
బిజెపిపార్టీ గెలుపు కోసం ఇంటింటా విస్తృత ప్రచారం
శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని 306 బూతులో భూత్ అధ్యక్షుడు బాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మండల కో ఆర్డినేటర్ నరహ రిశెట్టి రామకృష్ణ హాజరై ఇంటింటి ప్రచార నిర్వహిం చారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి దాదాపుగా 5 నెలలు గడుస్తున్నా చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదు మహాలక్ష్మి స్కీమ్ , రైతుబంధు,భూమిలేని రైతులకు రైతుబంధు, రెండువేల పెన్షన్లు…