ముఖ్యమంత్రి జహీరాబాద్ వస్తుంటే నీమ్ఙ్ రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఏమిటి..టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జహీరాబాద్ కు రావడం మంచిదే కానీ ముఖ్యమంత్రి గారి పర్యటన పేరుతో రైతులను వారి గ్రామాలకు వెళ్లి రాత్రి వేళలో వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం,మాజీ మంత్రి టి.హరీష్ రావు మాట్లాడుతూ జహీరాబాద్ కు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి చేసింది చెప్పాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం కాదు ప్లై ఓవర్ బ్రిడ్జ్,బసవేశ్వర విగ్రహం,నీమ్జ్ రోడ్డు ఇవన్నీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినవే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమి చేశారో చెప్పాలని నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పకుండా తిరిగి ప్రతి విమర్శలు చేయడం సిగ్గు చేటు,గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు,ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేసిన నిధులను రద్దు చేయడం జహీరాబాద్ అభివృద్ధికి నిరోధం కాదా? రైతులను/బిఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
దుగ్గొండి మండలంలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు.వర్షాకాలం నేపథ్యంలో నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారా అని నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని విత్తనాల షాపులను దుగ్గొండి సీఐ సాయిరమణ,నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.
Agriculture.
ఎరువుల దుకాణాల యజమానులకు ఎలాంటి నకిలీ విత్తనాలు, పత్తి గింజలు మిరప గింజలు,మొక్కజొన్నలు,పెసర్లు రైతులకు సంబంధించిన నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడిఏ దామోదర్ రెడ్డి,సీఐ సాయిరమణ హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు, నర్సంపేట ఏవో కృష్ణ కుమార్, దుగ్గొండి ఏవో మాధవి, చెన్నారావుపేట ఏవో గోపాల్ రెడ్డి, దుగ్గొండి ఏఈఓ విజయంతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిర్బంధాలు ఎందుకు ఇదేనా ప్రజాపాలన హరీశ్ రావు హాట్ కామెంట్స్.
జహీరాబాద్ నేటి ధాత్రి:
సీఎం రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సదర్భంగా రైతులతో పాటు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘x’ (ట్విట్టర్) వేదిక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం పర్యటన ఉన్న ప్రతిసారి ఇలా ముందస్తు అరెస్టులు, నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. ఇదేనా ప్రజాపాలన అంటూ ఫైర్ అయ్యారు. మొన్న నాగర్‌కర్నూల్ పర్యటనలో చెంచు సోదరులను ఇలానే అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు.నేడు జహీరాబాద్‌లో రైతులను, రైతు నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని కామెంట్ చేశారు. జహీరాబాద్ నిమ్స్ చుట్టూ ఉన్న గ్రామాలను అష్ట దిగ్బంధనం చేసి, రైతు నాయకులను నిర్బంధించడం అది ఎలా ప్రజాపాలన అవుతుందని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే పాలన అంటూ ఆక్షేపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ తన ఆవేదనను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఆ హక్కును హరించడం దుర్మార్గమని.. నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు, అరెస్టులు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జరిగే పరిస్థితులు లేవని తెలిపారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను, రైతు నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ హరీశ్ రావు, డీజీపీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
– జిల్లా అధికార యంత్రాంగం చో రవ తీసుకోవాలి వివిధ గ్రామాల రైతుల ఆవేదన….
కొల్చారం (మెదక్) నేటిధాత్రి:
ఆరుగాలం పండించిన వరి ధాన్యం పంట అమ్ముకుందామంటే గత వారం రోజుల నుంచి అకాల వర్షం రైతన్నలను వెంటాడుతూనే ఉంది. ఏటు చూసినా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు అకాల వర్షం, మరోవైపు లారీల కొరత ఈ కష్టాలు మాకేనా అంటూ అన్నమొ రామచంద్ర అంటూ రైతన్నలు బోరున విలిపిస్తున్నారు.
Rain haunts
ఒకవైపు సొసైటీ పాలకవర్గాల నిర్లక్ష్యం తోటి రైతుల వరి ధాన్యం తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. లారీలు రాక వెనుకబడ్డ రైతులకు ఒక్క బస్తాకు సుమారు రెండు రూపాయలకు నుంచి నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా వివిధ గ్రామాల రైతులు మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండిస్తే పండించిన పంట డబ్బులు చేతికొచ్చే వరకు రైతుల కళ్ళల్లో కన్నీరే కాదు రక్త నీరు వస్తున్నాయి.
Rain haunts
ఎటు చూసినా రైతుల కష్టాలు.. రైతుల వైపు కన్నెత్తి చూడని రాజకీయ నాయకులు.. వారికి అవసరం ఉంటేనే పలకరిస్తారు … రైతుల నుంచి ఏ యొక్క రాజకీయ నాయకుడు రైతుల పక్షాన ధర్నా చేసిన దాఖలాలు లేవు. కొనుగోలు కేంద్రాలలో నిలిచిన వరి ధాన్యాన్ని జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని కొనుగోలు కేంద్రాల్లో నిలిచిన వరి ధాన్యాన్ని అతి తొందరగా తరలించాలని వివిధ గ్రామాల రైతులు జిల్లా అధికార యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు.
మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి అక్రమంగా ముందస్తు అరెస్ట్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మల్గి మాజీ సర్పంచ్ జల్గొండ మారుతి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శివరాజ్ శ్రీకాంత్ రెడ్డిలను శుక్రవారం పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకొని అక్రమ నిర్బంధాలతో, అక్రమంగా హద్నూర్ పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీస్ సిబ్బంది ముందస్తు అరెస్టు చేసినారు.
కోహీర్, మండల్ కు చెందిన ప్రముఖ మరియు సుప్రసిద్ధ వ్యక్తి, ముహమ్మద్ సజ్జాద్ పటేల్ చిష్తి, మోహి ఖాద్రీ రిజ్వానీ అహ్మదీ యూసుఫీ,అల్-నైబీ అల్-మిర్జా కలందరీ,సజ్జాదా నషిన్ అస్తానా,ప్రస్తుతం జహీరాబాద్ లో నివసిస్తున్న గురుజువాడ నివాసి అహ్మద్ హుస్సేన్ గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు గురుజువాడ లో సాయంత్రం మగ్రిబ్ ప్రార్థన తర్వాత మృతుడి అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి.పూర్వీకుల స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రాణాలతో బయటపడిన వారిలో అతని భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.
నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?
◆ రైతులను ముంచేందుకు రెడీ అవుతున్న ముఠాలు
◆ అన్నదాతలకు నకిలీ విత్తనాలు అంటగట్టే కుట్ర
◆ ఏటా రూ. కోట్లలో నకిలీ దందా.. నిండా మోసపోతున్న రైతులు
◆ రైతులకు రక్షణగా అనేక చట్టాలు.. అవగాహన లేక అన్యాయం
ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్నది. దీంతో రైతులను నిలువునా ముంచేందుకు నకిలీ కేటు గాళ్లు సిద్ధమైపోతున్నారు. ప్రతి ఏడాది రైతులకు నకిలీ విత్తనాలను అంటగట్టడం.. వారిని నిండా ముంచడం నకిలీ వ్యాపారులకు పరిపాటిగా మారింది. సరైన అవగాహన లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతంగా నకిలీ విత్తనాలను తయారుచేస్తున్నారు. దీంతో రైతులు నకిలీ విత్తనాలు నాటి నిండా మునిగిపోతున్నారు. ఆ తర్వాత పరిహారం కూడా పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది రూ. కోట్లల్లో రైతులు నష్టపోతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి.. ఆశించిన దిగుబడి రాక అగచాట్లు పడుతున్నారు. అయితే విత్తన రక్షణకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నప్పటికీ రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే మోసాలకు గురవుతున్నారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ రైతులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు విత్తన పత్తిని సాగు చేస్తుంటారు. ఈ విత్తనపత్తిని సాగుచేసిన అనంతరం విత్తనాలను కంపెనీలకు విక్రయిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని విత్తనాలు విఫలమవుతాయి. మధ్య దళారులు వీటిని రైతుల నుంచి సేకరించి అక్రమదందాకు తెరలేపుతున్నారు. కంపెనీల లేబుళ్లు వేసి అచ్చం అసలు విత్తనాలలాగే ఈ కంపెనీలు విత్తనాలను తయారు చేస్తున్నాయి.
Fake seeds
విజిలెన్స్ తనిఖీలు అంతంతే..
రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీలు సైతం అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి విత్తనాలు సేకరించిన కంపెనీలు విఫలమైన విత్తనాల వివరాలను రైతుల పేరుతో సహా వ్యవసాయశాఖకు అందించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు పెద్దగా అమలు కావడం లేదని తెలుస్తున్నది. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ వ్యవస్థ తనిఖీలు సక్రమంగా లేకపోవటంతో నకిలీ విత్తనాలు నామమాత్రంగానే పట్టుబడుతున్నాయి. ఒకవేళ రైతులు నకిలీ విత్తనాలు సాగు చేసి మోసపోతే ఏం చేయాలి.. వారికి రక్షణగా ఉన్న చట్టాలేమిటిఝ.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ రైతులకు కొన్ని విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.
నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే ?
నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు.విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?
అమలులో ఉన్న విత్తన చట్టాలు –
– అభివృద్ధి చేసిన విత్తనాలు & మొలకల చట్టం, 1951 – విత్తనాల చట్టం, 1966 – కొత్త వంగడాల రక్షణ & రైతు హక్కుల చట్టం, 2001 – పత్తి విత్తనాల చట్టం, 2007
పరిహారం పొందే మార్గాలు..
నాణ్యత లేని విత్తనాలు సాగు చేసి రైతులు మోసపోతే వినియోగదారుల ఫోరమ్ లో కేసు వేయొచ్చు. సివిల్ కోర్టులోనూ కేసులు దాఖలు చేయొచ్చు. పత్తి విత్తనాల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. రిజిస్టర్ అయినా కొత్త వంగడాల్లో నాణ్యతా లోపం అయితే రైతు హక్కుల చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. విత్తనాలు మొలకెత్తకపోయినా.. దిగుబడి ఏమాత్రం రాకపోయినా పరిహారం పొందే అవకాశం ఉంది. విత్తనాల కోసం చెల్లించిన ధరను, సాగు ఖర్చు, దిగుబడి విలువ, రైతుకు కలిగిన మానసిక క్షోభకు సైతం పరిహారం పొందే అవకాశం ఉంది.
రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
విత్తనాలు కొన్నపుడు రసీదు తప్పక తీసుకోవాలి.
విత్తనాలు ఉంచిన డబ్బా/సంచి దాచి ఉంచాలి.
విత్తనాల గురించి సమాచారం తెలుపుతు ఇచ్చిన కాగితాలను దాచి ఉంచాలి
వీలైతే కొన్ని విత్తనాలను కూడా భద్రపరచాలి
పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ అధికారికి, సంబంధిత డీలర్/కంపెనీ ప్రతినిధికి తెలియజేయాలి.
నష్ట పరిహారం కోసం కేసు వెయ్యాలి / దరఖాస్తు చేసుకోవాలి.
జహీరాబాద్: నిమ్డ్ రైతుల ముందస్తు అరెస్ట్ లతో మామడ్దిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోనట్లు పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్డ్ ప్రాజెక్టుకు సారవంతమైన భూములు తీసుకోవద్దని వేడుకున్నా రైతుల అరెస్ట్ ను రైతు నాయకులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పేరు గ్రామానికి పోలీసులు రాగానే వందలాది మంది మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ.
◆ నేడు జహీరాబాద్ కి అక్బరుద్దీన్ ఓవైసీ రాక.
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆక్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ.. ఉపాధి అవకాశాలతో జహీరాబాద్లో కొత్త శకం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్/ఝరాసంగం: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం జహీరాబాద్ పర్యటన ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యుడు సంజీవరెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ , సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ ప్రాజెక్టు వెళ్లే రోడ్, ఝరాసంగం మండలం మార్చినూరులోని కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా సభ వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ , వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం చే నిమ్జ్ రోడ్డు ప్రారంభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) రహదారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్ కాల్ మండలం 17 గ్రామాలలో సుమారుగా 12,635 ఎకరాల భూమి సేకరించి 2.50 లక్షలమందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన లక్ష్యంగా జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి 2013లో ఏర్పాటయింది. పరిశ్రమల ఏర్పాటు కోసం మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2023 నుంచి 2025 వరకు రూ.100 కోట్లతో నిమ్జ్ కు ప్రత్యేక రహదారి నిర్మించారు. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు వరకు 9 కిలోమీటర్లు, వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు మార్గంలో అక్కడక్కడ 13 చోట్ల వంతెనలు నిర్మించారు. హుగ్గేల్లి క్రాస్ రోడ్ నుంచి కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపూర్ వరకు నిర్మించిన రోడ్డు మధ్యలో సుమారుగా 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి 131 కేవీ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలనుఅమర్చారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం నిమ్జ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
సభాస్థలి నుంచే రైల్వే ఓవర్ బ్రిడ్జి
జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలం నుంచే ప్రారంభించనున్నారు. మరో రూ.100 కోట్లతో నిర్మించిన నిమ్జ్ రోడ్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఝరాసంఘం మండలం మాచ్నూర్ గ్రామంలో రూ. 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మరో అరుదైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. లింగాయత్ సమాజ్ సృష్టికర్త విశ్వ గురువుగా కీర్తి కిరీటాన్ని సంపాదించిన అశ్వరుడా బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా సభ వేదిక ప్రాంగణంలో మరికొన్ని అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
ఝరాసంగం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్న నిజ్జా (జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి) రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు ప్రాంతం వరకు నిర్మించిన రోడ్డు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. రోడ్డు మధ్యలో సుమారు 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి, 131 కెవి విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా సందర్భంగా గురువారం రాత్రి పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలను ప్రారంభించారు. దీంతో రోడ్డు ప్రాంతం మొత్తం కాంతులతో మెరిసిపోయింది. బర్దిపూర్, చిలేపల్లి, పొట్టిపల్లి, ఎల్గోయి, చిలేపల్లి తండా, వనంపల్లి మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు విద్యుత్ కాంతులను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
విశాలమైన వాతావరణంలో చదువులు నేర్పాల్సిన హయత్ నగర్ పరిధిలోని రవీంద్రభారతి స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా శ్మశానవాటిక వద్ద పాఠశాలను నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ బీసి సంక్షేమ సంఘం,పేదల రిజర్వేషన్ పోరాట సమితితో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి,స్థానిక ఎమ్మార్వో, మండల విద్యాశాఖ అధికారులకు వేరువేరుగా పిర్యాదులు చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి శివ బహుజన్,పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గిరిగాని బీక్షపతి గౌడ్ మాట్లాడుతూ హయత్ నగర్ మండల కేంద్రంలోని హయత్ నగర్ గ్రామ పరిది కుంట్లూర్ రోడ్డులో స్మశాన వాటిక పక్కనే రవీంద్ర భారతి స్కూల్ గత కోంత కాలంగా విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరోపించారు.పాఠశాలలకు అనుకోని శ్మశానవాటిక ఉండడం వలన విద్యార్థులకు,తల్లిదండ్రులకు, స్థానిక ప్రజలకు, తీవ్రమైన అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు.నిత్యం దహన సంస్కారాలు జరుగుతుండడంతో కలుషితమైన విషపుపోగా,దుర్వాసనతో విద్యార్థులు అనారోగ్యాలకు గురైతున్నారని అవేదన వ్యక్తం చేశారు.అలాగే విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని తెలిపారు.ఈ విషయం పట్ల పలుమార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సమాచారం తెలిసినప్పటికి విద్యాశాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తుందని వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన రవీంద్ర భారతీ స్కూల్ పై శాఖ పరమైన చర్యలు చేపట్టి తక్షణమే అక్కడి నుండి వేరొక చోటికి తరలించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి,స్థానిక ఎమ్మార్వో,మండల విద్యాశాఖ అధికారులను కోరినట్లు ఆయా సంఘాల ప్రతినిధులు ఎర్ర శ్రీహరి గౌడ్,శివ బహుజన్, గిరిగాని బీక్షపతి గౌడ్ కోరారు.రవీంద్రభారతి స్కూల్ ను వెంటనే సీజ్ చెయ్యని పక్షంలో అన్ని ప్రజా సంఘలతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
కల్వకుర్తి లో బిజెపి ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఊచకోత కోసిన భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు, ప్రశంసలు తెలుపుతోంది….ఈ సందర్భాన్ని పురస్కరించుకొని త్రివిధ దళాలు అందించిన సేవలకు కృతజ్ఞతగా మరియు మన ఐక్యత చాటడానికి, మే 23 వ తేదీన సాయంత్రం 4:00 pm గంటలకు కల్వకుర్తి కాలేజీ గ్రౌండ్ నుండి శివాజీ చౌక్ వరకు ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించబడుతుంది…మన దేశ సైనికుల పోరాట పటిమను కీర్తిస్తూ, భారతదేశంపై ప్రేమను చాటుతూ ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రజలు , కుల సంఘాలు, వివిధ వృత్తి వ్యాపార సంఘాలు,యువజన సంఘాలు ,ప్రజా సంఘాలు ,విద్యార్థులు ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నా.
మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం… రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి (32) మృతుడు 3,4 రోజుల క్రితం మరణించి ఉండవచ్చని మృతుడు హిందూ మతానికి చెందిన వాడుగా ఆనవాళ్లు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. స్టేషన్ మాస్టర్ ప్రశాంత్ చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
రాళ్ల బండి శ్రీనివాస్ ను సన్మానించిన దేవస్థానం ఆలయ కమిటీ,
నేటి ధాత్రి మొగుళ్లపల్లి:
హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా మొగుళ్లపల్లి మండలం ముట్లపల్లి శ్రీ అభయాంజనేయ దేవస్థానం లో ఆలయ కమిటీ నిర్వాహకులు అక్షర దర్బార్ భూపాలపల్లి క్రైమ్ రిపోర్టర్ రాళ్ల బండి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు,ఆలయ అభివృద్ధికి కృషి చేసినా డాక్టర్ భజ్జూరి వెంకట రాఘవులు ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యం ను డాక్టర్ రఘుపతి రెడ్డి శ్రీ పెళ్లి రంజిత్ కిరణ్ ఇతర దాతలను ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గూడూరి రఘుపతి రెడ్డి డ్యాగా రమేష్ సామల మాధవ రెడ్డి అన్నారెడ్డి మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట రెడ్డి ఆలయ అర్చకులు రంగన్న చార్యులు భజన మండలి సభ్యులు పాల్గొనారు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి
-సమాచార హక్కు రక్షణ చట్టం-2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్.
వరంగల్ నేటిధాత్రి:
ప్రైవేట్ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరంకు ముందస్తుగానే అడ్మిషన్లు తీసుకుంటూ విద్యను వ్యాపారంగా మారుస్తూ లక్షల రూపాయలను పేద మధ్య తరగతి విద్యార్థుల నుండి కాజేస్తున్నారని వెంటనే జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాహుల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వేలు దాటి లక్షలకు చేరిందని, మేనేజ్మెంట్ కోట సీట్లకు యజమాన్యం చెప్పినంత ఫీజు విద్యార్థులు కట్టాల్సిందే లేదంటే నో అడ్మిషన్ అంటూ విద్యార్థుల జీవితాలపై ప్రైవేట్ విద్యాసంస్థలు చెలగాటం ఆడుతుందని తెలిపారు. జిల్లా రాష్ట్ర విద్యాధికారులు వెంటనే ముందస్తు అడ్మిషన్ల పేరుతో లక్షలు కాజేస్తున్న పలు ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఫీజు నియంత్రణ చట్టం రూపొందించకపోవడం, ముఖ్యమంత్రి విద్యార్థులపై శ్రద్ధ చూపకపోవడం వల్లే ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు కొన్ని సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు రాకపోవడం, ప్లీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను యజమాన్యాలు దౌర్జన్యంగా వారి వద్ద నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.
జహీరాబాద్ పట్టణ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శివలింగం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేవలం వారం రోజుల్లోనే రూ.3 కోట్ల విలువ గల ఆస్తి సంబంధిత నేరాన్ని ఛేదించి, కేసుల పరిష్కారంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆయన బుధవారం డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.
పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మీదుగా సరస్వతీ పుష్కరాలకు కాలేశ్వరం వెళుతున్న మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అంబేద్కర్ సెంటర్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్,పరకాల రూరల్ మండలం అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్,ఎర్రం రామన్న,చందుపట్ల రాజేందర్ రెడ్డి,కుక్కల విజయ్ కుమార్, సంగా పురుషోత్తం,చిర్ర సారంగపాణి,భాసాది సోమరాజు,ముత్యాల దేవేందర్,కుంటమల్ల గణేష్, ఆకుల రాంబాబు,ధర్నా సునీల్,కందుకూరి గిరిప్రసాద్, గాజుల రంజిత్,సారంగా నరేష్,పల్లెబోయిన భద్రయ్య, చంద్రిక అశోక్,ఆర్పీ సంగీత మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
24 మే 2025 నాడు జహీరాబాద్ కి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ వస్తున్నారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆక్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
రేగొండ, నేటిధాత్రి
రేగొండ మండలం కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీపతి మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా రమేష్, భరత్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ మరియు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కర్ణాకర్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.