ముహమ్మద్ సజ్జాద్ పటేల్ గుండెపోటుతో కన్నుమూశారు.

ముహమ్మద్ సజ్జాద్ పటేల్ గుండెపోటుతో కన్నుమూశారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కోహీర్, మండల్ కు చెందిన ప్రముఖ మరియు సుప్రసిద్ధ వ్యక్తి, ముహమ్మద్ సజ్జాద్ పటేల్ చిష్తి, మోహి ఖాద్రీ రిజ్వానీ అహ్మదీ యూసుఫీ,అల్-నైబీ అల్-మిర్జా కలందరీ,సజ్జాదా నషిన్ అస్తానా,ప్రస్తుతం జహీరాబాద్ లో నివసిస్తున్న గురుజువాడ నివాసి అహ్మద్ హుస్సేన్ గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు గురుజువాడ లో సాయంత్రం మగ్రిబ్ ప్రార్థన తర్వాత మృతుడి అంత్యక్రియల ప్రార్థనలు జరిగాయి.పూర్వీకుల స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. ప్రాణాలతో బయటపడిన వారిలో అతని భార్య, ఇద్దరు కుమార్తెలు మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు.

మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.

మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలొస్తున్నాయి.. రైతన్నాజర భద్రం!

జహీరాబాద్ నేటి ధాత్రి:

నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు. విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?

◆ రైతుల‌ను ముంచేందుకు రెడీ అవుతున్న ముఠాలు

◆ అన్న‌దాత‌ల‌కు న‌కిలీ విత్త‌నాలు అంట‌గ‌ట్టే కుట్ర

◆ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్న వ్య‌వ‌సాయాధికారులు

◆ ఏటా రూ. కోట్ల‌లో న‌కిలీ దందా.. నిండా మోస‌పోతున్న రైతులు

◆ రైతుల‌కు ర‌క్ష‌ణ‌గా అనేక చ‌ట్టాలు.. అవ‌గాహ‌న లేక అన్యాయం

ఖ‌రీఫ్ సీజ‌న్ స‌మీపిస్తున్న‌ది. దీంతో రైతుల‌ను నిలువునా ముంచేందుకు న‌కిలీ కేటు గాళ్లు సిద్ధ‌మైపోతున్నారు. ప్ర‌తి ఏడాది రైతుల‌కు న‌కిలీ విత్త‌నాల‌ను అంట‌గ‌ట్ట‌డం.. వారిని నిండా ముంచ‌డం న‌కిలీ వ్యాపారుల‌కు ప‌రిపాటిగా మారింది. స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. అసలేదో నకిలీ ఏదో గుర్తుపట్టలేనంతంగా నకిలీ విత్తనాలను తయారుచేస్తున్నారు. దీంతో రైతులు నకిలీ విత్తనాలు నాటి నిండా మునిగిపోతున్నారు. ఆ తర్వాత పరిహారం కూడా పొందలేకపోతున్నారు. ప్రతి ఏడాది రూ. కోట్లల్లో రైతులు నష్టపోతున్నారు. విత్తనాలు కొనుగోలు చేసి.. ఆశించిన దిగుబడి రాక అగచాట్లు పడుతున్నారు. అయితే విత్తన రక్షణకు సంబంధించి అనేక చట్టాలు ఉన్నప్పటికీ రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్లే మోసాలకు గురవుతున్నారని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రతి ఏడాది నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేస్తూనే ఉన్నది. అయినప్పటికీ రైతులు మాత్రం మోసపోతూనే ఉన్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు విత్తన పత్తిని సాగు చేస్తుంటారు. ఈ విత్తనపత్తిని సాగుచేసిన అనంతరం విత్తనాలను కంపెనీలకు విక్రయిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని విత్తనాలు విఫలమవుతాయి. మధ్య దళారులు వీటిని రైతుల నుంచి సేకరించి అక్రమదందాకు తెరలేపుతున్నారు. కంపెనీల లేబుళ్లు వేసి అచ్చం అసలు విత్తనాలలాగే ఈ కంపెనీలు విత్తనాలను తయారు చేస్తున్నాయి.

Fake seeds

విజిలెన్స్ తనిఖీలు అంతంతే..

రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ తనిఖీలు సైతం అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతుల నుంచి విత్తనాలు సేకరించిన కంపెనీలు విఫలమైన విత్తనాల వివరాలను రైతుల పేరుతో సహా వ్యవసాయశాఖకు అందించాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు పెద్దగా అమలు కావడం లేదని తెలుస్తున్నది. విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ వ్యవస్థ తనిఖీలు సక్రమంగా లేకపోవటంతో నకిలీ విత్తనాలు నామమాత్రంగానే పట్టుబడుతున్నాయి. ఒకవేళ రైతులు నకిలీ విత్తనాలు సాగు చేసి మోసపోతే ఏం చేయాలి.. వారికి రక్షణగా ఉన్న చట్టాలేమిటిఝ.. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ క‌మిష‌న్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ రైతులకు కొన్ని విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.

నకిలీ విత్తనాలతో నష్టం జరిగితే ?

నాణ్యమైన విత్తనం రైతు హక్కు. కానీ, ప్రతి పంట సీజన్లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతూనే ఉన్నారు.విత్తన నాణ్యతలో లోపం వలన కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తకనో, ఆశించిన దిగుబడి రాకనో ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఏమి ఉన్నాయి? నష్ట పరిహారం పొందే మార్గాలు ఉన్నాయా? రైతులు ఏమి చెయ్యాలి?

అమలులో ఉన్న విత్తన చట్టాలు –

– అభివృద్ధి చేసిన విత్తనాలు & మొలకల చట్టం, 1951
– విత్తనాల చట్టం, 1966
– కొత్త వంగడాల రక్షణ & రైతు హక్కుల చట్టం, 2001
– పత్తి విత్తనాల చట్టం, 2007

పరిహారం పొందే మార్గాలు..

నాణ్యత లేని విత్తనాలు సాగు చేసి రైతులు మోసపోతే వినియోగదారుల ఫోరమ్ లో కేసు వేయొచ్చు. సివిల్ కోర్టులోనూ కేసులు దాఖలు చేయొచ్చు. పత్తి విత్తనాల చట్టం క్రింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. రిజిస్టర్ అయినా కొత్త వంగడాల్లో నాణ్యతా లోపం అయితే రైతు హక్కుల చట్టం క్రింద కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. విత్తనాలు మొలకెత్తకపోయినా.. దిగుబడి ఏమాత్రం రాకపోయినా పరిహారం పొందే అవకాశం ఉంది. విత్తనాల కోసం చెల్లించిన ధరను, సాగు ఖర్చు, దిగుబడి విలువ, రైతుకు కలిగిన మానసిక క్షోభకు సైతం పరిహారం పొందే అవకాశం ఉంది.

రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..

విత్తనాలు కొన్నపుడు రసీదు తప్పక తీసుకోవాలి.

విత్తనాలు ఉంచిన డబ్బా/సంచి దాచి ఉంచాలి.

విత్తనాల గురించి సమాచారం తెలుపుతు ఇచ్చిన కాగితాలను దాచి ఉంచాలి

వీలైతే కొన్ని విత్తనాలను కూడా భద్రపరచాలి

పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ అధికారికి, సంబంధిత డీలర్/కంపెనీ ప్రతినిధికి తెలియజేయాలి.

నష్ట పరిహారం కోసం కేసు వెయ్యాలి / దరఖాస్తు చేసుకోవాలి.

నిమ్స్ రైతుల ఆందోళన మామడ్దిలో ఉద్రిక్తత.

నిమ్స్ రైతుల ఆందోళన.. మామడ్దిలో ఉద్రిక్తత.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్: నిమ్డ్ రైతుల ముందస్తు అరెస్ట్ లతో
మామడ్దిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు పోనట్లు పోలీసులు అడ్డుకుంటున్నారు. నిమ్డ్ ప్రాజెక్టుకు సారవంతమైన భూములు తీసుకోవద్దని వేడుకున్నా రైతుల అరెస్ట్ ను రైతు నాయకులు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు. అరెస్టుల పేరు గ్రామానికి పోలీసులు రాగానే వందలాది మంది మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ పోలీసుల వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

నేడు జహీరాబాద్ కి అక్బరుద్దీన్ ఓవైసీ రాక.

ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ.

◆ నేడు జహీరాబాద్ కి అక్బరుద్దీన్ ఓవైసీ రాక.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆ‌‌క్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ..

జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ.. ఉపాధి అవకాశాలతో జహీరాబాద్లో కొత్త శకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగం: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం జహీరాబాద్ పర్యటన ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యుడు సంజీవరెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ , సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ ప్రాజెక్టు వెళ్లే రోడ్, ఝరాసంగం మండలం మార్చినూరులోని కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా సభ వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ , వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం చే నిమ్జ్ రోడ్డు ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) రహదారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్ కాల్ మండలం 17 గ్రామాలలో సుమారుగా 12,635 ఎకరాల భూమి సేకరించి 2.50 లక్షలమందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన లక్ష్యంగా జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి 2013లో ఏర్పాటయింది. పరిశ్రమల ఏర్పాటు కోసం మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2023 నుంచి 2025 వరకు రూ.100 కోట్లతో నిమ్జ్ కు ప్రత్యేక రహదారి నిర్మించారు. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు వరకు 9 కిలోమీటర్లు, వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు మార్గంలో అక్కడక్కడ 13 చోట్ల వంతెనలు నిర్మించారు. హుగ్గేల్లి క్రాస్ రోడ్ నుంచి కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపూర్ వరకు నిర్మించిన రోడ్డు మధ్యలో సుమారుగా 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి 131 కేవీ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలనుఅమర్చారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం నిమ్జ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

సభాస్థలి నుంచే రైల్వే ఓవర్ బ్రిడ్జి

జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలం నుంచే ప్రారంభించనున్నారు. మరో రూ.100 కోట్లతో నిర్మించిన నిమ్జ్ రోడ్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఝరాసంఘం మండలం మాచ్నూర్ గ్రామంలో రూ. 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మరో అరుదైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. లింగాయత్ సమాజ్ సృష్టికర్త విశ్వ గురువుగా కీర్తి కిరీటాన్ని సంపాదించిన అశ్వరుడా బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా సభ వేదిక ప్రాంగణంలో మరికొన్ని అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

నిమ్డ్ రోడ్డు జిగేల్.

నిమ్డ్ రోడ్డు “జిగేల్”

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
శుక్రవారం ప్రారంభించనున్న నిజ్జా (జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి) రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు ప్రాంతం వరకు నిర్మించిన రోడ్డు విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. రోడ్డు మధ్యలో సుమారు 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి, 131 కెవి విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్న సందర్భంగా సందర్భంగా గురువారం రాత్రి పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలను ప్రారంభించారు. దీంతో రోడ్డు ప్రాంతం మొత్తం కాంతులతో మెరిసిపోయింది. బర్దిపూర్, చిలేపల్లి, పొట్టిపల్లి, ఎల్గోయి, చిలేపల్లి తండా, వనంపల్లి మీదుగా వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు విద్యుత్ కాంతులను చూసి ఆనందం వ్యక్తం చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా రవీంద్ర భారతి స్కూల్.

నిబంధనలకు విరుద్ధంగా రవీంద్ర భారతి స్కూల్.

స్మశానవాటిక అనుకొని పాఠశాల భవనం.

భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు…

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు.

హైదారాబాద్/హయత్ నగర్,నేటిధాత్రి:

విశాలమైన వాతావరణంలో చదువులు నేర్పాల్సిన హయత్ నగర్ పరిధిలోని రవీంద్రభారతి స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా శ్మశానవాటిక వద్ద పాఠశాలను నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ బీసి సంక్షేమ సంఘం,పేదల రిజర్వేషన్ పోరాట సమితితో పాటు పలు సంఘాల ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి,స్థానిక ఎమ్మార్వో, మండల విద్యాశాఖ అధికారులకు వేరువేరుగా పిర్యాదులు చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, తెలంగాణ బీసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి శివ బహుజన్,పేదల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గిరిగాని బీక్షపతి గౌడ్ మాట్లాడుతూ హయత్ నగర్ మండల కేంద్రంలోని హయత్ నగర్ గ్రామ పరిది కుంట్లూర్ రోడ్డులో స్మశాన వాటిక పక్కనే రవీంద్ర భారతి స్కూల్ గత కోంత కాలంగా విద్యా శాఖ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని ఆరోపించారు.పాఠశాలలకు అనుకోని శ్మశానవాటిక ఉండడం వలన విద్యార్థులకు,తల్లిదండ్రులకు, స్థానిక ప్రజలకు, తీవ్రమైన అసౌకర్యంగా ఉందని వాపోతున్నారు.నిత్యం దహన సంస్కారాలు జరుగుతుండడంతో కలుషితమైన విషపుపోగా,దుర్వాసనతో విద్యార్థులు అనారోగ్యాలకు గురైతున్నారని అవేదన వ్యక్తం చేశారు.అలాగే విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని తెలిపారు.ఈ విషయం పట్ల పలుమార్లు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.సమాచారం తెలిసినప్పటికి విద్యాశాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తుందని వారు పేర్కొన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన రవీంద్ర భారతీ స్కూల్ పై శాఖ పరమైన చర్యలు చేపట్టి తక్షణమే అక్కడి నుండి వేరొక చోటికి తరలించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్,జిల్లా విద్యాశాఖ అధికారి,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి,స్థానిక ఎమ్మార్వో,మండల విద్యాశాఖ అధికారులను కోరినట్లు ఆయా సంఘాల ప్రతినిధులు ఎర్ర శ్రీహరి గౌడ్,శివ బహుజన్, గిరిగాని బీక్షపతి గౌడ్ కోరారు.రవీంద్రభారతి స్కూల్ ను వెంటనే సీజ్ చెయ్యని పక్షంలో అన్ని ప్రజా సంఘలతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కల్వకుర్తిలో తిరంగా ర్యాలీ.

కల్వకుర్తిలో తిరంగా ర్యాలీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

కల్వకుర్తి లో బిజెపి ఆధ్వర్యంలో ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఊచకోత కోసిన భారత సైన్యానికి దేశమంతా ఏకమై అభినందనలు, ప్రశంసలు తెలుపుతోంది….ఈ సందర్భాన్ని పురస్కరించుకొని త్రివిధ దళాలు అందించిన సేవలకు కృతజ్ఞతగా మరియు మన ఐక్యత చాటడానికి, మే 23 వ తేదీన సాయంత్రం 4:00 pm గంటలకు కల్వకుర్తి కాలేజీ గ్రౌండ్ నుండి శివాజీ చౌక్ వరకు ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించబడుతుంది…మన దేశ సైనికుల పోరాట పటిమను కీర్తిస్తూ, భారతదేశంపై ప్రేమను చాటుతూ ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రజలు , కుల సంఘాలు, వివిధ వృత్తి వ్యాపార సంఘాలు,యువజన సంఘాలు ,ప్రజా సంఘాలు ,విద్యార్థులు ఈ తిరంగా యాత్రలో పాల్గొనాలని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నా.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

రాజాపూర్  నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం… రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి (32) మృతుడు 3,4 రోజుల క్రితం మరణించి ఉండవచ్చని మృతుడు హిందూ మతానికి చెందిన వాడుగా ఆనవాళ్లు ఉన్నాయన్నారు. మృతదేహాన్ని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. స్టేషన్ మాస్టర్ ప్రశాంత్ చారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

రాళ్ల బండి శ్రీనివాస్ ను సన్మానించిన దేవస్థానం ఆలయ.

రాళ్ల బండి శ్రీనివాస్ ను సన్మానించిన దేవస్థానం ఆలయ కమిటీ,

నేటి ధాత్రి మొగుళ్లపల్లి:

 

 

హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా మొగుళ్లపల్లి మండలం ముట్లపల్లి శ్రీ అభయాంజనేయ దేవస్థానం లో ఆలయ కమిటీ నిర్వాహకులు అక్షర దర్బార్ భూపాలపల్లి క్రైమ్ రిపోర్టర్ రాళ్ల బండి శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు,ఆలయ అభివృద్ధికి కృషి చేసినా డాక్టర్ భజ్జూరి వెంకట రాఘవులు ఆదిత్య హాస్పిటల్ యాజమాన్యం ను డాక్టర్ రఘుపతి రెడ్డి శ్రీ పెళ్లి రంజిత్ కిరణ్ ఇతర దాతలను ఆలయ కమిటీ నిర్వాహకులు సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గూడూరి రఘుపతి రెడ్డి డ్యాగా రమేష్ సామల మాధవ రెడ్డి అన్నారెడ్డి మాజీ సర్పంచ్ నరహరి పద్మ వెంకట రెడ్డి ఆలయ అర్చకులు రంగన్న చార్యులు భజన మండలి సభ్యులు పాల్గొనారు

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లపై అధికారులు.

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి

-సమాచార హక్కు రక్షణ చట్టం-2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్.

వరంగల్ నేటిధాత్రి:

ప్రైవేట్ విద్యాసంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరంకు ముందస్తుగానే అడ్మిషన్లు తీసుకుంటూ విద్యను వ్యాపారంగా మారుస్తూ లక్షల రూపాయలను పేద మధ్య తరగతి విద్యార్థుల నుండి కాజేస్తున్నారని వెంటనే జిల్లా విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 వరంగల్ జిల్లా స్టూడెంట్ కన్వీనర్ ఎద్దు రాహుల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాహుల్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ వంటి కోర్సులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో వేలు దాటి లక్షలకు చేరిందని, మేనేజ్మెంట్ కోట సీట్లకు యజమాన్యం చెప్పినంత ఫీజు విద్యార్థులు కట్టాల్సిందే లేదంటే నో అడ్మిషన్ అంటూ విద్యార్థుల జీవితాలపై ప్రైవేట్ విద్యాసంస్థలు చెలగాటం ఆడుతుందని తెలిపారు. జిల్లా రాష్ట్ర విద్యాధికారులు వెంటనే ముందస్తు అడ్మిషన్ల పేరుతో లక్షలు కాజేస్తున్న పలు ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం, ఫీజు నియంత్రణ చట్టం రూపొందించకపోవడం, ముఖ్యమంత్రి విద్యార్థులపై శ్రద్ధ చూపకపోవడం వల్లే ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులకు కొన్ని సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు రాకపోవడం, ప్లీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను యజమాన్యాలు దౌర్జన్యంగా వారి వద్ద నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు.

శివలింగం ఉత్తమ సేవలకు గుర్తింపు.

శివలింగం ఉత్తమ సేవలకు గుర్తింపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శివలింగం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కేవలం వారం రోజుల్లోనే రూ.3 కోట్ల విలువ గల ఆస్తి సంబంధిత నేరాన్ని ఛేదించి, కేసుల పరిష్కారంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆయన బుధవారం డీజీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఈటెలకు ఘనస్వాగతం.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఈటెలకు ఘనస్వాగతం

 

పరకాల నేటిధాత్రి

 

పరకాల పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల మీదుగా సరస్వతీ పుష్కరాలకు కాలేశ్వరం వెళుతున్న మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అంబేద్కర్ సెంటర్ వద్ద వారికి ఘనంగా స్వాగతం పలికి వారిని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంత్ లాల్,పరకాల రూరల్ మండలం అధ్యక్షుడు కాసగాని రాజ్ కుమార్,ఎర్రం రామన్న,చందుపట్ల రాజేందర్ రెడ్డి,కుక్కల విజయ్ కుమార్, సంగా పురుషోత్తం,చిర్ర సారంగపాణి,భాసాది సోమరాజు,ముత్యాల దేవేందర్,కుంటమల్ల గణేష్, ఆకుల రాంబాబు,ధర్నా సునీల్,కందుకూరి గిరిప్రసాద్, గాజుల రంజిత్,సారంగా నరేష్,పల్లెబోయిన భద్రయ్య, చంద్రిక అశోక్,ఆర్పీ సంగీత మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జహీరాబాద్ కి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ వస్తున్నారు.

24 మే 2025 నాడు జహీరాబాద్ కి అక్బర్ ఉద్దీన్ ఓవైసీ వస్తున్నారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని ఈద్గా మైదానంలో 24 మే 2025 నాడు ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన సభ నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలెద్ సైఫుల్లా రహ్మాని గారు అధ్యక్షత వహిస్తారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాంద్రాయణగుట్ట శాసనసభ్యులు మజ్లిస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ పాల్గొంటారు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ శెట్కార్ గారు మరియు జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారు మరియు ఈ కార్యక్రమానికి స్థానిక కన్వీనర్ ముఫ్తిసుబూర్ ఖాస్మి వివిధ జమాత్ ల మత పెద్దలు మరియు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వివిధ ఆర్గనైజేషన్ పెద్దలు పాల్గొని సంబోధిస్తారు కులాలు మతాలకు అతీతంగా పాల్గొనాలని జహీరాబాద్ మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ అత్తర్ అహ్మద్ మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహియుద్దీన్ గౌరి ముస్లిమ్ ఆ‌‌క్శన్ కమేటి అధ్యక్షుడు మొహమ్మద్ యూసుఫ్ యమ్.పి.జే అధ్యక్షుడు మొహమ్మద్ అయ్యూబ్ ఝరాసంగం మండల అధ్యక్షుడు షేక్ రబ్బాని తెలిపారు ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక.

కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక

రేగొండ, నేటిధాత్రి

 

రేగొండ మండలం కనపర్తి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశానుసారం ఎన్నుకున్నట్లు కనపర్తి ఎంపీటీసీ పరిధి ఇంఛార్జ్ బోయిన వినోద్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా శ్రీపతి మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా రమేష్, భరత్, ప్రధాన కార్యదర్శిగా ప్రకాష్ మరియు యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కర్ణాకర్ ను ఎన్నుకున్నట్లు వినోద్ తెలిపారు. వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసే విధంగా చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో భూపాలపల్లి మరింతగా అభివృద్ధి చెందుతున్నారు. నూతనంగా ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

ఫర్టిలైజర్స్ సీడ్స్ దుకాణాల్లో తనిఖీలు.

పోలీస్,వ్యవసాయ శాఖల ఉమ్మడి తనిఖీలు.

నర్సంపేట నేటిధాత్రి:

దుగ్గొండి మండలంలోని ఫర్టిలైజర్స్, సీడ్స్ దుకాణాల్లో పోలీస్ శాఖ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు.వర్షాకాలం నేపథ్యంలో నకిలీ విత్తనాలు రైతులకు అమ్ముతున్నారా అని నేపథ్యంలో దుగ్గొండి మండలంలోని విత్తనాల షాపులను దుగ్గొండి సీఐ సాయిరమణ,నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడిగా తనిఖీలు నిర్వహించారు.

Fertilizer

ఎరువుల దుకాణాల యజమానులకు ఎలాంటి నకిలీ విత్తనాలు, పత్తి గింజలు మిరప గింజలు,మొక్కజొన్నలు,పెసర్లు రైతులకు సంబంధించిన నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడిఏ దామోదర్ రెడ్డి,సీఐ సాయిరమణ హెచ్చరించారు.ఈ తనిఖీల్లో ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు, నర్సంపేట ఏవో కృష్ణ కుమార్, దుగ్గొండి ఏవో మాధవి, చెన్నారావుపేట ఏవో గోపాల్ రెడ్డి, దుగ్గొండి ఏఈఓ విజయంతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

గణపురం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ.

గణపురం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో భూపాలపల్లి నియోజకవర్గ గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా రెండోసారి ఓరుగంటి కృష్ణను ఎన్నుకోవడం జరిగింది కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు మామిళ్ళ మల్లేష్ పసునూటి శంకర్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఓరుగంటి కృష్ణ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని రెండోసారి గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి నాకు సహకరించిన పార్టీ నాయకులు గ్రామస్తులు అలాగే నా యొక్క మిత్ర బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు

ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు.

ఉప్పల్ తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయించండి

ప్రజల ఇబ్బందులు తీర్చండి

కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లిన వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్ నేటిధాత్రి:

గురువారం అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 25.85 కోట్లతో పునరాభివృద్ధి చేసిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు.
రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కరీంనగర్లో జరిగిన రైల్వేస్టేషన్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రతిరోజు రైలు నడపాలని కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి వినతి పత్రం అందజేశారని, ఈవిషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ తీసుకొని, ఈఅభ్యర్థనకు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కోరారని తెలిపారు. జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి, ఉప్పల్ రైల్వే బ్రిడ్జి కంప్లీట్ అయ్యేలా, తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ ని రాజేందర్ రావు కోరారు. రైల్వే బ్రిడ్జిల నిర్మాణ పనులు ఆలస్యం కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి రాజేందర్ రావు తీసుకొచ్చారు. వీటిపై ప్రత్యేక దృష్టిసారించి బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకొని, ప్రజలు ప్రయాణికులు ఇబ్బందులు తీర్చాలని రాజేందర్ రావ్ కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశంలో నూటమూడు స్టేషన్లలో తెలంగాణ నుండి కరీంనగర్ , వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్ లను పునరాభివృద్ధి చేసి ప్రారంభించుకోవడం రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కరీంనగర్ ప్రజలు రైల్వే శాఖ సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో కరీంనగర్ ఎంపీగా పని చేసిన పొన్నం ప్రభాకర్ కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారని గుర్తు చేశారు. నాడు యూపీఏ ప్రభుత్వ హయంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దడానికి ప్రత్యేక చొరవ చూపారని తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మారుతున్న కాలానికి అనుగుణంగా రైల్వే శాఖ అధికారులు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని వెలిచాల రాజేందర్ రావు కోరారు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక పథకాలు.

యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి.కమలాకర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రత్యేక రుణ పథకాలు అందజేయనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ గంటి. కమలాకర్ తెలిపారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవసాయ రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని “అగ్రికల్చర్ రైజ్” పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వరి మిల్లులు, తడి మరియు పొడి ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, గ్రేడింగ్, ప్యాకింగ్ మరియు ఇతర వ్యవసాయ ఆధారిత చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తక్కువ వడ్డీ రేటుతో ప్రత్యేక రుణాలు మంజూరు చేయబోతున్నది. ఈ నేపథ్యంలో నర్సంపేట యూనియన్ బ్యాంకు మేనేజర్ జీ బాలాజీ ఆధ్వర్యంలో మిల్లర్ల సంఘ భాద్యులతో, వర్తక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా యూనియన్ బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ “వ్యవసాయ రంగానికి విలువ జోడించే పరిశ్రమల ప్రోత్సాహంతో రైతులకు మెరుగైన ధరలూ, ఉపాధి అవకాశాలూ అందుతాయన్నారు. ఈ క్రమంలోనే రుణాల ప్రక్రియను వేగవంతం చేసి, సులభంగా రుణాలు అందుబాటులోకి తెస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రీజినల్ హెడ్ గంటి. కమలాకర్, డిప్యూటీ రీజినల్ హెడ్ మహేష్, బ్రాంచ్ మేనేజర్ జీ.బాలాజీ, ఫీల్డ్ ఆఫీసర్ శుశాంత్, రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు గోనెల రవీందర్, ఇరుకు కొటేశ్వర్, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు దాసరి నర్సింహ రెడ్డి,బ్యాంక్ మిత్ర అడ్డగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి..

సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఈ నెల 23న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేశ్కుమార్ షెట్కార్, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డితో కలిసి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న బసవేశ్వర విగ్రహం, నిమ్ రోడ్డు, కేంద్రీయ విద్యాలయ భవనం, సభా స్థలం తదితర ప్రాంతాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ, వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ ద్వారా తాగునీరు, టాయిలెట్స్ వంటి అన్ని పనులు పూర్తయ్యాయని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version