
చంద్రబాబు కృషితోనే స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా
చిత్తూరు/పలమనేరు,నేటి ధాత్రి: ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా లభించిందని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమను ఆనాడు నష్టాల నుంచి నేడు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేక్కించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారమన్నారు.వేలాది మంది తెలుగువారు విరోచిత…