాయకుడే లేడు. పాలకులు లేరు. మరి దేశంలోనే ఇన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని ప్రజల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసిఆర్. ఇక పేదింటి ఆడ పిల్ల పెళ్లి భారం కాకూడదని, ప్రభుత్వం తరుపున కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పేరుతో లక్షనూటపదహారు రూపాయలు ఇస్తున్నారు. తాజాగా దళిత బంధు పేరుతో ఎంతో మంది దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న నాయకుడు కేసిఆర్. మరి అలాంటి టిఆర్‌ఎస్‌ను ప్రజలు కాదనుకుంటారా? బిజేపి, కాంగ్రెస్ లాంటి వారిని నమ్మి, మళ్లీ తమ జీవితాలను ఆగం చేసుకుంటారా? గతంలో డెబ్బై ఏళ్ల గోస పడరాని కష్టాలు పడ్డ ప్రజలు, మళ్లీ బిజేపి,కాంగ్రెస్‌లను నమ్మేందుకు సిద్ధంగా లేరు. వారి మాయ మాటలు వినేందుకు ఇష్టపడడం లేదు. నిజంగా బిజేపికి ప్రజల మీద ప్రేముంటు, ప్రేద ప్రజలను ఆదుకోవాలనుకుంటే పెరుగుతన్న నిత్యావసర ధరలేమిటి? పెట్రోలు, డీసెల్ పెంపులేమిటి? గ్యాస్ ధర నియంత్రణ లేకుండా పెరుగుడేమిటి? ఇదేనా బిజేపికి ప్రజల మీద వున్న గౌరవం. ఓ వైపు జిఎస్టీ పేరుతో బాదుడు…మరో వైపు దేశం కోసం, ధర్మం కోసమంటూ సమాజాన్ని చీల్చుడు…మతం పేరుతో బిజేపి రాజకీయాలు ఎంతో కాలం సాగవు…
ముఖ్యమంత్రి కేసిఆర్ దేశంలోనే ప్రస్తుతం వున్న రాజకీయ నాయకుల్లో తిరుగులేని నాయకుడు. ఎదురు లేని నాయకుడు. ఏ రాష్ట్రంలో కనిపించని ప్రగతిని తెలంగాణలో చూపించిన నాయకుడు. తెలంగాణ రాష్ట్రంవచ్చిన ఇంత తక్కువ కాలంలో ఇక మిగిలిపోయిన పనులంటూ లేకుండా అనేక పనులు పూర్తి చేశాడు. అసలు తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణమే జరగదని చెప్పి నేలపై, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతోపాటు, అనేక రిజర్వాయర్లు నిర్మాణం చూశాడు. సాధ్యం కాదన్న వాటిని సుసాధ్యం చేసి చూపించాడు. అసలు తెలంగాణలో ఇలా నీటి పరవళ్లు చూస్తామని గతంలో ఎవరూ అనుకోలేదు. తెలంగాణ రాకపోతే ఉమ్మడి రాష్ట్రంలో ఇంకెప్పటికీ సాధ్యమయ్యేవి కాదు. కాకతీయ కాలంలో రూపకల్పన చేసిన చెరువుల ఆనవాలు లేకుండా చేసిన ఉమ్మడి పాలకుల దాష్టికాన్ని దిగమింగుకొని బతికిన తెలంగాణ ప్రజలకు మొత్తం 46వేల పైచిలుకు చెరువులు మళ్లీ గంగాళాలు చేశాడు. నీళ్లతో నింపేశాడు. ఎండాకాలం, వానా కాలం, ఆ కాలం, ఈ కాలం అని తేడా లేకుండా అన్ని కాలాలు చెరువుల్లో నీటి చుక్క ఇంకిపోకుండా చూసుకుంటున్నారు. మరి ఇలాంటిపరిస్ధితి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వుందా? అంతెందుకు దేశంలోనే అత్యధిక చెరువులున్న రాష్ట్రం తమిళనాడు. మరి అక్కడ చెరువులన్నీ ఖాళీ…చెన్నై నగరమే మంచినీటి కోసం కటకటలాడడం చూస్తూనే వున్నాం. కాని మన తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీటిని మిషన్ భగీరధ ద్వారా అందిస్తున్నాము. ఇలా దేశమంతా ప్రజలకు మంచినీరు అందించాలన్నదే కేసిఆర్ కల. అందుకే జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించేందుకు సిద్దమౌతున్నారు.
`టిఆర్ఎస్ రోడ్ షోలకు విపరీతంగా జనం హాజరౌతున్నారు.
`తమ మద్దతు తెలియజేస్తున్నారు.
`ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కారు వైపే….
`రైతు బంధు లబ్ధిదారులంతా టిఆర్‌ఎస్ వైపే
`అసరా పించన్లు, ఇతర పింఛన్ దారులంతా కేసిఆర్ నాయకత్వమే కోరుకుంటున్నారు.
`ఫ్లోరైడ్ బాధ విముక్తి టిఆర్‌ఎస్ తోనే జరిగింది. ప్రజలు కూడా ఇదే విషయం చెబుతున్నారు.
`టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించి రికార్డు సృష్టిస్తుంది.
హైదరాబాద్,నేటిధాత్రి: మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ గెలుపు మామూలుగా వుండదు. మెజార్టీ 50వేలు దాటుతుంది. ఎక్కడికెళ్లినా జనం టిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. టిఆర్‌ఎస్ ప్రభంజనమే కనిపిస్తోంది. ఎన్నికలన్న తర్వాత ప్రతిపక్షాలు పోటీ చేయాలి కాబట్టి అన్నట్టుగానే వుంది. వారి ప్రచారం. వారికి ప్రజల్లో స్ధానం. బిజేపికి మునుగోడులో చెప్పాలంటే బిజేపికి లీడర్లు లేరు. క్యాడర్ అసలే లేదు. అద్దెకొచ్చిన నాయకులు తప్ప వారితో నడిచేందుకు జనమే లేరు. బిజేపి వైపు ప్రజలు చూడడమే లేదు. బిజేపి నాయకులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తే తరిమికొడుతున్నరు. ఈ గ్యాస్ ధరలేంది…ఈ నిత్యావసర వస్తువుల ధరలేంది? పెట్రోల్, డీజిల్ ధరలు మోతేంది? అని బిజేపి నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజలే బిజేపి నేతలను పరిగెత్తిస్తున్నారు. వారికి మాటలు లేకుండా చేస్తున్నారు. వారికి చెమటలు పెట్టిస్తున్నారు. ధరలు తగ్గించి రండి…అప్పుడు చూద్దాంపో అని మొహంమీదనే బిజేపి నేతలను ప్రజలు చీకొడుతుంటే ఏం చెప్పుకోవాలో? ఎలా చెప్పుకోవాలో తెలియని అయోమయంలో వున్నారు. దాంతో బిజేపి అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డి కొత్త నాటకం మొదలుపెట్టిన సంగతి చూస్తునే వున్నాం. ఈ విషయం ముందునుంచి మనం చెబుతూనే వున్నాం. ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిందంటే చాలు ఏదో ఒక నాటకానికి తెరతీస్తారని తెలుసు. అదే ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి అనుసరిస్తున్నది. ఇంకా ప్రజలు బిజేపిని నమ్ముతారా? వారికి ఓట్లేస్తారా? అంటున్న మునుగోడు ఉప ఎన్నికల నియోజవకర్గ ఇన్‌ఛార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావుతో నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావు ప్రత్యేక ఇంటర్వూ…మునుగోడు నుంచి.మునుగోడు ప్రజలకు టిఆర్‌ఎస్‌పై ఎంత ప్రేమ, అభిమానం వున్నాయో గ్రామాలు తిరుగుతుంటే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల తమకు జరిగిన మేలు ఏమిటో ప్రజలు మాకే వివరిస్తున్నారు. ముఖ్యంగా మిషన్ భగీరధ నీళ్ల గురించి చెప్పని వ్యక్తి అంటూ లేడు. ఏ గ్రామనికి వెళ్లినా ఇదే మాట…ఈ రోజు ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా వున్నారంటే కారణం నీళ్లు. ఈ నీళ్లకోసం ఏళ్ల తరబడి గోస పడ్డ ప్రజల కళ్లలో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ మీద కృతజ్ఞతాభావం కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. కాంట్రాక్టులు తప్ప, నియోజవర్గ అభివృద్ధి తన వల్ల కాదని వదిలేశాడని ప్రజలు అంటున్నారు. ఆయనను శాపనార్దాలు పెడుతున్నారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఓట్లేస్తే ఏం చేస్తాడు? నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా నాలుగేళ్లు గాలి తిరుగుళ్లు తిరిగి మళ్లా ఎందుకొచ్చాడో మాకు తెలుసంటున్నారు. గత ఎన్నికల్లోనే రాజగోపాల్‌రెడ్డిని గెలిపించి పొరపాటు చేశామని, ఈ సారి ఆ పొరపాటు చేయకుండా టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని ప్రజలు చెబుతున్నారు. మునుగోడుకు నేను ఆగష్టులో వచ్చాను.
అప్పటినుంచి దాదాపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలే కాదు, అన్ని గడపలు కూడా టచ్‌చేశాను. ప్రజల చెప్పే ప్రతి మాట విన్నాను. నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులందరినీ కలిశాను. వాళ్లంతా ఓట్లేసేందుకు సిద్ధంగా వున్నారు. అందుకే మేం మెజార్టీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నాం. 50వేల మెజార్టీ వస్తుందన్న ఆలోచనతో వున్నాం. మళ్లీ ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడు సభతో ఆ జోష్ మరింత పెరుగుతుంది. మా మెజార్టీ కనీవినీ ఎరగరి రీతిలో పెరిగే అవకాశం కూడా వుంది. ఎందుకంటే మేం నియోజవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను కలవడం జరిగింది. ముఖ్యంగా దళిత బంధు లబ్ధిదారులు. భవిష్యత్తులో గిరిజిన బంధు అమలు వంటి పధకాలపై ప్రజల్లో ఎంతో ఆసక్తి వుంది. కేసిఆర్‌తోనే తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ రాకపోతే ఇలాంటి పథకాలు చూసేవాళ్లం కాదని అంటున్నారు. ఇక ఆసరా పెన్షన్ దారులు మాత్రం తమ ఓటు కేసిఆర్‌కే అంటూ చెప్పడం కూడా మీడియాలో చూస్తున్నదే. మాకు ప్రత్యక్ష అనుభవంతో వింటున్నదే. వాళ్లు కేసిఆర్ గురించి చెబుతున్న తీరు కూడా ఎంతో ముచ్చటేస్తుంది. గతంలో తమ జీవన విధానం, ఇప్పటి జీవిన విధానంలో కనిపిస్తున్న మార్పును స్పష్టంగా చెబుతున్నారు. తమ పెద్ద కొడుకు కేసిఆర్ అంటున్నారు. బీజేపీ ప్రచారమంతా పైట పటారమే.. ఆ పార్టీకి క్యాడర్ లేదు. లీడర్ షిప్ అసలే లేదు. కాని కాంట్రాక్టర్‌ను చూసి ఇతర ప్రాంతాలను ప్రచారానికి వస్తున్న జనమే గాని, మునుగోడు ప్రజలు బిజేపి సభలు వెళ్లడం లేదు. ప్రచారంలో పాల్గొనడంలేదు. అంతే కాకుండా ఈ మధ్య ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని ఎక్కడిక్కడ నిలదీస్తుండడంతో ఆయన ఆవేశాలకు లోను కావడం. తాను చెప్పింది మాత్రమే జనాన్ని వినాలనడం…తనను ప్రశ్నించొద్దని ప్రజలను భయపెట్టడం కూడా ప్రజల్లో బిజేపిపై మరింత కోపం పెరిగింది. అసలు రాజగోపాల్‌రెడ్డి పరిస్దితి చూసి, ఆ పార్టీ నేతలెవరూ ప్రచారానికి కూడా రావడంలేదు. ఆయన వెంట తిరిగేందుకు ఇష్టపడడం లేదు. ఎక్కడికెళ్లినా రాజగోపాల్‌రెడ్డి అసహనం వ్యక్తం చేయడాన్ని కూడా ప్రజలు చీ కొడుతున్నారు. అసలు రాజీనామా ఎందుకు? చేశావో మాకు తెలుసంటూ మొహం మీదనే రాజగోపాల్‌రెడ్డిని తిడుతుంటే ఆయనకు రోజురోజుకూ అసహనం పెరిగిపోతోంది. తన రాజకీయ భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోంది. ఎందుకు రాజీనామా చేశానా? అన్నది తన ముఖ కవలికల్లో తెలిసిపోతుంది. ఇక కాంగ్రెస్ పరిస్దితి అంతకన్నా భిన్నంగా ఏమీ లేదు. పాల్వాయి స్రవంతికి ప్రచారం చేయడానికి కూడా ఎవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ జోడోయాత్ర జోష్‌లో వుంది. మునుగోడును వదిలేసింది.
ఎలాగూ మునుగోడులో గెలిచేది లేదు. కనీసం డిపాజిట్ కూడా వచ్చేది లేదు. టిఆర్‌ఎస్ ప్రభంజనం ముందు నిలబడి కొట్లాడే శక్తి లేదు. ప్రజల మద్దతు అసలే లేదు. దాంతో రాహుల్ యాత్రలో పాల్గొన్నాకనీసం పేరొస్తుందన్న ఆలోచనలతో నాయకులు వున్నారు. స్రవంతిని ఒంటరిని చేసి వదిలేశారు. నిజానికి బిజేపి, కాంగ్రెస్‌లు ఎప్పుడో చేతులెత్తేశాయి. మునుగోడులో ప్రజల నాడి వారికి అర్ధమైపోయింది. టిఆర్‌ఎస్ గెలుపును అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే ప్రచారం మానుకున్నారు. వార్ వన్ సైడ్ చూసి పక్కకు తప్పుకున్నారు. ఇదిలా వుంటే మునుగోడు నియోజవర్గం మొత్తం కేంద్ర ప్రభుత్వం మీద ఉత్తరాల యుద్దం మొదలుపెట్టారు. మునుగోడులో బిజేపిని పాతిపెట్టేందుకు సిద్ధమౌతున్నారు. రాజగోపాల్‌రెడ్డిని ఓడిస్తామని శపధం చేస్తున్నారు. పద్మశాలీలంతా చేనేతపై జిఎస్టీ వేయడాన్ని నిరసిస్తూ పోస్టు కార్డు ఉత్తరాలు రాయడం మొదలుపెట్టరు. ఈ ఉద్యమం ఒక విప్లవంగా సాగుతోంది. మొదట పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ ఉత్తరం రాశారు. పార్టీ శ్రేణులతోపాటు, పద్మశాలీలు ప్రధానికి ఉత్తరాలు రాస్తున్నారు. అంటే చేనేత వృత్తిని కేంద్ర ప్రభుత్వం ఎలా తుంచేయాలని చూస్తుందో జిఎస్టీతో తేటెతెల్లమైంది దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకమైన ఘట్టం. విదేశీ వస్తు బహిష్కరణ. స్వదేశీ వస్తు ఉత్పత్తి, వినియోగం. ఇది దేశమంతా ఒక ఉప్పెనలాంటి విప్లవాన్ని సృష్టించింది. ఇప్పుడు మళ్లీ అదే చేనేతతో కేంద్ర ప్రభుత్వాన్ని కదలించేందుకు, వచ్చే ఎన్నికల్లో బిజేపి ప్రభుత్వాన్ని దించేందుకు, ఇప్పుడు మునుగోడులో బిజేపిని ఓడిరచి బుద్దిచెప్పేందుకు ఇక్కడినుంచే అడుగులు మొదలయ్యాయి. చేనేత సోదరులు ఉత్తరాలతో బిజేపి పునాదులు కదలనున్నాయి. పేదలపై భారాలు మోపుతూ, చిన్న చిన్న వ్యాపారాలను చిదిమేస్తూ, చేతి వృత్తులను నాశనం చేస్తున్న బిజేపి కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, బిజేపిని ముంచేందుకు మునుగోడులోనే శ్రీకారం జరుగుతుంది. బిజేపిపై గెలిచి మరోసారి టిఆర్‌ఎస్ సత్తా ఏమిటో, భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో బిఆర్‌ఎస్ సత్తా ఏమిటో చూపిస్తాం…!
తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి కుమారుడు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర పుట్టినరోజును పురస్కరించుకొని కొత్తవాడ
ఆటోనగర్ లోని బ్లాండ్ లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాల లో వద్దిరాజు రవిచంద్ర యూత్ వింగ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా పిల్లలతో కేక్ కట్ చేపిచ్చి పండ్ల పంపిణీ చేయడం జరిగింది
అనంతరం యాజమాన్యానికి పిల్లలకు ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వద్దిరాజు రవిచంద్ర గారి వ్యక్తిగత సహాయకులు వీణవంక కిరణ్ కుమార్. రవిచంద్ర యూత్ వింగ్ సభ్యులు జన్ను నాగరాజ్. సుధీర్. హరీష్. వినయ్. నగేష్.అశోక్. బబ్లు. రమేష్.సురేష్. నరేష్.సంతోష్. అవినాష్. శివకుమార్. దిలీప్. శ్రీధర్. అజార్. చిన్నపాషా.భరత్ మరియు తదితరులు పాల్గొన్నారు…
హైదరాబాద్,నేటిధాత్రి: తెలంగాణ రాకపోతే మునుగోడు లాంటి ప్రాంతాలుఎలా వుండేవో ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. గత పాలకుల పాపానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఎంతో మంది అభాగ్యుగులు, ఫ్లోరైడ్ పీడితుల జీవితాలను చూస్తుంటే కళ్లలోనీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అసలు వాళ్లు కొన్ని దాశాబ్దాల కాలంగా పసి తనం నుంచి వయసు మళ్లే దాకా ఎలా బతికి బట్టకట్టారో అన్నది వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. ఎలా జీవించారో , ఎలా జీవితాలను నెట్టుకొచ్చారన్నది చూస్తుంటే గుండె చెరువౌతుంది. తినే తిండిలో ఫ్లోరైడే…తాగే నీటిలో ఫ్లోరైడే…శరీరమంతా ఫ్లోరైడ్‌నిండి, ఎండిన కర్రల్లా ఎముకలు ఎక్కడ విరిగిపోతాయో! అనుకుంటూ క్షణ క్షణం బతకడం అంటే ఎంత నరకమో!! వినడానికే గుండె ధైర్యం చాలడం లేదు. అలాంటి మునుగోడు వాసుల గోడు వింటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చాక, తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి కేసిఆర్ పుణ్యమా అని మిషన్ భగీరథ ద్వారా అందుతున్న మంచినీళ్లు వారి జీవితాలకు అమృతంలా మారి, ఆయు ప్రమాణాలు పెంచాయో వారి మాటల్లో వింటుంటే ఆనందమేస్తుంది. మిషన్ భగీరధ నీళ్లు వారి జీవిత కాలాన్ని పెంచాయని చెబుతుంటే అంతకన్నా సంబురం మరొకటి వుంటుందా? అని సంతోషం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డితో మునుగోడు నుంచి నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు…. మునుగోడులో ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రజల మనోగతాన్ని వివరించారు.
ఆ విషయాలు ఆయన మాటల్లోనే… ప్రచారం కోసం మర్రిగూడ ప్రాంతంలో ప్రజలు చూసినప్పుడు గత పాలకులు చేసినపాపం ఏమిటో? వారికి వత్తాసు పలికిన నాయకులు, కనీసం తమ ప్రాంత ప్రజలకు మంచినీళ్లు ఇవ్వమని అడగలేని దద్దమ్మలాంటి నాయకులు ఇంకా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. సిగ్గూ శరం విడిచి, మానాభిమానుల వదిలేసి, ఇంకా ప్రజలకు తామే దిక్కని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చేదాకా అక్కడి ప్రజలను పాలించిన నాయకులు ఎంత దుర్మార్గులో ప్రజలకు తెలుసు. అందుకే ఆ పార్టీల నాయకులంటే ప్రజలు అసహ్యించుంకుటున్నారు. అంతే కాదు బిజేపిపార్టీకి చెందిన నాయకులు సిగ్గు లేకుండా తాము ఫ్లోరైడ్ సమస్య తీర్చినట్లు చెప్పుకుంటున్నారు. ఓవైపు బాధితుడైన స్వామి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు,మంత్రి కేటిఆర్ తమకు ఎలాంటి సాయం చేశారన్నది చెబుతున్నాడు. తెలంగాణరాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసిఆర్ తమ మునుగోడుకు ఏం చేశారన్నది చెబుతున్నాడు. ప్లోరైడ్‌ను ఎలా పారద్రోలాడో స్వామి చెబుతున్నాడు. ఇంటింటికీ సురక్షితమైన మంచినీరు మిషన్ భగీరధ ద్వారా ఎలా వస్తున్నాయో చెబుతున్నాడు. వాటిని చూసుకుంటూ, స్వామి లాంటి వారు చెప్పే మాటలు వింటూ కూడా ఇంకా బిజేపి నాయకులు రాజకీయాలు చేస్తున్నారు. గతంలో ఫ్లోరైడ్ బాధితుడైన స్వామికి సైతం కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇవ్వలేదు. అతని వృత్తి చేసుకునేందుకు అవసరమైన చేయూతనివ్వలేదు. ఫ్లోరైడ్‌సమస్య మునుగోడులో తీర్చలేదు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్ మునుగోడు గోడును ఏనాడో తీర్చారు. స్వామి లాంటి వారికి డబుల్ బెడ్ రూం ఇచ్చారు. ఆయన కాళ్ల మీద ఆయన నిలబడేందుకు అవసరమైన సెలూన్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి సాయం అందించారు. దివ్యాంగుల పెన్షన్‌ను కూడా అందిస్తున్నారు. ఇదీ మునుగోడు ప్రాంత ఫ్లోడైడ్ బాధితులైన దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత. నిస్సహాయులైన ఫ్లోరైడ్ బాధితులను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో అన్నది ఫ్లోరైడ్ఉద్యమంలో భాగస్వామైన స్వామి చెబుతున్నారు. ఇవి కళ్లుండి చూడలేని, చెవులుండి వినలేని బిజేపి, కాంగ్రెస్ పార్టీలకు రుచించడం లేదు. అసలు ఈ ప్రాంతంలో రాజకీయం చేయడానికి కూడా ఆ రెండు పార్టీలకు ఎలాంటి అర్హత లేదు. ఓటు అడిగే నైతిక హక్కు వారికి అసలే లేదు. ఏ ఒక్కనాడు ఫ్లోరైడ్ భాధితుల గోడు వినుకుండా దశాబ్ధాల పాటు మునుగోడులో రాజకీయం చేసినందుకు వాళ్లు సిగ్గుపడాలి. ఇప్పుడు మునుగోడు ప్రగతిని చూసి తల దించుకోవాలి.నిన్నటి తరం మునుగోడు బాధలుపట్టని పాలకుల నిర్ధయకు బలై, ఎంతనరకం అనుభవించారో కదిలిస్తే ఒక్కొ ఇంటిలో ఒక్కొ ధీనగాధ వినిపిస్తోంది.
కళ్ల ముందే ఫ్లోరైడ్ శరీరంలో నిండిపోయి, తనువు చాలిస్తున్నవారిని చూస్తూ తమ జీవితానికి కూడా రోజులు లెక్కబెట్టుకున్న వారు, ముఖ్యమంత్రి కేసిఆర్ వల్ల ఫ్లోరైడ్ మహామ్మారి నుంచి తప్పించుకొని బతికి బట్టకట్టామని చెబుతున్నారు. కేసిఆర్ లాంటి పాలకులు వుంటే ప్రజలు ఏ సమస్య రాదని చెబుతున్నారు. అప్పటి రోజులకు ఇప్పటి రోజులు పూర్తి భిన్నం. ఉద్యమ నాయకుడైన కేసిఆర్ తెలంగాణ ఉద్యమ కాలంలో రాష్ట్రమంతా తిరిగారు. అందులో భాగంగా ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లోనూ ఆయన పర్యటించారు. పరిస్దితి తెలుసుకున్నారు. ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశారు. అప్పటిపాలకులతో కొట్లాడాడు. కాని ఫలితం లేకపోయింది. ఆ పాలకులకు కనికరం లేకపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు నాలుక లేకపోయింది. ఆ నాలుకలో నరం చచ్చుబడిపోయింది. కనీసం ఉద్యమ నాయకుడు కేసిఆర్‌తో కలిసి గళమెత్తే ధైర్యంలేకపోయింది. వారికి పదవులు కావాలి. కాంట్రాక్టులు కావాలి. ప్రజల గోడు విన్నది లేదు. మునుగోడు బాధ పట్టించుకున్నది లేదు. ఫ్లోరైడ్ మూలంగా ప్రజలు పిట్టాల్లా రాలిపోతున్నా, ఉమ్మడి పాలకులతో కొట్లాడాలన్న సోయి రాలేదు. ఉద్యమ కాలంలో మునుగోడు బాధలు చూసిన కేసిఆర్ తెలంగాణ రాగానే మిషన్ భగీరధ ఫలితాలు ముందు మునుగోడుకే అందించాడు. వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. కొన్ని విషయాలు వింటుంటే వారి జీవితానుభవాలు పగవారికి కూడా రాకూడదని అనిపిస్తుంది.
ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలంటే ఉద్యోగులు కూడా ముందుకు వచ్చేవారు కాదని తెలిసి ఆశ్చర్యపోయాను. మునుగోడులోని మర్రిగూడ మండలంలో పనిచేయాలంటే ఉద్యోగులు మరింత భయపడేవారట. వాళ్లు ఇక్కడి మంచినీళ్లు తాగలేక దాహం తీర్చుకునేందుకు యూరిన్‌ను పట్టుకొని, వడబోసి తాగేవారని తెలిసింది. అంత దుర్మార్గమైన పరిస్ధితులను ప్రజలు ఎలా ఎదుర్కొన్నారన్నది విని మనసు చలించిపోయింది. ఇలాంటి పరిస్ధితులు అనుభవించిన వారు చెబుతుంటే ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్ భగీరధ కార్యాక్రమం ఎందుకు ఎంచుకున్నారో అర్ధమౌతుంది. అలాంటి పరిస్ధితులు భవిష్యత్తులో ఏ ప్రాంతానికి రాకూడదన్న బృహత్ సంకల్పంతోనే మిషన్ భగీరధ పథకం తీసుకొచ్చారని ప్రతిపక్షాలకు ఇప్పటికైనా అర్ధం కావాలి. మిషన్ భగీరధ ఎంత విజయవంతమైన సంక్షేమ పథకమో అప్పుడర్ధమౌతుంది. మాట్లాడేవారు చాలా మాట్లాడతారు. ఒక్కసారి మునుగోడు ప్రజలు బాధలు చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మంచినీళ్ల విలువ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తెలియకున్నా, మునుగోడులో మంచినీళ్లే అమృతంతో సమానం. జీవితాలను నిలబెడుతోంది. అర్ధాంతర ఆయువులను అడ్డుకుంటోంది. గత చేదు జ్ఞాపకాలను చెరిపేస్తుంది. భవిష్యత్తును అందమైన లోకం చేస్తుంది. మునుగోడు ప్రజల జీవితాలను ఆనందమయం చేసింది నీళ్లే…ఆ నీళ్ల కోసమే దశాబ్దాలు వాళ్లు పోరాడిరది. మాకు ఏమీ ఇవ్వకున్నా ఫరావాలేదు. మంచినీళ్లివ్వండి మహాప్రభో అని డిల్లీదాకా వెళ్లే, ఉత్తచేతులు చూపించారు. మళ్లీ ఊసెత్తలేదు. నీళ్లకోసం నిధులు విడుదల చేస్తామని చెప్పి మాట మార్చారు. మర్చిపోయారు. ప్రజలు జీవితాలను ఆగం చేశరు. తెలంగాణ వస్తే గాని మునుగోడు లాంటి ప్రాంతాల బాధ తీరదని చెప్పారు. తెలంగాణ తెచ్చాక మునుగోడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాదు, తినే తిండిలో, తాగే నీళ్లలో ఫ్లోరైడ్‌లేకుండా చేశారు…ఫ్లోరైడ్ ను పెంచి పోషించిన పాపాత్ములకు రాజకీయాల్లో స్ధానం లేకుండా చేశారు…అందుకే ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముఖ్యమంత్రి కేసిఆర్‌నే కొలుస్తున్నారు. టిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామని చెబుతున్నారు.
`గతంలో డిల్లీలో వుండి సోనియా గాంధీ చేసిన ధర్నాలో పాల్గొనలేదు..!
`రాహుల్ గాంధీ జోడో యాత్రకు డుమ్మా కొట్టాడు…!
`నమ్మి మునుగోడు చేతిలో పెడితే నిండా ముంచిన అన్నాదమ్ములు!
హైదరాబాద్,నేటిధాత్రి:
నేను నిజాయితీ పరుడిని…నేను ప్రజల కోసం త్యాగం చేసే నాయకుడిని…ప్రజల ప్రతినిధిని…పేదోళ్లకు అండగా వుండే నాయకుణ్ణి…అని చెప్పుకునే గొప్పలన్నీ ఉత్తవే అని, నమ్మించి మోసం చేయడానికే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరూపించుకుంటున్నాడు. ఇంత కాలం ఆయన మాటలు నమ్మిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒక నాయకుడు తన స్వార్ధం కోసం కూడా ఇంత కాలం నమ్మించగలడా? ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన కోసం పనిచేస్తూ, తన ఎదుగుదలకు పార్టీని వాడుకుంటూ, ఇంకా ఆ పార్టీలోనే వుంటూ, ఇంత కాలం పదవులు అనుభవిస్తూ, పార్టీకే గోతులు తవ్వుతూ తమ బ్రాండ్ అసలు నిజస్వరూపం ఇప్పుడు చూపిస్తున్నాడు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో వుండడం వెంకటరెడ్డికి కూడా ఇష్టం లేదు. కాకపోతే ఇప్పటికిప్పుడు తన పదవికి రాజీనామా చేసే ధైర్యం లేదు. తమ్ముడి కోసం త్యాగం చేయాలని వున్నా, అదును కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక వేళ రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో గెలిస్తే, జంప్ అయ్యేందుకు సిద్దంగానే వున్నాడు..లేకుంటే కాంగ్రెస్‌లోనే కొనసాగాలన్న అంతర్మధనంలో వున్నాడు. తనంటత తాను వెళ్లిపోవాలని వున్నా, భవిష్యత్తులో ప్రజలు నమ్మరన్న భయం కూడా ఆయనను వెంటాడుతోంది. అందుకు పార్టీకి నష్టం చేకూర్చే మాటలు మాట్లాడుతూ, తనను బైటకు సాగనంపితే వెళ్ధామని చూస్తున్నాడు…స్వయంగా ఆయనే నన్ను భరించమని ఎవరంటున్నారు… నా ప్రవర్తన నచ్చపోతే పంపించండని పార్టీకి సవాలు విసిరే మాటలు కూడా మాట్లాడాడు. అంటే తనను కాంగ్రెస్ పార్టీ బైటకు పంపిస్తే దాన్ని కూడా సానుభూతికింద వినియోగించుకుందామని చూస్తున్నాడు. కాని ప్రజలు అంత అమాయకులా?
గతంలో ఎన్నడూ వెంకటరెడ్డి వంటి నాయకులను చూడలేదన్నది రాజకీయాలు తెలిసిన వారు అంటున్న మాట.
ఎందుకంటే సుదీర్ఘ రాజకీయ అనుబంధం వున్న పార్టీని ఇంత కాలం తన స్వలాభం కోసమే వెంకటరెడ్డి వినియోగించుకున్నాడన్నది నిజం. ఆయన అసలు స్వరూపం తెలిసిపోయింది. ఆయన నిజ స్వరూపం చూపించుకున్నాడు. అంతటి సీనియర్ నాయకుడు పూటకో మాట…గంటకో తిరకాసు రాజకీయం చేయడం అన్నది ఎక్కడా చూడలేదు… రెండు రోజుల్లో మూడు రకాలైన మాటలు మాట్లాడి, తనకు నాలుక మడతెట్టడం చాలా సులువు అని నిరూపించుకున్నాడు. జనం వెర్రి వెంగలప్పలని చెప్పకనే చెబుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నాటి నుంచి చూస్తుంటే కూడా వెంకటరెడ్డి మాట్లాడే మాటలు వెగటుపుట్టిస్తున్నాయి. చండూరు సభలో అద్దంకి దయాకర్ మాటలు తనను గాయపర్చాయని చెప్పి కొంత కాలం సాగదీశాడు…తాను ఎంతో మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొచ్చాడు. తనకు క్షమాపణచెప్పాలన్నాడు. అద్దంకిని పార్టీనుంచి పంపించేయాలన్నాడు. తర్వాత ఏదో సందర్భంలో రేవంత్ రెడ్డి ఐపిఎస్, హోంగార్డుల మాటలు పట్టుకొని దాన్ని పెద్ద రాద్దాంతం చేశాడు…అలా కొంత కాలం గడిపాడు…ఆఖరుకు అద్దంకి దయాకర్‌తోపాటు, రేవంత్‌రెడ్డి కూడా క్షమాపణలు చెప్పారు…అబ్బే…నా మనసు కరగలేదన్నాడు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెబితే మునుగోడు ప్రచారం గురించి ఆలోచిస్తానన్నాడు. తీరా రేవంత్ క్షమాపణ చెప్పాక తూచ్ అన్నాడు. నాకు మనస్తాపం ఇంకా తగ్గలేదన్నాడు. సీనియర్లందరి చేత పట్టుబట్టించి పాల్వాయి స్రవంతికి టిక్కెట్టు వచ్చేలా రాజకీయం చేశాడు… రేవంత్‌ను అలా దెబ్బకొట్టాడు…గాంధీ భవన్‌లో పాల్వాయి స్రవంతిని దీవించి, మళ్లీ తూచ్ అన్నాడు…తమ్ముడి కోసం సెల్‌ఫోన్ ప్రచారం మొదలు పెట్టాడు…అదేంటని మీడియా ప్రశ్నిస్తే ఆ ఆడియా ఇప్పటిది కాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు… పార్టీ మీ మీద గుర్రుగా వుందని మీడియా ప్రశ్నిస్తే ఎందుకు ఎవరు భరించమంటున్నారంటూ పార్టీని ప్రశ్నించాడు…ఆఖరుకు ఆస్ట్రేలియా వెళ్లి, నాకు రాజకీయాలంటేనే ఇష్టం లేదన్నాడు. ఇంకా ఎంత కాలం రాజకీయాలు చేస్తానన్నాడు. మునుగోడు ఫలితం వచ్చే దాకా వెంకటరెడ్డి ఇండియాకు రాకపోవచ్చు…వచ్చి అప్పుడేం చెబుతాన్నది ఆసక్తి కరంగా మారింది.
గత మూడు నాలుగు నెలల కాలం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కమాట మీద నిలబడే నాయకుడు కాదని తనకు తానే నిరూపించుకుంటూ వస్తున్నాడు.
పదే పదే అబద్దాలు చెబుతూ వస్తున్నాడు. అందర్నీ నమ్మిస్తూనే , పార్టీని నిండా ముంచుతున్నాడు. పార్టీకి తీరని ద్రోహం చేస్తున్నాడు. తన తమ్ముడికోసం పార్టీని శ్రేణులను అమోయయానికి గురిచేస్తున్నాడు. పార్టీ శ్రేణులకు ఆశ చూపించి ఓట్లేయించుకునేందుకు విదేశాలనుంచి స్కెచ్ వేస్తున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్న వెంకటరెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన కాంగ్రెస్ ఫార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అందుకు పది రోజుల గడువు పెట్టింది. ఈ లోపు పుణ్య కాలం వెళ్లిపోతుంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కూడా తేలిపోతుంది. అప్పుడు మళ్లీ వెంకటరెడ్డి ఏ రాగం అందుకుంటాడో అని అంటున్నారు. ఇంత దగా కోరు మాటలు గతంలో ఏ నాయకుడు మాట్లాడలేదని కాంగ్రెస్ పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఈ మధ్య తనకు తెలసిన కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి, ఈ ఒక్కసారి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయమని అడిగాడు. మంచికీ, చెడుకు పనికొచ్చేది మేమే అంటూ చెప్పాడు. అదేంటని మీడియా, పార్టీ ప్రశ్నిస్తే అది ఇప్పటిదికాదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కాని ఎవరూ నమ్మలేదు. అది ఈ మధ్య మాట్లాడిన మాటలే అని తేటతెల్లమయ్యాయి. అంతే కాదు ఫోన్‌లోనే తానే పిసిసి ప్రెసిడెంటునౌతానని చెప్పాడు. ఇలా రెండు నాలుకల మాటలు అనడం కన్నా, ఊసరవెళ్లి రంగులు అని చెప్పడం కరక్టుగా వుంటుందని రాజకీయ పార్టీలంటున్నాయి.
నిజానికి వెంకటరెడ్డి కాంగ్రెస్‌కు ఎప్పటినుంచో దూరంగా వుంటున్నాడు.
ఎందుకంటే పిపిసి అధ్యక్షుడిని నేనే అని కలలు గన్న వెంకటరెడ్డికి అధిష్టానం షాక్ ఇచ్చింది. రేవంత్‌ను పిసిసి చేసింది. దాంతో అప్పటినుంచి అక్కసు మొదలై, పార్టీకి దూరమయ్యేందుకే చూస్తున్నాడు. రేవంత్‌రెడ్డి రూ.50 కోట్లుపెట్టి పిసిపి కొనుక్కున్నాడని అన్నాడు. ఇక గాంధీభవన్ మెట్లు ఎక్కనన్నాడు. కాని ఏ మాట మీద ఆయన నిలబడలేదు. రేవంత్‌తో కలసి ముచ్చట్లు బాగానే వుంటాయి…తర్వాత పక్కకు జరగ్గానే విమర్శలు అంతే విధంగా వుంటాయి. ఆ మధ్య సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ విచారణ జరిగింది. ఆ సమయంలో సోనియాగాంధీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ర్యాలీ జరిపారు. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఏక కాలంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు జరిగాయి. అదే సమయంలో వెంకటరెడ్డి పార్లమెంటులో వున్నాడు. తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో మంతనాలు జరిపారు. ఇక తాజాగా రాష్ట్రంలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర జరుగుతోంది. కాని వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో వున్నాడు. ఇంతకన్నా నయ వంచన ఏదైనా వుంటుందా? పార్టీ ఎంపిగా వుంటూ, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా, కోవర్టు రాజకీయాలు చేయడాన్ని ఎవరూ స్వాగతించడం లేదు. పార్టీ నమ్మి మునుగోడు చేతిలో పెడితే తమ్ముడు నిండా ముంచి పోయాడు…నల్లగొండ రాజకీయాలు అన్న వెంకటరెడ్డి చేతిలో పెడితే పార్టీనే నామరూపాలు లేకుండా చేస్తున్నాడు…! నైతికతకు అర్ధాలు మార్చుతున్నాడు…నమ్మక ద్రోహానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాడని కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
` కేసిఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు…
`కేసిఆర్ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు.
`మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల.
` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది…
` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది…
` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది…
`ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు…
` ఉద్యమాన్ని, రాజకీయంతో రంగరించారు.
` తెలంగాణ ఆకాంక్షల వేధిక టిఆర్‌ఎస్సే…
`తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసిఆరే…
`ప్రగతిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోంది కారే…
`చేతికి బలం లేదు?కమలానికి తావులేదు?గులాబీకి ఎదురులేదు?
`తెలంగాణ వాదుల మదిలో మాట, ఉద్యమ కారుల నోటి మాట.
` తెలిసో తెలియకో ప్రతి పక్షాల మాయలో పడిన వాళ్లు మళ్ళీ సొంత గూటికే…
`ఆత్మాభిమానం నూటికి నూరుపాళ్లు టిఆర్‌ఎస్ తోటే…
` నెగ్గడం తెలిసిన కేసిఆర్ కు తగ్గడం కూడా తెలుసు…
`తెలంగాణ సాధనలో గొంగళి పురుగునైనా ముద్దాడానన్న గొప్ప సాధకుడు.
`తెలంగాణ భవితవ్యానికి దిశానిర్దేశకుడు…
`అలిగిన తమ్ముళ్లను అక్కున చేర్చుకునే అన్న అతడు…
`పెద్ద తరానికి పెద్ద కొడుకు…
` మొత్తంగా తెలంగాణ కు రక్షకుడు…
హైదరాబాద్,నేటిధాత్రి:
ముందే ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో సున్నితంగా చెప్పాడు. ఒక దశలో హెచ్చరించి మరీ చెప్పాడు. అయినా బిజేపి వినలేదు. పదే పదే నన్ను గోకాలని చూస్తున్నారు. నా ఓపికను పరీక్షిస్తున్నారు. మరి నేనే గోకడం మొదలు పెడితే, ఇక ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడిదాక గోకుతానో తెలియదు అని సిఎం అన్నాడు. అంతే కాదు. ఒక్కసారి నన్ను గోకి మీరు వదిలేసినా, ఇక నేను వదలేయను. ఏం రాజకీయం నడపాలో అది నడుపుతానన్నాడు. అన్నట్లునే బిజేపిని మునుగోడు ఉప ఎన్నికల వేల కోలుకోలేని దెబ్బ కొట్టాడు. నలుగురు పార్టీలో చేరారో లేదో..ఇక అంతా అయిపోయినట్లే…ఇక పార్టీ అధికారంలోకి వచ్చే…అన్నంత కలలు గన్న బిజేపికి ఒక్కసారిగా దిమ్మతిరిగి బొమ్మ కనిపించే సన్నివేశం రాష్ట్ర రాజకీయాల్లో కనిపించింది. గతంలో టిఆర్‌ఎస్‌లో కీలక భూమిక పోషించిన ఇద్దరు నేతలు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద పరిణామం…గతంలో టిఆర్‌ఎస్ టిక్కెట్టు ఇవ్వలేదని దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌లో చేరాడు. తర్వాత ఈ మధ్య కాలంలోనే బిజేపిలో చేరాడు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పొమ్మన లేకపొగబేట్టే రాజకీయాలను సహించలేని దాసోజ బిజేపిలో చేరాడు. కాని ఆయన మనస్తత్వానికి సరిపోని బిజేపిని వదిలి మళ్లీ టిఆర్‌ఎస్‌లో చేరాడు. ఇక మరో నేత, మాజీ మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఆ మధ్య బిజేపిలో చేరాడు. కాని తన స్వభావానికి, బిజేపికి ఎక్కడా సొసగలేదు. దాంతో తిరిగి మళ్లీ ఆయన టిఆర్‌ఎస్‌లో చేరాడు. ఉద్యోగ సంఘ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమ కారుడిగా, టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా పార్టీలో ఆయనకు ఎనలేని గౌరవం వుండేది. బిజేపిలో చేరిన నాడు తప్ప, మళ్లీ ఆయన గురించి అడిగిన వారు లేరు. పిలిచిన వారు లేరు. పేరుకే తప్ప బిసిలకు బిజేపిలో ప్రాధాన్యత లేదన్నది గుర్తించి, మాతృ సంస్ధ టిఆర్‌ఎస్‌కి చేరుకున్నాడు. దాంతో ముఖ్యమంత్రి కేసిఆర్ బిజేపికి రిటన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవల మునుగోడు నామినేషన్ రోజు కూడా టిఆర్‌ఎస్‌తో వున్న మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాత్రికి రాత్రి పార్టీ కండువా మార్చుకున్నాడు. డిల్లీలో మూడు రోజులు మకాం వేసి, బిజేపిలో చేరాడు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పాయింటు మెంటు ఇవ్వడం లేదన్న బూర నర్సయ్య గౌడ్ మూడు రోజుల పాటు బిజేపి పెద్దల ఆశీస్సుల కోసం ఎదరుచూసినప్పుడు ఆత్మగౌరవం ఎటు పోయిందని టిఆర్‌ఎస్ కూడా ప్రశ్నించింది.
ఒక్కసారి కేసిఆర్ మెట్టు దిగితే ఎలా వుంటుందన్నదానిపై నేటిధాత్రి ఆరు నెలల క్రితమే చెప్పింది.
కేసిఆర్ మదిలో వున్న ఆలోచనలు అక్షర బద్దం చేసింది. త్వరలో మళ్లీ ఉద్యమ కారులను తిరిగి సొంత గూటికి తెప్పించేందుకు కేసిఆర్ ఆలోచిస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. అదును కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ చూస్తున్నాడు. నిజానికి ఏ ఉద్యమ కారుడిని కేసిఆర్ వదులుకోలేదు. వదిలేయలేదు. కావాలనే వాళ్లకు వాళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేసుకుంటూ వెళ్లారే…గాని కేసిఆర్ ఎవరినీ వదిలుకోవాలని అనుకోలేదు. వారికి వాళ్లు, ఎవరో చెప్పిన మాటలు విని భ్రమపడి ఇప్పుడు కేసిఆర్‌పక్కన లేకుండా ఇతర పార్టీలలో వున్నారు. ఇప్పటికే వాళ్లు ముఖ్యమంత్రి కేసిఆర్ నుంచి ఒక్క పిలిస్తే చాలు అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కేసిఆర్‌తో కలిసి నడిచారు. వాళ్లను కూడా కేసిఆర్ ఎంతో గౌరవించారు. అందరినీ అక్కున చేర్చుకున్నాడు. వారి వారి స్ధాయిని బట్టి పదవులు కూడా ఇచ్చాడు. ఒక దశలో 2004లో మంత్రి పదవులు కూడా అవకాశం కల్పించి, వారి నాయకత్వాలకు భరోసా కల్పించాడు. అయినా వారిలో పదవుల ఆశతోనో, లేక ఎవరో చెప్పిన మాటల వల్లనో కాని వారు టిఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. కేసిఆర్ నాయకత్వం నుంచి దూరంగా జరిగారు. దూరమైన తర్వాత గాని వారికి తత్వంబోధ పడలేదు. ఇప్పటికీ వారిని కదిలిస్తే ఆ జ్ఞాపకాలే చెబుతుంటారు. అవి తప్ప చెప్పుకోవడానికి వారికి ప్రత్యేకంగా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. అంతగా వారి జీవితాలను కేసిఆర్ ప్రభావితం చేశారు. అయినా వారు కేసిఆర్‌ను వదిలి వెళ్లిపోయారు. కాని ఇప్పటికీ వాళ్లు ఎందుకు కేసిఆర్‌ను వదిలి వెళ్లిపోయామన్న అన్న ఆలోచనల్లోనే వున్నారు. కేసిఆర్ నుంచి పిలుపొస్తుందేమో అన్న ఆశతో కూడా ఇంకా వున్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజున మళ్లీ గులాబీ గూటికి చేరాలన్న ఆలోచనలతో , కేసిఆర్ కళ్లలో పడాలన్న తపనతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి, ఆయనకు దగ్గరవ్వాలని చూశారు. కాని మళ్లీ ఆ ప్రయత్నం వాళ్లు చేయలేదు. కేసిఆర్ కూడా వారి గురించి పట్టించుకోలేదు. కాకపోతే మళ్లీ వారంతట వాళ్లు వస్తామంటే వద్దంటామా? అన్న ఆలోచనలోనే కేసిఆర్ వున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నేత కేసిఆర్. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన కోపం కూడా అంతే..ఒక్కసారి వద్దనుకున్నాక ఆయన మళ్లీ ముఖం చూసే పరిస్దితి వుండదు. కాని ఆయన ఎవరినీ వద్దనుకోలేదు. వాళ్లే వెళ్లిపోయిన సందర్భాలు. అందుకే ఎవరైతే మళ్లీ సొంత గూటికి రావాలని చూస్తున్నారో! వాళ్లు వస్తే ఆదరించేందుకు సైతం కేసిఆర్ సిద్దంగా వున్నాడు. వారికి తగిన ప్రాదాన్యత కల్పిస్తాడనడంలో సందేహం లేదు.
నిజం చెప్పాలంటే ఒక రకంగా కేసిఆర్ అదృష్ట జాతకుడు.
ఆయన ప్రతి అడుగు ఒక సంచలనమే…ప్రతి మాట ఒక వినూత్నమే…ఆయన ప్రతి నిర్ణయం కొత్తదనమే…ప్రతి ఆచరణ ఆదర్శమే…అందుకే ఆయన రాజకీయాల్లో చేరిన నుంచి వేసిన ప్రతి అడుగు ఒక చారిత్రక సత్యమే కాదు. అవసరంగా కూడా మారింది. కాంగ్రెస్‌నుంచి టిడిపిలో చేరి, ఆయన గురువు మీదనే గెలిచి శభాష్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో తనదైన పాత్రతో ప్రత్యేకతను చాటుకున్నాడు. ఏ చంద్రబాబు అయితే నమ్మించి మోసం చేశాడో..కేసిఆర్ సేవలు తీసుకొని వదిలేశాడో…ఆయనను గద్దెదించిన నాయకుడైన చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చంద్రబాబును తెలంగాణ రాజకీయాలకు పూర్తిగా దూరం చేశాడు. ఇదీ కేసిఆర్ చాణక్యం. చంద్రబాబు లాంటి నాయకుడినే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి, తెలుగుదేశం పార్టీనే తెలంగాణలో లేకుండా చేసిన నాయకుడు కేసిఆర్. అసలు ఏ తరం ఆలోచించలేదు. ఉద్యమ తరం కూడా తెలుగుదేశం పార్టీకి ఆ పరిస్దితి వస్తుందని ఊహించలేదు. ఎవరూ ఊహించని వాటిని నిజం చేయడమే కేసిఆర్ రాజకీయం.
తనకు ఎదరు లేని, తిరుగులేని నాయకత్వాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయం చేయడం అంటే అందుకు ఎంతో సాహసం కావాలి.
ఎంతో నేర్పు కావాలి. రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్నవారై వుండాలి. అంతే కాని ఎప్పుడొచ్చాం కాదని సినిమా డైలాగు ప్రతిపక్షాలు చెబితే చాలదు. కేసిఆర్‌ను ఎదుర్కొనే శక్తి సమీప కాలంలో ఎవరికీ లేదు. ఏపార్టీకి ఆ అవకాశం రాదు. ఎందుకంటే రాజకీయ చాణక్యమే కాదు, అభినవ అభిమన్యుడు కూడ ఆయనే… పద్మవ్యూహంలాంటి రాజకీయాలను చేధించి, శాసించగలిగే నాయకుడు కేసిఆర్. వ్యూహాలు సృష్టించడం తెలుసు. పద్మవ్యూహాలు చేదించడం తెలుసు. ఆ పద్మవ్యూహంలో ప్రతిపక్షాలను చిక్కించి ఉక్కిరిబిక్కిరి చేయడం కూడా కేసిఆర్‌కే తెలుసు. మునుగోడు ఉప ఎన్నిక అనగానే చంకలు గుద్దుకున్న బిజేపి ఆశలు ఆవిరైపోతున్నాయి. అందుకే జాతీయరాజకీయాలను కూడా తన కనుసైగలతో శాసించగలిగే స్ధాయిలో వున్నాడు. దేశ రాజకీయాలను ఏలేందుకు అన్ని అర్హతలున్న ఏకైక నాయకుడు. అందుకే ఆయనంటేనే ఉద్యమకారులకు ఒక నమ్మకం. తెలంగాణ నేతలకు ఒక వరం. తెలంగాణ రాజకీయాలే కాదు, ప్రగతి కూడా కేసిఆర్‌తోనే సాధ్యం. ఎందుకంటే జాతీయ స్దాయిలో పాలన సాగిస్తున్న బిజేపి ఏ ఒక్క ప్రాజెక్టు తెలంగాణకు ఇచ్చింది లేదు. తెలంగాణ అభివృద్ధి కాంక్షించింది లేదు. నలుగురు ఎంపిలున్నా ఇచ్చిన నిధులు లేవు. వారు చేసిన అభివృద్ధి లేదు. అలాంటిది రాష్ట్రంలో వారు బలం పెరిగితే తెలంగాణకు వచ్చేది లేదు…మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లినట్లే…అందుకే ఆ పరిస్దితి కేసిఆర్ ఎప్పుడూ రానివ్వడు. తెలంగాణలో మరే పార్టీకి చోటు లేదు. రాష్ట్రం సాధించుకున్న టిఆర్‌ఎస్‌దే ఎప్పటికీ అధికారం…! కేసిఆర్‌దే నాయకత్వం. అదే జనం మాట…ప్రజల నోట…!
కెనడా టొరంటో నగరం లో 120 మంది వాలంటీర్లతో ,170 స్టేజ్ పర్ఫామెన్స్ తో 1500 మంది అతిథులతో బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను ఘనంగా జరిపారు.
అతిథులందరికీ అచ్చ తెలుగు విందు భోజనాలు 14 రకాల ఐటమ్స్ తో వడ్డించారు. సుమారు ఏడు గంటల పాటు శాస్త్రీయ
నృత్యాలు, తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, ఒడియా భాష లో పాటలు డాన్సులు ఆహుతులకు కనువిందు చేశాయి. తర్వాత పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చారు.
*** టొరంటో సిటీ కౌన్సెలర్ గేరి క్రాఫోర్డ్ మరియు సతీమణి చీఫ్ గెస్ట్ గా పాల్గొని హాజరైన మెంబెర్స్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఇండియా కెనడా బంధం మరింత ముడి వేయించుకోవాలని ఆకాంక్షించారు.
*** ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించిన బిర్చ్ మౌంట్ ఫ్రెండ్స్ గ్రూప్ కార్యనిర్వాహక సభ్యులు జగపతి రాయల,సూర్య కొండేటి, ప్రతాప్ బొల్లవరం, విష్ణు వంగల, రమేష్ తుంపర, శ్రీకాంత్
బండ్లమూడి, రాజశేఖర్ రెడ్డి, మూర్తి వారణాసి, నరసింహారెడ్డి, సర్దార్ ఖాన్, రామ సుబ్బారెడ్డి.
ఈకార్యక్రమానికి విజయవంతానికి మిషన్ అఫ్ మదర్ (Mission Of Mothers ( MOM) చాలా సహకరించారు.
*** ఆర్గనైజర్ జగపతి రాయల మాట్లాడుతూ కెనడా చరిత్రలో ఇది అతిపెద్ద దీపావళి ఈవెంట్ ,ఇలాంటి మరిన్ని మనదైన పండుగలను జరుపుతూ కెనడాలోని తెలుగువారికి
సంస్కృతి సంప్రదాయాలను కాపాడతామని చెప్పారు. ** దీనా రెడ్డి ముత్తుకూరు మరియు రామ్ జిన్నల, శ్రీకాంత్ లింగమనేని, ఫణీన్ద్ర కుమార్ కొడాలి, భరత్ కుమార్ రెడ్డి, మినర్వా రెస్టారెంట్, హార్టుఫుల్ రిలాక్సేషన్ సౌజన్యం తో ఈ వేడుకలు ఘనంగా ముగిసినది
*** అలాగే ఇంకో ఆర్గనైజర్ సూర్య కొండేటి మాట్లాడుతూ 120 మంది వాలంటీర్లు రాత్రి ప్రగలు శ్రమించి దీపావళి ఈవెంట్ ఇంత గొప్ప సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఖానాపురం మండలంలోని రెవెన్యూ గ్రామం ఖానాపురం-2 పరిధిలోని మనుబోతుల గడ్డ,బండమీదిమామిడి తండా గ్రామపంచాయతీల పరిధిలోని పోడు వ్యవసాయ భూముల సర్వేను ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ప్రారంభించారు.ఎంపీపీతో కలిసి బండమీదిమామిడి తండా సర్పంచ్ బోడ లక్ష్మీ-బాలరాజు, ఎంపీటీసీ సభ్యులు బోడ భారతి-పూలునాయక్,స్థానిక రైతులతో కలిసి సర్వే అధికారులతో వాగులు,వంకలు దాటుతూ సర్వేను ఎంపీపీ ప్రకాష్ రావు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ పోడు రైతులకు శాశ్వత పరిష్కారం కోసం ల్యాటు ట్యూడ్ ద్వారా సమగ్రమైన సమాచారాన్ని రైతుల ముందుకు తీసుకవచ్చి ఎఫ్ఆర్సి పట్టాలు(హక్కు పత్రాలు) ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేతుల మీదగా అందిస్తామని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా, నేటిధాత్రి : ఎనుమాముల మార్కెట్ లో శనివారం రోజున బీహార్ ,చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేస్తున్న ఇండియన్ డిసైపోల్ మిషన్ ఆధ్వర్యంలో. గత.నెల రోజుల నుండి. పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన. వరంగల్ జిల్లా ఎస్సీ/ ఎస్టీ. అట్రాసిటీ. విజిలెన్స్. అండ్. మంటరింగ్ కమిటీ మెంబర్. మరియు. వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు దళిత రత్న,నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ అక్కడి వాతావరణం పిల్లల పరిస్థితి చూసి బాధ చెందడంజరిగింది. పిల్లలకు సరిగా బట్టలు లేకపోవడం అనారోగ్యంతో ఉండడం. శుభ్రత లేకపోవడం చూశాను చదువు ఏమాత్రం లేకపోవడం చూసి. బాధపడ్డాను. వీరికి తక్షణమే .స్కూలుకు అవసరమైన గది సౌకర్యం కావాలివీడి పరిస్థితిని చూసి. బాధపడి నేను జిల్లా కలెక్టర్ గోపికి ఈ విషయం తెలపరుస్తానని శుభ్రత కోసం శనివారం రోజున సబ్బులను ఇచ్చినాను ఇట్టి పాఠశాలను నిర్వహిస్తున్న. కలకోట్ల,స్వామి దాస్ ,ఝాన్సీ దంపతులు,పోలేపాక సుమన్ పుష్ప. దంపతుల ,సేవలు మరువలేనివి. ఈ పాఠశాలలో,సుమారు 65 మంది ,పిల్లలకు ,విద్యాబోధనలు. అందిస్తున్నారు.
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కు 22వ తేదీ నుండి 27వ తేదీ వరకు సెలవు ప్రకటించగా శనివారం ట్రేడర్లు మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల తూకాలు చేసి లావాదేవీలను జరపడం శోచనీయం.మార్కెట్ పని దినాలలో కాకుండా మార్కెట్ సెలవు దినాల్లో లావాదేవులు జరపడంతో మార్కెట్కు రావలసిన ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.అలాగే మార్కెట్ నియమాలకు విరుద్ధంగా ట్రేడర్లు వ్యవసాయ ఉత్పత్తులను ఖరీదు చేయడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు.మార్కెట్ పాలకమండలి ఎన్ని నియమ నిబంధనలు పెట్టిన కూడా ట్రేడర్లు నడుచుకోకవడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇటీవల సేమ్ డే సేమ్ చెక్ సమస్య మరిచిపోక ముందే ఇలాంటి ఘటనలు జరగడం మార్కెట్ పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశాలు ఉంటుందని పలువురు బహిరంగనే విమర్శిస్తున్నారు.
మహబూబాబాద్,నేటిధాత్రి:రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పత్తి కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు.శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మట్లాడుతూ,దిగుబడి అంచనాల మేరకు కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వానాకాలం-2022 -23 సీజన్ లో 91,385 ఎకరాల్లో పత్తి పంట వేసినట్లు, ఇందులో 7లక్షల 31 వేల 080 క్వింటాళ్ల పంట ఉత్పత్తి అంచనా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.8శాతం తేమ కలిగిన రకానికి క్వింటాలుకు 6380/- రూపాయలు కనీస మద్దత్తు ధర లభించనుందని, రైతులు నాణ్యత ప్రమాణాలు కలిగిన పత్తిని కొనుగోలు కేంద్రాలకు తెచ్చే విధంగా చూడాలని,అవసరమైన తేమ శాతం నిర్ధారణ,తూకం యంత్రాలు సిద్ధంగా ఉంచాలన్నారు.ప్రతి కేంద్రం వద్ద రవాణాకు వాహనాలు అందుబాటులో ఉంచాలన్నారు.నాణ్యత ప్రమాణాలను,తేమశాతాన్ని పాటించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.తూనికలు, కొలతలు శాఖ ద్వారా జిన్నింగ్ మిల్లుల తూకపు మిషన్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు.
పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో 5 జిన్నింగ్ మిల్లులు, రోజుకు 1250 బేళ్ళ సామర్థ్యం కలవి ఉన్నాయనీ,కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సందర్భంగా పత్తికి కనీస మద్దతు ధర, వానాకాలం 2022-23 నాణ్యత ప్రమాణాలపై రూపొందించిన పోస్టర్ ను జిల్లాకలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి వెంకట్ రెడ్డి,సి.సి. ఐ. అధికారి ఎం.ఉమామహేశ్వర రావు,ఇంఛార్జి జిల్లా వ్యవసాయ అధికారి ఎం. లక్ష్మినారాయణ,ఆర్.టి.ఓ. రమేష్ రాథోడ్,అగ్నిమాపక శాఖ అధికారి డి.నాగేశ్వరరావు, లీగల్ మెట్రోలజీ అధికారి ఎస్.విజయ్ కుమార్, డి.ఎస్.పి. డి.రమణ , తొర్రూరు, మహబూబాబాద్ ఎ.ఎం.సి.చైర్మన్లు పి.శాంత, బి.ఉమ ,కార్యదర్శులు ఎన్.రాజ, జి.రాజేందర్,జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఎ.వేణుగోపాల్ రెడ్డి, ఎస్.జనార్ధన్,రవికిరణ్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట-నేటిధాత్రి:పోలీసు అమరవీరుల వారోత్స వాలను పురస్కరించు కుని చెన్నారావుపేట మండల కేంద్రంలోని కస్తూరిభా బాలికల పాఠశాల,జిల్లా పరిషత్తు పాఠశాల విద్యార్థులకు ఎస్ ఐ తోట మహేందర్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థుల కు పోలీసు స్టేషన్ లో ఉన్నటు వంటి వివిధ రకాల టెక్నాలజీ ల గురించి వివరించారు సమాజంలో జరుగుతున్న విషయాలు పోలీసుల పాత్ర అనే అంశాలను ఆయుధాలు పట్ల ఎస్ ఐ విద్యార్థులకు వివరించారు ఈ27 వరకు పోలీసు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతాయి అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
జేరిపోతుల జనార్దన్,ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,తెలంగాణ
సిద్దిపేట జిల్లా: నేటి ధాత్రి రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఇతర వృతివిద్యా కోర్సుల ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజులు పెంచుతున్నట్టు ఇచ్చిన జీవోను వెనక్కు తీసుకోవాలని అదే విధంగా ఈ మధ్య జరిగిన గ్రూప్-1 పరీక్షలలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్)రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జేరిపోతుల జనార్దన్ అన్నారు.. శుక్రవారం నాడు సిద్దిపేట లోని స్థానిక ఎడ్ల గురువారెడ్డి భవన్ లో ఆయన మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఫీజులను గత ఫీజుల కంటే భారీగా పెంచి విద్యార్థులపై మోయలేని భారం మోపిందని విమర్శించారు.. కరోనా తరువాత ఇప్పుడు ఫీజులు పెంచడంతో తమ పిల్లలను ఉన్నత విద్యను అందించలేమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు..ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెంచిన ఫీజుల జీవోలను వెనక్కి తీసుకోవాలన్నారు..ఫీజుల పెంపు ప్రయివేటు కాలేజీలకు కొమ్ముకాసే విధంగా ఉందని మండి పడ్డారు.. రాష్ట్రంలోని 159 ఇంజనీరింగ్ కాలేజీల్లో టిఏఎఫ్ఆర్ సి సిఫారసులతో ప్రభుత్వం ఫీజులు పెంచడం సరికాదన్నారు.. కనీస ఫీజులను సైతం 35 వేల నుండి 45 వేల రూపాయలకు పెంచారని,పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 40 కాలేజీల్లో లక్ష దాటిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ఫీజులను పెంచడం ఠీ పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరం అవుతారని, వెంటనే జీవోలను వెనక్కు తీసుకోవాలన్నారు.. అదే విధంగా ఈ నెల 16 వ తేదీన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో అవకతవకలు జరిగాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనల ప్రకారం ఉదయం10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించగా హైదరాబాద్ లలాపేట్ శాంతినగర్ లోని సెయింట్ ప్రాన్సిస్ డి సెల్ఫ్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో మాత్రం మధ్యాహ్నం1 గంట నుంచి 3.30 నిర్వహించారని,ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం ఏంటని వారు ప్రశ్నించారు.. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిన ఆయా సెంటర్ లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు..టిఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఇలాంటి అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు.. వేలాదిమంది అభ్యర్థుల భవిష్యత్తు పై ఆధారపడిన గ్రూప్-1 పరీక్ష నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై ఉన్నతస్థాయి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంగెం మధు,జిల్లా అధ్యక్షులు చిట్యాల శేఖర్ లు ఉన్నారు..
మహబూబాబాద్ మండలం లో ఎంపీపీ ఎస్ నందమూరి నగర్ ఉర్దూ మీడియం పాఠశాల ను ఆకస్మికంగా జిల్లా విద్యాధికా అరేయ్ డాక్టర్ అబ్దుల్ హై సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యలు పరిశీలన చేశారు.మూడవ వ తరగతి విద్యార్థిని ఎండి.ముష్క్కాన్ ను ఉర్దూ మరియు ఇంగ్లీష్ పై పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టం జరిగింది.హెచ్ ఎం ను పాఠశాలలో విద్యా అభివృద్ధి తగిన సలహాలు సూచనలు చెయ్యటం జరిగింది.అలాగే ప్రతి పాఠశాల లో ఎఫ్ ఎల్ ఎన్ (ఫాండేషన్ లిటెర్రస్సి న్యూమరాస్ ప్రోగ్రాం) సమర్థవంతగా నిర్వవించవలెనని,దీనికి సంబందించిన లెషన్ ప్లాన్ ప్రకారం టిఎల్ ఎం తయారు చేసి మైక్రో లెవెల్ బోధన గావించాలని ప్రతి ఉపాధ్యాయులు తెలంగాణ స్టూడెంట్ ట్రాకర్ ఆప్ డౌన్ లోడ్ చేసుకొని ప్రతినెలా ప్రగతి నమోదు చెయ్యాలన్నారు.ఎట్టి పరిస్థితి లో నిర్లక్ష్యం చేయకూడదని చేసిన వారిపై రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు.డీఈవో వెంట ఎ సిజిఈ మందుల శ్రీరాములు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.