*నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ*

పాలకుర్తి (జనగామ):నేటి ధాత్రి, కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలంలోని బొమ్మెర గ్రామంలోని నిరుపేదలకు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా వర్కర్లకు గ్రామస్థుడు పేరపు కుమార్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎస్సై గండ్రాతి సతీష్ పాల్గొని మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం అందించిన పేరపు కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణం, రాపాక సత్యనారాయణ, బత్తిని సురేష్, కుంట శ్రీనివాస్,…

Read More

గంజాయ్, గుట్కా, గుడుంబా నియంత్రణపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం.

భూపాలపల్లి నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మకాలు జరగకుండా సంయుక్తంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాలో గుడుంబా, గుట్కా, గంజాయి అమ్మకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ సమయంలో జిల్లాలో గుడుంబా, గుట్కాల అమ్మకం…

Read More

*రైతుల పట్ల చిన్నచూపు తగదు – టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి *

జమ్మికుంట *నేటి ధాత్రి* (ఇళ్లందకుంట) : ఆరుగాలం కష్టపడి పండించిన రైతాంగం పంటలను విక్రయించే సమయంలో తెరాస ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నదాత పట్ల చిన్నచూపు తగదని టీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ఇల్లందకుంట మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించిండ్రు. రైతుల తోటి మాట్లాడి పలు సమస్యల గురించి తెలుసుకున్నాడు వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైన ఆయన మాట్లాడుతూ ఇప్పుడు…

Read More

ప్రాణం తీసిన అతివేగం

వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాల గ్రామ శివారులో ద్విచక్రవాహనదారుడు అతివేగంగా వెళ్లి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు జఫర్ గడ్ మండలం కు చెందిన మాదరాసీ నర్సింగరావు(52)గా గుర్తించినట్లు తెలిపారు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి భార్య సునీత పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

Read More

మండలంలో జోరుగా బెల్టు షాపుల నిర్వహణ

నల్లబెల్లి-నేటిధాత్రి: మండల కేంద్రంలోని వైన్ షాప్ నుండి గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్న షాపు యజమాని లాక్ డౌన్ సడలింపు నేపథ్యంలో రెండు రోజుల క్రితం వైన్ షాపుల నిర్వహణ జరిగింది. ఈ సందర్భంగా వైన్ షాపు యజమానులు మద్యం ప్రియులకు కాదని అధిక రేట్లకు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు.దీంతో గ్రామాలలో జోరుగా బెల్టు షాపుల నిర్వహణ జరుగుతున్నది. గ్రామాలల్లో బెల్టు దుకాణాల నిషేధం ఉన్నప్పటికీ ఇదేమి పట్టించుకోని ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది చూసీచూడనట్టుగా…

Read More

రేషన్ షాప్ ల తనిఖీలు – తహసిల్దార్ నాగరాజు.

నూగూరు వెంకటాపురం నేటి ధాత్రి :- వెంకటాపురం మండల తాసిల్దార్ అంటి నాగరాజు ఆకస్మికంగా మండలంలోని అన్ని రేషన్ షాపులను తనిఖీ నిర్వహించారు రేషన్ షాప్ ల లో రేషన్ డీలర్లు ఉచితంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి ప్రతి మనిషికి 12 కిలోల బియ్యం సరిగా ఇవ్వాలని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టవద్దని తూకం విషయంలో కార్డుదారులకు అన్యాయం జరగకూడదని రేషన్ షాప్ కు వచ్చిన ప్రతి ఒక్కరు మాస్కు ధరించి కనీస దూరం…

Read More

*హోటల్ తెరిస్తే 5వేల జరిమానా*

శాయంపేట, నేటి ధాత్రి: లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉండగా ఎవరైనా హోటల్ లు తెరిస్తే 5వేల జరిమానా విధిస్తామని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. శాయంపేట మండలంలో శుక్రవారం కొన్ని హోటల్లు తెరిచారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మండలంలోని హోటల్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కోవిండ్ -19 కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం సూచించే మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన దుకాణాలు…

Read More

దెబ్బకు దిగివచ్చిన మద్యం ధరలు

  కనీస విచారణ చేపట్టనీ అధికారులు. వెల్గటూర్ (నేటిధాత్రి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రముతో పాటు మండలంలోని అన్ని వైన్స్ షాపులలో మద్యం ధరలు దిగివచ్చాయ్. బుధవారం నుండి తెరుచుకున్న వైన్స్ షాపులు ప్రభుత్వ రేట్లను అధిగమించి వైన్స్ లోనే ఏకంగా బ్లాక్ దందాను మొదలు పెట్టి ప్రభుత్వం నియమించిన రేటు కంటే ఒక్కో మద్యం క్వార్టర్ సీసాపై 20 నుండి 30 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తూ మద్యం ప్రియులను నిలువు దోపిడీ…

Read More

*మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!*

*మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్‌ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.* *వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు.* *కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్‌ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది.* *తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. ఆ తరువాత మెడలో వేసుకున్నాడు* *దానికి సంబంధించిన వీడియో సోషల్…

Read More

పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి

*జనగామ జిల్లా..పాలకుర్తి సర్పంచ్ ని వెంటనే సస్పెండ్ చేయాలి* *మరుగుదొడ్ల బాగోతంలో* *కార్యదర్శిని సస్పెండ్ చేశారు* *సర్పంచ్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు* *-సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తాం* *-సిపిఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శి రమేష్ రాజా* ——————————- పాలకుర్తి:నేటిధాత్రి, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి,అక్రమాలలో కలెక్టర్ కు పిర్యాదు లు అందిన నేపథ్యంలో విచారణ జరిపిన ఉన్నత అధికారులు 4 లక్షల రూపాయల మేరకు అవినీతి జరిగిందని తేల్చి కేవలం కార్యదర్శి మనోహర్…

Read More

అన్నిధానాల్లో అన్నదానం గొప్పది

వరంగల్ సిటి నేటిధాత్రి అన్నిదానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.నన్నపునేని నరేందర్ అభిమాన సంఘం వ్యవస్థాపకులు బత్తుల కుమార్ ఆద్వర్యం 23వ డివిజన్ ఎస్.ఆర్.ఆర్ తోట లో లాక్ డౌన్ నేపద్యంలో 500 మంది పేదలకు మాంసాహారంతో కూడిన బోజనం పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడారు లాక్ డౌన్ సమయంలో పేదలకు సేవ చేయడం అభినందనీయమని అన్నారు. పేదవారు…

Read More

నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందే…. డి సి పి

మల్కాజిగిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా), 8 మే (నేటిధాత్రి): మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రెడ్ జోన్ లో ఉన్నందున కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డి సి పి రక్షిత మూర్తి,ఈ సందర్భంగా వ్యాపారులకు నిర్మాణ రంగ సంస్థ యజమానులకు లాక్ డౌన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వివరించారు, ఇంట్లో నుండి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని మాస్క్ లేకుండా…

Read More

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. శుక్రవారం పోలీస్‌, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో చేపట్టి నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన అక్రమ వ్యాపారి అరెస్టు వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేశవపట్టణం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కరివెద సదాశివరెడ్డి అనే అక్రమ వ్యాపారి ప్రభుత్వ లైసెన్సు, ఎలాంటి…

Read More

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబం రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ భారీగానే వెనకేసుకున్నారు. వ్యాపారాలు చేసి అలసిపోయారో ఏమో తెలియదు. కానీ ఇంకా సంపాదించాలంటే రియల్‌ఎస్టేట్‌ రంగం సరైన వేదిక అనుకున్నారు ఆ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పులేదు, రియల్‌ఎస్టేట్‌ కూడా తప్ప కాదు. కానీ వచ్చిన చిక్కల్లా కబ్జాలు చేయడమే. ఆ కబ్జా భూముల్లో అక్రమ వెంచర్లు వేసి అప్పనంగా దండుకుందామనుకోవడమే సరిగ్గా ఇదే జరుగుతుంది….

Read More

నకిలీ విత్తనాలు స్వాధీనం

50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం నర్సంపేట డివిజన్‌లో మళ్లీ నకిలీ విత్తనాలను కొందరు అక్రమ వ్యాపారులు రైతులకు అంటకడదామని పనిలో పడ్డారు. అక్రమ వ్యాపారాన్ని పసిగట్టిన పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే రైతుల శ్రేయస్సు కోసం వారి నిజాయితీని నిరూపించుకున్నారు. పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌ను చాకచక్యంగా ఛేదించారు. మూడుగంటల వ్యవధిలోనే ఇతర జిల్లాకు వెళ్లి అక్రమ దందా గట్టురట్టు చేశారు. నర్సంపేట అర్బన్‌ సిఐ కొత్త దేవేందర్‌రెడ్డి, నర్సంపేట…

Read More

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1 ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్‌ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో…

Read More

అంతా డస్ట్‌తోనే పని…

ఇసుక లేకుండా అంతా డస్ట్‌తోనే పని… నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను ప్రారంభించారు. అభివద్ధిలో భాగంగా ముందుగా ప్రధాన రహదారుల మధ్య 5కిలోమీటర్ల మేరకు రోడ్డు డివైడర్‌ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుండి మల్లంపల్లి రోడ్డు, అమరవీరుల స్థూపం వద్ద నుండి వరంగల్‌ వైపు రోడ్డుకు పనులు చేశారు. అలాగే పాకాల సెంటర్‌ నుండి మహబూబాబాద్‌ రోడ్డు వైపునకు కూడా పనులు ప్రారంభం…

Read More

‘లేఖ’లో…ఏముంది…?

‘లేఖ’లో…ఏముంది…? వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతికి డిఐఈవో లింగయ్య పూర్తి బాధ్యత వహించాలని, విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని వెంటన సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి ‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే..భుజాలు తడుముకున్న’ చందంగా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య తాము ఏ తప్పు చేయలేదు..తామంతా సత్యహరిశ్చంద్రులమంటూ, తమపై…

Read More

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి – సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ వరంగల్‌ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సూచించారు. వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన నగరంలో ట్రాఫిక్‌ అభివద్దికోసం తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్‌ ఆర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌…

Read More