ఎండ తీవ్రతకు సరస్వతీ పుష్కరాల్లో ఎక్కడి వారు ఆక్కడే.
కిక్కిరిసిన సెలవ పందిర్లు.
మహాదేవపూర్ -నేటి ధాత్రి:
సరస్వతి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు దర్శనాలకు వచ్చిన భక్తులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు ఐదుగురు అస్తవ్యస్తకు గురికావడం జరిగింది. వీరిలో ఒకరు పారిశుద్ధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తున్న క్రమంలో సొమ్మసిల్లి పడిపోవడం జరిగిందని సమాచారం. మిగతా నలుగురు భక్తులు కరీంనగర్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాకు చెందిన వారిని తెలిసింది. అస్తవ్యస్తకు గురైన వారందరికీ ప్రధమ చికిత్స కేంద్రానికి తరలించి చికిత్సను అందించడం జరుగుతుందని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పుష్కర స్నానాలకు వచ్చిన భక్తులందరూ చలవ పందిళ్లకు పరిమితం కావడంతో చలవ పందిళ్లు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్రం నాలుగు తర్వాత భక్తులు గోదావరి స్థానానికి వెళ్లే పరిస్థితి కనబడుతుంది.
జయశంకర్ జిల్లా చిట్యాల మండలం గోపాలపురం గ్రామానికి చెందిన తిప్పని లక్ష్మి మరియు తీర్తాల సుస్మిత కి హస్పెటల్ ఖర్చుల కొరకు నాయకుడు పేదలకు ఆధర్షవంతుడు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహయనిధి(సీఎం ఆర్ఎఫ్ )Rs. 52000/ల చెక్కులను చిట్యాల మండల కాంగ్రేస్ పార్టీ వర్క్ంగ్ ప్రెసిడెంట్ మూల శంకర్ గౌడ్,అదజేయడం జరిగింది . ఈ కార్యక్రమం లోపిఎసియస్ వైస్ చైర్మెన్ ఏరుకొండ గణపతి గ్రామ శాఖ అధ్యక్షులు నీలం కుమార స్వామి నా యకులు తాటి కంటి మల్లయ్య, చెవుల రమేశ్, సంపెల్లి రాజు తదితరులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.
మండలంలోని రాయపర్తి రైతు వంతడుపుల సుజాత వారి ఆయిల్ ఫామ్ తోటలో ఉద్యానశాఖ వారి ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ తోటల సాగు పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఆయిల్ ఫామ్ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ 100% భరోసా కల్పిస్తుంది, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ మాట్లాడుతూ ఇంకా విస్తీర్ణం పెంచేందుకు రైతులు ముందుకు రావాలని కోరారు. సాగు చేసే రైతులకు ఆయిల్ ఫామ్ టన్నుకు ధర 21000 ఉంది. త్వరలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము.అదేవిధంగా నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన,ఆయిల్ ఫామ్ తోటలకు డ్రిప్పు ద్వారా ఎరువులు పంపే విధానాన్ని రైతులకు వివరించడం జరిగింది. ఆయిల్ ఫామ్ సాగు చట్టబద్ధతతో కూడుకున్నది మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడికి కృషి చేయాలని రైతులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి మధులిక, హెచ్ ఓ టెక్నికల రాకేష్, రాంచరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సతీష్ నారాయణ,ఫీల్డ్ ఆఫీసర్ భరత్ తదితర రైతులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాస్తు గాయపడగా ఆయన ను పరామర్శించిన. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా పెళ్లి బిక్షపతి కొన్ని రోజుల క్రితం గాయపడగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి. పరామర్శించి. వారికి మనో ధైర్యం చెప్పి అండగా ఉంటామని పార్టీ పరంగా గాని ప్రభుత్వపరంగా కానీ తగిన సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి గాయపడిన బిక్షపతికి కుటుంబానికి సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. బి ఆర్ ఎస్ పార్టీ. తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజ భీంకర్ రాజన్న. పాక్స్. వైస్ చైర్మన్. ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. పార్టీ సీనియర్ నాయకులు. పడిగల రాజు. గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్. జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్. కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్. తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ నాయకులు క్యారం జగత్ కుమార్. భాను. మూర్తి. నేరెళ్ల అనిల్. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు
20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలి
ఆల్ ట్రేడ్ యూనియన్ లు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
నర్సంపేట,నేటిధాత్రి:
కార్మిక చట్టాలను అమలు చేయాలని కార్మికులకు, గుదిబండగా మారిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక జయప్రదం చేయాలని కోరుతూ గురువారం నర్సంపేట పట్టణంలో వరంగల్ రోడ్డు కూడాలీ నుండి జయలక్ష్మి సెంటర్ వరకు సీఐటీయూ,బిఆర్టిటి, ఏఐటీయూసీ ఏఐఎఫ్టీయు న్యూ,ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం గౌడ్,బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు బానోత్ సాగర్, ఏఐటిసి జిల్లా నాయకులు గుంపల్లి మునీశ్వర్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ లు మాట్లాడుతూ కార్పొరేట్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాటం చేయాలని కోరారు. దశాబ్ద కాలంగా పోరాడి సాధించుకున్న హక్కులను చట్టాలను కార్పొరేట్ సంస్థలకు పణంగా పెట్టి శ్రామిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా దోచుకోవడానికి మరిన్ని అదనపు లాభాలను పోగు చేసుకోవడానికి పని గంటల భారాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఇరువైన దేశవ్యాప్తంగా సంఘటితమై సమ్మె చేస్తున్నారని అన్నారు సమ్మెలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు హనుమకొండ శ్రీధర్, పట్టణ కార్యదర్శి రాజు, బిఆర్టియు జిల్లా నాయకులు పెరమండ్ల రవి, నాయిని వేణు చంద్ ,బొల్లం ప్రసాద్ ,అన్నం రాజు ,అనిల్, ఏఐఎఫ్టియు న్యూ నాయకులు అశోక్ ,రవి, పైడి ,ఆనంద్, ఐ ఎఫ్ టి యు నాయకులు కుమార్, ప్రదీప్ ,తదితరులు పాల్గొన్నారు.
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామానికి చెందిన. గ్రామపంచాయతీ కార్మికురాలు పోచ ఎల్లవ్వ. మృతిచెందగా. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక వారి కుటుంబాన్ని చూసి చదివించి వారి కుటుంబానికి. సత్తు శ్రీనివాస్ రెడ్డి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లవ్వ అర్థిక స్థితి బాగోలేక వారి కుటుంబానికి చూసి చలించి వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చిన దాతలు ఇందులో భాగంగా.తన వంతు సహాయంగా. 50 కేజీల బియ్యాన్ని అందజేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి. అలాగే మృతి చెందిన. గ్రామపంచాయతీ. కార్మికురాలు . ఎల్లవ్వ కుటుంబ పరిస్థితి బాగా లేనందున. ప్రభుత్వ పరంగా గాని గ్రామపంచాయతీ పరంగా గాని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. ఫిషరీష్ జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్. గ్రామ శాఖ అధ్యక్షులు ఆసరి మహిపాల్ రెడ్డి. మండల మహిళా అధ్యక్షురాలు హరిక రెడ్డి. రాజేష్. బాలయ్య. తంగళ్ళపల్లి రవి. పెద్ది పరిసరం గౌడ్. బుర్ర బబ్లు. చెక్కపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు
స్వాములకు రాసమళ్ళ కృష్ణ అంజలీ దంపతుల అన్నప్రసాదం అందజేత
పరకాల నేటిధాత్రి :
పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలోని శ్రీ భక్తంజనేయ స్వామి దేవస్థానంలో మల్లక్కపేట గ్రామానికి చెందిన రాసమళ్ళ కృష్ణ అంజలి దంపతులు మరియు రాయపర్తి గ్రామానికి చెందిన మార్క రాజేశ్వరి విజయ్ కుమార్ లు ఆంజనేయ మాల వేసిన స్వాములకు అన్నప్రసాదం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంబిరు మహేందర్ ఇఓ వెంకటయ్య అర్చకులు కాటూరి జగన్నాధాచార్యులు,భక్తులు,దీక్ష స్వాములు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది.
కరీంనగర్ జిల్లా రామడుగు మండల ట్రైనీ ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ వద్ద మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ట్రైనీ ఎస్సై సతీష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన ముఖ్యంగా యువతపై కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాలను వివరించారు. అలాగే మత్తు పదార్థాలపై నియంత్రణ అవసరాన్ని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాల నివారణ చర్యలలో భాగంగా ఆప్రాంతంలో కుక్కల బృందంతో (డాగ్ స్క్వాడ్) తనిఖీ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
హజ్ యాత్రకువెళ్ళుతున్న సయ్యద్ అబ్రార్ కు టి జె ఎస్ సన్మానం.
వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అక్తర్ కుమారుడు సయ్యద్ అబ్రార్ ను మక్కా హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు య౦ఏ.ఖాదర్ పాష శాలువతో ఘనంగా సన్మానించారు ఈసందర్భంగా పాషా మాట్లాడుతూ ఇస్లాం ధర్మంలో జీవితంలో ఒక్కసారి మక్కయాత్ర కు పోవాలని అన్నారు ఎప్పుడైనా హజ్ యాత్ర చేస్తే పుణ్యక్షేత్రముగా ఉమ్రా కూడా చేయవచ్చు నని. ముస్లిం సోదరులు ఉమ్రా చేయవచ్చని అన్నారు సన్మానిం చిన వారిలో య౦ఏ ఖాదర్ పాష. చాంద్ పాషా తెలంగాణ ఉద్యమ నాయకులు. రిటైర్డు ఉద్యోగి జి.ఎం గౌస్ పాన్ గల్ అబ్బాస్ అలీ. మహిబూబ్ వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అక్తర్ తదితరులు పాల్గొన్నారు
రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా హనుమాన్ చాలీసా,108 హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయడం జరిగిందని ఆలయ అర్చకులు రాంపల్లి సతీష్ శర్మ తెలిపారు.హనుమాన్ మాల ధరించిన ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ చాలీసాలో అత్యంత వైభవోపేతంగా పాల్గొన్నారు.
Hanuman.
భారతదేశం సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి అవరోధాలకు తావులేకుండా, ఎలాంటి విపత్తులు కలగకుండా ప్రజలంతా ఆయురారోగ్య, అష్టయిశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఒక్క భక్తుడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ శనివారం రోజున హనుమాన్ యజ్ఞం, మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాల ధరించిన సాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపిన నేపద్యంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు.
`నో సెకెండ్ ధాట్…హరీష్ రావు పవర్ పుల్ క్లారిటీ
`కేసీఆర్ అడుగుజాడల్లోనే…కేటీఆర్ నడిచే దారిలోనే!
`బీఆర్‌ఎస్‌కు నవ యుగం..కేటీఆర్‌కు పట్టం!
`భవిష్యత్తు బీఆర్‌ఎస్ సీఎం కేటీఆర్!
`బీఆర్‌ఎస్‌కు యువ నాయకత్వంతో ఉరకలు
`అన్ని నియోజకవర్గాలలో నవ నాయకత్వం
`హరీష్ రావు మరో సారి పూర్తి స్పష్టత
`కవిత కూడా చెబుతున్నది అదే మాట
`మేమంతా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ఒక్కటే…
`మా ముందున్న లక్ష్యం బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తేవడమే!
`బీఆర్‌ఎస్ ఛీలాలనే పాలక పక్షం కలలు నెరవేరేది లేదు
`కాంగ్రెస్ కుట్రల రాజకీయం తీరేది కాదు
`ముగ్గురి మధ్య దూరానికి చోటు లేదు
`తెలంగాణ వున్నంత వరకు బిఆర్‌ఎస్ వుంటుంది
`బీఆర్‌ఎస్ మరో వందేళ్ళు కొనసాగుతుంది
`బీఆర్‌ఎస్ శ్రేణులలో పెరిగిన జోష్
`ఈసారి ఉద్యమ కారులకు పెద్ద పీట
`యాభై సీట్లలో కొత్త వారికి కోట!
`సీనియర్లకు పార్టీ పదవులు… యువ నాయకులకు పాలనలో ప్రాధాన్యతలు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఒక్కమాట..ఒకే ఒక్క మాట…అంతే బిఆర్‌ఎస్ మీద లేని పోని రాద్దాంతం చేసేవారి నోళ్లు మూయించాయి. లేని పోని రాతలు రాసే మీడియాకు అవకాశం లేకండాపోయింది. రకరకాల వదంతులకు చెక్ పెట్టాయి. అయితే అది ఇప్పుడు కొత్తగా చెప్పిన మాట కాదు. కాని సమయం, సందర్భం అన్నది కూడా దేనికైనా కలిసిరావాలంటారు. ఇప్పుడొచ్చింది. మళ్లీ ఆ ప్రశ్నకు తావులేకుండా పుల్ స్టాప్ పడిరది. అదే కేటిఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించే అంశం. బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఏది చెబితే అదే నాకు శిరోదార్యం అని మరోసారి మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు హరీష్‌రావు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. మరోసారి ఈ విషయం ఎవరూ ప్రస్తావించొద్దు. బిఆర్‌ఎస్‌లో ఆధిప్యత పోరు అన్నదానికి తావే లేదన్నారు. తనపై వస్తున్న అసత్యపూరితమై వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని నిగ్గు తేల్చారు. కేసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నూటికి నూరు పాల్లు కట్టుబడి ఇప్పటి వరకు పనిచేశానన్నారు. ఇకపై కూడా అలాగే వుంటుందన్నారు. బిఆర్‌ఎస్‌లో తాను ఒక సామాన్య కార్యకర్తలని అని అన్నారు. కేసిఆర్ అడుగుజాడల్లో నడవడమే నా పని అని చెప్పారు. రకరకాల రూమర్లకు ప్రతీసారి సమాధానం చెప్పడం అవసరం లేదని, ఇది ఆఖరు అని అటు మీడియాకు, ఇటు ఇతర రాజకీయ పార్టీలకు చెప్పారు. తెలంగాణలో వున్న బలమైన పార్టీ బిఆర్‌ఎస్. బిఆర్‌ఎస్‌ను మించిన పార్టీ లేదు. అడ్డిమార్ గుడ్డి దెబ్బ అన్నట్లు జనానికి పదే పదే లేనిపపోనివి చెప్పి కాంగ్రెస్ నమ్మించింది. అయినా ప్రజలు పూర్తిగా కాంగ్రెస్‌ను నమ్మలేదు. అందుకే బిఆర్‌ఎస్‌ను బలమైన ప్రతిపక్షంగా కూర్చోబెట్టారు. దాంతో ఊపిరి సలపని కాంగ్రెస్ రకరకాల విన్యాసాలు చేస్తోంది. బిఆర్‌ఎస్‌కు చెందిన పది మందిని లాక్కున్నది. వారి పరిస్దితి ఎలా వుందో చూస్తూనే వున్నాం. అయినా కాంగ్రెస్ ఆశ చావడం లేదు. బిఆర్‌ఎస్‌లో ఏదో సృష్టించాలని, రకరకాల పుకార్లు ప్రచారం చేసి కాలం గడుపుకుందాని అనుకుంటోంది. ఎందుకంటే ప్రజలకు బిఆర్‌ఎస్ విషయాలంటే ఆసక్తి ఎక్కువ. బిఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణ ఇంటి పార్టీ. తమ ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఎదురౌతుందనుకుంటే సహజంగా కుటుంబ సభ్యులు కొంత కలవరపడుతుంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. బిఆర్‌ఎస్‌లో అందరూ కలిసి వుండాలని ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు. అప్పుడూ, ఇప్పుడు అలాగే వున్నారు. ఎప్పుడూ అలాగే వుంటారు. కాని కేటిఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ఎప్పటికిప్పుడు ఏదో వివాదం నడుస్తోందని ప్రచారం చేసుకోకపోతే కాంగ్రెస్‌క కాలం గడవదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో వున్నప్పుడూ అదే చేసింది. ఇప్పుడు అధికారంలో వున్నా అదే మాట్లాడుతోంది. కాంగ్రెస్‌కు అభివృద్ది చేత కాదు. ఎన్నికల హమీలు అమలు చేయలేరు. కాంగ్రెస్‌లో వున్న కుంపట్లు ఆరేవి కాదు. ప్రజలు దృష్టి అటు వైపు వెళ్లకుండా వుండాలంటే బిఆర్‌ఎస్‌ను ప్రతిసారి తెరమీదకు తెస్తే తప్ప పూట గడిచే రోజు కాంగ్రెస్‌కు లేదు. అందుకే ప్రభుత్వంలో వున్నా, బిఆర్‌ఎస్ జపం చేయకపోతే కాంగ్రెస్‌కు క్షణం కూడా గడిచేలా లేదని హరీష్ రావు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. దాంతో ఇక కాంగ్రెస్ కూడా ఇకపై పుకార్లు పుట్టించే పరిస్దితి లేకుండాపోయింది. అన్ని దారులు హరీష్‌రావు ఒక్క మాటతో మూసేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా అదే మాట అనేక సార్లు చెప్పింది. చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు రాజకీయ పార్టీలు ఎదుటి పార్టీ మీద రాళ్లేస్తుంటారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు అదే చేస్తూ విచ్చంది. ఇంకా అదే పనిలో వుంది. కాని ఇకపై మరో అస్త్రం ఏదో సిద్దం చేసుకుంటే గాని కాంగ్రెస్‌కు పని వుండదు. నిజం చెప్పాలంటే బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ ఎంతో ఆరోగ్యంగా వున్నారు. ఇంకా రెండు మూడు ఎన్నికలు ఎదుర్కొనేంత శక్తితోనే వున్నారు. కాని తెలంగాణ అంటే గిట్టని వాళ్లు, తెలంగాణ బాగుండడం చూడలేని వాళ్లు, కేసిఆర్ రాజకీయాలు ఆగం కావాలని చూసే వాళ్లు చాల మంది వున్నారు. తెలంగాణలో కేసిఆర్ అనే ఒక్క పదం వినిపించకపోతే మేమే నాయకులం అని గొప్పలు చెప్పుకోవడానికి పాలకపక్షం కాంగ్రెస్‌లో, కేంద్ర పాలకపక్షం బిజేపి వుంది. కాని ఆ అవకాశం ఎవరికీ రాకపోవచ్చు. కేసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్ది రోజులకే ఆయన ఆరోగ్యం బాగాలేదంటూ మీడియాల్లో నిత్యం కథనాలు వచ్చేవి. అలా ఆ ఐదేళ్లు కాంగ్రెస్‌తోపాటు, మీడియా కొంత కాలం గడిపింది. ఆ సమయంలో కేసిఆర్ నిండు అసెంబ్లీ సాక్షిగా నేను దుక్కలాగా వున్నారు. నేను ఇంకా మరో పదిహేను, ఇరవై ఏళ్లు రాజకీయాల్లో వుంటాను. నా ఆరోగ్యం కాంగ్రెస్ పార్టీకి, మీడియాకు ఎంత ప్రేమో అంటూ ఎద్దేవా చేశారు. కేసిఆర్ గురించి అలా అనుకునేవారు అనుకుంటూనే వుంటారు..నేను మరో ఇరవై ఏళ్లు రాజకీయం చేస్తానని ఎంతో నమ్మకంగా కేసిఆర్ చెప్పారు. ఇక కేసిఆర్ ఆరోగ్యంపై కాకుండా కేటిఆర్ సిఎం కావాలన్న దానిపై ఓ రెండుమూడేళ్లు కాంగ్రెస్ రకరకాల ప్రచారాలు సాగించారు. మీడియాలో కూడా కేటిఆర్ సిఎం. అనేది ఓ నాలుగైదు సంవత్సరాలుగా నానుతూనే వుంది. ఇంకా ఆ చర్చ సాగుతూనే వుంది. గత ఎన్నికల సమయంలో ఇంకా బాగా సాగింది. హరీష్‌రావుతో పాటు, పార్టీలోని అనేక మంది నాయకుల అభిప్రాయాలు కూడా అందరికంటే ముందుగా మీడియానే సేకరించింది. అనూహ్యంగా బిఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. దాంతో మళ్లీ భవిష్యత్ బిఆర్‌ఎస్ నాయకుడు ఎవరు? అన్న చర్చ మళ్లీ మొదటికి వచ్చింది. కాదు కాంగ్రెస్,బిజేపి మీడియాతో కలిసి తెరమీదకు తెచ్చింది. ఇదే అదునుగా హరీష్‌రావు ఎంతో అసంతృప్తిగా వున్నారంటూ లేనిపోని వార్తలు సృష్టించారు. ఏకంగా హరీష్‌రావు కొత్త పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారంటూ కాంగ్రెస్‌కు చెందిన సోషల్ మీడియాతోపాటు, ప్రధాన పత్రికలు కూడా వార్తలు వండి వార్చాయి. మరికొన్ని మీడియా సంస్దలు హరీష్‌రావు బిజేపిలోకి వెళ్తున్నట్లు ప్రచారం చేశాయి. హరీష్‌రావు ప్రాధాన్యత తగ్గిస్తున్నారంటూ పుకార్లు లేచాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు రోజుకో రకమైన వార్త సృష్టించడం మొదలుపెట్టారు. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాటు హరీష్‌రావుకు అప్పగించలేదని మొదలు పెట్టారు. హరీష్‌ను పక్కన పెట్టే సమయం ఆసన్నమైందన్నారు. ఇక ఎమ్మెల్సీ కవిత విషయంలో కూడా అదే జరుగుతోంది. కవితను కూడా పార్టీ నుంచి సాగనంపే కుట్రలు జరుగుతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. ఆమెను కూడా రజతోత్ససభకు దూరం పెట్టారన్నారు. కవిత ఎంచుకున్న బిసి నినాదం పార్టీలో ప్రకంపనలు సృష్టించిందన్నారు. కేసిఆర్ కవితను తన ఇంటికి కూడా రానివ్వడం లేదని కూడా అనేక వార్తలు వస్తున్నాయి. అంతే కాదు కవిత మొదటి నుంచి ప్రత్యేకశైలిలో రాజకీయాలు నెరపడం తెలుసు. నాయకత్వం పటిమ ఆమెలో వుందని చెబుతూనే, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా వార్తలు రాస్తున్నారు. అన్నతోఆమెకు పడడం లేదని లెక్కలేశారు. ఇటీవల కవిత చేసిన సామాజిక తెలంగాణ అంశం బిఆర్‌ఎస్ నుంచి కవిత దూరం కావడానికే చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. ఆమె కంట తడి పెట్టుకోవడం కూడా బిఆర్‌ఎస్ పెద్దల వైఖరి నచ్చకనే అంటూ వార్తలు రాసుకొచ్చారు. ఇలా బిఆర్‌ఎస్‌లు కలతలు నింపే ప్రయత్నాలు బోలెడు చేస్తూనే వున్నారు. అయినా కేటిఆర్, హరీష్‌రావు, కవితల మధ్య సఖ్యతకు గండికొట్టలేరన్నది తేలిపోయింది. వారి ఐక్యతను జీర్ణించుకోలేక ఇలాంటి ప్రకటనలు కాంగ్రెస్ సోషల్ మీడియా పదే పదే చేస్తూనే వుంది. ఇంకా చేస్తూనే వుంటుంది. కాని బిఆర్‌ఎస్‌లో ఎలాంటి అరమరికలులేవు. అయినా ఇప్పుడు ఆ ప్రచారానికి తావే లేదు. వచ్చే ఎన్నికలు కేటిఆర్ నాయకత్వంలో వెళ్లరు. కేసిఆర్ ఇంకా బలంగానే వున్నారు. కాంగ్రెస్, బిజేపిలను ఇంకా పదేళ్లుపాటు ఎదుర్కొనే శక్తితోనే వున్నారు. ఇప్పటికిప్పుడు కేసిఆర్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కాకపోతే భవిష్యత్ బిఆర్‌ఎస్ నాయకుడు కేటిఆర్ మాత్రమే అని అందరూ చెబుతున్నదే. ఇందులో మరో ప్రశ్నకు తావులేదు. అలాంటి పరిస్దితులు ఉత్పన్నమయ్యే సమస్యే లేదు. ఎంత కాలమైనా బిఆర్‌ఎస్ భవిష్యత్తు నాయకుడు కేటిఆరే అవుతారు. అది ఇప్పటికే కేసిఆర్ కూడా అనేక సంకేతాలు పంపారు. 2018 ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలిచిన వెంటనే కేటిఆర్‌ను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటును చేశారు. ఇంతకన్నా స్పష్టత మరొకటి వుండదు. ఇది పదే పదే చెపాల్సిన పనిలేదు. బిఆర్‌ఎస్‌లో లేనిపోని రాద్దాంతాలను ఎవరూ సృష్టించాల్సిన పనిలేదు. బిఆర్‌ఎస్ పార్టీని ఎంతో పదిలంగా, ఉద్యమ రణరంగంలో ధైర్యంగా నిలుపుకుంటూ 25ఏళ్లు కాపాడుకున్నారు. ఆ బంధాన్ని కుటుంబ సభ్యులెలా వదులుకుంటారు? ప్రచారం చేసేవారికి కొంచెమైనా వుండాలి?
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన పట్టణ బి.ఆర్. ఎస్ నాయకులు ఈరోజు శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు గారి, ఆదేశాల మేరకు జహీరాబాద్ పట్టణం వివిధ వార్డ్ లకు చెందిన 8 మంది లబ్ధిదారులకు గాను ₹2,56,500 విలువ గల చెక్కులను ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,ముఖ్య నాయకులతో కలిసి క్యాంపు కార్యాలయంలో అందజేయడం జరిగింది..
లబ్ధిదారుల వివరాలు :- పస్తాపూర్ కి చెందిన పల్లె అశోక్ ₹.20,000/- రంజోల్ కి చెందిన రిజ్వనా ఫాతిమా ₹.18,500/- & కళావతి ₹.11,500/- రచ్చన్నపేట్ కి చెందిన ధన లక్ష్మి ₹.24,500/- హమాలీ కాలనీకి చెందిన సుమయ్య ఫాతిమా ₹.14,000/- బస్వవేశ్వర స్ట్రీట్ కి చెందిన సంతోష ₹.54,000/- APHB కాలనీ కి చెందిన మానస ₹.21,000/- ఆర్యనగర్ కి చెందిన గౌరమ్మ ₹.42,000/-చిన్న హైదరాబాద్ కి చెందిన రవి ₹.51,000/-.ఈ సంధర్బంగా లబ్ధిదారులు వారి కుటుంబసభ్యులు ఎమ్మెల్యే మాణిక్ రావు గారికి ,నాయకులకు ధన్యవాదలు తెలియజేశారు……. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అశోక్ షెరి , మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ యాకూబ్, వెంకటేశం గుప్తా, పద్మజ, అశోక్ రెడ్డి, పాండు ముదిరాజ్, నరేష్ రెడ్డి లు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి
వనపర్తి నేటిధాత్రి :
గోపాల్ పేట్ మండల్. కేంద్రంలో పద్మావతి గార్డెన్స్ లో గోపాల్ రెడ్డి కూతురు వివాహ వేడుకలో రాష్ట్ర ప్లానిoగ్ బోర్డు వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు కందిరీగ తాండ కు చెందిన లోక్య నాయక్ కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు .
సంస్థ గత ఎన్నికల నిర్మాణ సన్నాహాగా సమావేశం సంస్కృత నిర్మాణం వైపు కాంగ్రెస్ అడుగులు రిజర్వేషన్ ఏదైనా కలిసికట్టుగా పని చేద్దాం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మండలంలో జరిగిన సమావేశంలో రిజర్వేషన్ ఏదైనా కలిసికట్టుగా పని చేద్దాం గ్రామ కమిటీలను పటిష్టం చేయడం మనందరి బాధ్యత అని భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మొగుళ్లపల్లి లోని అమ్మ గార్డెన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సంస్థాగత నిర్మాణ సన్నాహాక సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్రసత్యనారాయణ రావు తోపాటు సంస్థాగత నిర్మాణ సన్నాహక పరిశీలకులుగా ఇనుగాల వెంకటరామిరెడ్డి, లింగాజీ పాల్గొనగా. సభాధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయితే ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ. మొగులపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో ఈ నెల 15 నుండి 17 వరకు అన్ని గ్రామాల ప్రజలు కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని గ్రామ కమిటీలను ఎన్నుకునే విధంగా ఇన్చార్జిలు బాధ్యత తీసుకోవాలని కమిటీలను వేయడం పూర్తి చేయాలని గ్రామ కమిటీలు పటిష్టంగా ఉంటే పార్టీ పటిష్టంగా ఉంటుందని గ్రూపు రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మండలంలో 25 మంది సర్పంచుల 25 మంది ఉపసర్పంచ్లు 300 మంది వార్డు సభ్యులను ఒక ఎంపీపీ ఒక జడ్పిటిసి 13 మంది డైరెక్టర్లకు అర్హులైన వారిని ఎంపిక చేయాలని. రిజర్వేషన్ ఏది వచ్చిన ఆ గ్రామాలలో నాయకత్వం వహించి నాయకుడు బాధ్యత వహించి గ్రామ ప్రజలు నిచ్చే వ్యక్తిని సర్పంచ్ గా ఎంపిటిసిగా జడ్పిటిసిగా డైరెక్టర్లుగా ఎంచుకొనె బాధ్యత తీసుకోవాల్సిందిగా సూచించారు మీ గ్రామాల్లో అభివృద్ధి కొరకు గ్రామ కమిటీలు ఒక్కటిగా కూర్చుని చర్చించి తీర్మానం చేసుకుని గ్రామ కమిటీ అధ్యక్షుడు వస్తే తప్పకుండా ఆ పనిని చేయడం జరుగుతుందని ఎవరు పడితే వారు రావద్దని కార్యకర్తలకు సూచించారు.
Congress Party
ఎవరు పడితే వారు తమ ఇష్టంగా నా పని కావాలంటే మీ పదవులు ఉండవని ఎమ్మెల్యే వారికి తెలిపారు ప్రజల కోసం ఇచ్చిన పదవులను ప్రజలు మెచ్చే విధంగా పనిచేయడం అని ఇందిరమ్మ పిల్ల జాబితా అర్హులకు అందే విధంగా చూసుకోవాలని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనమందరం యుద్ధ సైనికుల పని చేసేందుకు పటిష్టమైన కార్యకర్తలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ సమావేశంలో. పరిశీలకులు ఇనుగాల వెంకటరామిరెడ్డి, లింగాజి, పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, చిట్యాల ఏఎంసి చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, వైస్ చైర్మన్ మహమ్మద్ రఫీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండి సుదర్శన్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ సంపెళ్లి నరసింగారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆకుతోట కుమారస్వామి, జిల్లా నాయకులు మండల నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు
సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా మహాసభల కరపత్రం విడుదల
కేసముద్రం నేటి ధాత్రి:
మే 18న కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీ సాయి గార్డెన్లో జరిగే సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఎఐటియుసి మండల కార్యదర్శి మంద భాస్కర్, సిపిఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్ అన్నారు. బుధవారం కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంద భాస్కర్ , చొప్పరి శేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను సంస్కరణ పేరుతో చట్టాలను సవరించి కార్మికుల శ్రమను అప్పనంగా దోచుకునేందుకు కుట్ర పండుతుందన్నారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించి కార్మిక హక్కులను కాల రాస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని విమర్శించారు. కేసముద్రంలో జరిగే జిల్లా మహాసభలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందిస్తామన్నారు. ఈ మహాసభలకు జిల్లాలోని ఐదు ఎం ఎల్ ఎస్ పాయింట్ నుండి హమాలీ కార్మికులతో పాటు ముఖ్య అతిథులుగా ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజ్, సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారధి, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజయ్ సారధి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేషపల్లి నవీన్, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓమ బిక్షపతి హాజరవుతారన్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వడ్డే బోయిన లక్ష్మీనరసయ్య, రాజబోయిన శ్రీను, నరముల యాకయ్య, బిచ్చు, రాజు, యాకయ్య, రెంటాల వెంకన్న, నగేష్, తాటికాయల యాకయ్య, గణేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచ సుందరిమణులను సాధరంగా ఆహ్వానించిన వరంగల్ సీపీ
ఖిలా వరంగల్ లో భారీ పోలీస్ బందోబస్తు
వరంగల్ తూర్పు నేటిధాత్రి :
మిస్ వరల్డ్ పోటీల సందర్బంగా హెరిటేజ్ టూర్ లో భాగంగా హన్మకొండ, వరంగల్ పర్యటనకై బుధవారం సాయంత్రం హరిత కాకతీయ హోటల్ కు చేరుకున్న వివిధ దేశాలకు చెందిన సుందరిమణులను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సాధరంగా ఆహ్వానించారు.
Thousand Pillar
మొదటగా హనుమకొండ లోని వేయి స్తంభాల దేవాలయంలో సందర్శన చేసిన ప్రపంచ సుందరీమణులు, అనంతరం వరంగల్ తూర్పు పరిధిలోని ఖిలా వరంగల్ కోట వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Thousand Pillar
వరంగల్ డివిజన్ పోలీసులు ఏసీపీ నందిరాం నాయక్ ఆధ్వర్యంలో, ఇంతేజార్గంజ్ సీఐ షుకూర్, మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నం, మట్టేవాడ సిఐ తుమ్మ గోపి, వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ, ఎస్సై లు, మహిళా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా బావాజీ పల్లి గ్రామంలో బుధవారం ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నిలిపింది. గ్రామస్తులకు వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల బాలస్వామి (55) సొంత పొలంలో ట్రాక్టర్ సహాయంతో పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ గా గోపి కిషోర్ బుదవారం బాధ్యతలు చేపట్టారు.ఎల్ఐసి కార్యాలయానికి చేరుకున్న నూతన మేనేజర్ గోపి కిషోర్ కు .కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్,అడ్మినిస్ట్రేషన్ అధికారితో.
LICs new manager
ముఖ్య అధికారులు,సిబ్బంది,ఎల్ఐసి ఏఓఐ సంఘం నాయకులు, ఎల్ఐసి లియాపి సంఘం నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం పలువురు శాలువాలతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో డెవలప్మెంట్ ఆఫీసర్స్,అధికారులు,ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
పోచంమైదాన్ బస్ షెల్టర్ పై, కొన్ని రోజులుగా వార్తలు ప్రచురించిన “నేటిధాత్రి”.
“నేటిధాత్రి” కథనానికి స్పందించిన ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ కు అభినందనలు
ఎక్స్ అకౌంటు (ట్విట్టర్) ద్వారా ఆర్టీసీ ఎండి సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన “నేటిథాత్రి” పత్రిక
ఎట్టకేలకు పోచంమైదాన్ బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి
షెల్టర్ నీడన ప్రయాణికులు.. “నేటిధాత్రి” పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
బస్ షెల్టర్ నిర్మాణాన్ని అడ్డుకున్న బిల్డింగ్ ఓనర్, ఆర్టీసీ అధికారుల పైకి ఎదురు దాడి ప్రయత్నం
అండగా నిలబడి నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్..
వరంగల్ తూర్పు నేటిధాత్రి:
వరంగల్ తూర్పు పరిధిలో, పోచంమైదాన్ జంక్షన్ వద్ద ఉన్న బస్సు స్టాండ్ గత రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో బాగంగా ఉన్న బస్ స్టాండ్ ను తొలగించారు. అదే స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టిన అధికారులు, పైకప్పు (షెల్టర్) వేయడం మర్చిపోయారు. దీంతో మహిళలు, ప్రయాణికులు కొన్ని రోజులగా నానా ఇబ్బందులు పడ్డారు. బస్ స్టేషన్ కు పైకప్పు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికుల సమస్యను నేటిధాత్రి పత్రిక, “బస్ షెల్టర్ నిర్మించండి సార్” అని, “బస్ షెల్టర్ నిర్మించండి మంత్రి గారు” అని బస్టాండ్ సమస్యపై, అనేకసార్లు వార్తలు రాసి, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి. సోషల్ మీడియా ఎక్స్, (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ దృష్టికి తీసుకెళ్లిన నేటిదాత్రి పత్రిక. పిర్యాదుకు స్పందించిన ఆర్టీసీ ఎండీ, మే 14, బుధవారం నాడు మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు, వారి పర్యటనలో భాగంగా ఖిలా వరంగల్ కు బుధవారం రానున్న నేపథ్యంలో, నగరాన్ని సుందరీకరణ చేస్తున్న విషయం తెలుసుకొని, జిల్లా ఆర్టీసీ అధికారులకు బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో. వెంటనే స్థానిక ఆర్టీసీ అధికారులు బస్టాండ్ లో బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేశారు. నిలువ నీడ చేకూర్చిన ఆర్టీసీ అధికారులకు, సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేటిధాత్రి పత్రిక కు, స్థానిక కార్పొరేటర్ కు కృతజ్ఞతలు తెలియచేశారు ప్రయాణికులు.
RTC bus
బస్ షెల్టర్ నిర్మాణం ఆపాలని, ఆర్టీసీ అధికారులతో వాగ్వాదం
బుధవారం ఉదయం ఆర్టీసీ అధికారులు పోచంమైదాన్ కు చేరుకొని, బస్ షెల్టర్ నిర్మాణం చేస్తుండగా, పక్కనే ఉన్న బిల్డింగ్ యజమాని కుమారులు వచ్చి, ఆర్టీసీ మహిళ అధికారిని పైకి ఇనుప రాడ్డుతో దాడి చేయబోయి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇనుప రాడ్డుతో దాడి చేయబోయే సంఘటనపై వీడియో తీసిన ఆర్టీసీ అధికారులు వీడియోను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. ఓ టౌన్ ప్లానింగ్ అధికారి సైతం వచ్చి బస్ షెల్టర్ అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆర్టీసీ అధికారులపై రుబాబు మాటలు మాట్లాడటంతో, మున్సిపల్ కార్పొరేషన్ “పెద్దల సహకారం” బిల్డింగ్ ఓనర్ కు ఉంది అనే అనుమానాలకు తావిచ్చింది. బిల్డింగ్ ఓనర్ కుమారులు మాట్లాడుతూ, నగర మేయర్ మేడం మాకు సపోర్ట్ గా ఉంది అని చెప్పడం గమనార్హం.
RTC bus
స్పందించిన స్థానిక కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్
బస్ షెల్టర్ వద్ద నిర్మాణం అడ్డుకున్న వ్యాపారితో మాట్లాడిన స్థానిక కార్పొరేటర్. ఇరువురికి నచ్చచెప్పిన తరువాత ఆర్టీసీ అధికారులు పని మొదలు పెట్టారు. దగ్గరుండి నిర్మాణం పూర్తి చేయించిన స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీష శ్రీమాన్. బస్ షెల్టర్ నిర్మాణం పూర్తి చేయించిన 25వ డివిజన్ కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలిపారు ప్రయాణికులు.
వివాహా వేడుకల్లో పాల్గొన్న టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..
జహీరాబాద్ నేటి ధాత్రి :
జహీరాబాద్ పట్టణంలోని ఉత్తమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో . ఈ రోజు జరిగిన ఝరాసంఘం మండలం గంగాపూర్ గ్రామం పి.మల్ శెట్టి పాటిల్ కుమారుని వివాహా వేడుకల్లో టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు పాల్గొని నూతన వదువరు లను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలియజేసారు, ఈ వివాహా వెడుకల్లో మాజీ సర్పంచ్ లు శంకర్, రామలింగారెడ్డి, శివరాజ్ పాటిల్,జలీల్, జి.నర్శింలు,నబిసాబ్, చెంగల్ జైపాల్,చంద్రప్ప, తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.