7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం.

7న కేతకి ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రమాణ స్వీకారం

జహీరాబాద్ నేటివ్ ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం లోని ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఈనెల 7న నిర్వహించనున్నట్టు తెలిపారు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న పాలకమండలి ప్రమాణ స్వీకారం ఈనెల 7తో జరగనుంది అని తెలిసింది.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి.

సిరిసిల్ల 9వ వార్డు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణి

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణం 9వ వార్డు (సర్ధాపూర్, జెగ్గరావుపల్లె) లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి గారు గంభీరావుపేట ప్రశాంత్ గౌడ్ గారు.

 

Ration shop.

బాలకీస్టాయ్య, యాదయ్యా,రాజనర్సు,కనకయ్య,రాములు,ఉపేందర్, షాధుల్, అంజయ్య, తిరుపతి, మోఫిక్, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వనికి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పారు..

రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి.

రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలి

★గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించిన జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్

జహీరాబాద్. నేటి ధాత్రి:

టీపీసీసీ ఏక్సిక్యూటివ్ మెంబెర్ ధనాలక్మి
కోహిర్ మండలంలోని పిచరాగాడి గ్రామంలో “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ” రాజ్యాంగ పరిరక్షణ సన్నాక సమావేశం మరియు పాదయాత్ర నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్. మరియు టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ ధనలక్ష్మి కోహిర్ మండల పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి పౌరుని హక్కు అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానిస్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నామని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క విలువలు రాజ్యాంగ స్ఫూర్తిని గ్రామ ప్రజలకు వివరించారు. యాత్రలో పాల్గొన్న ప్రజలందరికీ మాజీ మంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అర్షద్ గ్రామ పార్టీ అధ్యక్షులు వీర రెడ్డి,కోహిర్ టౌన్ అధ్యక్షులు.శంషీర్,మాజీ ఎంపిపి షౌకత్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజమ్మిల్,బాడంపేట్ ఆలయ కమిటీ చైర్మన్ దయానంద పాటిల్, మాజీ సర్పంచ్ అంజయ్య ,మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

సన్న బియ్యం పథకాన్ని వినియోగించుకోవాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని జహీరాబాద్ లోని ఫరీద్ నగర్ కాలనీలో రేషన్ షాప్ నెంబర్ 46 వాడు ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాల ఉద్దేశ్యం, సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే అన్నారు. ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించబడిందని తెలిపారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని సజావుగా అమలు చేస్తామని తెలిపారు. బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో రమేష్ బాబు అజీమ్ రాజు ఉస్మాన్ రబ్బానీ డీలర్ అధికారులు, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

మూడు నెలలుగా జీతాలు ల్లేవ్….

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల అవస్థలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రంలో మూడు నెలలుగా జీతాలు లేక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఎన్నో అవ స్థలు పడుతున్నారు. ఉగాది పండుగ జరుపుకోవడా నికి కూడా చేతిలో రూపాయి లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. పండగ రోజున భార్య పిల్లలకు ఏమీ కొనివ్వలేని పరిస్థితులు ఎదు ర్కుంటున్నామని వాపోతున్నారు. పని దగ్గరికి వెళ్తే అక్కడ కూలీలతో ఎన్నో అవస్థలు ఉంటున్నాయని. సమయానికి సర్వర్ రాదు ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని చెప్తున్నారు. రోజురోజుకు పెరుగుతు. న్న ఎండ తీవ్రత కూడా సమస్యగా మారిందన్నారు. ఒకే వ్యవస్థలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు ఆఫీసులో పని చేసే వారికి, ప్రతి నెల జీతాలు ఇస్తు న్నారు కానీ ఎండలో కూలీలతో కలిసి పనిచేస్తున్న తమకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గత ప్రభుత్వంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మూడు నెలలుగా జీతాలు లేక అల్లాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

విలాయత్ అలీ”ని సన్మానించిన తహసీల్దార్ “విక్రమ్ కుమార్

 

“నేటిధాత్రి” ఐనవోలు.

ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన ఎండీ. విలాయాత్ అలీ(25) ఇటీవల ప్రకటించిన టీజీపీఎస్సీ గ్రూప్-1 ఫలితాల్లో 489.5 మార్క్స్ తో రాష్ట్రస్థాయిలో 86వ ర్యాంక్ జోనల్ స్థాయిలో BC-E కేటగిరిలో మొదటి ర్యాంక్ సాధించారు. విలాయాత్ అలీకి ఈ రోజున ఐనవోలు తహసీల్దార్ K. విక్రమ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించి మొమెంటో అందజేసినారు. మరియు పూల మొక్క ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినారు.
విలాయాత్ అలీ మాట్లాడుతూ నాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం డిప్యూటీ కలెక్టర్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దిగువ మధ్యతరగతి కుటుం బానికి చెందిన నేను నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.
గ్రూప్-1 లో రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంక్ సాధించినట్టు తెలిపాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగం వదిలి గ్రూపు -1 కి సన్నద్ధం అయ్యను అని తెలిపినారు
ఇట్టి సన్మానం కార్యక్రమంలో తహసీల్దార్ K. విక్రమ్ కుమార్, నాయబ్ తహసీల్దార్ K. అనిల్ కుమార్, మండలం గిర్థవర్ శ్రీమతి రేగొండ రాణి, అదనపు గిర్థవర్ మరుపట్ల మల్లయ్య, ASO, మండల సర్వే యర్, కార్యాలయం సిబ్బంది మరియు పున్నెల్ గ్రామస్తులు పాల్గొన్నారు.

బడులా అవి బందెలదొడ్లా?

`ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేటు స్కూళ్లు

`లక్షలకు లక్షల ఫీజులు వసూలు

`పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కూళ్లు

`తెలంగాణలో ప్రతి ఏటా కొన్ని వేల కొత్త స్కూళ్లు

`బ్రాంచీల మీద బ్రాంచీలతో కార్పొరేట్‌ స్కూళ్లు

`అరకొర సౌకర్యాలు.. గాలి కూడ ఆడని గదులు

`మూడు నాలుగు అంతస్తుల భవనాలు

`పిల్లలను గొర్రెల మందల్లా కుక్కేస్తున్నారు

`ప్లే గ్రౌండ్‌లకు దిక్కు లేదు

`ప్రశాంతమైన వాతావరణం అసలే వుండదు

`హైదరాబాదు తో పాటు శివారు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో వెలుస్తున్న స్కూళ్లు

`జిల్లాలు, మండలాలు, గ్రామాలలో కూడా అనేక ప్రైవేటు స్కూళ్లు

`ఇబ్బడి ముబ్బడిగా ప్లే స్కూళ్లు

`ఉద్యోగాలు చేసుకునే వారి పిల్లల కోసం పెద్ద ఎత్తున ప్లే స్కూళ్లు

`గల్లీ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు

`కార్పొరేట్‌ స్కూళ్లలో లక్షలకు లక్షలు వసూలు

`జనవరి నుంచే కార్పొరేట్‌ స్కూళ్లలో అడ్మిషన్లు

`వేలకు వేలు అడ్వాన్సులు…ట్యూషన్‌ ఫీజులు

`అకాడమిక్‌ ఇయర్‌ పూర్తి కాకుండానే దోపిడీ మొదలు

`ఎక్కడికక్కడ ఇబ్బడి ముబ్బడిగా అడ్మిషన్ల జోరు

`ఇప్పుడు అడ్మిషన్లు తీసుకుంటే కొంత తగ్గింపు

`ఇప్పుడున్న ఫీజులు తర్వాత పెరగొచ్చు

`ఆలస్యం చేస్తే సీట్లే దొరక్కపోవచ్చు

`ఇవీ ప్రైవేటు స్కూళ్లు సాగిస్తున్న ప్రకటనలు

`విద్యా శాఖ అధికారుల అలసత్వం

`ప్రైవేటు స్కూళ్లపై కరువైన నియంత్రణ

`కార్పొరేట్‌ స్కూళ్లలో కూడా కనీస శిక్షణ లేని టీచర్లే ఎక్కువ

`తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డూ అదుపు లేదు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
అవి బడులా బందెల దొడ్లా! హైదరాబాద్‌ నుంచి మొదలుపెడితే, ఆఖరుకు పల్లెల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేటు స్కూళ్లు ఎలా వుంటున్నాయో అధికారులు చూస్తున్నారా? కనీసం పట్టించుకుంటున్నారా? పర్వవేక్షిస్తున్నారా? అధికారుల పర్మిషన్లతోనే ప్రైవేటు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారా? అధికారులను లెక్క చేయకుండానే పుట్డుకొస్తున్నాయా? ఎక్కడిక్కడ వెలుస్తున్న ప్రైవేటు బడులు ఎలా వుంటున్నాయో, వున్నాయో పర్వవేక్షించిన తర్వాతనే అనుమతులిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఒక స్కూల్‌ ఏర్పాటు చేయాలంటే ఎలాంటి సౌకర్యాలు వుండాలో స్పష్టమైన లెక్కలున్నాయి. చట్టంలో సూచించబడ్డాయి. స్కూల్‌ ఎలాంటి వాతావరణంలో వుండాలో కూడా నిర్థిష్టంగా చెప్పబడి వుంది. అసలు పాఠశాల భవనం ఎలా వుండాలో స్పష్టంగా చట్టంలో సూచించడం జరిగింది. ప్రతి స్కూల్‌ విశాలమైన, ప్రశాంతమైన వాతావరణంలో అర్థ చంద్రాకారాపు ఆకారంలో భవన నిర్మాణం వుండాలి. గాలి వెలుతురు దారాలంగా రావాలి. ఒక తరగతి ఎలా డిజైన్‌ చేయాలో చెప్పబడి వుంది. ఒక తరగతిలో ఎంత మంది విద్యార్థులు వుండాలో కూడా విద్యా హక్కు చట్టంలో స్పష్టంగా రాసి వుంది. ప్రభుత్వ పాఠశాలలు అన్ని ఈ సౌకర్యాలు కలిగి నిర్మాణం చేసి వున్నాయి. మరి ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లు ఇలాంటి వాతావరణ పరిస్థితులలో నిర్మాణాలున్నాయా? ఆ మౌలిక సదుపాయాలు ఎన్ని ప్రైవేటు స్కూళ్లలో వున్నాయి? ఈ విషయాలు ఏ అధికారులన్నా పట్టించుకుంటున్నారా? ఆ చట్టం అమలు చేస్తున్నారా? చట్ట ప్రకారం నిర్మాణంలో లేని స్కూళ్ల అనుమతులు రద్దు చేశారా? చేస్తున్నారా? విద్యా హక్కు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే తెలంగాణలో వున్న ప్రైవేటు స్కూళ్లలో కనీసం ఎనభై శాతానికి పైగా స్కూళ్లు మూసివేయబడతాయి. హైదరాబాదులో తొంభై ఐదు శాతం ప్రైవేటు స్కూళ్లు మూసివేయొచ్చు. కానీ అధికారులు కదులుతున్నారా? చర్యలు తీసుకోగలరా? ఆ ఉదాసీనత ఎవరిది? ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఆ అలసత్వానికి బాధ్యులెవరు? ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నతాధికారులున్నారు. జిల్లా, మండల స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరి వాళ్లంతా ఏం చేస్తున్నారు. ఇకపోతే అలాంటి స్కూళ్ల దోపిడీ గురించి రాస్తే రామాయణం అవుతుంది. ప్రైవేట్‌ స్కూళ్లు అప్పుడే అడ్మిషన్ల దుకాణాలు తెరిచాయి! ఇంకా ఈ అకాడమిక్‌ ఇయర్‌ పూర్తి కాలేదు. పరీక్షలు నిర్వహించలేదు. ఫలితాలు ప్రకటించలేదు. వేసవి సెలవులు ఇవ్వలేదు. కానీ కొత్త అకాడమీ అడ్మిషన్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఆలోచించిన ఆశా భంగం అన్నట్లు సీట్లు నిండిపోతున్నాయంటూ ప్రచారం సాగిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ స్కూళ్ల నుంచి చిన్నా చితకా స్కూళ్లలో పరీక్షల కోలాహలం కన్నా అడ్మిషన్ల హడావుడే ఎక్కువగా కనిపిస్తోంది. స్కూళ్ల ముందు జాతర తలపిస్తోంది. ప్రతి రోజు ప్రైవేటు స్కూళ్ల ముందు వందల సంఖ్యలో వాహనాలు. పిల్లలు, వాళ్ల తల్లిదండ్రులు. అడ్మిషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. గతంలో కొత్త అకాడమీ ఇయర్‌ మొదలైన తర్వాత అడ్మిషన్ల ప్రక్రియ సాగేది. కొంత కాలానికి వేసవి సెలవులలో అడ్మిషన్లు సాగించే వారు. ఇప్పుడు ఏకంగా జనవరి నెలలోనే స్కూళ్ల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అడ్మిషన్లు మొదలుపెడుతున్నారు. వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. పిల్ల పుట్టక ముందే కుళ్ల కుట్టి పెట్టుకున్నట్లు అడ్మిషన్లతోనే పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్‌, షూజులు, బ్యాచులు, టిఫిన్‌ బాక్స్‌లు, ఇతర అన్ని రకాల వస్తువులు అడ్మిషన్ల నాడే తల్లిదండ్రులకు అంటగడుతున్నారు. ఇంతటి దుర్మార్గం గతంలో పెద్దగా కనిపించేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. పేద ప్రజల బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాయి. పెద్ద పెద్ద స్కూళ్లకు దీటుగా ఫీజులు ఇష్టానుసారం వసూలు వేస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం వెనుకబడి వుంటున్నాయి. నిబంధనలు గాలికి వదిలేస్తున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని యధేచ్చగా ఉల్లంఘిస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కూడా ఇందులో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఎలాంటి అనుమతులు లేని స్కూళ్లు అనేకం వున్నాయి. అధికారులు కనీస తనిఖీలు నిర్వహించింది లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఎన్ని అనుమతులున్న ప్రైవేటు స్కూళ్లు వున్నాయో, అనుమతులు లేనివి ఎన్ని వున్నాయో కనీస సమాచారం కూడా వారి వద్ద పూర్తి స్థాయిలో లేదని తెలుస్తోంది. అందుకే ఎవరికి వారు, ఎక్కడ పడితే అక్కడ ఏటా కొత్త కొత్త స్కూళ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక అనేక కార్పొరేట్‌ స్కూళ్లు బ్రాంచీల మీద బ్రాంచీలు ఏర్పాటు చేస్తున్నారు. అటు కార్పొరేట్‌ స్కూళ్లు గాని, ఇటు చిన్నా చితకా స్కూళ్లలలో వసతుల లేమితోనే నిర్వహిస్తున్నారు. ఇరుకైన గదులు. సరైన మార్గం లేకుండా చిన్న చిన్న బిల్డింగ్‌ లలో నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చాలా స్కూళ్లలో ఆట స్థలం వుండదు. కనీసం ప్రేయర్‌ చేయించడానికి సైతం స్థలం లేని స్కూళ్లే అధికం. ఇక బోధన విషయానికి వస్తే మాత్రం నిపుణులైన అద్యాపకులు ఎక్కడా కనిపించరు. అరకొర చదువులు వదిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. పిల్లల నుంచి మాత్రం భారీగా ఫీజులు వసూలు చేస్తారు. ఒక స్కూల్‌లో ఉపాధ్యాయుడి నియామకం జరగాలంటే కనీస అర్హతలు నిర్థారించి వుంది. ప్రైమరీ స్కూల్‌ అయితే కచ్చితంగా టిటిసి చేసి వుండాలి. హై స్కూల్‌ అయితే బిఈడీ పూర్తి చేసి, టెట్‌ కూడా పాస్‌ అయి వుండాలి. ఎందుకంటే టీచర్‌ అనగానే పాఠాలు చెప్పడం మాత్రమే వస్తే సరిపోదు. టీచర్‌ అంటే కనీసం అర్థం, అవగాహన లేని వాళ్లు స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రైయిన్డ్‌ టీచర్‌ అయితే బిఈడీ, టిటిసిలలో విద్యార్థుల మానసిక పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయిస్తారు. విద్యార్థుల మానసిక సామర్ధ్యాలపై పూర్తి ట్రైనింగ్‌ టీచర్ల అవగాహనతో వుంటారు. చైల్డ్‌ సైకాలజీ చదువుకొని వుంటారు. చైల్డ్‌ మెధడాలజీపై పట్డున్నవారుంటారు. ఏ విద్యార్థికి ఎలా పాఠం చెబితే అర్థం చేసుకోగలరన్న దానిపై పూర్తి జ్ఞానంతో వుంటారు. అంతే గాని స్కూళ్లను బందర దొడ్డిలా మార్చి గుంపంతటికీ ఒకేలా పాఠం చెబితే అందరూ అర్థం చేసుకోలేరు. ఒత్తిడిని తట్టుకోలేని పిల్లలకు ఎలా పాఠం చెప్పాలి. ఎలాంటి అవగాహన తో వారికి పాఠం బోధించాలన్నది కేవలం ట్రైన్డ్‌ టీచర్లకు మాత్రమే తెలుస్తుంది. చాలా మంది పిల్లల ఎంతో సెన్సిటివ్‌ గా వుంటారు. అలాంటి వారికి అర్థమయ్యే తరహాలో సబ్జెక్టు చెప్పడంలో శిక్షణ పొందిన అద్యాపకులకే సాధ్యమౌతుంది. అందువల్ల ప్రైవేటు స్కూళ్లు ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటి పాఠశాలల నిర్వహణ మూలంగా ఇటీవల కొంత మంది విద్యార్థులు చనిపోయిన ఘటనలున్నాయి. తల్లిదండ్రులకు కడుపుకోతలను మిగిల్చుతున్నాయి. ఇక ఇటీవల స్కూళ్లతో పాటు ప్లే స్కూల్స్‌ కూడా విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం వంటి పరిస్థితులు వున్నవారు ఎక్కువగా తమ పిల్లల్ని ప్లే స్కూళ్లలలో జాయిన్‌ చేస్తున్నారు. కాస్త అడుగులు వేయడం వచ్చే పిల్లల్ని కూడా ఇలాంటి స్కూళ్లలో జాయిన్‌ చేస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు మార్కెట్‌ లో ఒక వ్యాపారమైపోయింది. ఇంట్లో తమ పిల్లల్ని చూసుకునే తీరిక, వీలు, ఓపిక లేని తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులకు అప్పగిస్తున్నారు. వందల మందికి ఐదారుగులు మహిళా టీచర్లు, ముగ్గురు నలుగురు ఆయాలతో వాటిని నిర్వహిస్తుంటారు. వాళ్లు ఏ మాత్రం అలసత్వం వహించినా పిల్లల పరిస్థితి ఎలా వుంటుందని ఏ ఒక్క తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. తల్లిదండ్రులు ఇలా వుండడం వల్ల విచ్చలవిడిగా ప్లే స్కూళ్లు వెలుస్తున్నాయి. కానీ అధికారులు పర్యవేక్షణ లేదు. సందర్శన అసలే లేదు. నియంత్రణ అన్నది కనుచూపు మేరలో లేదు.

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

పంటల కోతలు వాయిదా వేసుకోవాలి.

మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం.

నర్సంపేట ఏ.డీ.ఏ దామోదర్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

Crop harvesting should be postponed.

వాతావరణంలో వచ్చిన మార్పులు నేపథ్యంలో మొక్కజొన్న, ఎండుమిర్చి, ఇతర పంటల కోతల నిర్వహణ పనులను వాయిదా వేసుకోవాలని నర్సంపేట డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కే. దామోదర్ రెడ్డి రైతులను కోరారు. ఈ సందర్భంగా ఏడిఏ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుల్లో మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

 

వరంగల్ జిల్లా పరిధి పలు ప్రాంతాలతో పాటు నర్సంపేట డివిజన్ లోని 6 మండలాలకు మూడు రోజులపాటు వర్ష సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.కోత దశలో ఉన్న మొక్కజొన్న,ఎండుమిర్చి, ఇతర పంటల కోత మరొక రెండు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.ఇప్పటికే కోసిన మొక్కజొన్న,ఎండుమిర్చి పంట ఇతర ఉత్పత్తుల పట్ల అప్రమత్తమై ఇళ్లల్లో జాగ్రత్తగా తడవకుండా భద్రపరచుకోవాలని అన్నారు.ఒకవేళ కల్లాలలో ఉన్నచో వాటినిటార్పాలిన్లతో తగువిధంగా భద్రపరచుకొనుటకు పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవాలని ఏటియ దామోదర్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ ని కలిసిన పెబ్బేరు నూతన ఎస్సై.

జిల్లా ఎస్పీ ని కలిసిన పెబ్బేరు నూతన ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి :

 

గురువారం నూతన పెబ్బేరు ఎస్సై గంగిరెడ్డి యుగంధర్ రెడ్డివనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలోజిల్లాఎస్పీ రావుల గిరిధర్నుమర్యాదపూర్వకంగాకలిస పుష్పగుచ్చం అందజేశారురు ఈ సందర్భంగ ఎస్పీ మాట్లాడుతూవిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని శాంతి భద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు
జి,యుగంధర్ రెడ్డి వనపర్తి జిల్లా పెద్దమందడి పోలీస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ పెబ్బేరుకు బదిలీపై వచ్చారు.పెబ్బేరు ఎస్సైగా పనిచేసిన హరిప్రసాద్ రెడ్డి వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీపై వెళ్ళారు.
శాంతిభద్రతల పరిరక్షణకు పెబ్బేరు ప్రజలు సహకరించాలని నూతన ఎస్సై యుగందర్ రెడ్డి  ప్రజలను కోరారు.

ఉచిత మెగా వైద్య శిబిరం.

ఉచిత మెగా వైద్య శిబిరం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండల పరిధిలోని బచ్చరాజ్ పల్లి గ్రామంలో గురువారం మల్లారెడ్డి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రముఖ సంఘ సేవకుడు గట్టు ప్రశాంత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది.ఈ ఉచిత వైద్య శిబిరంలో బీపీ,షుగర్, థైరాయిడ్, మొదలగు వైద్య పరీక్షలు నిర్వహించి గ్రామంలోని సుమారు 200 మందికి ఉచిత టాబ్లెట్లు అందించారు. అవసరమైన వారికి 60 మందికి పైగా చెవి ముక్కు,గొంతు,థైరాయిడ్, గర్భసంచి, శరీర సంబంధ వ్యాధులకు గాను ఉచితంగా ఆపరేషన్ చేయించడానికి వీలుగా మల్లారెడ్డి హాస్పిటల్ వారి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.క్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుకు గట్టు ప్రశాంత్,ను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రాములు, మల్లారెడ్డి హాస్పిటల్ బృందం డాక్టర్ అఖిలేష్,భవ్య,స్టాఫ్ నర్స్ లు అరుణ,ప్రవణి,ఫార్మా అంకిత,మార్కెటింగ్ మేనేజర్ ఎండి.మహమ్మద్,నాగప్ప, గ్రామస్తులు అంజయ్య,నక్క రవి,బోడపట్ల శ్రీనివాస్, హంసమ్మ,పాల్గొన్నారు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు.

ఏబీవీపీ నాయకుల ముందస్తు అరెస్టులు

నిజాంపేట, నేటి ధాత్రి

 

చలో HCU కార్యక్రమానికి తరలిన ఏబీవీపీ విద్యార్థి నాయకులను నిజాంపేట పోలీసులు ముందస్తుగా అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) భూములను కాపాడేందుకు పోరాడుతున్న విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం దారుణమన్నారు.
క్యాంపస్‌లో 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఇందిరమ్మ పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని ఆరోపించారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై దమనకాండ ఆపాలని
HCU భూములను రక్షించాలన్నారు.
విద్యార్థుల గొంతును నొక్కాలని చూస్తే, తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మరింత మిన్నంటుతుంది! రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువత ఏకమై ప్రభుత్వంపై ప్రతిఘటన తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే .

నాగర్ కర్నూల్/నేటి దాత్రి:

 

 

ఈరోజు తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్రీ మహాలక్ష్మి గోదాసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తృతీయ బ్రహ్మోత్సవాలకు ( జాతార) సందర్భంగా స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొన్న మన ప్రియతమ నేత ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.

అలాగే ఆవంచ గ్రామంలో మహా గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు,మండల నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు..

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.

ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు.  

 

పాలకుర్తి నేటిధాత్రి

 

 

పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, దేవరుప్పుల మండల పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి హాజరై, దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దొడ్డి కొమురయ్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అన్యాయానికి వ్యతిరేకంగా, రైతుల హక్కుల కోసం పోరాడిన వీరయోధుడు. ఆయన చూపిన మార్గంలో నడిచి, రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు రైతుల భద్రతకు కల్పించిన అద్భుత సంక్షేమ కార్యక్రమాలు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, వారి జీవనోపాధిని మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అని పేర్కొన్నారు. అదనంగా, రైతులు అన్నదాతలు వారికి గౌరవం కల్పించడం మన బాధ్యత. దొడ్డి కొమురయ్య వంటి పోరాట యోధుల త్యాగాల వల్లే ఈ రోజు రైతులు హక్కులు పొంద గలుగుతున్నారు. ఈ త్యాగాలను గుర్తుంచుకుని, ప్రతి రైతు సంక్షేమానికి పాటుపడాలి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రాంతీయ నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగిస్తూ, రైతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే  పిలుపునిచ్చారు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాట సరికాదు

నర్సంపేట,నేటిధాత్రి:

 

రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదారాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలంపాట వేయడం సరికాదని ఎబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ ఆరోపించారు.

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించగా అనంతరం నరేష్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం పాట ద్వారా అమ్మే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

యూనివర్సిటీ అభివృద్ధి కోసం పని చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం, యూనివర్సిటీ భూములు అమ్మి విద్యార్థులకు నష్టం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

యూనివర్సిటీ భూమి రక్షించుకునేందుకు విద్యార్థి నాయకులు ధర్నాలు నిర్వహిస్తున్న క్రమంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసి, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం సరికాదని అవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే వెనక్కి తీసుకొని సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్, రాజేష్ చింటూ, నాగరాజ్, ప్రమోద్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు.

కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.. పేదలకు సంక్షేమ పథకాలు

జడ్చర్ల /నేటి ధాత్రి

 

 

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని హేమాజీపూర్ గ్రామంలో గురువారం.. ఏఐసీసీ ఆదేశాల మేరకు.. జై బాపు.. జై భీమ్..జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రను ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్రగా వెళ్లి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ..

బూర్గుల గ్రామం నుండి హేమాజీపూర్ గ్రామానికి రూ. 1 కోటి 62 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మత్తులు చేపడతామని, భవిష్యత్తులో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

హేమాజీపూర్ గ్రామంలో అసంపూర్తిగా ఆగిపోయిన గ్రామపంచాయతీ, కమ్యూనిటీ హాల్, డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

Congress

 

అనంతరం బిల్డింగ్ తండా, కోయిలకుంట తండా నేల బండ తండా, లింగారం, గాంధీ పాలెం తండాలలో పాదయాత్ర సాగింది.

గాంధీ పాలెంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.

అంగరంగ వైభవంగా.కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు*

 

రాయికల్ నేటి ధాత్రి. ఏప్రిల్ రాయికల్.పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ “విరించి-2025″వార్షికోత్సవ వేడుకలను గురువారం ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ….. పాఠశాలల్లో వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులలోని ప్రతిభ పాటవాలు వెలికి తీయడానికి దోహదపడతాయని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో రాణించాలన్నారు. విద్యార్థుల చదువు విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్న శిఖరాలను అధిరోహించాలని,సోషల్ మీడియాలకు బానిసలు కాకుండా తగు జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న ఉన్నత స్థాయిలో స్థిరపడాలన్న ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు తల్లిదండ్రుల పెంపకం చాలా ముఖ్యమని అన్నారు.వార్షికోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు పలు సందేశాత్మకమైన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు,కరాటే,పౌరాణిక దేశభక్తి నృత్యాలతో పలువురిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జూపల్లి వేణుగోపాల్ రావు,డైరెక్టర్ జూపల్లి తిరుపతిరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

రైతులను వెంటాడుతున్న అగ్గి తెగులు…

రైతులను వెంటాడుతున్న అగ్గి తెగులు…

– మరోవైపు అకాల వర్షం…

– దిక్కు తోచని స్థితిలో రైతన్నలు…

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

 

రైతులు వేసిన వరి పంటలో అగ్గి తెగులు, మెడ విరుపు రోగాలు, మరోవైపు అకాల వర్షం రావడంతో రైతన్నలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషంగా ఉండాల్సిన రైతన్నలకు ఒకవైపు, వరి వేసిన తర్వాత పొట్ట కచ్చిన వరి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు అందక కొందరి రైతుల పొలాలు ఎండిపోయి రైతులు విలువలాడుతున్నారు.

మరోవైపు వరి ఈ నిన దశలో మెడవిపు రావడంతో రైతులు స్ప్రే మందులకే పరిమితమై పోతున్నారు.

మరోవైపు అకాల వర్షం ఈదు గాలులు రైతులను వెంటాడుతున్నాయి.

Farmers

 

అన్నమొ రామచంద్ర అంటూ అలమటిస్తు, దిక్కు తోచని స్థితిలో రైతులు అప్పుల పాలవుతున్నారు.

అయ్యో ఈ బాధ మాకేనా మా బాధ ఎవరికి చెప్పుకోలే దేవుడా అంటూ నెత్తికి చేయి పెట్టుకొని అలమటిస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.

పలు గ్రామాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని పలు గ్రామాలలో గురువారం చలివేంద్రల ఏర్పాటు చేసిన అధికారులు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాల మేరకు జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు సీఈవో గణపతి మిట్టపల్లి గ్రామంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ కిషన్ నర్వ జైపూర్ గ్రామాలలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ గౌడ్ మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపూరావు ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వేసవికాలంలో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతుందని గ్రామ ప్రజలకు,ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీరు చలివేంద్ర కేంద్రాలను గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయ విషయమని అన్నారు.ప్రజలకి కాకుండా పశువులకు,పక్షులకు కూడా ప్రజలు తమతమ నివాసాలలలో ధాన్యాన్ని నీళ్లను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ గ్రామ నాయకులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం.

సన్న బియ్యం పంపిణిని ప్రారంభం

గంగారం, నేటిదాత్రి:

 

గంగారం మండలం కోమట్ల గూడెం గ్రామంలోని రేషన్ దుకాణంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉచిత సన్న బియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని, ఈపథకం ద్వారా రైతుల కష్టానికి సన్న వడ్ల కు క్వింటకు 500 రూపాయల బోనస్ కల్పిస్తూ వారికీ గౌరవాన్ని కల్పించడంతో పాటు, పేద ప్రజలకు పోషకాహారాన్ని అందించడమే ఈపథకం యొక్క ఉద్దేశమన్నారు. ఈ పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈసం రమ, కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు మంకిడి విజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు,మహిళా లు తదితరులు పాల్గొన్నారు…

గురుకుల ఫలితాల్లో రిషిత ప్రతిభ.

గురుకుల ఫలితాల్లో రిషిత ప్రతిభ

రాష్ట్ర స్థాయిలో 3521 ర్యాంకు

పలువురి అభినందనలు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గురుకుల ఫలితాల్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు చెందిన దూడపాక లావణ్యశంకర్ చిన్న కుమార్తె రిషిత రాష్ట స్థాయిలో ప్రతిభ కనబర్చింది. గత ప్రిభవరి 23న జరిగిన గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 52,314 మంది హాజరు కాగా శనివారం ప్రకటించిన ఫలితాల్లో రిషిత రాష్టా స్థాయిలో 3521 ర్యాంకు సాధించింది.ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులు,పాఠశాల యాజమాన్యం,కాలనీ వాసులు అభినందనలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version