దింపుడు కల్లం ఆశల్లో కమల, హస్తాలు?

కమల, హస్తాలు విలవిల!

-బిఆర్‌ఎస్‌ కళకళ.

-కాంగ్రెస్‌ ఊపులన్నీ ఉత్తవే…

-కమల బలాలన్నీ భ్రమలే…

-కాంగీయులవి పగటి కలలే..

– కమలానికి ఉలికిపాటే..

-పోటీకే దిక్కులేదులే…

-బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరొస్తారా? అని ఎదురుచూపులే.

-వాషింగ్‌ పౌడర్ల కోసం వెతుకులాటే.

– హస్తమంతా అస్తవ్యస్తంమే…

– కమలంలో అన్నీ కలహాలే.

-ఐక్యతకు ఆ పార్టీలలో తావే లేదు?

-బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ చూస్తారు.-కారు వంద స్పీడ్‌ గ్యారెంటీ.

-ప్రతిపక్షాలకు పట్టుమని పది వస్తే ఎక్కువ..

– హస్తం లుకలుక…కమలం వెలవెల.

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                         

రాష్ట్ర రాజకీయాల్లో ఈసారి కూడా మళ్లీ బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనం సృష్టించే వాతావరణమే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కారు స్పీడు వంద దాటే అవకాశాలున్నాయంటున్నారు. ప్రతిపక్షాలకు మళ్లీ భంగపాటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పైన పటారం లోన, లొటారంలా వున్న ప్రతిపక్ష పార్టీలు ఊపును కొద్ది కాలం చూపించుకోకపోతే కష్టమన్న ఆలోచనకు వచ్చి, తాము బలంగానే వున్నామని చెప్పుకోకపోతే కష్టంగా మారుతుందని ఆలోచన చేస్తున్నట్లున్నాయి. అందుకే అసలు ప్రతిపక్షాల పరిస్ధితి క్షేత్రస్ధాయిలో ఎలా వుందనేదానిని గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలోని ఏ గ్రామంలో చూసుకున్నా పట్టుమని పది మంది కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌, బిజేపిలకు లేరు. ఇది వాస్తవం అన్నది కాంగ్రెస్‌కు తెలుసు. బిజేపికి ఆ మాత్రం కూడా లేరని ఆ పార్టీకి తెలుసు. కాకపోతే కొద్ది కాలం వాళ్లు తమకు బలం వుందని చూపించుకుందామనుకున్నారు. అందులోనూ వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలైనా దిక్కౌతాయని అనుకున్నాయి. కాని అవి కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. సహజంగా పదేళ్ల తర్వాత ఏ పార్టీలోనైనా అంతో ఇంతో అసంతృప్తి సహజం. ఎక్కడో అక్కడ అలాంటి వాళ్లు బైటపడుతుంటారు. తమకు పదేళ్ల తర్వాత కూడా అవకాశం దక్కకపోతే ఎలా? అనుకునే నాయకులు కొందరు నాయకులు సహజంగా పక్క చూపులు చూడడం సహజం. అదే అదునుగా బిఆర్‌ఎస్‌ నుంచి ఎవరైనా రాకపోతారా? వాళ్లు మన పార్టీకి దిక్కు కాకపోతారా? అన్నంత ఆశగా గత మూడేళ్లుగా ఎదరుచూస్తునే వున్నాయి. ఇదిగో వచ్చే…ఇదిగో వచ్చే అంటూ కాలయాపన తప్ప ప్రతిపక్షాలు స్వతహాగా ఎలా బలపడాలన్నదానిపై దృష్టిపెట్టలేదు. పుణ్య కాలంకూడా అయిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలు ఇంకా దింపుడు కళ్లెం ఆశతోనే కాలం వెల్లదీస్తున్నాయి. బిఆర్‌ఎస్‌ నుంచి నాయకులు ఎవరైనా వెళ్లిపోయేవారు వుంటే, ఇప్పటికే వెళ్లిపోయేవారు. కాని ఇప్పుడు వెళ్తారనుకోవడం, వాళ్లు వచ్చి మా పార్టీలో చేరుతారని ప్రతిపక్షాలు ఆశపడడం ఆశ్యర్యంగా వుంది. సహజంగా ఈ పదేళ్ల కాలంలో ఎంతో కొంత కాలం పదవులు అనుభవించిన వాళ్లు పార్టీ మారితే ప్రజలే వారికి తగిన బుద్ది చెబుతారు. బిఆర్‌ఎస్‌ నుంచి బిజేపి వెళ్లిన వాళ్లలో దాసోజు, స్వామీ గౌడ్‌ లాంటి వారు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. బిజేపి నుంచి చాలా మందే కప్పదాటుడుకు సిద్దంగా వున్నారని తెలుస్తోంది. అంతే కాని బిఆర్‌ఎస్‌ నుంచి వెళ్లేందుకు ఎవరూ సిద్దంగా లేరు. ఈ పదేళ్లలో ఎలాంటి పదవులు దక్కని వారు వెళ్లేందుకు పెద్దగా సిద్దంగా లేదు. ప్రతిపక్షాలు బలపడినట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. మబ్బులను చూసి ముంత ఒలకబోసుకునేంత అమాయకులు కాదు మన నాయకులు. ఇక ప్రతిపక్షాలలో కూడా పదేళ్ల కాలంగా అదికారం కోసం ఎదురుచూస్తున్న వాళ్లు వున్నారు. వాళ్లను కాదని పదవులు కొత్త వారికి ఇవ్వడం అన్నది కష్టమైన పని. అందుకే అధికార బిఆర్‌ఎస్‌ను వదిలి వెళ్లడం అంటే రెంటికీ చెడిన రేవడి కావడమే అవుతుంది. అందువల్ల అలాంటి ఆశలు కూడా ప్రతిపక్షాలకు తీరవనే తెలుస్తోంది. ఇక ప్రతిపక్షాలలో కాంగ్రెస్‌ పార్టీ అనుకున్నంతగా కాని, ప్రచారం చేసుకుంటున్నంత గాని ప్రజల్లో లేదు.

 ఇప్పటికీ ఆ పార్టీకి పట్టుమని పది మంది గట్టి నాయకులు, కార్యకర్తలు లేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ కాలంలో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేని ఎంతో మంది కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో, కాంగ్రెస్‌లో వున్న నాయకులు ఆ పార్టీకి క్యూ కట్టారు. దాంతో వారి అనుచరులంతా బిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడం, బిఆర్‌ఎస్‌కు ఊహించని మెజార్టీ సీట్లు రావడంతో ఇక కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే అనుకున్నవాళ్లంతా బిఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే స్దాయి నేతలంతా ఎప్పుడో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ యూత్‌ను ఆకర్షించలేకపోయింది. తెలంగాణలో అమలౌతున్న అనేక సంక్షేమ పథకాలు దాదాపు ప్రజలందరికీ అందుతున్నాయి. ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఏదో ఒక పథకం అందే వుంది. పైగా ప్రతి కుటుంబానికి రైతు బంధు వస్తోంది. సాగుకు 24 గంటల కరంటు అందుతోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో బిఆర్‌ఎస్‌ను తిరుగులేని శక్తిగా నిలిపింది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం ప్రతి గడప, గడపకూ చేరింది. ఆయన నాయకత్వం మీద ప్రజలందరికీ నమ్మకం మరింత పెరిగింది. తెలంగాణలో ఆసరా పించన్లు పెద్దఎత్తున అమలౌతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా పించన్లు అందిస్తున్నారు. అటు వృద్యాప్త పించన్లు, ఇటు ఒంటరి మహిళల పింఛన్లు, వికలాంగుల పించన్లు, బీడి కార్మికుల పించన్లు అందుతున్నాయి. వాటికి తోడు నేతలన్నలకు, గీతన్నకలకు కూడా పించన్లు అందుతున్నాయి. దాంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి ఏదో రకమైన పథకం అందుతోంది. ఇలాంటి సమయంలో ఏ ఒక్కరిని కదిలించినా చెప్పే మాట ఒకటే..మళ్లీ మా సిఎం. కేసిఆరే అని..! ఈ విషయాలు కాంగ్రెస్‌కు తెలుసు. బిజేపికి తెలుసు. అయినా రాజకీయ పార్టీ అన్న తర్వాత యుద్ధం చేయాలంటే , నిలబడాలి. తలపడడం తర్వాత…వున్నామన్న ఉనికిని చాటుకోవాలని కాంగ్రెస్‌, బిజేపిలు సాగుతున్నాయి. అంతే తప్ప ప్రజల్లో బలముందనో…గెలుస్తామన్న ఆశ మాత్రం ఆ పార్టీలో ఏ ఒక్క నాయకుడికి లేకపోవడం గమనార్హం. 

 ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పుకోవాలి. 

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేస్తున్న రాజకీయ విన్యాసం వల్ల కాంగ్రెస్‌పార్టీకి మొదటికే మోసం వచ్చే పరిస్ధితి వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో ప్రజల్లో కనీసం గుర్తింపు లేని నాయకులను తెరమీదకు తెచ్చి, నాలుగురైదుగురికి ఆశ చూపి, టిక్కెట్‌ నీకే అంటూ మభ్యపెడుతున్నాడని సమాచారం. తెలంగాణ యాసలో చెప్పాలంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు చేస్తున్నాడనేది కాంగ్రెస్‌ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధాన వాదన. దీనికి తోడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన పొన్నం ప్రభాకర్‌ లాంటి వారిని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం అంటేనే ఆ పార్టీని రేవంత్‌రెడ్డి నిండా ముంచేందుకే కంకణం కట్టుకున్నాడనేది సుస్పష్టమౌతున్న అంశం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక నియోజకవర్గాలలో ఇలాంటి పరిస్థితులే సృష్టించి ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను గంగలో కలిపే పన్నాగం రేవంత్‌రెడ్డి బాగానే పన్నుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా వుంటే బిజేపి పరిస్ధితి అంతకన్నా అద్వాహ్నంగా వుంది. బండి సంజయ్‌ అధ్యక్షుడుగా వున్నప్పుడు కనీసం ఊపైనా కనిపించింది. ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది. పార్టీ శ్రేణుల్లో నిస్తేజం ఆవహించింది. కనీసం కార్యకర్తలకు వున్న అవగాహన కూడా నాయకులకు లేకుండాపోయింది. పార్టీ ఏ పరిస్దితుల్లో వుందో కూడా వారు అర్ధం చేసుకునే స్దితిలో లేరు. అందుకే హడావుడిగా అధ్యక్షుడిని మార్చుకున్నారు. పూడ్చుకోలేని తప్పు చేశారు. ఇప్పుడు లబోదిబో అంటున్నారు. కాని బైటకు వినిపించకుండా ఏడుస్తున్నారు. వున్న బలం పోయింది. కొత్త బలం రాదని తెలిసింది. వలస పక్షులను నమ్ముకొని ఇప్పటికే మునిగిన కలమం, మరింత వాడిపోయేందుకు సిద్దంగా వుంది.

నవ తరం నిర్మాత

` మునుగోడు బిఆర్‌ఎస్‌ నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో తనకు కేటిఆర్‌ తో వున్న అనుబంధాన్ని పంచుకుంటూ..

` రేపటి తరం ప్రతినిధి

` ఉద్యమ కాలానికి ఊపిరి.

` తెలంగాణ అభివృద్ధిలో ఆర్తి.

` భవిష్యత్తు రాజకీయాలకు స్పూర్తి.

`అలుపెరుగని ప్రజా సేవకు నాంది.

`నేటి నాయకులలో మేటి.

`పరిపాలనలో ఆయనకు ఆయనే సాటి.

`వేగానికి ఆయనే పోటీ

`నిత్యం ప్రజల్లోనే…

`ప్రతి నిమిషం ప్రజా సేవలోనే…

` ప్రతి పనిలో డైనమిజమే…

`తెలంగాణ బ్రాండ్‌ కేటిఆరే.

`మూడక్షరాల పదం యువత నాలుకల మీద జపమే.

 హైదరబాద్‌,నేటిధాత్రి:                                 

కొన్ని ఉద్విగ్నమైన క్షణాలు కోపమైతే నష్టం. కాని అవే ఆలోచనలైతే…అపురూం. అనితర సాధ్యం…అనిర్వచనీయం…అపురూపం, అధ్భుతం…ఒక ఆవిష్కారం…మార్పుకు సంకేతం…ప్రగతినకి ఆలవాలం…ఇదంతా ఒక వరుసలో జరిగే అభివృద్దికి నిదర్శనం…రేపటి తరానికి అందే అతిపెద్ద బహుమానం…ఎందుకంటే రెండు దశాబ్ధాల క్రితం తెలంగాణ ఒక ఉద్విగ్నమైన క్షణం. ఆ క్షణం నుంచి ఉద్భవించిందే తెలంగాణ ఉద్యమం. అది ఆవేశాన్ని మాత్రమే మోసుకురాలేదు. ఒక దృఢమైన చిత్తం నుంచి అంకురార్పరణ జరిగింది. ఆ చిత్తం ఒక పరిపూర్ణమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పోరాటానికి వేదికను చేసింది. ఆ పోరాటం ముఖ్యమంత్రి కేసిఆర్‌ రూపంలో అడుగులు వేసింది. తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కేసిఆర్‌. ఆయన అడుగు జాడలే మంత్రి కేటిఆర్‌. 

కేటిఆర్‌ అడుగు మాకు భరోసా…కేటిఆర్‌ మాట మాకు దీవెన..ఆయన చూపు చల్లని వెన్నెల…మా నాయకుడు కేటిఆర్‌ ఎక్కడుంటే అక్కడ మాకది కోవెల. అని మునుగోడు బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు నారబోయిన రవి ముదిరాజ్‌ అంటున్నారు. ప్రజల కోసం మంత్రి కేటిఆర్‌ వేసే అడుగులు తెలంగాణ సంక్షేమానికి బాటలు… ఆయన చెప్పే విలువైన మాటలు రేపటి తరానికి లక్ష్యాలు..యువత భవితకు వెలుగులు అంటున్నారు రవి ముదిరాజ్‌. ఎందుకంటే ప్రజల సాధక, బాధకాలపై నిరంతరం ఆలోచించే నాయకుల్లో మా నాయకుడు కేటిఆర్‌ ఎంతో ఉన్నతమైన ఆలోచనలున్నవారు. ఎల్లవేళలా అయన ప్రజలతో వుంటూ, ప్రజల్లో మమేకమౌతూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వుంటారు. అంతే కాదు ప్రపంచ దేశాలు తిరిగిన అనుభవంతో అక్కడ జరిగిన అభివృద్దిని ఇక్కడ మనకు నిజం చేస్తున్న నాయకుడు కేటిఆర్‌. మంచి మనసున్న నాయకులకే ప్రజాభివృద్ధిపై మమకారం వుంటుంది. తన నిరంతర శ్రమతో ప్రజల హృదయాలను గెల్చుకున్నారు. ముఖ్యంగా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఐటి సెక్టార్‌లో ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా చెప్పే ఏకైక పేరు కేటిఆర్‌. మరో పేరు కూడా ఎక్కడా వినిపించదు. ఒకప్పుడు ఐటి అంటే అందరూ బెంగుళూరు అనేవారు. కాని ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎవరిని అడిగినా టక్కున హైదరాబాద్‌ అని చెబుతున్నారు. ప్రపంచ అగ్రశ్రేణి ఐటి దిగ్గజాలన్నీ హైదరాబాద్‌లో వారి ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం అన్నది కేవలం మంత్రి కేటిఆర్‌ చొరవ వల్లనే సాద్యమయ్యాయని గర్వంగా చెప్పుకోవాలి. రాష్ట్ర రాజకీయాలే కాదు, పాలనా పరమైన సేవలందిస్తూ, ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం నిరంతరం తపన పడుతున్న నాయకుడు కేటిఆర్‌. గొప్ప ప్రగతిలో తెలంగాణను ముందు వరసలో నిలబెడుతున్న నాయకుడు కూడా కేటిఆర్‌ కావడం విశేషం. రేపటి తరం కోసం కేటిఆర్‌ పడుతున్న శ్రమ మాటల్లో చెప్పలేనిది. ఇంతటి విశిష్ట సేవలు గతంలో ఏ నాయకుడు అందించలేదంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే మంత్రి కేటిఆర్‌ వంటి డైనమిక్‌ లీడర్‌ లేడు. తెలంగాణ విషయంలో ఏ సమస్యనైనా ఎంతో అవలీలగా పరిష్కరించడంతో ఆయనకు ఆయనే సాటి అంటారు. రాష్ట్రాభివృద్ధిలో ఎంతో కీలకభూమిక పోషిస్తున్న మంత్రి కేటిఆర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని, మునుగోడు బిఆర్‌ఎస్‌ నాయకుడు నారబోయిన రవి, ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

 నేను నా జీవితంలో కలుసుకున్న అతి గొప్ప సుగుణాలున్న వ్యక్తులలో మంత్రి కేటిఆర్‌ ఒకరు. 

ఆయన ఆలోచన ఆకాశమంత..ఆయన ఆచరణ పర్చుకున్న మన భూమి అంత. ఆయనను దగ్గరుండి చూసిన వారికి మాత్రమే అర్ధమయ్యే నిజం. ఆయన విసృతమైన ఆలోచనలు మన తెలంగాణ ప్రగతికి వేస్తున్న అడుగులు. నా రాజకీయ ప్రస్తానం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు నాలో ఎంతో స్పూర్తిని నింపిని నాయకుల్లో మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసిఆర్‌ అయితే, రెండో వ్యక్తి మంత్రి కేటిఆర్‌. వారి ఇరువురి ఆలోచనలు దాదాపు ఒకే రకంగా వుండడం విశేషం. ఎందుకంటే ఏ నాయకుడైనా ప్రతి విషయాన్ని ఇతరులతో ప్రతి సందర్భం పంచుకోలేరు. వారిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ సరిగ్గా అదే జరుగుతోంది. ముఖ్యమంత్రికేసిఆర్‌ మదిలో మెదలే ఆలోచనలన్నీ, ఆచరణగా కేటిఆర్‌ పాటించడంలోనే విజయం దాగి వుంది. అందుకే నేను బలమైన నేతగా ఎదగాలన్న సంకల్పం తీసుకున్న నాటినుంచి మంత్రి కేటిఆర్‌ను అనుసరిస్తున్నాను. ఆయనను నిశితంగా గమనిస్తున్నాను. మానవత్వం నిండిన ఆయన ఔదార్యాన్ని అడుగడుగునా అందిపుచ్చుకుంటున్నాను. కరోనా సమయంలో రాత్రి పన్నెండు గంటలకు ఓ బిడ్డ ఆకలితో అలమటిస్తుందని తెలిసి, పాలు లేక ఓ తల్లి రోధిస్తుందని తెలుసుకొని, ఆ రాత్రి పాలు పంపించే నాయకుడు వున్నారా? అంటే అది ఒక్క కేటిఆర్‌ మాత్రమే…!ఇది చాలు ఆయన మానవత్వం విలువేమిటో..ఆయనకు ప్రజల మీద వున్న మమకారం ఎంతటిదో…అంతటి అంకితభావం కల్గిన నాయకుడు కేటిఆర్‌ మాకు మార్గదర్శి…ఎందుకంటే జీవితంలో ఎందరో తారసపడుతుంటారు. వారంతా మనకు గుర్తు వుండరు. వారికి మనం దగ్గరకాలేము…కాని కొందరు మాత్రమే మనమీద బలమైన ముద్ర వేస్తారు. నాపై కూడా మంత్రి కేటిఆర్‌ ముద్ర వుందని గొప్పగా చెప్పుకుంటాను. ఆయన అడుగులు, ఆచరణలు , ఆయనకు మురింత దగ్గర చేశాయి. అలాంటి వ్యక్తిత్వం నిండిన నాయకులు తెలంగాణలో కొద్ది మంది మాత్రమే వుంటారు. అందుకు కేటిఆర్‌ సచ్చీలమైన నాయకత్వం నాకు స్పూర్తిదాయకమయ్యాయి. మంచితనం, మానవత్వం నిండిన కేటిఆర్‌ నాయకత్వం తెలంగాణ మీదనే బలమైన ముద్ర వేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజలకు అనునిత్యం అండగా వుండే నాయకుడు ఎవరు అని అడిగితే నేటితరం యువత చెప్పే ఏకైక మాట కేటిఆర్‌. అంతగా యువతలో ఆయనకు అంతగా ఫాలోయింగ్‌ పెరిగిపోయింది. ప్రజలంటే ఆయనకు విశ్వాసం. ఆయనంటే ప్రజలకు నమ్మకం. 

 తెలంగాణ ప్రగతిలో ఇంతగా పరుగులు పెడుతోందంటే అందుకు ఒక కారణం మంత్రి కేటిఆర్‌. 

నేను స్వతహాగా వ్యాపార రంగంలో వున్న వ్యక్తిని. నేను తెలంగాణ మొత్తం తిరుగుతుంటాను. తెలంగాణ రాకముందు సిరిసిల్ల ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుంది? సరే అది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అనుకుందాం? కాని పదేళ్ల క్రితం హైదరాబాద్‌ ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుంది? పోల్చుకుంటేనే ఆశ్చర్యమనిపిస్తుంది. నాటి రోజులు గుర్తు చేసుకుంటే హైదరాబాద్‌ ఎంతగా అభివృద్ది చెందిందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు కనిపిస్తున్నా, ప్రతిపక్షాల నాయకులకు అవి కనిపించకపోవడం వారి దురదృష్టం. అందుకు మనమేమీ చేయలేం. కాని ప్రజలకు తెలుసు. ఒక నాడు సిరిసిల్ల అంటే ఉరిసిల్ల అంటూ వుండేవారు. మరి నేడు అదే సిరిసిల్లను సిరుల సిల్లను చేశాడు. సిరిసిల్లను సింగారించారు. ఎటూ చూసినా పచ్చదనం నింపారు. అడుగడుగునా ప్రగతి ముద్రలు వేశారు. టెక్స్‌టైల్స్‌ హబ్‌గా మార్చారు. ఇదంతా తెలంగాణ రావడం మూలంగానే సాధ్యమైంది. ముఖ్యమంత్రి కేసిఆర్‌ తెలంగాణ తేవడం వల్లనే ఆవిషృతమైంది. అందులో కేటిఆర్‌ భాగస్వామ్యం ఎంతో వుంది. అందుకే ఆయన అంటే అందరికీ ఇష్టమైన నాయకుడైంది. నేడు మంత్రి కేటిఆర్‌ పుట్టిన రోజు. ఈ రోజు నాకు నాలో రాజకీయ, ప్రజా సేవ స్పూర్తిని నింపిన నాయకుడి గురించి నాలుగు మాటలు చెప్పే అవకాశం నాకు వచ్చింది.అందుకు ఎంతో సంతోషంగా వుంది. మంత్రి కేటిఆర్‌ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుకొని, తెలంగాణను కొన్ని వందల రెట్లు అభివృద్దిచేయాలని మనసారా కోరుకుంటున్నాను.

చెప్పుడు మాటల చే(వే)టు!?

` బండి పదవికి వచ్చిన గండం!

`కిషన్‌ రెడ్డికి ఇష్టం లేని కష్టం!?

` సాఫీగా సాగుతున్న రాజకీయానికి గుదిబండ కట్టడం!

`చెవులు కొరక్కోవడమే అసలు సిసలు రాజకీయం!

` గోడలకు చెవులుంటాయంటే ఇదే!

` బండిని దించి సాధించిందేమిటి?

` దించే దాకా అందరూ ఎప్పుడూ అని ఎదురుచూసిన వాళ్లే!

` బండి దిగితే గాని తత్వం బోధపడలే?

` ఊపు, ఊపనుకున్న వాళ్ల వాపు పోగొట్టుకున్నారు?

` చే’జేతులా కమలం వాడగొట్టుకున్నారు!

` చేతికి లేని బలం కల్పించారు.

` కర్నాటక మాదే…మాదే అని చేతికి వశం చేశారు.

`తెలంగాణలో చేతులెత్తేశారు?

` కమలం కకావికలం చేసుకున్నారు?

హైదరబాద్‌,నేటిధాత్రి: 

బిజేపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ఒక్క మాట ఆ పార్టీ డొల్లతనాన్ని బైటపెట్టింది. ఆయన కావాలని అన్నా, ఆచాచితంగా అన్నా, తనకు కలిగిన బాధను మాత్రం వ్యక్తం చేశాడు. ఇంత కాలం తనలో దాచుకున్న ఆవేధన బైటపెట్టుకున్నాడు. గత మూడు రోజుల కిందట ఆంతరంగికులతో చెప్పుకుంటూ బండి సంజయ్‌ మధనపడుతున్నాడంటూ వచ్చిన వార్తను నిజం చేసినంత పనిచేశాడు. సరిగ్గా కిషన్‌రెడ్డి పార్టీ అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమం రోజున ఆయనను కలచివేసిన సంఘటన గురించి నోరు విప్పాడు. అంటే బిజేపిలో చెప్పుడు మాటలు, అటు మాటలు, ఇటు మాటలు అటు కూడా చెల్లుతాయన్నది సంజయ్‌ మాటలతో తేలిపోయినట్లైంది. ఈ విషయంలో మీడియాలో ఎన్ని రకాల వార్తలు వచ్చినా ఏదో బలమైన కారణం వుంటుందనే అందరూ అనుకున్నారు. కాని పార్టీకి ఒక ఊపు తెచ్చిన బండి సంజయ్‌ లాంటి నాయకుడిని సమయం వస్తే పార్టీ పక్కన పెడుతుందని తెల్చిచెప్పినట్లైంది. ఇందులో రెండు రకాల కోణాలు చూడొచ్చు. ఎంతటి వారైనా సరే పార్టీయే సుప్రిం అని చెప్పడం ఒకటి అయితే, పార్టీ వద్దనుకుంటే ఎంతటివారినైనా పక్కన పెడుతుందని సంకేతాలు పంపినట్లైంది. అయితే ఇది ఒక రకంగా బండి సంజయ్‌కు శిక్ష కాకపోయినా, పార్టీ శ్రేణులు పడుతున్న ఆవేదన మాత్రం క్షక్షగానే చూస్తున్నారు. బండి సంజయ్‌ లాంటి నాయకుడు బిజేపిలో ఎంత మంది వున్నారన్నదానిపై కూడా చర్చ జగాల్సిన అవసరం వుంది. అసలు బండి సంజయ్‌ వల్ల ఎవరు నష్టపోయారు? ఎలా నష్టపోయారు? ఎంత నష్టపోయారు? అన్నది కూడా ఇక్కడ చర్చించాల్సిన అంశమే..అయితే బండి సంజయ్‌ అధ్యక్షుడిగా వున్నంత కాలం ఆయన ఎప్పుడు దిగిపోతాడా? అని ఎదురు చూసిన వాళ్లు కూడా కిషన్‌రెడ్డి పదవీ స్వీకార కార్యక్రమంలో ఒక రకంగా మొసలి కన్నీరు కార్చారనన్న అపవాదు కూడా వినిపించింది. అసలు బండి సంజయ్‌ ఆ మాట ఎందుకన్నారు? ఎవరిని ఉద్దేశించి అన్నారు? అన్నదానిపై రాష్ట్రంలో చర్చ జోరుగా సాగుతోంది. అదేంటో గాని పార్టీలో చేయాల్సినంత చేవారు. తర్వాత అన్ని వేళ్లూ ఈటెల రాజేందర్‌ వైపు చూస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. పార్టీలో చేరిన వాళ్లు అంటే మొదటి నుంచి పార్టీలో వున్నవారు అంటూ ఎవరూ లేరు. నిజామాబాద్‌ ఎంపి. ధర్మపురి అరవంద్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుతో సహా అందరూ కొత్త వాళ్లే. కాకపోతే పార్టీని పట్టుకొని కొన్ని దశబ్ధాలుగా వున్నవారు మాత్రం పెద్దగా తెరమీద లేరు. అంటే బండి సంజయ్‌ మీద ఎంత మంది నివేదికలు ఇచ్చారన్నదానిపై పెద్దగా లోతైన చర్చ అవసరమేలేదు. ఆయన అధ్యక్షుడుగా వున్న సమయంలో మొదట్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రతిసారి అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే వస్తున్నాడు. బండి సంజయ్‌ తనకు ప్రాధాన్యతనివ్వడం లేదన్నది కూడా పలుమార్లు మీడియా ముఖంగానే చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర కార్యక్రమానికి కూడా రఘునందన్‌ రావును ఆహ్వానించలేదన్నది కూడా భహిరంగ రహస్యమే..అయితే బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసే సమయంలో పార్టీ అధ్యక్షుడి ఎంపికలో రఘునందన్‌ రావు పేరు బలంగా వినిపించింది.

ఎందుకంటే రఘునందర్‌ రావు కూడా మంచి వక్త. అందరూ రఘునందర్‌రావుకు పదవి దక్కుతుందని అనుకున్నారు. కాని అనూహ్యంగా బండి సంజయ్‌ పేరు తెరమీదకు వచ్చింది. నిజానికి అప్పటికి బండి సంజయ్‌ సమర్ధత ఎవరికీ తెలియదు. కరీంనగర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే కరీంనగర్‌ ఎంపిగా గెలవడంతో ఆయన ఒక్కసారిగా దూసుకొచ్చారు. వచ్చీ రావడంతో రాష్ట్రపార్టీ అధ్యక్షుడయ్యాడు. అలా పార్టీ పగ్గాలు చేపట్డాడో లేదో..తనేంటో చూపిస్తూ వచ్చాడు. పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. అంతే కాదు ఇంతలో వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందర్‌ రావుకు సెంటిమెంటు రాజకీయం నెరిపి, బండి సంజయ్‌ తనదైన శైలిలో ప్రచారం నెరిపారు. సిద్దిపేటలో పోలీసులు ఎన్నికల ప్రచారంలో కొడుతున్నట్లు, కారులో పిడుగుద్దులు గుద్దినట్లు అరవడం మొదలుపెట్టాడు. అది పెద్దఎత్తున వైరల్‌ అయ్యింది. పార్టీకి మైలేజ్‌ తెచ్చిపెట్టింది. పార్టీ మీద సానుభూతి పెద్దఎత్తున పెరిగింది. దుబ్బాకలో రఘునందన్‌ రావు వైపు ప్రజల మొగ్గు మరింత పెరిగింది. కాకపోతే దుబ్బాక కేవలం తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే గెలిచినట్లు ఇటీవల డిల్లీలో రఘునందన్‌ వ్యాఖ్యానించడం జరిగింది. ఆఫ్‌ది రికార్డు చెప్పిన మాటలును వృత్తి దర్మానికి వ్యతిరేకంగా ఎలా ప్రసారం చేస్తారంటూ మీడియాకు కూడా రఘునందన్‌ నీతి సూత్రాలు చెప్పాడు. కాకపోతే తాను కూడా పార్టీ అధ్యక్ష రేసులో వున్నానని మరోసారి స్పష్టం చేశారు. అంటే బండి ఎప్పుడు దిగిపోతాడా? అని ఆయన కూడా ఎదురుచూసినట్లే లెక్క? 

 బండి సంజయ్‌ పార్టీ అధ్యక్షుడైన సమయంలో నిజామాబాద్‌ ఎంపి అరవింద్‌పేరు ప్రముఖంగా వినిపించింది. 

వస్తూ వస్తూనే ఆయన ఎంపి అయ్యారు. పైగా రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం కావడం. చిన్నప్పటి నుంచి దగ్గరుండి రాజకీయాలను చూస్తూవుండడం ఆయనకు ప్లస్‌ అవుతాయని అందరూ అనుకున్నారు. కాని పార్టీ అధ్యక్షుడుగా బండి సంజయ్‌ను నియమించారు. ఆయన ఆశలు ఆవిరైనట్లున్నాయి. కాని ఇటీవల కల్వకుంట్ల కవిత విషయం వచ్చే దాకా ఆయన ఇంత కాలం బైట పడలేదు. బండి సంజయ్‌ నిజామాబాద్‌ మాజీ ఎంపి, ఎమ్మెల్సీ కవిత విషయంలో బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే అది నానుడి వాడినట్లు వాడినా మహిళల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది బండి సంజయ్‌ మర్చిపోయాడు. ఈ విషయంలో అరవింద్‌కు సంజయ్‌ అడ్డంగా దొరికనట్లైంది. నిత్యం తెల్లారిలేస్తే కల్వకుంట్ల కవితను తూర్పారపట్టే అరవింద్‌ బండి సంజయ్‌ వ్యాఖ్యలను తప్పు పట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. పార్టీ పరమైన చర్యలు వుంటాయని కూడా ఆయన ఆనాడే ప్రకటించాడు. కాలం మూడు నెలలు గడిచింది.. అంతే బండి సంజయ్‌ పదవి పోయింది. కాకపోతే ఇటీవల వరకు కూడా కేంద్ర పెద్దలు ఎవరు వచ్చినా, సందర్భం వచ్చిన ప్రతీసారి బండిని మార్చే ప్రసక్తి లేదంటూ వచ్చారే గాని, చూద్దామని అనలేదు. కాని మార్చేశారు. అందుకు కారణం ఇటీవల పార్టీలో చేరిన ఈటెల రాజేందర్‌, కోమటిరెడ్ది రాజగోపాల్‌రెడ్డిలు పనిగట్టుకొని, సంజయ్‌ మీద పిర్యాధులు చేశారన్న వార్తలు మాత్రం ఇప్పటికీ చెక్కర్లు కొడుతూనే వున్నాయి. అది నిజమా? కాదా? అన్నది బండి సంజయ్‌ వ్యాఖ్యల్లో కూడా నర్మగర్భంగా వెలుగులోకి వచ్చింది. వాళ్లే అని ఆయన నేరుగా చెప్పకపోయినా, అంతటి సమర్ధులు వాళ్లే అన్నది మాత్రం పార్టీ శ్రేణులు అనుకుంటున్నాయి. బండిని దింపేసి, ఈటెలకు మరో కొత్త పదవి ఇవ్వడంతో ఆయన డిల్లీ నుంచి వస్తూ, వస్తూనే హడావుడి చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరీ ఆలోచింపజేసేవిగా వున్నాయి. అంటే ఒక రకంగా ఆశ్యర్యపోయేట్లుగా చేశాయని చెప్పొచ్చు. బండి సంజయ్‌ను పదవి నుంచి తప్పించారని తెలియగానే ఏడ్చేశాను అని స్వయంగా ఆయనే చెప్పడం కూడా అందరినీ ఆశ్చర్యచతుకిల్ని చేసింది. ఏది ఏమైనా రొయ్యలు మాయమయ్యాయి. ఎవరు తిన్నారన్నది మాత్రం అర్ధం కాకుండా వుంది. బండి పదవి కరిమింగిన వెలగపండైనది. కాకపోతే బండి తెచ్చిన ఊపు మాత్రం బిజేపికి ఎప్పుడూ గుర్తుంటుంది. గుర్తు చేసుకుంటుంది. కిషన్‌ రెడ్డి వల్ల పార్టీకి ప్రయోజనం జరగక్కపోతే మాత్రం బండిని అనవసరంగా దించేశామని మధనడతుంది. ఇది ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. బడుగుల పట్ల రాజకీయ పార్టీలన్నీ ఒకేలాగా వుంటాయన్నది మాత్రం నిజమైంది.

కరువు నేలన సాగు సంపద!

`పాలకుల జాతకం కూడా కలిసి వస్తే ప్రతి రోజూ పండగ వాతావరణం.

`ఎమ్మెల్సీ దండె విఠల్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు.

` తొమ్మిదేళ్ల క్రితం వరకూ కరువు తాండవం

` తెలంగాణ సిద్దించడంతోనే తొలగిన కష్టం.

` తెలంగాణ వచ్చిన తొలి ఏడాది నుంచే రైతు గోసకు చరమగీతం.

` చెరువుల బాగుతో మొదలైన సంబరం.

` చెరువులు నింపడంతో నీటి తాండవం.

`కాళేశ్వరంతో మొదలైన అసలు సిసలు సాగు విప్లవం.

` ఇప్పుడు సిరుల సింగారం.

`నాడు చూద్దామన్నా చుక్క లేదు

`ఎటు చూసినా ఎడారిని తలపించిన తెలంగాణం.

` ఇప్పుడు కోటిన్నర ఎకరాల సాగు మాగాణం.

` నేడు ఎక్కడ చూసినా నీటి పరవళ్ళు ఆగింది లేదు.

`నిన్న చెమట చుక్కలతో వ్యవసాయం…

` నేడు కళ్ల నిండా ఆనందం.

`పాలకుల నిర్లక్ష్యం నాడు

`మనసున్న పాలకుడు నేడు.

`తెలంగాణ మురుస్తున్న వేళ ఇంటింటా సంబురం.

 హైదరబాద్‌,నేటిధాత్రి:                                                 

తెలంగాణ వచ్చి అప్పుడే దశాబ్ధ కాలామౌతుందా? అనిపిస్తోంది. ఎందుకంటే సంతోషం పండగలాంటిది. అది ఆనందాన్ని నింపుతుంది. తెలంగాణ ఏర్పాటు అన్నది ప్రజలకు వేడుక. ఆ వేడుక వస్తూనే కొండంత ఆనందాన్ని తెచ్చింది. అంతకంటే గొప్ప నాయకుడిని తెలంగాణ ప్రజలకు అందించింది. ఆ నాయకుడే కేసిఆర్‌. ప్రతి యుగంలో ఒక పుణ్యపురుషుడు పుడతాడంటారు. అలాగే తెలంగాణ కోసం, తెలంగాణ విముక్తికోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ జన్మ నిజంగానే చరితార్ధకమైందని చెప్పాలి. తెలంగాణ కోసం ఎంతో మంది శ్రమపడ్డారు. తెలంగాణ తేవాలని అనుకున్నారు. అయితే అనుకోవడం వేరు. కష్టపడడం వేరు. పట్టుదలతో సాధించడం వేరు. ఇవన్నీ మాత్రం ఒక్క కేసిఆర్‌ మాత్రమే త్రికరణ శుద్దిగా ఆచరించాడు. అనుసరించాడు. అందుకే మకు తెలంగాణను సాధించాడు. మనకు ప్రసాదించాడు. ఒక నాయకుడు పద్నాలుగేళ్ల సుధీర్ఘ ఉద్యమ రాజకీయ పోరాటం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో అంకితభావం వుండాలి. చిత్తశుద్ది కావాలి. ఎన్ని అవాంతరాలైనా ఎత్తుకున్న బాధ్యతను భుజం దించకూడదు. నమ్మకున్నవారికి అన్యాయం చేయకూడదు. అదే సరిగ్గా ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆనుసరించారు. అందుకే తెలంగాణ సాధించారు. ప్రజలకు బహుమానంగా అందించాడు. ఆ సమయంలో కేసిఆర్‌ కొంచెం పట్టు సడలినా నేడు ఈ పరిస్ధితి వుండేది కాదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక పట్టుదల. ఆ పట్టుదలకు ప్రతిరూపం కేసిఆర్‌. అంటున్న ఎమ్మెల్సీ దండె విఠల్‌ , నేటిధాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…

తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల కాలం క్షణంలా గడిచిపోయింది.. పదేళ్ల క్రితం ఒక రోజు యుగంలా గడిచేది. ఇది అతిశయోక్తి కాదు. 

ఆనాటి క్షోభ గుర్తుకొస్తేనే గుండె జల్లు గుబేల్‌ మంటుంది. ప్రతి వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. ప్రతి సమాజం దినదిన గండంగానే గడిపింది. ఉదయం లేవడంతోనే ఏదో ఒక వెలితి. అది కరంటు వుండదు. ఏ క్షణం వస్తుందో తెలియదు. ఎంత సమయం వుంటుందో తెలియదు. ఇక పల్లెల పరిస్ధితి మరీ అద్వాహ్నాం. ఇండ్లలో కరంటు వున్నప్పుడు ప్రజలు ఇంట్లో వుండేవారు కాదు. ఎందుకుంటే కూలీ నాలీ చేసుకుంటూ వుండేవారు. సాయంత్రం ప్రజలు ఇళ్లలోకి చేరుకునే సమయంలో కరంటు వుండేది కాదు. ఇదీ అప్పటి పరిస్ధితి. అయితే ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం కేసిఆర్‌ మొదలు పెట్టారో…కనీసం అప్పటి నుంచైనా కరంటు ఇస్తారని అనుకున్నాం. కాని కావాలని తెలంగాణ ప్రజలను నాటి సీమాంధ్ర పాలకులు మరింత ఇబ్బందులుకు గురిచేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో కరంటు నిరంతరంగా వుండేది. తెలంగాణలో కోతలే వుండేవి. కరంటు మాత్రం వుండేది కాదు. ఇది తెలిసిన తర్వాత ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగసింది. ఇక అసెంబ్లీలో ఓ సందర్భంలో హరీష్‌రావునుద్ధేశించి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏం చేసుకుంటారో? చేసుకోండి?? అంటూ నాటి పాలకుల దుర్మార్గపు మాటలు తెలంగాణ మరింత రగిలిపోయేందుకు కారణమైంది. తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణ పల్లెలో ఎప్పుడు ఏ అలజడి వుంటుందో తెలిసేది కాదు. రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ నక్సలైట్లను జన జీవన స్రవంతి లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి, 1989లో తెలంగాణ యువత జీవితాలతో ఆడుకున్నది. ఆ సమయంలో తెలంగాణ యువత పెద్దఎత్తున అటు వైపు అడుగులేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వాలు నిషేదాలు విధించడంతో ఎంతో మంది తెలంగాణలో అనేక ఇండ్లలో పుత్రశోకాలు మిగిలాయి. మళ్లీ అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్‌. రాజశేఖరరెడ్డి నక్సలైట్లతో చర్చల పేరుతో మళ్లీ తెలంగాణలో లేని అలజడి రేపాడు. అంటే తెలంగాణలో ఎప్పుడూ ప్రశాంతత లేకుండా చేస్తేనే సీమాంధ్ర అభివృద్దిపై చర్చ జరగకుండా చూసుకుండేవారు. ఇలా తెలంగాణను అల్లకల్లోం చేసి, ఆంధ్రాను అన్న పూర్ణగా తీర్చిదిద్దుకున్నారు. నీళ్లు తరలించుకెళ్లారు. తెలంగాణ ఎండబెట్టారు. తెలంగాణ భూములు పడావు పడేలా చేశారు. ఆంధ్రాలో కాలువలు, పొలాలకు నీళ్లు, ఆఖరుకు చేపల చెరువులు కూడా నింపుకున్నారు. తెలంగాణను నిర్లక్ష్యం చేశారు. క్షోభకు గురి చేశారు. గోస పెట్టారు. 

మన తెలంగాణను మనకు సాధించి పెట్టిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ పదేళ్ల కాలంలో తెలంగాణలో సమ్మిళిత అభివృద్ధిని చేసి చూపించారు.

 తెలంగాణ వచ్చాక ఎలా వుంది? అంటే మాటల్లో చెప్పలేనంతగా అభివృద్ది చెందిందని టక్కున చెప్పేస్తారు. పదేళ్ల క్రితం తెలంగాణ వచ్చి వెళ్లి, మళ్లీ ఇప్పుడు చూసిన వారు ఆశ్చర్యపోకతప్పదు. ఎందుకంటే తెలంగాణ అంత వేగంగా అభివృద్ధి చెందింది. ప్రతి ఇంటికి నీరొచ్చింది..మిషన్‌ భగీరధతో సురక్షితమైన మంచినీరు అందుతోంది. ప్రతి అడుగుకు నీరుంది. తెలంగాణలో ఎండిన బీడంతా తడిసింది. నెర్రెలు పారిన నేలంతా పచ్చదనం పర్చుకున్నది. నేలంతా సాగౌతోంది. తెలంగాణ నేలంతా పచ్చగా సింగారించుకున్నది. తెలంగాణ బంగారమైంది. ఎటు చూసినా నీళ్లతో కళకళలాడుతోంది. పాడి పంటకు అసలైన నిర్వచనం తెలంగాణలో కనిపిపిస్తోంది. ఇదంతా కల గన్నామా? అసలు తెలంగాణ వస్తుందన్న ఆశలే లేని రోజుల నుంచి, తెలంగాణ సాధించి, బంగారు తెలంగాణను చూస్తున్నాం. ఇదంతా కేసిఆర్‌ వల్లనే సాధ్యమయ్యింది. కేసిఆర్‌ లేకుండా తెలంగాణ వచ్చేదే కాదు. కేసిఆర్‌ పాలన లేకుంటే తెలంగాణ ఇలా వుండేదే కాదు. ఎందుకంటే యుగపురుషులు చేపట్టే ప్రతి కార్యానికి ప్రకృతి కూడా పూర్తిగా సహకరిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడిన గోసకు మరో కారణం కూడా వుంది. తెలంగాణ అంటేనే చిన్న చూపు వున్న నేతలు అదృష్టం కొద్ది ముఖ్యమంత్రులైనా చరిత్ర హీనులుగానే మిగిలిపోయారని చెప్పకప్పదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద తీవ్ర వివక్ష చూపించేవారు. అందుకే ఆయన పాలనుకు ప్రకృతి ఏనాడు సహకరించలేదు. ఆయన పాలించిన తొమ్మిదేళ్లలో ఏడేళ్లు కరువు. రెండేళ్లు భయంకరమైన కరువు. మొత్తంగా ఆయన పాలతనంతా కరువు మయం. కాని సీమాంద్రను వున్నదాంతా దోచిపెట్టాడు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపాడు. ఏ సీమాంధ్రను చూసి అన్న పూర్ణ అంటూ కీర్తించేవారో..అదే ప్రాంతంలో క్రాప్‌ హలీడే కూడా డిక్లేర్‌ చేసిన రోజులు ఒక్క చంద్రబాబు హాయాంలోనే జరిగింది. అంటే ఆ సమయంలో పచ్చని పొలాలతో అలరాలుతుండే సీమాంధ్రలోనే మంచినీళ్లకు కరువొచ్చిందంటే, తెలంగాణలో ఎంతటి దుర్భరమైన పరిస్ధితులు వుండేవో అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకునేవారు. అటు కరువు, ఇటు ఉపాధి లేక, పంటలు పండక, నాటి పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ అస్తవ్యస్ధమైంది. 

కళ్లుండి చూడలేని, నోరండి మాట్లాడలేని, పదవులుండి పలుకుబడి లేని తెలంగాణ కాంగ్రెస్‌, తెలుగుదేశం నేతలంతా నిశ్చేష్ట్రులుగా, ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే మిగిలిపోయేవారు. 

వారికి పదవులుంటే చాలు ప్రజలు ఏం లేకున్నా ఫరవాలేదన్నంతగా రాజకీయం చేసేవారు. నిండు అసెంబ్లీలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వమని నాటి పాలకులు చెబుతుంటే, మౌనం దాల్చిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆనాడు మూగబోయిన నోర్లు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. సీమాంధ్రులను ప్రశ్నించలేని గొంతులు ఇప్పుడు లేస్తున్నాయి. నాడు పాలన చేతగాని వాళ్లు, ఇప్పుడు పదవుల కోసం ఆరాపడుతున్నారు. పదేళ్లలో జరిగిన తెలంగాణ అభివృద్ధిని కూసి కొనియాడాల్సిందిపోయి, ఆనాడు చెప్పలేకపోయిన మాటలు ఇప్పుడు చెబుతున్నారు. కాని పుణ్యకాలం ఎప్పుడో దాటిపోయింది. తెలంగాణ కాంగ్రెస్‌ నేతల రాజకీయాలకు ఎనాడో నూకలు చెల్లిపోయాయి.

బడుగుల ఆత్మగౌరవమే బిఆర్‌ఎస్‌!

 

`ఉద్యమ పార్టీగా అన్ని వర్గాలకు ప్రాధాన్యత.

`బడుగు నేతలకు అత్యంత గౌరవం.

`బిఆర్‌ఎస్‌ బాటలోనే అన్ని పార్టీలు.

`కాంగ్రెస్‌ పార్టీ ఒంటెద్దు పోకడలు.

`రెడ్డి రాజ్య స్థాపన బీరాలు.

`బడుగులను పక్కనపెట్డే కుట్రలు.

`బిజేపిలో అదే వైఖరి?

`ప్రతిపక్షాలలో కనిపించని బడుగుల గుర్తింపు.

` ఒక్క బిఆర్‌ఎస్‌ లోనే అసలైన అత్యంత గౌరవం.

`ఉద్యమ వేదిక నుంచే బడుగులకు పెద్ద పీట.

`తెలంగాణ సమాజమంతా ముక్త కంఠంతో చెప్పేది ఒక్కటే.

`అన్ని వర్గాల సంక్షేమం కోరేది ఒక్క బీఆర్‌ఎస్‌ పార్టీనే.

`బిఆర్‌ఎస్‌ అంటే బడుగులకు బాసట.

` బిఆర్‌ఎస్‌ పార్టీయే తెలంగాణ కు కొండంత అండ.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరారక్ష.

హైదరబాద్‌,నేటిధాత్రి:  

రాజకీయ పార్టీలు రాజకీయమే చేయాలి. కాని సైద్దాంతిక రాజకీయాలు చేయాలి. ప్రజలకు మేలు చేసే రాజకీయాలు చేయాలి. ఓడ ఎక్కెదాకా ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అనేలా వుండకూడదు. అందులోనూ కుల, మత రాజకీయాలు అసలే చేయొద్దు. దురదృష్టమేమిటంటే దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన బిజేపి, కాంగ్రెస్‌లో చేసేది ఇదే. అందుకే కాంగ్రెస్‌ పార్టీ కులాల వారిగా రాజకీయాలు చేస్తే, బిజేపి మత పరమైన రాజకీయాలు చేస్తుందన్న అపవాదు వుండనేవుంది. ఈ రెండు పార్టీలు ఈ రెండు నమ్ముకున్నా, ఓట్ల కోసమే బడుగులను వాడుకుంటూ వస్తున్నాయి. కాని ఏనాడు బుడుగులుకు ఈ రెండు పార్టీలు పెద్ద పీట వేసింది లేదు. బుడుగులసామాజిక వర్గాలకు న్యాయం చేసింది లేదు. వారిని ఆర్ధికపరంగా ముందుకు తీసుకొచ్చింది లేదు. వారికి ఆర్ధిక ప్రయోజనాలు కల్పించే పధకాలు అందించింది లేదు. కాని మన స్వతంత్ర దేశంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాతే అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అందుతున్నాయి. అన్ని రకాల సంక్షేమ పధకాలు అందించబడుతున్నాయి. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాత్రమే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందులో దళిత బంధు, గిరిజన బంధు, పోడు పట్టాలు, బిసిలు లక్ష సాయం, రైతుబంధు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పధకాలు ప్రజలకు అందుతున్నాయి. దానికి తోడు రాజకీయంగా కూడా బడుగులకు పెద్ద పీట వేస్తున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌లో వున్నంత మంది బడుగులనేతలు మరే పార్టీలో లేరు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా కీలకస్ధానాల్లో వున్నారు. భవిష్యత్తులో బిఆర్‌ఎస్‌ మాత్రమే బడుగుల నేతలకు మరింత ప్రాదాన్యతనివ్వనుంది. 

జనం కోసం ఆలోచించలేని పార్టీలు కూడా ఓట్లకోసం జపం చేస్తుంటారు

. ఎన్నికలు దగ్గర పుడుతున్నప్పుడే వాళ్లు గుర్తుకొస్తుంటారు. ఆ క్షణం దాటిందంటే మేమంటే మేమే..మాకు మేమే అన్నట్లు వ్యవహరించడంలో కాంగ్రెస్‌, బిజేపిలు ఒకరిని మించి మరొకరు నాటకాలు ఆడడంలో ఆరితేరిపోయారు. అందుకే తెలంగాణ సమాజం బిఆర్‌ఎస్‌ను ఆదిరిస్తూ వస్తోంది. బిఆర్‌ఎస్‌నే గెలిపిస్తూ వస్తోంది. బిఆర్‌ఎస్‌ మాత్రమే బడుగుల ప్రయోజనాలు కాపాడుతుందన్న నమ్మకం బలంగా వుంది. బిఆర్‌ఎస్‌ కేవలం బడుగులే కాదు, అగ్రవర్ణాల పేదలకు కూడా మేలు చేయడంలో ముందుంది. ప్రజలు అంతగా బిఆర్‌ఎస్‌ను గుండెల్లో పెట్టుకోవడం ఇష్టం లేని జాతీయ పార్టీలు, కులాల కుంపట్లు రగిలించేందుకు గత మూడు,నాలుగు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే వున్నారు. 

   ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి రేవంత్‌రెడ్డి అధ్యక్షుడయ్యాక తెలంగాణలో కుల రాజకీయాలకు, ముఖ్యంగా రెడ్డి రాజకీయం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. 

ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఓ వేదిక మీద పంచుకున్నారు. గతంలో రెడ్డి సంఘాల సమాఖ్యలను ఏకం చేసే పని ఆయన పార్లమెంటు ఎన్నికలకు పోటీ చేసినప్పుటి నుంచే మొదలుపెట్టాడు. 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి నుంచి పోటీ పార్లమెంటుకు పోటీ చేశాడు. ఆ సమయంలో ఆయన ఆ పార్లమెంటు పరిధిలోని రెడ్డి కులస్ధులతో అనేక ధఫధపాలుగా సమావేశాలు నిర్వహించారు. దాంతో మల్కాజిగిరి ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి ఆయన పిపిసి. మీద కన్నేసి, పిసిసి. అధ్యక్షుడు అయిన తర్వాత రెడ్డి ఐక్య వేధిక సమావేశం పరోక్షంగా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన చేసి వ్యాఖ్యలు ఇప్పటికీ తెలంగాణ సమాజం మర్చిపోదు. ఎందుకంటే రెడ్డి అంటే కనీసం పది ఎకరాల స్థలం వుండాలి. వాళ్లు రాజకీయంగా ఎదగాలి. రెడ్డి రాజకీయం ఉమ్మడి రాష్ట్రంలో లాగా కీలకపాత్ర పోషించాలంటే మనమంతా ఏకం కావాలి. ఒక్కతాటిపై రావాలి. ఇతర పార్టీలలో వున్నవారిని ఎలాగైనా కాంగ్రెస్‌లోకి తెప్పించే ప్రయత్నం చేయాలి. అంటూ ఆయన అనేన విషయాలు చెప్పాడు. ఇప్పుడు అదే ఆ పార్టీలో అనుసరిస్తూ వస్తున్నాడు. 

బడుగు నేతలను ఎక్కడిక్కడ పక్కన పెడుతూ, కేవలం రెడ్డి నాయకత్వాన్నే ప్రోత్సహిస్తూ వస్తున్నారు. 

ఇటీవల కాంగ్రెస్‌లో చేరుతున్న వారి లిస్టు చూస్తే కేవలం రెడ్డి నాయకులే కనిపిస్తున్నారు. ఎక్కడా ద్వితీయ శ్రేణి నాయకులుగా బడుగులను ప్రోత్సహించడం లేదు. తాజాగా ఆలేరుకు సంబంధించిన కాంగ్రెస్‌ నేతుల గాంధీభవన్‌కు న్యాయం చేయాలని వస్తే వారందరినీ సస్పెండ్‌ చేస్తామంటూ హెచ్చరించారు. గతంలో ఏ పిపిసి. అధ్యక్షుడు ఇలా మాట్లాడిన సందర్భాలు లేదు. గతంలో ఏఐసిసి. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓటింగ్‌లో సాక్ష్యాత్తు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లాంటి వారు గాంధీభవన్‌ ముందు దర్నా చేయాల్సిన రావడం దురదృష్టకరం. అదే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిత్యం పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఏదో రకంగా విమర్శిస్తూనే వుంటాడు. కొన్ని సార్లు దూషించిన సందర్భాలున్నాయి. మరో నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసే వ్యాఖ్యలు ఎలా వుంటాయో తెలంగాణ సమాజానికి తెలియంది కాదు. ఆయన కూడా నిత్య అసమ్మతి వాదిగా రేవంత్‌ను ఎప్పుడూ ఎదిరిస్తూనే వుంటాడు. ఇటీవల తాజాగా కూడా అమెరికాలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో ఎవరూ స్పందించపోయినా, అందరికన్నా ముందు స్పందించి తప్పని నిర్ధారించింది ఆయనే. అంటే రెడ్డిలో నిత్య అసమ్మతి వాదులున్నప్పటికీ రెడ్డి నేతలపై ఎలాంటి చర్యలు వుండవు. 

 గతంలో కూడా కాంగ్రెస్‌ కల్చర్‌ ఇలాగే వుండేది. 

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కొన్ని దశాబ్ధాల పాటు పార్టీలో నిత్యం ఏదో ఒకటి రగిలిస్తూనే వుండేవారు. 1989లో చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని కూలదోసింది కూడా వైఎస్సే అని సాక్ష్యాత్తు చెన్నారెడ్డే అసెంబ్లీలో ప్రకటించారు. అంటే వారి రాజకీయం కోసం ఎవరైనా ఇబ్బందులకు గురి చేసేందుకు వెనకాడని తత్వం వున్నా సరే రెడ్డి అంటే చాలు ఏమనరు? ఇక అదే వైఎస్‌ . రాజశేఖరెడ్డి మరో ముఖ్య మంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని పదేపదే ఇరుకున పెట్టేవారు. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక జనార్ధన రెడ్డి బార్యకు మంత్రి పదవి ఇచ్చారు. మరో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డితో సభలో చెప్పులు విసిరేయించినట్లు వైఎస్‌పై ఆరోపణలున్నా ఆయనను పార్టీ వెనకేసుకొచ్చింది. ఆఖరుకు కోట్ల విజయభాస్కరరెడ్డి తన రాజీనామా లెటర్‌ను ఎప్పుడూ జేబులో పెట్టుకొని వుంటూ వుండేవారని అంటుంటారు. అంటే వాళ్లకు వాళ్లే కొట్లాడుకుంటున్నట్లు నటిస్తూ, బడుగుల సానుభూతితో ఓట్లు సంపాదించి, అధికారంలోకి రావడం రెడ్డి నేతలకు అనాదిగా వస్తున్న అలవాటే. ఇప్పుడూ రేవంత్‌ రెడ్డి అదే చేస్తున్నాడు. మిగతా రెడ్డి నేతలు కూడా అదే అనుసరిస్తున్నారు. కాని అదే కాంగ్రెస్‌లో ఎవరైనా బిసిలు, ఎస్సీ, ఎస్టీలు నోరు తెరిస్తే చాలు వాళ్లను క్షణాల్లో పార్టీ నుంచి సాగనంపే కార్యక్రమం క్షణాల్లో జరుగుతుంది. ఓట్లు రెడ్డిలవి, సీట్లు బడుగులవి అంటూ కాంగ్రెస్‌ మీద వున్న అపవాదే ఇప్పటికీ అమలౌతోంది. 

 తాజాగా బిజేపి కూడా అదే వర్గంలో చేరిపోయింది. 

తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో బిజేపి అధ్యక్షులుగా ఎంతో మంది రెడ్డి నేతలే పనిచేశారు. అందులో ఏ ఒక్కరు బిజేపికి బలం పెంచలేదు. కాని వాళ్లు మాత్రం బలపడుతూ వచ్చారు. వారిలో ఒక్క లక్ష్మణ్‌ తప్ప మరో బిసి నేత కనిపించరు. ఆయన కూడా ఒకేసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు రాజ్యసభ ఇచ్చారు. గతంలో కూడా బిజేపికి రెండుసార్లు కిషన్‌రెడ్డి అధ్యక్షుడుగా పనిచేశాడు. కాని పార్టీ కి వచ్చిన ఊపులేదు. గెలుపు లేదు. కాని ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు గతంలో ఎన్నడూ లేనంతగా బిజేపిని నిత్యం లైమ్‌లైట్‌లో వుంచిన నాయకుడు బండిసంజయ్‌. ఆయన ను కూడా ఇప్పుడు పక్కనపెట్టారు. మళ్లీ బిజేపిని రెడ్డినేత చేతులో ్లనే పెట్టారు. కాని మళ్లీ మరో బిసినేతకు ఇవ్వలేదు. ఎందుకంటే బిసి నేతలు ఎదగడం ఏ రెడ్డి సామాజిక వర్గ నేతలకు ఇష్టం వుండదు. తాజాగా బండి సంజయ్‌ ఇదే విషయాన్ని తన అనుచరులతో చెప్పుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తనపై క్షక్ష కట్టి మరీ దింపేశారని చెప్పుకున్నాడని అంటుంటారు. ఇలా పైకేమో బడుగుల గురించి బాష్యాలు చెబుతూ, పార్టీ సంగతికొచ్చేసరికి బడుగులను దూరంపెట్టడమే బిజేపి అంతర్గత స్వామ్యమని మరోసారి తెలిపోయింది.

రెచ్చగొట్టకు రేవంత్‌!

`బెదిరింపులు మానుకో!!

`నేటిధాత్రి ఇలాంటి ఉడుత ఊపులు చాలా చూసింది?

`నీ రాజకీయం పుట్టకముందే నేటిధాత్రిది అక్షర ప్రభంజనం.

`నువ్వు రాజకీయ ఓనమాలు నేర్వకముందే, ఉమ్మడి రాష్ట్ర పాలకులకు నిద్ర లేకుండా చేసింది.

`పందొమ్మిదేళ్లుగా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నది.

`సమైక్య పాలకులనే ఎదిరించి నిలిచింది.

`తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోసింది.

`నేటిధాత్రి రాజకీయ ప్రత్యర్థి కాదు! ప్రశ్నా ప్రపంచం.

`సామాజిక బాధ్యతకు నిదర్శనం.

`పత్రికల మీద దాడులు ప్రజాస్వామ్య పరిహాసం.

` ప్రత్రికలలో వచ్చిన వార్తలను ఖండిరచే అవకాశం వుంది.

`స్వార్థ రాజకీయాల కోసం అనవసరంగా యువకుల జీవితాలను బలిచేయొద్దు?

`నేటిధాత్రి కి బెదిరింపు కాల్స్‌ చేసిన వారిపై కేసులు నమోదు చేయడం నిమిషం పని. 

`వాళ్ల జీవితాలు ఆగం కావొద్దనే ఊరుకుంటున్నాము.

`మళ్ళీ ఎలాంటి కాల్స్‌ వచ్చినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం.

`నాయకుడిగా క్రెడిబిలిటీ నిలబెట్టుకుంటావో, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటావో ఆలోచించుకో!

`పత్రికలో వార్తలే జీర్ణించుకోకపోతే, ప్రజల ప్రశ్నలు ఎలా వింటావు?

`రాజకీయ అవకాశ వాదులను నేటిధాత్రి ఉపేక్షించదు.

`శివుడు గొంతులో గరళమంత శక్తి కల్గినది నేటిధాత్రి.

హైదరబాద్‌,నేటిధాత్రి:                                     

నేటిధాత్రి తన 19 సంవత్సరాల సుధీర్ఘ అక్షర ప్రయాణంలో అనేక మంది నాయకులను చూసింది. కొత్తగా రేవంత్‌ వర్గంచూపించే ఉడుత ఊపులకు నేటిధాత్రి భయపడుతుందనుకుంటే అది భ్రమే అవుతుంది. నాయకులపై వార్తలు వస్తే వాటిని ఖండిరచే అవకాశం వుంది. ప్రభుత్వాలను విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు వుందని చెప్పుకునే రేవంత్‌ రెడ్డికి, తన రాజకీయాన్ని కూడా పత్రికలు ప్రశ్నిస్తాయన్న సోయి లేకపోవడం విడ్డూరం. నాయకుడిగా తాను ఇష్టం వచ్చినట్లు ఇతర పార్టీలను, ఇతర నాయకులను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే రేవంత్‌కు నేటిధాత్రి మీద మాట్లాడే అర్హత లేదు. ఇదిలా వుంటే యువకులను అడ్డంపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేయడం ఏమిటి? ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల పట్ల ఇలాంటి వ్యవహారాలు జరిగితే, జగ్గారెడ్డి లాంటి నాయకులు కూడా రేవంత్‌ని నేరుగానే విమర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావును సైతం రేవంత్‌ సైన్యం పేరుతో గతంలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదేం పద్దతి అని వాళ్లు ప్రశ్నిస్తే నాకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నావు. నాయకులకు క్షమాపణ చెప్పుకున్నావు. ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయన్న భ్రమలో నేటిధాత్రిని బెదిరిస్తున్నావా? ఆవేశపరులైన యువకుల జీవితాలను స్వార్ధ రాజకీయాలకు కోసం వాడుకొని, వారి భవిష్యత్తును నాశనం చేయకు. గత కొన్ని రోజులుగా రేవంత్‌ సైన్యం పేరుతో ఫోన్లు చేస్తున్నారు. వారిని పోలీసులకు పట్టించడం నిమిషం పని. కాని రాజకీయ నాయకుల లాగా మీడియాకు స్వార్ధ ప్రయోజనాలుండవు. నాయకుడు వ్యక్తి. అందకే వారికి వ్యక్తిగత అసవరాలు, రాజకీయ క్రీడలు, పదవుల పందేరాలుంటాయి. మీడియాకు సమాజ శ్రేయస్సు మాత్రమే వుంటుంది. అందుకే బెదిరింపులకు పాల్పడిన వారిని చూస్తే జాలేస్తుందే? కాని కోపం రావడం లేదు. ఎందుకంటే వారి జీవితాలేమిటో వారికే తెలియదు. వారి భవిష్యత్తు నాయకులకు తాకట్టు పెడతారు? అలాంటి వారి జీవితాలు నాయకుల కబంధ హస్తాలనుంచి బైట పడాలనే మీడియా కోరుకుంటుంది. నేటిధాత్రి కూడా అదే ఆలోచిస్తుంది. అందుకే రేవంత్‌ సైన్యం పేరుతో వస్తున్న బెదింపులను పట్టించుకోలేదు. కాకపోతే అవి మరీ శృతి మించితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ఇలాంటి దిగజారుడు చేష్టలు మానుకుంటే చాల మంచింది. రాజకీయాలన్నాక పూలు, పడతాయి? రాళ్లు పడతాయి? అవి రేవంత్‌కు తెలియంది కాదు. 

పద్నాలుగేళ్లపాటు సుదీర్ఘ పోరాటం సాగించి సాధించుకున్న తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని, తెలంగాణను ఆగం చేయాలని చూసిన రేవంత్‌రెడ్డిని దిగజారుడు రాజకీయాలు తప్ప మంచి రాజకీయాలు ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.

 వెనకటి గుణమేలా మాను..వినరా సుమతీ! అన్నట్లు ప్రజలు ఎన్నుకొని, ప్రజా ప్రతినిధిని చేస్తే కూడా తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే నాయకుడిగా ఎంత ఎదిగినా వృధానే! ఈ విషయం రేవంత్‌రెడ్డి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. హుందాపూరిత రాజకీయాలు నెరపాలి. అంతేకాని వ్యక్తి స్వామ్యరాజకీయాలు ప్రజాస్వామ్యంలో రాణించవు. రేవంత్‌రెడ్డి రాజకీయాలు మొదలుపెట్టక ముందు నుంచే నేటిధాత్రి అక్షర ప్రభంజనం కొనసాగుతోంది. అది ముందు తెలుసుకుంటే ఎంతో మంచింది. తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టిన పత్రిక, తెలంగాణ మానస పుత్రిక నేటిధాత్రి. కేవలం తెలంగాణ కోసం వ్యాపారాలు మానుకొని, భూములను అమ్ముకొని నేటిధాత్రి అక్షరోద్యమం చేసింది. అంతటి త్యాగం నేటిధాత్రికి వుంది. కాని రేవంత్‌ అనే నాయకుడికి చెప్పుకోవడానికి రాజకీయం తప్ప, తెలంగాణ ఉద్యమ నేపధ్యంలేదు. తెలంగాణ కోసం కొట్లాడిరది అసలే లేదు. పైగా ఎక్కడ తెలంగాణ వాదులు తన పర్యటనను అడ్డుకుంటారో? అని ఆ రోజుల్లో కరీంనగర్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశాలకు గన్‌ పట్టుకొని మరీ వెళ్లిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. తెలంగాణ ఉద్యమ ద్రోహంలో ప్రదాన పాత్రదారులకు, సూత్రదారులకు అండగా వున్న రేవంత్‌చరిత్ర అందరకీ తెలుసు. అయినా ఇప్పుడు సత్యవంతుడినన్నట్లు, తెలంగాణ కోసం కల్లబొల్లి మాటలు చెబితే ఎవరూ నమ్మురు? నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేముంటే, వాళ్లు నమ్మితే ఎవరూ అడ్డుకునే పరిస్ధితి వుండదు. నేటిధాత్రిని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కొన్ని వందల సార్లు మభ్యపెట్టాలని చూశారు. మాయ చేయాలని చూశారు. ఇబ్బందులకు గురిచేశారు. నేటిధాత్రి నడవకుండా అనేక కుట్రలకు తెరతీశారు. ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని చూశారు. కాని నాటి పాలకులు కుయుక్తులన్నింటికీ ఎదిరించి ఉద్యమంలో తెలంగాణ అక్షర వేదాలు రచించింది. తెలంగాణ ఉద్యమ యజ్ఞం సాగించింది. తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లె గొంతును వినిపించింది. ఆకుల అలజడిలో కూడా తెలంగాణ శబ్ధం వినిపిచింది. ఎండిన గొంతును నుంచి తెలంగాణ రాగం ఆలపించేలా చేసింది. అదీ నేటిధాత్రి ఘనత. చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా వుంది. చెప్పుకుంటుంటే ఇప్పటికీ ఉద్వేగం ఉప్పొంగుతుంది. మరి రేవంత్‌ నువ్వెం చెప్పుకుంటావు? తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యావని చెప్పుకోవాలి? తెలంగాణకు నేటిధాత్రి చేసిన అక్షర సేవ ముందు రేవంత్‌ రాజకీయాలు ఒక దూళి కణంతో సమానం. ఇప్పటికైనా నేటిధాత్రి మీద బెదిరింపులు మానుకో…ఎందుకంటే ఇలాంటి అదిరింపులు అనేకం చూశాం..ఎదుర్కొన్నాం…నిలబడ్దాం…అంతేకాదు తప్పు చేస్తే అధికారంలో వున్న నాయకులను, పదవుల్లో వున్న మంత్రులను కూడా నిలదీసి, కడిగేసిన చరిత్ర నేటిధాత్రిది..ముందు నేటిధాత్రి చరిత్ర తెలుసుకో..దాని విశ్వరూపం ఎంత గొప్పదో చూసుకో…! తప్పు చేస్తే ఎంతటి వారినైనా నిప్పుకణికల్లాంటి అక్షరాలతో కడిగేస్తాం..? ప్రభుత్వంలో వుండి తప్పులు చేసిన వారినే వదల్లేదు. వారి ప్రలోభాలకు లొంగలేదు. బెదిరింపులకు అదరలేదు. నేటిధాత్రికి వున్న బలమే అక్షర సైన్యం. అవి కవాతు మొదలుపెడితే ఎంతటి వారికైనా చుక్కలు కనిపించాల్సిందే…

 అసలు నేటిధాత్రి చెప్పిన వార్తలకు, రేవంత్‌ రెడ్డి సైన్యం బెదిరింపులకు ఏమైనా సంబంధం వుండాలా? వద్దా?

 అసలు రేవంత్‌రెడ్డి లేకపోతే కాంగ్రెస్‌ నడవదని అనుకుంటుంటే, రేవంత్‌ వుంటేనే కాంగ్రెస్‌ నడవదని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అనుకుంటున్నారు? ఇది భహిరంగ రహస్యమే! అదే నేటిధాత్రి చెప్పింది. ఇది వాస్తవం కాదా? దాన్ని జీర్ణించుకోలేకపోతే..అది నిజం కాదని నిరూపించాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీ పెద్దలందరి చేత జేజేలు కొట్టించుకో! అది సాధ్యమయ్యే పని కాదు? కాని నేటిధాత్రిని బెదింపులకు గురిచేస్తారా? నాయకుడన్న తర్వాత ఓర్పు సహనం వుండాలి. అయినా మీడియా అంటేనే లోపాలను ఎత్తిచూపేది. పార్టీ పరంగా వున్న అవరోధాలు, నాయకత్వాలలో వున్న లోపాలు, యంత్రాంగంలో హెచ్చుతగ్గులు ఇలా ప్రతి విషయాన్ని మీడియా సృషిస్తుంది. పార్టీలకు సూచనలు చేస్తుంది. వాటిని విమర్శలు అనుకోవడంలోనే పార్టీల అసలు స్వరూపం బైటపడుతుంది. నాయకుల డొల్లతనం కళ్లకు కనిపిస్తుంది. అయినా మీడియా ఇదే రాయాలి? ఇదే చెప్పాలి? తమ నేత గురించే గొప్పగా చెప్పాలి? లేకుంటే ఆ మీడియాపై పడిపోతాం? యాగీ చేస్తాం? దాడులు చేస్తాం? అంటూ వార్నింగ్‌లు ఇవ్వడం ఏమిటి? ఏ కాలంలో బతుకుతున్నాం. ఇప్పుడున్నది రాజరికంకాదు. రాజల కాలంలో కూడా ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు, పాలన పట్ల ప్రజలు అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాత్రి వేళలలో మారు వేషంలో తిరిగే వారట. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో..ప్రజల్లో నేతల మీద వున్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇప్పుడున్న పరిస్ధితుల్లో నాయకులకు పెద్ద శ్రమ అవసరం లేదు. మీడియా వుంది. ఆ మీడియానే సమాజ చైతన్యానికి గీటు రాయి. ఒక రకంగా సమాజానికి దిక్సూచీ. అది అర్ధం చేసుకోకపోతే నాయకులకు మనుగడ లేదు. భవిష్యత్తు అంత కన్నావుండదు..

పట్టుమని పది సీట్లు కష్టమే!?

-కాంగ్రెస్‌ లో కుంపట్లకు కొదువలేదు?

-వున్న వారంతా ముఖ్యమంత్రులే?

-రేవంత్‌ ను అసలు కాంగ్రెస్‌ లీడర్లే నమ్మడం లేదు?

-గతంలో రేవంత్‌ చేసిన ఉద్యమం లేదు?

-పార్టీలో పది మంది లీడర్లు సక్కగ లేరు?

-పార్టీని గెలిపించే నాయకుడే కరువయ్యాడు?

-రాని ప్రభుత్వంలో నేనే సిఎం అని చెప్పుకునే వారే?

-జనం నమ్ముతారని అనుకోవడం లేదు?

-పరిపాలనా దక్షతలో అనుభవం లేదు?

-ఎక్కడ చేరినా ఆ పార్టీలు బతికి బట్టకట్టింది లేదు?

-ఒక్కొక్కరినీ నిచ్చెన మీద నుంచి లాగడానికి వాళ్లే చాలు?

-పాత వారికి ప్రాధాన్యత లేదు?

-కొత్త వారికి ప్రజల్లో వున్న గుర్తింపు లేదు? 

-ఏ ఒక్కరికీ ప్రభుత్వం మీద పోరాటం చేసిన చరిత్ర లేదు?

-రోడ్ల మీదకొచ్చి కొట్లాడిరదెన్నడూ లేదు?

-ఈ ఐదేళ్లలో పోరాటం చేసి జైలుకెళ్లొచ్చిన నాయకుడే లేదు?

-కాలు కదపకుండా, కడుపు సల్లగా వున్న వాళ్లే?

-వీళ్లను చూసి ప్రజలు ఓట్లేస్తారా?

-కాంగ్రెస్‌ కు పట్టం కడతారా?

-కర్ణాటక లో గెలిస్తే తప్ప సోయి రాలేదు?

-నిద్రలో నుంచి లేచినా పగటి కలలే కంటున్నారు?

 హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయ పార్టీలకు ఆశలుండాలి. అంతకు మించి పోరాటం కూడా వుండాలి. అంతే కాని గాలి వాటం గెలుపుకోసం ఎదురుచూస్తే విజయాలు రావు. నిన్నటి దాకా వచ్చేది మేమే…పాలించేది మేమే అంటూ బిజేపి తెగ ఆశలకు పోయింది. కర్నాటక ఫతితాలతో పార్టీకి దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు ఆ ఆశల పల్లకిలో కాంగ్రెస్‌ ఊరేగుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పట్టుమని పది సీట్లు కూడా కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే పరిస్ధితి లేదు. కరంటు విషయంలో ప్రజలు కాంగ్రెస్‌ను ఎలా తిట్టిపోశారో అందరూ చూశారు. అయినా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో కొట్లాడేంతస్ధాయిగాని, రాజకీయాలంటే పోరాటాలన్నది తెలిసిన వాళ్లు లేరు. ఎంత సేపు ప్రచార యావ తప్ప, పార్టీ మీద మమకారం, గెలుద్దామన్న లక్ష్యం ఎవరకీ లేదు. నేను తప్ప, మరొకరు వుండొద్దు. నాకుంటే ముందుకు ఎవరూ ముందుకు పోవద్దు. అనే మనస్తత్వాలతో కాంగ్రెస్‌ పార్టీ నిండిపోయింది. అందుకే ఆ పార్టీ ఆశల మీదే బతుకుతోంది. ఆశయాలను ఎప్పుడో మర్చిపోయింది. కర్నాటక ఊపును చూసి, తమకు బలమొచ్చిందని కలలు గనే పార్టీ ప్రపంచంలో కాంగ్రెస్‌ తప్ప మరొకటి వుండకపోవచ్చనే చెప్పాలి. అసలు తెలంగాణలో కాంగ్రెస్‌ పారీక్టి కర్నాకట కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం ఏమిటి? అక్కడ బిజేపి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రజలు మార్పు కోరుకున్నారు. అంతే కాని కాంగ్రెస్‌ పార్టీ మీద ప్రేమతో గెలిపించలేదు. ఇక తెలంగాణలో అటు వంటి పరిస్దితి లేదు. ప్రపంచంలోనే ఎక్కడా లేనన్ని సంక్షేమ పధకాలు తెలంగాణలో అమలౌతున్నాయి. అలాంటి బిఆర్‌ఎస్‌ను ఓడిరచాలంటే ప్రజలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే తెలంగాణలో గోసను చూసి, వాళ్లెవరు కాంగ్రెస్‌ ఓటు వేసే పరిస్ధితి వుండకపోవచ్చు. ఆనాడు కరంటు లేదు. నీళ్లు లేవు. పంటలులేవు. ప్రజల బతుకు అన్నమో రామచాంద్రా! అన్నట్లు వుండేది. కాని తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర్ర పరిస్ధితులు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణ దేశంలోని అనేక రాష్ట్రాలకన్నా, ఎన్నొ రెట్లు ముందుంది. 

ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనలో తెలంగాణ సంపూర్ణ వికాసం పొందింది.

 ఇదీ అసలు తెలంగాణ ఆర్ధిక ముఖచిత్రం. దాన్ని గురించి కాంగ్రెస్‌కు అవసరం లేదు. అయినా పార్టీ పరిస్ధితి ఏమిటి? వాస్తవ పరిస్దితులు ఎలా వున్నాయి? ప్రజలు పార్టీకి అనుకూలంగా వున్నారా? ప్రజలకు పార్టీ ఎంతచేరువైంది. ప్రజల్లో పార్టీపట్ల కనీసం సానుభూతి వుందా? అన్నది కూడ తెలుసుకునే స్ధితి పార్టీలో ఎవరికీ లేదు? ఎవరూ పట్టించుకున్నది లేదు. కాని నేనే సిఎం. అని చెప్పుకోమంటే మాత్రం అందరూ ముందుటారు. నేనే సిఎం అవుతా అని చెప్పమంటే అందరూ చెప్పేస్తారు.ఇదీ ఆ పార్టీ పరిస్దితి. కాంగ్రెస్‌ పార్టీలో తాజా రాజకీయ పరిస్దితులు ఓసారి బాగా నిశితంగా పరిశీలిస్తే మాజీ ఎంపి. మధుయాష్కీ గౌడ్‌ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఏఐసిసి. నియమించింది. అసలు ఈ పదవికి ఎవరిని నియమించాలి. పార్టీలో అందరికీ తెలిసిన నాయకుడి, లేక ప్రజల్లో బాగా గుర్తింపు వున్న నాయకుడిని నియమించాలి. మరి మధుయాష్కీ గౌడ్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు. కరుడు గట్టిన కాంగ్రెస్‌ వాది ఇంతవరకు ఓకే. రెండుసార్లు ఎంపి. కాని రెండు సార్లు ఓడిపోయాడు. గత ఎన్నికల్లో దిక్కు లేక మళ్లీ నిజామాబాద్‌ వెళ్లిపోయాడు. అసలు ఆయన భవనగిరి నుంచి పోటీ చేయాలని అనుకున్నాడు. కాని పార్టీ ఆయనకు భువనగిరి ఇవ్వలేదు. బెట్టు చేస్తే నిజామాబాద్‌ కూడా ఇచ్చే పరిస్థితి లేని స్దితి దాకా వెళ్లింది. ఏమైంది? రెండోసారి కూడా ఓడిపోయాడు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచార కార్యదర్శి బాద్యతలు అప్పగిస్తే ఏం చేశాడు? అలిగి ఇంట్లో కూర్చున్నాడు. ఇదీ ఆయన చరిత్ర. అలాంటిది సార్వత్రిక ఎన్నికల్లో ప్రచార కమిటీ బాద్యతలు అప్పగిస్తే ఆయన వల్ల సమన్వయం సాధ్యమా? ఆయనను పార్టీ ప్రెసిడెంటు పట్టించుకునే అవకాశం వుందా? ఇదిలా వుంటే ప్రచార కమిటీ బాద్యతలు నిర్వర్తించే నాయకుడికి అనర్గళమైన వాక్చాతుర్యం వుండాలి. మరి అది మధుయాష్కీకి వుందా? కొన్ని రోజుల పాటు, గంటల పాటు నిర్విరామంగా సభలు నిర్వహించాల్సిన అవసరం వుంటుంది. అలసిపోవడం, చెప్పిందేచెప్పడం వంటివి కాకుండా, ప్రజలను ఉత్సాహపర్చే, ఆలోచింపజేసేలా ప్రసంగాలు సాగాలి. అవి ముధుయాష్కీ వల్ల సాధ్యమా? ఇది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ ముందున్న ప్రశ్న.

ఇక సాక్ష్యాత్తు పిసిసి. అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో వున్నంత కాలం కాంగ్రెస్‌ను చెడుగుడు ఆడుకునేవారు.

 కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు. తూర్పారపట్టేవారు. మరి అలాంటి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణశాఖకు అధ్యక్షుడు. ఇక త్వరలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న వైఎస్‌. షర్మిల తాను పాదయాత్ర చేసిన సందర్భంలో రేవంత్‌ చేసిన యాత్రపై విసిరిన వ్యంగ్యాస్త్రాలు తెలియందికాదు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అంటూ, రేవంత్‌రెడ్డికి పాదయాత్రను ఎగతాళి చేసింది. పార్టీ కోసంపాదయాత్రనే సరిగ్గా నిర్వహించని నాయకుడు పార్టీకోసం అహర్నిషలు కష్టపడతాడంటే అతిశయోక్తి కాదా? ఇక సీనియర్ల సంగతి తెలింది కాదు. రాజుగారి కథలో ఏడో చేప ఎప్పటికీ ఎండదు. కాంగ్రెస్‌పార్టీలో సీనియర్లలో సమన్వయం ఎప్పుడూ సాధ్యం కాదు. దీనికి తోడు కోవర్టు రాజకీయాలు తెలియంది కాదు. ఇలాంటి పార్టీ అధ్యక్షుడు, కొత్తగాచేరే నాయకులు, సీనియర్లను చూసి ప్రజలు ఓట్లేస్తారని భ్రమ పడడం ఊహలకు అంతు లేకపోవడం కాకపోతే మరేమిటని కార్యకర్తలే అనుకుంటున్నారు. అసలు ఊహించడానికి కూడా హాస్వాస్పదంగా వుంది. 

తెలంగాణ కాంగ్రెస్‌ ఇచ్చింది. ఇంత వరకు బాగానే వుంది.

 కాని ఆ పార్టీని 2014లో ప్రజలు ఆదరించలేదు. కారణం పదేళ్లుగా తెలంగాణ ఇస్తామని సాగదీసి, తీసి ఆఖరుకు తప్పని పరిస్దితుల్లో మాత్రమే ఇచ్చారు. 2004 ఎన్నికల్లో అప్పటి టిఆర్‌ఎస్‌, ఇప్పటి బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని, రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టి, కామన్‌మినిమమ్‌ ప్రోగ్రామ్‌లో తెలంగాణ ఏర్పాటును చర్చించి, అవసరమైతే రెండో ఎస్సార్సీ వేసైనా సరే అంటూ సన్నాయి నొక్కులు నొక్కి, ఆఖరుక పదేళ్లకు తెలంగాణ ఇచ్చారు. అప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అంటే ప్రజల్లో ఒక రకమైన హేయ్య భావం ఏర్పడిపోయింది. వందల మంది యువకులు బలిదానాలకు కాంగ్రెస్‌ కారమైందన్న ఆరోపణలు ఎదుర్కొన్నది. అయినా సరే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో గుర్తింపు వున్నా, ప్రజలకు చేరువలో వున్న నాయకులు కాంగ్రెస్‌లో ఎవరున్నారు? తెలంగాణ ఉద్యమ కాలంలో బిఆర్‌ఎస్‌ నేతలు నిత్యం ప్రజల్లో వున్నారు. పోరాటాలు చేశారు. పోలీసు దెబ్బలు తిన్నారు. కాళ్లు చేతులు విరగ్గొట్టుకున్నారు. జైలు జీవితం అనుభవించారు. ఒక్కొక్క నాయకుడి మీద పదులు సంఖ్యలో కేసులు ఇంకా వున్నాయి. మరి ఏ ఒక్క కాంగ్రెస్‌ నేత మీద తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో చేసిన ప్రజా ఉద్యమాలెన్ని? ప్రజల కోసం కొట్లాడి జైలుకు వెళ్లిన నేతలెంత మంది? కాళ్లు కదలకుండా,కడుపు చల్లగా ఇంట్లో కూర్చొని మీడియా సెటైట్లు వేసిన వాళ్లే గాని, ప్రజల్లో ప్రజలకు మద్దతుగా నిలిచిన నాయకుడు ఒక్కరైనా? వున్నారా? ఇదీ ప్రజలకు ముందు చెప్పాల్సిన సమాధానం…

మామిడి తోటలో గూడుపుఠాణి!?

`మహబూబాబాద్‌ పొలిటికల్‌ కహానీ!

`కవితే..నా! అసలు కిరికిరి!?

`సిట్టింగ్‌ స్థానంలో సిగపట్లేమిటి?

`ప్రతిపక్షాలకు అవకాశమివ్వడమేమిటి?

` జిల్లా అధ్యక్షురాలై వుండి ఇదేం పని?

` పార్టీ నిలబెట్టే పని వదిలేసి, పొగబెట్టడమేమిటి?

`సమన్వయం వదిలేసి ఎగదోయడేమిటి?

` జిల్లాలో ఈ లుకలుకలేమిటి?

`ఇప్పటికే మూడు పదవులు మీ ఇంటికి?

`మళ్ళీ కొత్త పంచాయతీ ఏమిటి?

`బలమైన చోట బలహీనం చేయడమేటి?

`జిల్లా అధ్యక్షురాలిగా ప్రతిపక్ష పాత్రకర్థమేమిటి?

` తెలిసి జరుగుతోందా? తెలియాలనే జరుగుతోందా?

`సమస్య సర్థుమనగకపోతే అన్ని వేళ్లు కవితవైపే?

`ఏక కాలంలో ఎన్ని పదవులు కావాలేమిటి?

`డోర్నకల్‌ కాదనుకోవడంలో అసలు తిరకాసేమిటి?

`గెలిపించాల్సిన స్థానంలో కూర్చొని అస్త్ర సన్యాసమేమిటి?

`సిట్టింగ్‌ స్థానం ఆశించడంలో ఔచిత్యమేమిటి?

`పార్టీ శ్రేణుల ఆందోళన గుర్తించే వారేరీ!

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                      

తెలంగాణలో బలం లేక ప్రతిపక్షాలు బాదపడుతున్నాయి. అధికార పార్టీ బలముండి తలనొప్పులను కొని తెచ్చుకుంటోంది. ఎదురులేని చోట కుంపటి రగించుకుంటున్నారు. ఆదిపత్య రాజకీయాలలో పార్టీ పరువును తీస్తున్నారు. జిల్లా అధ్యక్ష స్ధానంలో వుండి పార్టీకి నష్టం చేకూర్చే పనులు చేస్తున్నట్లు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ప్రతిపక్షాలు ఎలా బలపడాలని ఎదురుచూస్తున్నా, ప్రజలు వారివైపు చూడడం లేదు. ప్రతిపక్షాలను నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేదు. కారణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన. నాయకులు ఎలా వున్నా, వారి వ్యవహారం ఎలా వున్నా, ప్రజలు కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్‌ అందిస్తున్న పాలనవైపు చూస్తున్నారు. ఇది తెలిసిన కొందరు నేతలు సొంత బలం లేకపోయినా, నాయకుల మధ్య చిచ్చు పెట్టి టిక్కెట్‌ సాధించాలన్న ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల వల్ల పార్టీకే తీరని నష్టం జరుగే అవకాశం వుం ది. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్నదానిపై కూడా చర్చ సాగుతోంది. అయితే అక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వడం న్యాయం. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి అవకాశం ఇవ్వడం అసవరం. కాని ఎలాంటి నాయకత్వ సమస్య లేని చోట, గందరగోళలం సృష్టించి, లేని వివాదాలు రగిలించి రాజకీయాలు కూడా కొందరు చేస్తున్నారు. పెద్దన్న పాత్ర పోషించే స్ధాయిలో వున్న నేతలు కూడా పార్టీలో కయ్యానికి తెరతీయడం అన్నది సరైందికాదు. 

మహబూబాద్‌ జిల్లాలో ఇప్పుడు ఇదే జరుగుతుందని తెలుస్తోంది. 

 మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తెలంగాణ ఉద్యమకారుడు. ఉద్యోగం వదులుకొని మరీ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు. అక్కడ ఉద్యమాన్ని భుజాన వేసుకొని నడిపాడు. ముందుండి కొట్లాడిన నేత శంకర్‌ నాయక్‌. ఉద్యమకాలంలో నెగ్గుకు రాగలిగిన శంకర్‌ నాయక్‌ ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి రావడం శోచనీయం. ఉద్యమకారుడిని కూడా ఇబ్బందులకు గురిచేసే పరిస్ధితులు సృష్టిస్తున్నారు. నిజానికి ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ వల్ల, ఆ నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్షాలు చోటు లేకుండా పోయింది. అటు ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలన, ఇటు ఎమ్మెల్యే పనితీరుతో ప్రజలు సంతోషంగానే వున్నారు. పార్టీకి పటిష్టం చేయడంలో శంకర్‌ నాయక్‌ పాత్ర కూడా ఎంతో వుంది. భవిష్యత్తులో తన రాజకీయానికి ఎదురులేకుండా చూసుకోవడంలో, ప్రతిపక్షాలకు ఉనికి లేకుండా చేశాడు. బిఆర్‌ఎస్‌కు కంచుకోటను చేశాడు. అదే ఇప్పుడు ఆయనకు తెలనొప్పిని తెచ్చిపెట్టేలా చేస్తోంది. బలమైన నేతగా వున్న ఆయన స్ధానం కోసం జిల్లా అధ్యక్షురాలు, పార్లమెంటు సభ్యురాలు కవిత ఎప్పటినుంచో ప్రతయ్నం చేస్తోందన్న ప్రచారం బలంగానే వుంది. అందుకే ఇదంతా జరుగుతోందన్న ప్రచారం వుండనేవుంది. ఆమె తండ్రి రెడ్యానాయన్‌ పక్కనే వున్న డోర్నకల్‌ నియోజకవర్గంలో కొన్ని దశాబ్ధాలుగా రాజకీయాలు శాసిస్తున్నారు. ఆ స్ధానం మాలోతు కవిత కోరుకుంటోందంటే అర్ధముంది. కాని డోర్నకల్‌ వద్దనుకొని, మహబూబాబాద్‌ కావాలని కోరుకోవడం అంటే పార్టీలోనే చిచ్చు రేపడమౌతుంది. 

మాలోతు కవిత. ఇప్పటికే పార్లమెంటు సభ్యురాలు.

 ఆమె పదవీకాలం ఇంకా ఏడాదికిపైగా వుంది. ఆమె పోటీ చేయాలనుకుంటే డోర్నకల్‌ నియోజకవర్గం వుంది. కాని అక్కడ ఆమె తండ్రి రెడ్యానాయక్‌పై ప్రజలు తిరగబడుతున్న పరిస్దితులు చూస్తున్నాం. దాంతో ఆమె అక్కడ పోటీ చేస్తే మొదటికే మోసానికి వస్తుందేమో? అన్న అనుమానంతో బిఆర్‌ఎస్‌ బలంగా వున్న మహబూబాబాద్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను తప్పించే ఎత్తుగడ వేస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆమెకు ఇప్పటికే రెండు పదవులున్నాయి. ఒకటి పార్టీ జిల్లా అధ్యక్షపదవి వుంది. మరొకటి ప్రజా ప్రతినిధిగా పార్లమెంటు సభ్యురాలుగా వున్నారు. అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటే ఆమెకు మరో రెండు నియోజకవర్గాలు కూడా ఎంచుకునే అవకాశం వుంది. ఆమె పార్లమెంటు పరిధిలో వున్న ములుగు, డోర్నకల్‌ కూడా వుంది. ములుగులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క వుంది. ఆమెను ఓడిరచి, బలమైన నాయకురాలుగా గుర్తింపు పొందాలన్న తపన వుంటే ఆ నియోజకవర్గం ఎంచుకుంటానంటే పార్టీ కూడా స్వాగతించేందుకు ఆస్కారం వుండేది. డోర్నకల్‌ కూడా అందుబాటులోనే వుంది. ఈ రెండూ కాదని మహబూబాబాద్‌ కావాలని అక్కడ అస్ధిర రాజకీయాలకు ఆజ్యం పోయడం అంటే పార్టీకి తీరని నష్టం కల్గించడమే అవుతుంది. 

                ఈ మధ్య ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ ముఖ్యమంత్రిని కలిసినట్లు సమాచారం అందిన వెంటనే మహబూబాబాద్‌లో ఓ నాయకుడి మామిడి తోటలో బిఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. నిజానికి మహబూబాబాద్‌ నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడా ఇంత వరకు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడిరది లేదు. తమ నియోజకవర్గం అభివృద్ది జరగలేదని చెప్పింది లేదు. ఎక్కడా పేచీ లేదు. రైతులు కూడా తమకు నీళ్లు రావడం లేదనో, కరంటు సరిగ్గా రావడం లేదనో కూడా రోడ్డెక్కింది లేదు. ఇతర సంక్షేమ పధకాల అమలులో ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ పట్టించుకోవడం లేదనో, ఇబ్బందులకు గురి చేస్తున్నాడనో వార్తలు కూడా రాలేదు. కాని ఎన్నికల తరుణం దగ్గరకు వస్తున్న సమయంలో అదును చూసి, కొంత మంది ఎమ్మెల్యేను వ్యతిరేకించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఇలాంటి సమయంలో జిల్లాపార్టీ అధ్యక్షురాలుగా వున్న మాలోతు కవిత సమస్యను ఇక్కడే పరిష్కరించాల్సిన బాధ్యత ఆమెపై వుంది.. 

కాని సమస్యకు అసలు కారణమే ఆమె అన్న తేలడంతో ఇక పార్టీ శ్రేణులు ఏం చేయాలో అన్న ఆందోళనలో వున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నియోకవర్గం వరకు ఎమ్మెల్యేలే సుప్రిం అన్నది అనేక సార్లు స్పష్టం చేశారు. ఎంపిలైనా, ఎమ్మెల్సీలైనా సరే ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయొద్దన్న ఆదేశాలు కూడా వున్నాయి. అయినా శంకర్‌నాయక్‌ సీటు మీద కన్నెసిన మాలోతు కవితే, పార్టీ అధ్యక్ష స్ధానంలో వుండి కూడా సమస్యకు ఆజ్యం పోస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా బలమైన స్ధానంలో సొంత పార్టీలోనే ఇలాంటి సిగపట్లు వుంటే , ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లౌవుంది. లుకలుకలు లేని చోట అనవసర రాద్దాంతాలు సృష్టించి, పార్టీని పరువును బజారున పడేసుకోవడాన్ని ప్రజలు కూడా స్వాగతించరు. కాంగ్రెస్‌ పార్టీలోనే ఇలాంటి రాజకీయాలు వుంటాయని ఇంత కాలం చెప్పుకుంటున్న ప్రజలు మహబూబాబాద్‌ రాజకీయాలు చూసి బిఆర్‌ఎస్‌ కూడా తక్కువేం కాదన్న విమర్శలు చేసే దాకా తెచ్చుకోవద్దు. పార్టీకి నష్టం చేకూర్చే పనులు ఎవరూ చేసుకోవద్దు. అధికారంలో లేక ప్రతిపక్షాలు మధనపడుతుంటే, అధికారంలో పార్టీలో లుకలుకలు మంచిది కాదు. నాయకుల తీరు కూడా ప్రజాతీర్పు మీద ప్రభావం చూపుతుందని మర్చిపోవద్దు.

‘‘బాబు’’ ఆట..’’రేవంత్‌’’ కుట్ర!?

`కూడికలో తీసివేత తంత్ర!!

`రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌ కు ఒరిగిందేమీ లేదు.

`మూడు ఉప ఎన్నికల్లో ఓటమికి పరోక్షంగా రేవంతే కారణం?

`అంతకు ముందు కనీసం డిపాజిట్లైనా వచ్చేవి?

`రేవంత్‌ వచ్చాకా అవి కూడా కరువయ్యాయి.

`రేవంత్‌ అనుచరుల నినాదాలు మాత్రమే కనిపిస్తాయి.

`కాంగ్రెస్‌ పతనమే చంద్రబాబు రేవంత్‌ లా పన్నాగం?

`చంద్రబాబు ఆదేశమే రేవంత్‌ కు శిరోధార్యం?

`చంద్రబాబు ఆగర్భ కుట్ర కోణం?

`బిజేపి మేలు కోసం చంద్రబాబు మరో ప్రయత్నం?

`ఆచరణకు రేవంత్‌ ఎల్లప్పుడూ సిద్ధం?

`అప్పుడు ఓటుకు నోటు గరు దక్షిణ అసంపూర్ణం?

`కాంగ్రెస్‌ ఖతంతో పరిపూర్ణం లక్ష్యం?

`చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం రేవంత్‌ వంతుల వారి త్యాగం?

`కాంగ్రెస్‌ సీనియర్లు ఇంత కాలం మొత్తుకుంటున్నదిదే?

`అధిష్టానానికి అర్థం కాకపోయే?

`చంద్రబాబు చూపెప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతం?

`ఎప్పుడూ ఎవరో ఒకరితో పొత్తు లేకుండా సాగని చంద్రబాబు రాజకీయం?

`ఇప్పుడు మళ్ళీ బిజేపి అవసరమొచ్చింది.

`కాంగ్రెస్‌ కు పంగనామం పెట్టి ఎత్తుగడ మొదలైంది?

`కాంగ్రెస్‌ ను మోసం చేయడానికి సమయం ఆసన్నమైంది.

`అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే హస్తానికి టాటా!

`సైకిల్‌ సవారితో మళ్ళీ మొదలుపెట్టొచ్చు ఆట!

హైదరబాద్‌,నేటిధాత్రి: 

కాంగ్రెస్‌ పార్టీకి గ్రహచారం బాగాలేనట్లుంది. ఎప్పుడు ఊపొస్తుందో..ఎవరి వల్ల పోతుందో అర్ధం కాని పరిస్ధితుల్లో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ పరిస్ధితి మరింత ఆగమ్య గోచరంగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 23 సీట్లు గెలిస్తే 17 మంది బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో 14 మంది గెలిస్తే 12 మంది ఆ పార్టీని వదిలేశారు. అధికార బిఆర్‌ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్‌ లేవడం కష్టమని నిర్ణయం తీసుకున్నారు. ఇక పదవులు రాని వారు, పార్టీని వదిలి వెళ్లినా ప్రయోజనం లేనుకున్నవారు మాత్రమే కాంగ్రెస్‌లో వున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో నామరూపాలు లేకుండాపోవడంతో రేవంత్‌రెడ్డి కన్ను కాంగ్రెస్‌ మీద పడిరది. తాను ఎలాగైనా కాంగ్రెస్‌లో క్రియాశీలకం కావాలనుకున్నారు. నిజానికి తెలుగుదేశం పార్టీలోనే తెలంగాణ పార్టీకి అధ్యక్షుడు కావాలని రేవంత్‌ రెడ్డి ఆశపడ్డాడు. అప్పుడు తెదేపాలో వున్న ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటివారు రేవంత్‌ను ముందుకు రానివ్వలేదు. తేదేపా తెలంగాణ అధ్యక్షుడి ఆశలు నెరవేరనివ్వలేదు. దాంతో ప్రస్తుతం బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీగా వున్న ఎల్‌.రమణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడయ్యాడు. క్రమంగా తెలుగుదేశం పార్టీ మరింత కనుమరుగయ్యే పరిస్దితికి చేరుకున్నది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నాయకత్వం చేసిన చాలా మంది నేతలు వరుసగా బిఆర్‌ఎస్‌ గూటికిచేరుకున్నారు. ముందు ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావుతో మొదలైన వలసలు ఒక్కొక్కరుగా ఆ జిల్లా తెదేపా నేతలందరూ బిఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు. అలా ఒక్క జిల్లానే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వున్న తెలుగుదేశం నాయకులు చాలా మంది బిఆర్‌ఎస్‌ లో చేరిపోయారు. కాని రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ గుమ్మం తొక్కే పరిస్దితి లేదు. నిజాఇకి రేవంత్‌ రెడ్డి రాజకీయం మొదలైందే బిఆర్‌ఎస్‌లో…కాకపోతే తెలంగాణ తొలి ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలన్న దురుద్ధేశ్యంతో తెలంగాణకు తీరని అన్యాయం చేయడానికి ప్రయత్నించి జైలు పాలయ్యాడు. రాజకీయంగా కూడా అది సరైనది కాదు. నైతికంగా అసలు అలాంటి పనులు చేయడం ఎంత మాత్రం మంచిది కాదు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు తెరతీసిన చంద్రబాబుకు సహకరించి, మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో సునామీ సృష్టించాలని చేసిన ప్రేయత్నం బెడిసికొట్టింది. అసలు విషయం ముందే తెలిసి, ముఖ్యమంత్రి కేసిఆర్‌ రాజకీయ చాణక్యంతో రేవంత్‌ను పట్టుకున్నారు. రేవంత్‌ దుర్మార్గం బైటపెట్టారు. ఈ కుతంత్రానికి అసలు బాధ్యుడైన చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వున్నంత కాలం చంద్రబాబు హైదరాబాద్‌ రావడానికి కూడా సాహసించలేదు. అలాంటి స్ధితిని చేజేతులా తెచ్చుకొని తెలంగాణలో నామరూపాలుగా లేకుండాపోయిన పార్టీ తెలుగుదేశంలో మనుగడ లేక రేవంత్‌ రాజకీయం ఆగమ్య గోచరమైంంది. పైగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఆశలు లేవు. ఆ పార్టీకి మనుగడ లేదు. దాంతో కాంగ్రెస్‌లో చేరి తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవడం, పదిలం చేసుకోవడం కోసం చంద్రబాబు సాయం కోరాడు. ఆయన కూడా సమ్మతించాడు. 

 2018 మధ్యంతర ఎన్నికల సమయంలో చంద్రబాబు మద్దతు కాంగ్రెస్‌ కొంప ముంచింది.

 2009 ఎన్నికల్లో అదికార బిఆర్‌ఎస్‌ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోలేదా? అంటూ తెలంగాన ప్రజలను ఏమార్చే ప్రయత్నం చంద్రబాబు చేశారు. కాంగ్రెస్‌ను నిండా ముంచారు. అసలు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి కొడంగల్‌లో ఓడిపోయాడు. తర్వాత మాల్కాజిగిరి నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. అప్పటి నుంచి పిసిసి. పదవిపై కన్నేశాడు. నిజానికి ఆ సమయంలో కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే నాయకుడు కావాల్సివచ్చింది. 2014లో పిసిసి. అధ్యక్షుడైన పొన్నాలతో కొన్ని సీట్లు సీట్లు గెల్చుకున్నా, పార్టీని నడపడం ఆయన వల్లకాలేదు. మూడేళ్లు పార్టీని నడిపిన పొన్నాల పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వచ్చాడు. కాని ఉత్తరకుమారుడే అన్న నానుడి సార్ధకం చేసుకున్నాడు. ఆయన ఆధ్వర్యంలో కూడా కాంగ్రెస్‌ బొక్క బోర్లా పడిరది. పైగా ఆయన బిఆర్‌ఎస్‌ పార్టీ కోవర్టు అన్న ముద్ర బలంగానే పడిరది. ఇలాంటి సమయంలో అధికార బిఆర్‌ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడుగా రేవంత్‌ రెడ్డి కనిపించారు. దానికి తోడు తాను పార్టీ కోసం ఎంతైనా ఖర్చు చేస్తాను. పార్టీని మోస్తాను అని రేవంత్‌ చెప్పిన మాటలు పార్టీ అధిష్టానం గుడ్డిగా విశ్వసించింది. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన నుంచి తనదైన రాజకీయం చేస్తున్నాడని తెలిసినా సీనియర్లు ఏం చేయలేకపోయారు. నాడు మాణిక్యం ఠాకూర్‌ అయినా, నేడు మానిక్‌ఠాకూర్‌ అయినా రేవంత్‌ ఏది చెబితే అదే నమ్ముతూ వస్తున్నారు. కాని రేవంత్‌రెడ్డి అసలు రాజకీయం అర్దం చేసుకోలేపోతున్నారు. 

   రేవంత్‌ వల్ల కాంగ్రెస్‌కు ఇసుమంతైనా లాభం జరిగిందా? 

అంటే లేదనే చాలా మంది అంటారు. ఔనని ఏ ఒక్కరూ సమాధానం చెప్పడానికి సిద్దంగా లేదు. ఎందుకంటే రేవంత్‌ వల్ల వచ్చిన ఊపు లేదు. బలం అంతకన్నా లేదు. పైగా ఆయన సారధ్యంలో వచ్చిన ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా పోవడం గమనార్హం. రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడైన వెంటనే హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. ఆ సమయంలో కొత్త ఊపుతో రేవంత్‌ ఏదో పొడిచేస్తాడన్నంతగా పార్టీ గంపెడాశలు పెట్టుకున్నది. కార్యకర్తలు ఎంతో ఊపును ఊహించుకున్నారు. కాని మొదటి ఎన్నికలోనే రేవంత్‌రెడ్డి అస్త్ర సన్యాసం చేశాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 60 వేల ఓట్లు వస్తే, ఉప ఎన్నికల్లో మాత్రం మూడు వేలే వచ్చాయి. కాంగ్రెస్‌ ఓట్లన్ని ఎటు పోయాయని సీనియర్‌ నేతుల ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక వచ్చింది. నోముల నర్సింహయ్య మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడ భగత్‌ పోటీచేశారు. ప్రత్యర్ధిగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఇంకా చెప్పుకునే జానారెడ్డి పోటీచేశారు. కాని ఏమైంది? కాంగ్రెస్‌ ఓటమిని చూడాల్సి వచ్చింది. దీంతో రేవంత్‌ నేతృత్వం కూడా ఐరన్‌ లెగ్‌ అన్నది కన్ఫర్మ్‌ అయ్యింది. అంతే కాదు ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. రేవంత్‌ రెడ్డి తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆ పార్టీ అదికారంలోకి రాలేదు. పైగా తెలంగాణ రాకతో తెలంగాణలో లేకుండానే పోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే రుచి చూస్తోంది. అసలు విషయం ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ పార్టీ గ్రహిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీని రేవంత్‌ రెడ్డి ఓడిస్తూ వస్తున్నాడని పార్టీ కొంత తెలుసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నికతో రేవంత్‌ రాజకీయం మొత్తం బట్టబయలైంది. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి చావో రేవో తేల్చే ఉప ఎన్నిక ప్రచారం గాలికి వదిలేసి, రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు హజరౌతూ వచ్చారు. అంటే మునుగోడును ముంచాలని ముందే నిర్ణయించుకున్నాడు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌ కూడా రాకుండా చేశాడు. 

ఇదంతా రేవంత్‌ ఎందుకు చేస్తున్నాడు? అన్నది ఏ సీనియర్‌కు అర్ధం కాని ప్రశ్న. 

కాని దీన్ని అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఉప ఎన్నికల్లో ఆయన క్రియాశీలమైతే ఆ క్రెడిట్‌ గెలిచే సీనియర్లకు వస్తుంది. నాగార్జున సాగర్‌లో గెలిస్తే జానారెడ్డి మళ్లీ క్రియాశీలకమౌతాడు. మునుగోడులో గెలిస్తే పాల్వాయి స్రవంతి పేరు మారిమోగిపోతుంది. ఇదిలా వుంటే మొత్తం కాంగ్రెస్‌లో తన వర్గమే వుండాలి. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్ధానాలు తన వర్గంతోపాటు, తనతో తెలుగుదేశం నుంచి వచ్చిన వారు మత్రమే కనిపించాలి. ఏది జరిగినా వాళ్లంతా తనతోనే వుండాలి. తాను కాంగ్రెస్‌లో వుంటే వారికి ప్రాదాన్యత కల్పించాలి. ఒక వేళ ఏదైనా జరగకూడదనిది జరిగితే జంప్‌ కావడానికి వాళ్లంతా సిద్దంగా వుండాలి. ఇదీ మొదటి నుంచి రేవంత్‌ నెరుపుతున్న అంతర్గత రాజకీయం. ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలుసు. అయితే అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల వచ్చింది. కాని తెలంగాణ ప్రజలు ఆమెను వ్యతిరేకించడం లేదు. పైగా బిఆర్‌ఎస్‌ జాతీయ స్ధాయి పార్టీ అయిన తర్వాత ఇతర పార్టీలన ప్రశ్నించలేదు. దాంతో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తే ఎలా వుంటుందన్న ఆలోచన మొదలైంది. పైగా కాంగ్రెస్‌లో నిత్యం కల్లోలం కన్నా తెలుగుదేశంలో చేరితే అక్కడ కూడా తన హవానే సాగుతుంది. చంద్రబాబు ఎలాగూ రేవంత్‌కు ఫ్రీ హాండ్‌ ఇస్తాడు. కాంగ్రెస్‌లో కలహాలకాపురం, నిత్యం కష్టపడడం కన్నా, ఆ పార్టీని నిండా ముంచి, తన వర్గాన్నంతా తెలుగుదేశం పార్టీకిచేర్చి అక్కడ రాజకీయం చేయడమే మేలని నిర్ణయించుకున్నాడట. అందుకే కాంగ్రెస్‌లో కరంటు మంటలు పెట్టి, పోతున్నాడట?

తానా సభల్లో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు

 

ఎన్టీఆర్‌ అభిమానులను తన్నిన లోకేష్‌ అనుచరులు.

చదువుకున్న మందబుద్దులు.

అమెరికా చేరినా మానని చిల్లర చేష్టలు?

ఆధిపత్య పోరులో తెలుగుదేశం రాజకీయాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు, నారా లోకేష్‌ అభిమానులు అమెరికా లో ఆటా వేధిక వేడుక సాక్షిగా తన్నకున్నారు. చొక్కాలు చించుకున్నారు. వీధి రౌడీల్లా బిహేవ్‌ చేశారు. రాయాలంటే సిగ్గనిపిస్తోంది. చెప్పాలంటేనే అసహ్యం వేస్తోంది. ఇంతేనా మీ తెలివి అని తిట్టాలనిపిస్తోంది. అంత దూరం వెళ్లినా కురచ మనస్తత్వాలుగా మిగిలిపోవడం విచిత్రంగా వుంది. విడ్డూరంగా వుంది. చదివేస్తే వున్న మతి పోతుందని పెద్దలెందుకన్నారో ఆటా వేధికగా అమెరికా ప్రవాస తెలుగు వాళ్లు నిరూపించారు. ఎంతో సరదాగా, సందడిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా , వేడుకల్లా సాగాల్సిన సభలలో వివాదాలేమిటి? అసలు అక్కడ రాజకీయాలేమిటి? అందనంత దూరంలో వున్నారు. ఏడాదికోసారి కూడా మాతృ భూమికి రాలేరు. ఇక్కడ బతకడం కష్టమనే వెళ్లారు. ఉపాధి వెంట పరుగులు పెట్టారు. విలాసవంతమైన జీవితం కోరుకున్నారు. ఇక్కడ ఓటు హక్కు చాలామందికి లేకపోవచ్చు. అలాంటి వారికి రాజకీయాలతో పనేంటి? అందులోనూ హీరోల కోసం కొట్టుకోవడం ఏమిటి? రాజకీయాల కోసం తన్నుకోవడం ఏమిటి? ఇక్కడ నారా కుటుంబం, నందమూరి కుటుంబం కలిసే వుంది. వాళ్ల బంధుత్వం బాగానే సాగుతోంది. దేశం కాని దేశంలో బతుకు దెరువు కోసం వెళ్లిన తెలుగు వాళ్లు ఆప్యాయత, ఐక్యత మర్చిపోయి, ఎవరికోసమో.. కొట్టుకోవడం ఏమిటి? చిన్నతనం అనిపించడం లేదా? అక్కడ కూడా ఇదే ఆధిపత్యం, తెలుగు పౌరుషం అనుకుంటే అమెరికా రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగండి. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. అలా కొట్టుకోకండి. దేశ ప్రజలు తెలుగువారంటే అసహ్యించుకుంటారు. మళ్ళీ రిపీట్‌ కాకుండా చూసుకోండి.

హస్తానికి రేవంత్‌ బైబై!?

-కాంగ్రెస్‌ లో కరివేపాకు కాకముందే నిర్ణయం!

-కాంగ్రెస్‌ లో పెట్టిన కరంటు మంటలే అందుకు కారణం!

-కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ జంప్‌!?

-సొంత గూటికి రేవంత్‌!?

-టిడిపి, బిజేపి పొత్తులో భాగమే!

– రేపో మాపో టిడిపి గూటికి..?

-18 మందితో బైటకి!

-షర్మిల ప్రస్తావనే రేవంత్‌ కు ఇష్టం లేదు?

– రేవంత్‌ వద్దన్నా ఆగే పరిస్థితి కనిపించడం లేదు?

-ఎవరి కోసమో కష్టపడడం వృధా?

-కాంగ్రెస్‌ లో వున్న రేవంత్‌ వర్గమంతా హాండిచ్చేందుకు రెడీ!

-కాంగ్రెస్‌ ను వదిలేయడం ఖాయం!

– అమెరికా లో అన్ని విషయాలపై సమాలోచన.

-అటు ఉద్యమకారులు, ఇటు పూర్వ టిడిపి నాయకులు!

– కాంగ్రెస్‌ కు ఎంత సేవ చూసినా వృధానే?

-ఈ కష్టమేదో టిడిపి లో పడితే లాభమే!

-అక్కడ ఎదురులేని స్థానమే!

– ఇప్పటికీ టిడిపి ఎంతో కొంత ఉనికిలో వున్నదే?

– హైదరాబాద్‌, రంగారెడ్డి సీట్లు వశమే!

-ఖమ్మం, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ లలో పాగా వేయడమే?

-ఇదే సరైన అదును…బిజేపితో కలిసి పొత్తు కుదిరెను!

-ఇప్పటికీ జిల్లాల్లో టిడిపికి బలమైన నేతలున్నారు?

 హైదరబాద్‌,నేటిధాత్రి: 

రాజకీయాలు ఎంత కలిసొచ్చినట్లు కనిపించినా కంటి మీద కునుకులేకుండా పోవడం దురదృష్టకరమే. సరిగ్గా అలాంటి పరిస్ధితే తెలంగాణ ప్రదేశ్‌కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎదుర్కొంటున్నారు. రాజకీయాల్లో ఇంతటి నరకం ఆయన ఎప్పుడూ అనుభవించకపోవచ్చు. తెలుగుదేశం పార్టీలో వున్నంత కాలం హాయిగా సాగిన రేవంత్‌ రాజకీయం ఓటుకు నోటుతో తిరగబడిరది. 2014 ఎన్నికల్లో గెలిచిన రేవంత్‌రెడ్డిని, 2018లో ఓడిపోయేదాకా తెచ్చింది. అయినా నిలదొక్కుకున్నారు. కాని ఎప్పుడైతే కాంగ్రెస్‌లో చేరారో అప్పటినుంచి ఆయనకు చికాకు తప్ప ఏమీ మిగలడం లేదు. అందుకే ఆయన ఆ రోజునుంచే తన మనసంతా తెలుగుదేశం వైపే లాగుతున్నట్లుంది. ఎంత ఇష్టంతో కాంగ్రెస్‌లో చేరారో అంత కష్టంగా కాలం గడవడం కూడా ఇబ్బందే..అందుకే ఇక కాంగ్రెస్‌లో వుండడం కన్నా, మళ్లీ తెలుగుదేశంలో చోటు చూసుకోవడమే మేలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అది అమెరికాలో జరిగిన నాటా సభల సమయం కలిసొచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోవడానికి ఏదో ఒక బలమైన కారణం కావాలి. అందుకే అమెరికా నుంచి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్‌ అంటే నేనే…నేనంటేనే కాంగ్రెస్‌ అన్నారు. అది పెద్దగా పేలలేదు. మీడియా కూడా దాన్ని పట్టించుకోలేదు. పెద్దగా ప్రచారం చేయలేదు. దాన్ని వార్తగా కూడా ముందు ప్రాధాన్యత నివ్వలేదు. ఆ తర్వాత సీతక్క సీఎం అన్నది చెప్పారు. చెప్పిన సందర్భం ఏదైనా ఆ వ్యాఖ్య కాంగ్రెస్‌లోని కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించింది. అందులోనూ ఆది నుంచి రేవంత్‌రెడ్డి అంటే అడుగడుగునా వ్యతిరేకిస్తున్న భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ విషయంపై స్పందించారు. ముప్పై, నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్‌కే సేవ చేసిన వాళ్లుఎంతో మంది వున్నారు. అంటూ ఇతర నాయకుల పేర్లు చెప్పి, రేవంత్‌ వ్యాఖ్యలను ఖండిరచారు. అయినా అది కూడా పెద్దగా పేలలేదు. దాంతో ఉచిత విద్యుత్‌ మీద రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఇది జరగాలని ముందే రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఒక్కొక్కటిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఆఖరున తెలంగాణలో రైతులకు ఎకరాకు గంట చొప్పున, మూడు ఎకరాలకు మూడు గంటల కరంటు సరిపోతుందన్న మాటలు దుమారం రేపాయి. ఏది ఏమైనా ఎంత సమర్ధించుకున్నా చెప్పిన సందర్భం గురించి ఇప్పుడు ఎంత వివరించినా అందులో నిగూడార్ధం మాత్రం అదే..అన్నది తెలంగాణ సమాజం గుర్తించింది. కాంగ్రెస్‌ పార్టీకూడా తల పట్టుకున్నది. ఇదే అదునుగా అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. పొరపాటును కాంగ్రెస్‌ను నమ్మితే నట్టెట ముంచుతారన్నది ప్రజల్లోకి చర్చకు తెరతీశారు. 

అయితే రేవంత్‌రెడ్డి కోరుకున్నది కూడా ఇదే..జరుగుతున్నది కూడా అదే కావడంతో ఆయన సక్సెస్‌ అయ్యారనే చెప్పుకోవాలి. 

నిజానికి కాంగ్రెస్‌ ఎంత పుంజుకున్నా, ఒక వేళ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించినా కాని రేవంత్‌ ముఖ్యమంత్రి కావడం కలగానే మిగిలిపోయే అవకాశం వుంది. ఆ ప్రమాదాన్ని ముందే రేవంత్‌ రెడ్డి గమనించారు. అందుకే ఇప్పుడే అస్త్ర సన్యాసం చేస్తే కాంగ్రెస్‌ పార్టీ కకావికలమైపోతుంది. పైగా కాంగ్రెస్‌ పార్టీ నడిచేందుకు అవసరమైన పెట్టుబడి సాయం అందిస్తున్నది కూడా రేవంత్‌కు చెందని వర్గమే అన్నది అందరికీ తెలిసిందే. ఇంత చేసి, పార్టీకి ఎంత బలం తెచ్చినా, ఉపు తెప్పించినా ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న వచ్చే సరికి రేవంత్‌రెడ్డి అన్నది ఎక్కడా వినిపించడం లేదు. ఒప్పుకునే సీనియర్లు లేదు. పైగా ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాక కూడా రేవంత్‌కు సుతారం ఇష్టం లేదు. పొంగులేటి వచ్చిన తర్వాత ఆయన కన్నా బలమైన నేత మరొకరు లేరన్నంత ప్రచారం బలంగా సాగుతోంది. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిన మరునాడే వైఎస్‌. షర్మిల కాంగ్రెస్‌లోకి రాక..అన్న దానిపై చర్చ మొదలైంది. నిజానికి ఆమె వైఎస్‌ఆర్టీ పార్టీ రిజిస్టర్‌ చేసుకున్నారు. సొంతంగానే పార్టీని నడుపుతున్నారు. అయినా ఆమె తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకం కావడం లేదు. అందుకు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ముందు కాంగ్రెస్‌లోకి పంపి, ఆ తర్వాత షర్మిలను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. 

షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడం రేవంత్‌రెడ్డికి ఆది నుంచి సుతారం ఇష్టం లేదు.

ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకురావడం అసలే ఇష్టంలేదు. అయినా ఆమెను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మురంగా జరుగుతున్నాయి. అంతే కాకుండా పొంగులేటి లేదు లేదనుకుంటూనే, కాదు..కాదనుకుంటూనే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తున్నారు. తాజా రాజకీయాలు వివరిస్తున్నారు. ఆయన సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు. ఇదంతా చూస్తున్న రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ను బతికించడం కన్నా , సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి జీవం పోయడం తన రాజకీయ జీవితానికి ఉపయోగమని భావించినట్లున్నారు. అందుకే చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇవ్వడాన్ని ఆనాడు జగన్‌ పూర్తిగా వ్యతిరేకించాడు. పైకి ఆర్టికల్‌ 3 ప్రచారం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే, మరో వైపు పార్లమెంటులో ప్లకార్డు పట్టుకున్నాడు. తీరా తెలంగాణ ప్రకటన జరిగే సమయంలో సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకున్నాడు. తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించాడు. అందుకు షర్మిల కూడాపూర్తిగా సహకరించింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఆమె కూడా పాల్గొన్నది. తెలంగాణలో జగన్‌కు ఆనాడు బలంగా మద్దతు పలికిన కొండా సురేఖలాంటివారిని కూడా జగన్‌ మోసం చేశాడన్నది అందరికీ తెలిసిన విషయమే. పైగా దివంగత వైఎస్‌. బతికున్నంత కాలం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తే. తెలంగాణ ఇస్తే ఆంధ్రా ప్రజలు వీసా తీసుకొని వెళ్లాలా? అంటూ అసంబద్ద ప్రకటనలు చేశాడు. తెలంగాణ ప్రజలు మనోభావాలు దెబ్బతీశాడు. అలాంటి రాజశేఖరెడ్డి బిడ్డనంటూ, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తామంటూ షర్మిల రావడాన్ని ఏ తెలంగాణ వ్యక్తి జీర్ణించుకోలేని విషయం. అదే స్పందన రేవంత్‌రెడ్డి కూడా వ్యక్తంచేశాడు. అయినా ఆమెను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందుకే రేవంత్‌ ఇక తెలుగుదేశం పార్టీని నిలబెట్టడం ముఖ్యమన్న ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. 

తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన షర్మిలనే తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు , తెలంగాణ కోసం ఉత్తరం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాజకీయం చేయడం అవసరమని రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు.తెలంగాణ లో తెలంగాణ నాయకులే నాయకత్వం వహించే అవకాశం వుంది. తెలంగాణలో ఇంకా తెలుగుదేశం బలంగానే వుందన్న భావన వ్యక్తమౌతోంది. హైదరాబాద్‌ నగరంతోపాటు, పూర్వ రంగారెడ్డి జిల్లాలో కూడా తెలుగుదేశం బలంగానే వుంది. ఖమ్మం, నిజామాబాద్‌లలో కూడా తెలుగుదేశం నాయకులున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు సాధించినా మేలే..అన్న నిర్ణయానికి రేవంత్‌రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీకి వెళ్తే ఆయన స్వయం నిర్ణయాలకు తావుంటుంది. చంద్రబాబు సహాకారం కూడా పూర్తిగా వుంటుంది. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకులే కాదు, ఇప్పుడు రేవంత్‌రెడ్డి వర్గంగా ముద్ర పడిన నాయకులు కూడా ఆయనతోపాటు బైటకు వచ్చే అవకాశం వుంది. దాంతో తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన వారు సైతం ఎన్నికల ముందు మళ్లీ సొంత గూటికి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే జరిగితే కాంగ్రెస్‌ పుట్టి మునగడం ఖాయం…తెలుగుదేశం మళ్లీ చిగురించడం రేవంత్‌కు అవసరం.

కాంగ్రెస్‌ లో కరంటు ముసలం!

 

` రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలతో అయోమయం!

`ఒక్క మాటతో రైతుల్లో ఆగ్రహం.

`కాంగ్రెస్‌ దిష్టి బొమ్మలు తెలంగాణ వ్యాప్తంగా దగ్థం.

`కాంగ్రెస్‌ పార్టీలో అంతర్మధనం!`బిఆర్‌ఎస్‌ కు దొరికిన అస్త్రం?

`కాంగ్రెస్‌ ను బిఆర్‌ఎస్‌ ఆటాడుకుంటున్న వైనం?

`అమెరికాలో వుండి, తెలంగాణ కాంగ్రెస్‌ ను ఇరికించాడు?

`నేనే కాంగ్రెస్‌… కాంగ్రెస్‌ అంటే నేనే! అన్న రేవంత్‌.

`మొన్న సీతక్క సీఎం. అన్నాడు?

`నేడు ఎకరాకు మూడు గంటల కరంటు చాలని ప్లగ్‌ లో వేలుపెట్టాడు.

`మైండ్‌ గేమ్‌ ఆడాడు!

`గేమ్‌ చెయింజర్‌ కావాలనుకున్నాడు?

`బోల్తా పడ్డాడు!

`అసలు రేవంత్‌ రెడ్డి ఎవరు? అని కోమటి రెడ్డి ప్రశ్నించారు.

`రేవంత్‌ రెడ్డి మాట చెల్లదన్న కోమటి రెడ్డి.

` అదును కోసం ఎదురు చూస్తున్న కోమటి రెడ్డి.

`దొరికిన అవకాశంతో రేవంత్‌ పై కోమటి రెడ్డి ఎదురుదాడి.

`నేను స్టార్‌ కాంపెయినర్‌ ని నాకంటే రేవంత్‌ రెడ్డి గొప్ప కాదు.

`కలహాల కాంగ్రెస్‌ తెలంగాణ లో ఖతం.

హైదరబాద్‌,నేటిధాత్రి:                                                   

అక్కడ అమెరికాలో రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్‌ మీద అగ్గిరవ్వలు రాజేస్తే, నిప్పురవ్వలై తెలంగాణ కాంగ్రెస్‌లో కరంటు మంటలు రేగాయి. సమయం సందర్భంలేని మాటలు అనేక తంటాలు తెచ్చిపెడుతుంటాయి. అయినా నాయకులు ఈశ్వరుడు నోరిచ్చారు కదా! అని మాట్లాడడం మానుకోరు. వివాదాలు ముసురుకోకుండా జాగ్రత్త పడరు. ఎంత వివాదాలు సృష్టిస్తే అంత గొప్ప పబ్లిసిటీ వస్తుందన్న దీమా కొన్ని సార్లు కొంప ముంచుతుందంటే ఇదే..ఇంత కాలం కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ వచ్చినా, ఎన్ని విమర్శలు జడివానలు చూసినా, నోటి దూల తెచ్చే తుఫాను నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఉన్నతాన వుండకుండా ఉప్పును నిప్పుమీద వేసి ఎట్లా చిటపటలాడుతుందో చూద్దామనుకుంటే, ఎగిరొచ్చి కళ్ల మీద పడితే మంటే పుడుతుంది. హాయిగా వుండదు. ఇంత కాలం కాంగ్రెస్‌ను నడి భజారులో నిలుపుదామా? అని ఎదురుచూస్తున్న బిర్‌ఎస్‌కు రేవంత్‌ వ్యాఖ్యల రూపంలో మంచి ఆయుధం దొరికింది. మొన్నటిదాక ఇక కాంగ్రెస్‌ పని అయిపోయిందనుకుంటే, కర్నాటక ఫలితాలతో జోష్‌ నిండినట్లు ఓవర్‌ యాక్షన్‌ చేసింది. ఏమైంది రేవంత్‌ చేసిన ఒక్క ముక్కతో అంతా తుడిచిపెట్టుకుపోయింది. రైతులు దూరం చేసేలా చేసింది. అసలు రేవంత్‌రెడ్డి వెళ్లిన పనేమిటి? చేసిన వ్యాఖ్యలేమిటి? అన్నది ఒకసారి నిశితంగా పరిశీలిస్తే తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయంలో సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్లే. 

రేవంత్‌రెడ్డి అమెరికాలో ఆటా సభలువెళ్లాడు. 

ఇంత వరకు బాగానే వుంది. మేధావులు, విద్యావంతులు వేదికలను పంచుకున్నట్లు, నేనెందుకు లెక్చర్లు ఇవ్వొద్దనుకున్నాడో ఏమో? అధికార పార్టీ నాయకులేనా? విదేశీ గడ్డమీద మాట్లాడేది?నేనెందుకు మాట్లాడకూడదు…అనుకున్నాడో ఏమో? కాని అక్కడి ప్రజలతో కలిసి సమావేశమయ్యాడు. అక్కడ కూడా రాజకీయ ప్రచారం చేసుకున్నా తప్పు లేదు. కాని అక్కడ తన ప్రతాపం అవసరం లేదు. తాను గొప్ప అని చెప్పుకోవడం అవసరమే కాని, తానే గొప్ప అన్నది చెప్పుకోవడం ఎవరికీ మంచిది కాదు. సోమవారం అవసరమైతే సీతక్కను సిఎం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలే వివాదం రేపాయి. పార్టీలో చర్చకు దారి తీశాయి. దానిపై పెద్దఎత్తున రేవంత్‌ మీద ఎదురుదాడి మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీలో ఇక సీనియర్లు లేరా? ఎస్సీ, ఎస్టీ బిడ్డలు ఇంకా లేరా? రేవంత్‌రెడ్డి ఎలా అలా అంటారు? ఆయనకు ఏం హక్కుంది? అంటూ ఇప్పటికే అనేక మంది సీనియర్‌ నాయకులు మీడియాతో తమ అభిప్రాయాలు వెల్లడిస్తూనే వున్నారు. 

 సీతక్క ఏమైనా తెలంగాణ కోసం కొట్లాడిరదా? 

రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అన్నాడా? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌! తెలంగాణ కోసం కూడా అధికారంలో వుండి కొట్లాడిరది కాంగ్రెస్‌. అప్పుడు కాంగ్రెస్‌లో రేవంత్‌ లేడు. సీతక్క లేదు. రెండు కళ్ల సిద్దాంతంతో తెలంగాణను నిండా ముంచిన చంద్రబాబుతో వున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో వున్నారు. అంత మాత్రాన పదవులు ఎవరికి వారు డిసైడ్‌ చేసుకునే వెలుసుబాటు కాంగ్రెస్‌లో వుండదు. ఈ విషయం మీద వివాదం ముదురుతుందని గమనించే రేవంత్‌ రెడ్డి మరో వ్యాఖ్యానం కూడాచేశారు. రేవంత్‌ అంటే కాంగ్రెస్‌..కాంగ్రెస్‌ అంటే రేవంత్‌? అని చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మరింత కోపంగా వున్నారు. అది చల్లారకముందే తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సాగుకు ఇరవై నాలుగు గంటలు అవసరం లేదని రేవంత్‌రెడ్డి చెప్పడం తన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. పైగా ఎకరా పొలం తడిచేందుకు గంట సమయం చాలు…అని భాష్యం చెప్పడం అంతకన్నా భావ దారిద్య్రం. తెలంగాణలో 80శాతం మంది రైతులు మూడెకరాల రైతులే వున్నారంటూ కొత్త కితాబిచ్చాడు. వారికి మూడు గంటల ఉచిత విద్యుత్‌ చాలన్నాడు? తెలంగాణలో వుండే భూముల రకాలు ఎన్ని వుంటాయన్నదానిపై ఏనాడైనా అధ్యయం చేశాడా? ఇసుక నెలల్లో జరిగే సాగుకు ఎంత నీరు అవసరమౌతుందో తెలిసే చెప్పాడా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతాయి. అంతే కాకుండా ఈ వివాదం మొత్తం కాంగ్రెస్‌ మెడకు చుట్టుకునేలా చేశాడు. 

అటు కాంగ్రెస్‌ నేతలు, ఇటు అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ రేవంత్‌ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. 

ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. కరంటుపై కాంగ్రెస్‌ అసలు విధానం బైట పడిరదని ప్రచారం చేసింది. కాంగ్రెస్‌వస్తే మళ్లీ చీకటి రోజులే అని రైతులకు వివరించింది. గత పరిస్ధితులు ఎలా వుండేవో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. పేరుకే ఉచిత విద్యుత్‌ అయినా ఉదయం వేళ మూడు గంటలు, రాత్రిళ్లు మూడు గంటలు ఇచ్చేవారు. అందులోనూ నాణ్యమైన విద్యుత్‌ సరిగ్గా అందేది కాదు. రైతులు రాత్రుళ్లు బావుల వద్ద నిద్ర పోవాల్సివచ్చేది. ఎండనక, వానన కూడా బావుల వద్ద జీవితాలు గడిచేవి. రాత్రిళ్లు బావుల వద్దకు వెళ్తూ అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన సందర్భం వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత అలాంటి పరిస్దితి లేదు. రైతు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎప్పుడు వీలైతే అప్పుడు కరంటు వినియోగించుకునే అవకాశం ఏర్పడిరది. నిరంతరంగా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంలో పెరిగిన భూగర్భ జలాలతో సమృద్దిగా పంటలు పండుతున్నాయి. ఇవన్నీ తెలిసినా, రేవంత్‌రెడ్డి లేనిపోని వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెట్టారు. 

రేవంత్‌ రెడ్డి చేసిన సీతక్క సిఎం? 

 ఉచిత విద్యుత్‌ అవసరం లేదన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీలో తీవ్ర అంతర్మధనం జరుగుతోంది. ఈ విషయంపై స్పందించిన భువనగరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదును దొరికింది కదా? అని రేవంత్‌ను తూర్పార పట్టేశాడు. అసలు రేవంత్‌ ఎవరు? రేవంత్‌ రెడ్డి మాట కాంగ్రెస్‌లో చెల్లదు? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయం కోసం ఎదరుచూస్తున్న కోమటిరెడ్డికి రేవంత్‌ను అధిష్టానం వద్ద దోషిని చేయడానికి మంచి అస్త్రం దొరికినట్లైందనుకున్నాడు. పనిలో పనిగా సీతక్క సిఎం? అన్నదానిపై కూడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగానే స్పందించారు. అసలు కాంగ్రెస్‌ దళిత సిఎం నిర్ణయం తీసుకోవాలని మంచిర్యాల సభలో మొదట చెప్పిందే నేనంటూ చెప్పుకొచ్చారు. పైగా కాంగ్రెస్‌లో పార్టీ కోసం దశాబ్ధాలుగా పనిచేస్తున్న వారు అనేక మంది వున్నారని, కొత్తగా వచ్చిన వారు ఎవరికి వారు, సిఎంలమనుకోవద్దని సూచించారు. ఒక రకంగా అటు రేవంత్‌కు చురకలు అంటించాడు. అటు కాంగ్రెస్‌లో ముసురుకుంటున్న తుఫాను ఎప్పుడు ఆగిపోతుందేమో? కాని తెలంగాణ రైతుల ఆగ్రహం మాత్రం ఇప్పట్లో చల్లారకపోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు క్షమించకపోవచ్చు.

ఎంపీ వద్దిరాజు తమిళనాడు పర్యటన

పళని ఆలయాన్ని సందర్శించిన ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు

సుబ్రమణ్య స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ దంపతులు

తమిళనాడులో పర్యటిస్తున్న పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ దంపతులు తమిళనాడులోని పళని సుబ్రమణ్యస్వామి (దండయుతస్వామి) ఆలయాన్ని సందర్శించారు.స్టడీ టూర్ లో పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘం తమిళనాడులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.సంఘంలో సభ్యునిగా ఉన్న ఎంపీ రవిచంద్ర ఛైర్మన్ రమేష్ విధూరియ,ఇతర సభ్యులతో కలిసి మంగళవారం సుబ్రమణ్యస్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన వీరికి ఆలయ పూజారులు, అధికారులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర-విజయలక్మీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు, వేదపండితులు ఆశీర్వచనాలు పలికి శాలువాతో సత్కరించారు, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ పుణ్య దంపతుల వెంట కుమారుడు వద్దిరాజు ప్రీతమ్ ఉన్నారు.

నా వార్తే రావాలి! నేనే కనబడాలి!! నా మాటే వినపడాలి!!!

 

`నా తర్వాత షర్మిల వార్తలే వుండాలి?

`నా వార్తలకే ప్రాధాన్యమివ్వాలి?

`కాంగ్రెస్‌ నుంచి ఎంతటి వారి వార్తలైనా పరిమితంగా వుండాలి.

`నా వార్తలే నిత్యం రావాలి?

`షర్మిల వార్తలు హైలెట్‌ అవుతుండాలి?

`కాంగ్రెస్‌ పార్టీ మొత్తం షర్మిల కోసం ఎదురుచూస్తున్నట్లుండాలి!

`షర్మిలను కాంగ్రెస్‌ వర్గాలు ఆహ్వానిస్తున్నట్లే వార్తలుండాలి.

`షర్మిల వస్తేనే పార్టీ పూర్వ వైభవాన్ని చూస్తుందనేలా రాయాలి!

`షర్మిలను మించిన నాయకురాలు లేదనే చర్చ జరగాలి?

`షర్మిలకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారి వార్తలు తగ్గించాలి?

 `తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పగ్గాలు షర్మిల చేతికొచ్చే కృషి జరగాలి?

`అటు మీడియా తో, ఇటు అనుచరులకు పొంగులేటి సూచన?

`పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వింగ్‌ ఏర్పాటుకు కసరత్తు!

`యూ ట్యూబ్‌ నిండా మన వార్తలే వుండాలి.

`మన వార్తలే ట్రెండిరగ్‌ కావాలి?

`నా నాయకత్వం మీద ఎక్కువ ఫోకస్‌ వుండాలి?

`తెలంగాణ మొత్తం పొంగులేటి వార్తలు కనిపించాలి.

`ఇది ప్రచార యుగం.. ఎంతైనా ఖర్చు చేద్దాం?

`నేనేంటో చూపిస్తా! కాంగ్రెస్‌ లో నా తర్వాతే ఎవరైనా అనేలా చేస్తా!!

`నా రాజకీయం అందరికీ రుచి చూపిస్తా!

హైదారబాద్‌,నేటిధాత్రి: 

ఇకపై ప్రధాన మీడియా స్రవంతిలోనైనా, ఇతర మీడియా సంస్ధల్లోనైనా, మన ఆధ్వర్యంలో నడిచే సోషల్‌ మీడియాతోపాటు, కాంగ్రెస్‌ పార్టీ మీడియా వింగ్‌లోనూ తన వార్తలే కనిపించాలి. తాను ఎవరెవరిని కలుస్తున్నాను…తనను ఎవరు కలుస్తున్నారు? తనకెంత బలముంది? అన్నది ఎప్పటికప్పుడు ఫోకస్‌ చేస్తూ వుండాలి. అందుకే నిత్యం కాంగ్రెస్‌ పార్టీ వార్తల పేరుతో నేనే మీడియాలో కనిపించాలి. నా వార్తలు మాత్రమే పెద్దగా హైలెట్‌ కావాలి. మొత్తంగా నా మాటే మీడియాలో కూడా వినిపించాలి. ఇది కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులతో చెబుతున్న మాట? ఆ తర్వాత మన తరుపున త్వరలో కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయనున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వార్తలకు ప్రాధాన్యత కల్పించాలి. ఇప్పటికే ఆమె పాలేరు నుంచిపోటీ చేస్తానని చెబుతూ వస్తున్నారు. తెలంగాణలో సుమారు 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు. త్వరలో పాలేరులో కూడా పాదయాత్ర జరగనుంది. అక్కడే నివాసం కూడా వుంటానని చెబుతోంది. అందువల్ల ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా, పార్టీ నేతలు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వండి వార్చాలని సూచిస్తున్నారట. ముందుగా తన వార్తలకు ప్రాధాన్యత కల్పిస్తూ, తర్వాత షర్మిల వార్తలను ఎక్కువగా ఫోకస్‌ చేయాలని ఖచ్చితంగా సూచనలు చేసినట్లు తెలిసింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ వార్తల విషయంలో తన వార్తలే నిత్యం రావాలని, మిగతా కాంగ్రెస్‌ నేతల వార్తలకు అంత ప్రాదాన్యత కల్పించొద్దని కూడా మీడియా వర్గాలను మేనేజ్‌ చేసుకునే పనిలో శ్రీనివాస్‌రెడ్డి వున్నాడట. ముఖ్యంగా షర్మిల వార్తలను తెలంగాణ సమాజంలోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం వుందని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అంతే కాదు షర్మిల వస్తేనే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం దక్కుతుందని, ఇప్పటికీ కాంగ్రెస్‌లో షర్మిలను మించిన నాయకులు లేరన్నది జనంలోకి బాగా తీసుకెళ్లాలని కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీ పగ్గాలు అందుకునేంతగా పార్టీ నేతలు కోరుకుంటున్నారన్న సంగతిని జాతీయ కాంగ్రెస్‌ నేతలు తెలుసుకునేలా జాతీయ మీడియాను కూడా మేనేజ్‌ చేసుకుంటామని కూడా చెప్పుకుంటున్నారట. త్వరలో పెద్ద ఎత్తున సోషల్‌ మీడియా వింగ్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అనుచరుల సమావేశంలో పొంగులేటి వివరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిలో మొత్తం పొంగులేటి వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే కనిపించేలా ఇప్పనుంచే డిజైన్‌ చేయాలని చెబుతున్నారట. ఏ యూట్యూబ్‌ చానల్‌ చూసినా తన వార్తలు, షర్మిల వార్తలు మాత్రమే విసృతంగా అప్‌లోడ్‌ చేయాలన్నారట. పెద్దఎత్తున పాజిటివ్‌ వార్తలు ట్రెండిరగ్‌లో వుండేలా సోషల్‌ మీడియా వింగ్‌ 24 గంటలు పనిచేసేలా వుండాలని చెప్పారట. ఇది ప్రచార యుగం..దాని కోసం ఎంత ఖర్చు చేస్తే అంత లాభం అని, అందుకోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడేది లేదని కూడా పొంగులేటి స్పష్టం చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నేనోంటో చూపిస్తా…నా రాజకీయం ఏమిటో చూపిస్తా…కాంగ్రెస్‌ పార్టీలో నా పాత్ర ఎలా వుంటుందో చూపిస్తా…నేను చెప్పిందే పార్టీ మొత్తం వినేలాచేస్తా…నా తర్వాతే పార్టీలో ఎవరైనా అనేలే చేస్తా…ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మాహన్‌రెడ్డి రుణం తీర్చుకుంటా? షర్మిలను తెలంగాణ ముఖ్యమంత్రి చేయడం కోసం అహర్నిషలు పనిచేస్తా..ముందు అది ఖమ్మం జిల్లా నుంచే మొదలుపెడుతా…నేను సూచించే వారికే టిక్కెట్లు ఎలా దక్కాలో స్కెచ్‌ వేస్తా..అంటూ తన అనుచురులలో ఉత్సాహం నింపినట్లు విశ్వసనీయ సమచారం. 

 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌లో వర్గపోరులో మరో కొత్త కుంపటి రాజేసుకోనున్నది. 

ఇసంత రమ్మంటే ఇళ్లంతా నాదే అన్నట్లు మాజీ ఎంపి.పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనదంటూ, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఇప్పటినుంచే ఏర్పాటు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీని మొత్తం తన వైపు తిప్పుకునే ఎత్తుగడలు ఇప్పటినుంచే వేస్తున్నట్లు కూడా సమాచారం. తాను దూర సందు లేకపోయినా, మెడకో డోలు అన్నట్లు తాను కాంగ్రెస్‌లో చక్రం తిప్పడమే కాకుండా, షర్మిలను క్రియాశీలం చేయడానికి అసరమైన కసరత్తు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమచారం. కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ఆ పార్టీల త్వరలో కల్లోలం రేపే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయనను కలుస్తున్న నాయకులు, ఆయన పిలుస్తున్న నాయకులు ఖమ్మంలో ముందు పెంచుకోనున్న పట్టు అన్నదానిపై అడుగులు పడుతున్నాయి. ఆ అడుగులన్నీ షర్మిల కోసమే అన్నది కూడా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కళ్లలో ఆనందం చూడడానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సరికొత్త రాజకీయం మొదలుపెడుతున్నాడని వినికిడి. ఇదిలా వుంటే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పటికే వున్న అనేక గ్రూపులతో సతమతమౌతూ వుంది. తెలంగాణ వచ్చిన తర్వాత నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ఫలంగా కర్నాటక ఫలితాలతో కనిపించని ఊపు వచ్చిందని నమ్ముతున్నారు. ఇదే నిజమని ఎవరికి వారు నా మాటే చెల్లాలన్న రాజకీయాలు మొదలుపెడుతున్నారు.ఇలాగే గతంలో రేవంత్‌రెడ్డి కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భువనగిరి ఎంపి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కూడా అంటుండేవారు. ఎక్కడికెళ్లినా, ఏ సభనైనా రేవంత్‌రెడ్డి సీఎం అంటూ నినాదాలు చేసే బ్యాచ్‌ అంతటా రెడీగా వుంటుందంటుండేవారు. పైగా అసలైన కాంగ్రెస్‌ నేతలు పార్టీనుంచి పారద్రోలేలా రేవంత్‌రెడ్డి సోషల్‌మీడియా సైన్యం జగ్గారెడ్డి, ఇతర నాయకుల మీద పెద్దఎత్తున ట్రోల్‌ చేస్తూ వారిని మానసికంగా ఇబ్బందులు పెట్టిన సందర్భం కూడా వుంది. వాటిపై పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదులు చేస్తామని కూడా జగ్గారెడ్డి, హనుమంతరావులు హెచ్చరించిన సందర్భాలున్నాయి. ఒక దశలో జగ్గారెడ్డి కూడా పార్టీని విలేస్తానని, అవసరమైతే సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని, రేవంత్‌ సంగతి చూస్తానని కూడా హెచ్చరికలు జారీచేశారు. రేవంత్‌రెడ్డికి పోటీగా జగ్గారెడ్డి కూడా తిరంగ యాత్ర చేపట్టిన వైనం చూశాం. ఇప్పుడు సరిగ్గా అదే పనిని పొంగులేటి చేసి, రేవంత్‌రెడ్డికి చుక్కలు చూపించే పనిలో పడుతున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మొదట పొంగులేటి కాంగ్రెస్‌లో రావాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చిన తొలి దశలో వ్యతిరేకించింది రేవంత్‌ రెడ్డే. షర్మిల విషయంలోనూ ముందు స్పందించింది కూడా రేవంత్‌ రెడ్డే. తెలంగాణలో మేం..మేం చూసుకుంటాం? నీ రాజకీయాలు, సేవలు మా తెలంగాణ ప్రజలకు అక్కర్లేదు అని ప్రకటించింది కూడా రేవంత్‌రెడ్డే. ఎక్కడైతే ప్రభుత్వ ఏర్పాటుకోసం, ఏ అన్న కోసం పనిచేశావో అక్కడే రాజకీయాలు చేసేకో అంటూ సూచనలు కూడా రేవంత్‌ రెడ్డి ఇచ్చారు. ఆఖరకు ఇప్పుడు షర్మిల తెలంగాణలో కాంగ్రెస్‌లో చేరేందుకు అధిష్టానం నుంచి మార్గం సుగమమం చేసుకుంటున్నారు. అదే జరిగితే ఇక రేవంత్‌రెడ్డికి చుక్కలే…కోరికోరి కుంపటి నెత్తిన పెట్టుకోవడం అంటేఇదే మరి…ఏం జరుగుతుందో చూద్దాం. అయితే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన ధనబల రాజకీయంతో షర్మిలను ముందుకు తీసుకొస్తే, సామాజిక పరంగా ములుగు ఎమ్మెల్యే సీతక్కను రేవంత్‌ రెడ్డి ముందుకు తెచ్చి రసవత్తరమైన రాజకీయాన్ని అడేందుకు సిద్దపడుతున్నట్లు కూడా కనిపిస్తోంది. రాజకీయాలు ఇక ముందు ముందు మరింత రసవత్తరంగా వుంటాయని చెప్పడానికి ఇది ట్రైలరే అంటున్నారు.

బిజేపోళ్లు బిత్తరపోయారు?

`సభ ఎందుకు పెట్టినట్లో అనుకుంటూ జుట్టు పీక్కున్నారు?

`మోడీ సభ అంటూ బాగానే బిల్డప్పిచ్చారు?

`అందరి గాలి మోడీ చల్లగా తీశాడు.

`డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ అన్న ముచ్చట తీయలేదు.

`ప్రభుత్వంతో కొట్లాడండి అని చెప్పలేదు.

`రాష్ట్ర నేతలు చెప్పింది చెప్పినట్లు, అప్పజెప్పిపోయాడు.

`బిజేపి నేతలు తెల్ల మొహం వేశారు.

`కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదు.

`అబ్‌కి బార్‌ బిజేపి సర్కార్‌ అని ముగించారు.

` బిజేపి శ్రేణులకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప దనం తెలిసేలా చేశాడు.

`ముఖ్యమంత్రి కేసిఆర్‌ పాలనా దక్షతతో తెలంగాణకున్న ప్రాధాన్యత గురించి చెప్పి వెళ్లారు.

`మీకు అర్థమౌతుందా?

`స్టేజిని చూసి మోడీ నిరాశ చెందినట్లున్నాడు

`వలసవాదులను చూసి అవాక్కైనట్లున్నాడు.

`అందుకే ఎవరి పేరు ఉచ్చరించకుండానే స్పీచ్‌ ఇచ్చారు.

`ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ మూలాలు ఉన్నవాళ్లు ఇద్దరూ ముగ్గురే

`మిగిలిన వాళ్ళందరూ అవసరానికి వచ్చిన వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలే?

`ప్రజలను చూసి సంతోషపడ్డాడు! స్టేజిని పై ఉన్న వాళ్లని చూసి నిరాశ చెందినట్లున్నాడు!!

`ఒక్క బండి సంజయ్‌ మీద ప్రజలకు ఉన్న అభిమానాన్ని చూసి మోడీ సంతోషించినట్లున్నాడు.

`బండి సంజయ్‌ మార్పుపై మధనపడ్డట్లున్నారు.

`కిషన్‌ రెడ్డికి అంత పవర్‌ లేదని తెలుసుకున్నట్లున్నాడు.

`బిజెపిని రెడ్లు ఆక్రమించేసి బీసీలకు దూరం చేస్తున్నారేమో అనుకున్నట్లున్నాడు.

హైదరబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వరంగల్‌ వస్తున్నాడు. 8వ తేదీ ఎప్పుడొస్తుంది? ఇక రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతాడు? పార్టీ శ్రేణులుకు పూర్తి భరోసా కల్పిస్తాడు. దిశానిర్ధేశం చేస్తాడు. పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో హిత బోధ చేస్తాడు. అగ్రహోదగ్రుడిలాగా బిఆర్‌ఎస్‌ మీద ఆరోపణాస్త్రాలు సంధిస్తాడు. విమర్శల జడివాన కురిపిస్తాడు. సగటు బిజేపి శ్రేణుల్లో ఉత్సాహం నింపి వెళ్తాడు. తెలంగాణ బిజేపికి ఒక ఊపు తీసుకొస్తాడు. డబుల్‌ ఇంజన్‌ సర్కారు ప్రస్తావన తెస్తాడు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని పూసగుచ్చినట్లు వివిరిస్తాడు. తెలంగాణను ఏం చేశామో చెబుతాడు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో లెక్కలు చెబుతాడు. భవిష్యత్తులో తెలంగాణకు ఏం చేస్తామో చెప్పి వెళ్తాడు. ఇతర బిజేపి పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్దిని వివరిస్తాడు. గుజరాత్‌ మోడల్‌ను గుర్తు చేస్తాడు. అక్కడి ప్రగతిని తెలంగాణ ప్రజల ముందు ఆవిష్కరిస్తాడు. మేకిన్‌ ఇండియా గొప్పదనం అందరికీ వినిపించేలా చెప్తాడు. పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వాన్ని తూర్పారపడతాడు. తెలంగాణ ప్రభుత్వం అవినీతి అంటూ ప్రభుత్వంపై చర్యలు తీసుకుంటామని గిర్జస్తాడు. ఇక కొట్లాడండి అని బిజేపి శ్రేణులను ఉత్సాపరుస్తాడు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, పార్టీకి ఊపరి సల్పకుండా చేస్తాడు? ఇది శనివారం ఉదయం వరకు రాష్ట్ర బిజేపి పెద్దలు, నాయకులు, శ్రేణులు, సగటు కార్యకర్తలు కొంత కాలంగా నిద్రాహరాలు మాని ఎదురుచూసిన తరుణం. 

 పాపం..వాళ్లు ఒకటి ఆలోచిస్తే..ప్రధాని మోడీ మరొకటి చెప్పాడు. ఒక్కసారిగా నిద్రలో వున్న వాళ్లకు మెలకువ వస్తే ఎలా ఉలిక్కిపడతారో..అలా బిజేపి నేతలు ఏం జరుగుతుందో తేరుకునే లోపే ప్రధాని తన ప్రసంగం ముగించారు.

 ఇదీ ఈ రోజు బిజేపి నేతలకు కళ్లు బైర్లు కమ్మిన రోజు. ఇన్ని రోజుల పాటు ఎదరుచూసిన దానిలో కనీసం ఒక వంతు కూడా ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. ఇటీవల జరిగిన కాంగ్రెస్‌ సభను మించి బిజేపి సభ జరుగుతుందని గొప్పలకు పోయారు. పెద్ద భహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటన కూడా పెద్ద విదామైంది. పత్రికా ప్రకటలనపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాహుల్‌ గాంధీ సభను మించిన సభ జరుగుతుందని అందరూ ఊహించారు. ప్రధాని మోడీ ప్రసంగంపై బిజేపి శ్రేణులు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు ఊహించినంత స్ధాయిలో రాష్ట్ర బిజేపి సభ నిర్వహించలేదు. బిజేపి శ్రేణులు కలగన్నట్లు ప్రధాని మోడీ ప్రసంగం సాగలేదు. అటు, ఇటూ సప్పగానే తోచింది. బిజేపి కార్యకర్తలకు కొంత కోపం వచ్చింది. వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంత కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, బిఆర్‌ఎస్‌ మీద విరుచుకుపడుతున్న బిజేపి నేతల గాలి ప్రధాని మోడీ తీసి వెళ్లిపోయారు? ఇది ఎవరో అంటున్న మాట కాదు…సాక్ష్యాత్తు సభ దగ్గరే బిజేపి శ్రేణులు తిట్టుకున్న వ్యాఖ్యలు?

వరంగల్‌ సభ ప్రధాని మోడీకి నచ్చనట్లు వుంది. ఆ సభా వేదిక మీదకు రాగానే ప్రధాన మంత్రి మోడీకి అది బిజేపి వేదికలాగా కనిపించినట్లునట్లుంది.

 కింద వున్న కార్యకర్తలు బిజేపిని అనువణువూ నింపుకున్న వాళ్లు. కాని వేదిక మీద వున్నవాళ్లు అద్దె నేతలు. అరువు నేతలు. అవకాశవాదం కోసం బిజేపిలో చేరిన వాషింగ్‌ పౌడర్‌ నిర్మాలు. వారి రాజకీయ భవిష్యత్తు కోసం కాషాయకండువా కప్పుకున్నవారు. అంత పెద్ద వేదిక మీద అసలు బిజేపి నేతలుగా కనిపించింది ముగ్గురే..ఒకరు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌. కొత్త రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మూడు బండిసంజయ్‌. అంతే ముందు వరసలో చూసినా, వెనక వరుసలో వున్న వాళ్లంతా రాజకీయ అవసరార్ధం చేరిన వాళ్లే…అందుకే ప్రధాన మంత్రి మోడీ బిజేపి సభలో ఏ ఒక్క నాయకుడిని పేరును ప్రస్తావించలేదు. కనీసం సభ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు చెప్పలేదు. ఆఖరకు సభకు విచ్చేసిన బిజేపి శ్రేణులకు అభివాదం కూడా చేయకుండానే వెనుదిరిగారు. ఆఖరున ఔర్‌ ఏక్‌ బార్‌ బిజేపి సర్కార్‌ అని మూడుసారు శ్రేణులతో అనిపించి ముగించారు. అంటే ఆయనకు ఆ సభ నిర్వహణ మీద ఎలాంటి సదాభిప్రాయం లేదన్నది అర్దమైంది. కేవలం బండి సంజయ్‌ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ప్రధాని మోడీ ఆసక్తిగా గమనించారు. బండి సంజయ్‌ మాట్లాడుతుంటే పార్టీ శ్రేణులు ఈలలు వేస్తుంటే సంతోషించాడు. అంతకు మించి ప్రధాని మోడీ ఒక్కసారి కూడా వేదికపై చిరునవ్వు నవ్వలేదు. గతంలో బండి సంజయ్‌ నేతృత్వంలో జరిగిన రెండు మూడు సభల్లో ప్రదాని మోడీ పలు మార్లు చిరునవ్వులు చిందించారు. బండి సంజయ్‌ను భుజం తట్టారు. ప్రజలను బండికే చూపిస్తూ మురిసిపోయాడు. వరంగల్‌ సభలో అలాంటి సన్ని వేశం కనిపించలేదు. ఎవరినీ ప్రధాని మోడీ ఎవరినీ భుజం తట్టలేదు. వరంగల్‌ సభలో మాత్రం ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదు. కనీసం సంతోషంగా వున్నట్లు కూడా కనిపించలేదు. అంతే కాదు ప్రధాని ఊహించిన దానికి బిజేపి ఏర్పాటు చేసిన సభను చూసిన తర్వాత కొత్త అధ్యక్షుడైన కిషన్‌రెడ్డి పనితనం ఏమిటో కూడా అర్దమైనట్లుంది. 

 ఇదిలా వుంటే ప్రధాని మోడీ పదినిమిషాల వ్యవధిలో చెప్పిన రెండు రకాల వ్యాఖ్యలకు బిజేపి శ్రేణులు బిత్తరపోయాయనే చెప్పాలి.

 ఓ వైపు తెలంగాణ రాష్ట్రం దేశానికి ఎంత కీలకమో చెప్పారు. తెలంగాణ ఎంత అభివృద్ది చెందిందో చెప్పారు. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెప్పారు. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చి తెలంగాణ గొప్పదనాన్ని వివరించారు. అంటే ఇదంతా పరోక్షంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసినట్లే..ముఖ్యమంత్రి కేసిఆర్‌ పనితీరుకు కితాబిచ్చినట్లే…అయితే బిజేపి ఏర్పాటు చేసిన సభలో ఏదో ఒకటి మాట్లాడాలి. అందువల్ల ప్రధాని తనదైన శైలికి భిన్నంగా తెలంగాణ బిజేపి నేతలు ఏం చెప్పారో అవే విషయాలు ఉటంకించారే తప్ప, ఆయన కొత్తగా చెప్పినట్లు లేదు. గట్టిగా చెప్పినట్లు అసలే లేదు. దాంతో బిజేపి శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఇదే సభలో అటు ఈటెల రాజేందర్‌ , కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తోడుగా ప్రధాని పంచులు వుంటాయని అనుకున్నారు. కాని ప్రధాని కనీసం మాటల మతాబులు కూడా పేల్చలేదు. ఇదీ సంగతి..అర్ధమైందా? రేపటి భవిష్యత్తు ఇదే అని బిజేపి శ్రేణులకు అర్దమైనట్లుంది. 

 ఇదిలా వుంటే ప్రధాని మోడీ సభ పూర్తయిన వెంటే బిఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యారోపణలు సంధించారు.

 కేంద్ర బిజేపి వైఫల్యాలు ఎండగట్టారు. తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదని లెక్కలు చెప్పారు. ఇవ్వాల్సిన వాటి గురించి ప్రజలు వివరించారు. తెలంగాణకు బిజేపి తీరని అన్యాయం చేస్తోందన్న సంగతి చెప్పారు. తెలంగాణకు రావాల్సిన గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బయ్యారం స్టీల్‌ ప్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు మెడికల్‌ కాలేజీల మంజూరులో ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. కనీసం నవోదయ పాఠశాలలు కూడా ఇవ్వకపోవడం వివక్ష కాదా? అని రాష్ట్ర్రమంత్రులు, ఎమ్మెల్యేలు, బిఆర్‌ఎస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. ఇదీ అసలు సిసలు కొసమెరుపు.

అందరూ బిఆర్‌ఎస్‌ బాటలోనే! అన్ని పార్టీలు బడుగుల జపమే!!

`బలమైన నాయకుడు కేసిఆర్‌ అడుగుజాడలే…

`అన్ని పార్టీలలో ఆమోదమే..

`ఈసారి బడుగులకు బిఆర్‌ఎస్‌ లో అత్యంత ప్రాధాన్యత.

`సిట్టింగులను తప్పించనున్న చోట్ల ఎక్కువగా బడుగులకే పెద్దపీట.

`అసమ్మతి రాగాలున్న చోట కూడా అదే లెక్క.

`బిఆర్‌ఎస్‌ అంటే బడుగులకు అండ సంకేతాలు.

`అదే బాటలో బిజేపి పయనం.

`ఈటెల ఎంపికలో అదే పరమార్ధం.

`కాంగ్రెస్‌ లో కూడా మొదలైన బడుగుల జపం.

`పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ తో ఒక్కసారిగా కలకలం.

`కాంగ్రెస్‌ ను ఇంత కాలం కాపాడిరది బడుగు నేతలే.

`కాంగ్రెస్‌ కు ఎల్లకాలం ఓటు బ్యాంకు బడుగులే.

`అందరూ ఇప్పుడు బడుగుల నినాదమే.

`పటించేది బడుగుల మంత్రమా!

 పార్టీల కొంగ జపమా!?

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

తెలంగాణ రాజకీయాల్లో ఏ విషయం గమనించినా అందులో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముద్రనే స్పష్టంగా కనిపిస్తుందే తప్ప, ప్రతిపక్షాల ఆలోచన ఒక్కటి కూడా కనిపించడం లేదు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షాలను కేసిఆర్‌ వేలు పట్టుకొని నడిపిస్తున్నాడా? లేక ప్రతిపక్షాలే కేసిఆర్‌ వేలు పుట్టుకొని నడుస్తున్నాయో? అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో అమలౌతున్న పథకాలు విమర్శించే ప్రతిపక్ష కాంగ్రెస్‌,బిజేపిలు అవే పధకాలకు మరింత ఆర్ధికమద్ది ప్రచారాస్త్రాలు చేసుకుంటున్నాయి. దానికి తోడు ప్రతి క్షణం ముఖ్యమంత్రి కేసిఆర్‌ వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తూ, వాటినే అనుసరించడం కూడా ప్రతిపక్షాలు అలవాటు చేసుకుంటున్నాయి. తాజాగా బిఆర్‌ఎస్‌ ఈసారి వచ్చే ఎన్నికల్లో బడుగులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు పసిగట్టాయి. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలనీ బడుగుల ఆర్ధిక స్వేచ్ఛ ,స్వాలంబన మిలితమై వుంటున్నాయి. అందులో భాగంగానే వేసే ప్రతి అడుగు పేదలైన బడుగులు సంక్షేమం కోసం చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించి ఆది నుంచి అమలు చేస్తున్న ఆసరా ఫించన్లు కూడా పేదలైన బడుగుల జీవితాల్లో వెలుగుల నింపేందుకు, వారి జీవితాలకు భరోసా కల్పించేందుకు ఎంతో ఉపయోపడుతున్నాయి. అయితే ఆసరా అన్నది కేవలం పేదరికమే ప్రాతిపదికగా అమలు చేస్తున్నారు. కళ్యాణలక్ష్మి , షాదీ ముబాకర్‌ లాంటవి కూడ అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. అయినా బగుడుల్లో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తోంది. ఆయా వర్గాలు అటు రాజకీయంగా, ఇటు ఆర్ధికంగా సమానత్వాన్ని సాధించాలి. ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచన. అందుకే తెలంగాణలో దళిత బంధు అనే పధకం ప్రారంభించారు. నిజానికి ఇది గొప్ప పధకం. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఇలాంటి పథకం అమలు జరగలేదు. ప్రపంచానికి సమానత్వ పాఠాన్ని చెప్పిన ప్రాన్స్‌లో కూడా ఇలాంటి గొప్ప పధకాలు ఏనాడు లేదు. ఎందుకంటే ప్రపంచ గతినే మర్చిన ప్రాన్స్‌ విప్లవం ఒక గొప్ప మలుపు. ఒక్క రొట్టె ముక్క కోసం వచ్చిన విప్లవం ప్రాన్స్‌ విప్లవం. ఆకలి కోపం ఎలా వుంటుందో పాలకులకు రుచి చూపించిన విప్లవం ప్రాన్స్‌ విప్లవం. అలాంటి దేశంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాత్వ్రుం వున్నప్పటికీ పేదల సంక్షేమం, ఆర్ధిక స్వావలంబన కోసం ఏనాడు కృషి చేసింది లేదు. ఆకలి, ఆర్ధిక, సామాజిక అసమానత్వాలు ఎప్పుడో ఒకప్పుడు పెద్ద అగాధాన్ని సృష్టిస్తాయి. అందుకు ప్రాన్స్‌ విప్లవం ఒక ఉదాహరణ. బాస్టిలీ జైలు ఉదంతం ఒక నిర్ధారణ. అయినా ప్రాన్స్‌లో సహజంగా వచ్చిన మార్పులోనే అన్ని వర్గాలు అక్కడ ఎదిగాయి. కాని మొదటిసారి ప్రపంచ చరిత్రలోనే ముఖ్యమంత్రి కేసిఆర్‌ సంక్షేమం అన్న పదానికి కొత్త అర్ధం చెప్పారు. దళిత బంధు ప్రకటించారు. దళిత బంధు వల్ల ఇప్పటికే కొన్ని వేల మంది దళితుల కుటుంబ జీవితాల్లో వెలుగులొచ్చాయి. తెలంగాణలోని మొత్తం దళిత సమాజాన్ని ఆర్థికంగా గట్టెక్కించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి ఒక పథకం ప్రకారం వారి జీవితాలను దీర్చిదిద్దుతున్నారు. దశల వారిగా దళిత బంధు విడుదల చేస్తూ వారికి ఆర్దిక ప్రోత్సాహం అందిస్తున్నారు. ఆదుకుంటున్నారు. ఆ తర్వాత గిరిజన బంధు ప్రకటించారు. అంతకు ముందే పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పారు. తాజాగా వాటిని కూడ గిరిజనులకు అందజేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా పోడు భూముల సమస్యల ఒక్క తెలంగాణలో తప్ప ఎక్కడా పరిష్కారం కాలేదు. అలా గిరిజనుల జీవితాలను కూడా పండగ చేస్తున్నారు. ఈ మధ్య బిసిలకు లక్ష సాయం పథకం ప్రకటించారు. త్వరలో అది కూడా అమలు కానున్నది. ఇలా బిడుగుల కోసం ఒక్కొక్కటీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం వారి జీవితాలలో వెలుగులు నింపుతోంది. సమాజంలో అసమానతలు రూపు మాపే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తోంది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్ధం కావడంలేదు. ప్రజలకు వచ్చేఎన్నికల్లో ఏం చెప్పాలో తోయడం లేదు. దళిత బంధును పెంచి ప్రకటిస్తామా? అంటే అది బిఆర్‌ఎస్‌ పార్టీని కాపీ కొట్టినట్లే అవుతుంది. ఏ పధకం ప్రకటించాలన్నా వాటికి పేటెంట్‌ రైట్లు బిఆర్‌ఎస్‌ వే అన్న భావన కల్గుతోంది. తాజాగా ఆయా పార్టీలు రాజకీయాల్లో బడుగులను మరింత ప్రోత్సహించాలన్న ఆలోచన చేయకముందే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈసారి ఎన్నికల్లో బడుగు నేతలుకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తేఎలా వుంటుందన్న ఆలోచన చేస్తున్నాడని తెలిసి ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ఇప్పుడు ఆయా పార్టీలు కూడా బిడుగుల జపం చేస్తున్నట్లే కనిపిస్తోంది. 

బిజేపి తీసుకున్న తాజాగా నిర్ణయాల్లో కూడా బడుగుల వైపు బిజేపి కూడా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. 

అందుకే పైకి కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిని చేసినా, ఈటెల రాజేందర్‌ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తేనే పార్టీకి మెరుగైన ఫలితాలు లభించే అవకాశాలున్నాయన్న అంచనాకు బిజేపి పెద్దలొచ్చారు. అందుకే కర్నాటక ఎన్నికల తర్వాత బిజేపి సినారియా మారింది. గత కొంత కాలంగా అటూ, ఇటూ డైలమా కొనసాగించినా, తెలంగాణలో బిజేపి బతికి బట్ట కట్టాలంటే ఖచ్చితంగా బడుగుల కార్డు వినియోగించుకుంటే తప్ప మనుగడ సాగించలేమన్నది గుర్తించింది. నిజానికి తెలంగాణలో కూడా బడుగుల నేత సంజయ్‌ నేతృత్వంలోనే పార్టీకి ఊపు వచ్చింది. కాని ఆయన దూకుడే పార్టీని కొంప ముంచేలా వుందన్న తేలిపోయింది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగితే, పార్టీ ఖాళీ అయ్యే పరిస్ధితికి వచ్చింది. అధికార బిఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే బండి సంజయ్‌ బలం సరిపోదు. ఆయన వుంటే పార్టీ నేతలు కూడా సహకరించే పరిస్ధితి కనిపించడం లేదన్నది తెలిపోయింది. బిజేపిలోఒక్కసారిగా పెరిగిన అరువు నేతలే, పార్టీని ముంచడమా? తేల్చడమా? అన్నదాకా రావడంలో వారిని కాపాడుకోవాల్సిన అవసరం బిజేపికి కల్గింది. దాంతో బిజేపి కూడా బిసి జపం చేయాల్సి వస్తోంది. ఎందుకుంటే బిఆర్‌ఎస్‌ మీద ప్రతిపక్షాలు ఓ ముద్ర వేశాయి. కాంగ్రెస్‌ మీద మరో ముద్ర వుండనేవుంది. దాంతో బిఆర్‌ఎస్‌ అన్నది ఇటీవల బడుగుల పార్టీ ప్రజలు అక్కున చేర్చుకునేందుకు అనేక పధకాలు అమలు కూడా చేస్తున్నారు. ఇక మిగిలింది రాజకీయమే…దాన్ని కూడా అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక మిగిలింది కాంగ్రెస్సే…మేమేం తక్కువ..మాకేం తక్కువ. మాకు వున్న ఓటు బ్యాంకు బలమే బడుగులు అన్నది తెరమీదకు తెచ్చేందుకు కాంగ్రెస్‌ కూడా కొత్తఎత్తులకు సిద్దపడుతోంది. 

 కాంగ్రెస్‌లో మాత్రం ఒక తరహా తిరుగుబాటు కూడా మొదలైనట్లే కనిపిస్తోంది. 

మాజీ పిసిసి. అద్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తాజగా విడుదల చేసిన బిసి నేతల జాబితాతో కాంగ్రెస్‌లో ఒక కల్లోలం మొదలైనట్లే లెక్క. ఇప్పటి వరకు కాంగ్రెస్‌కు ఓట్లు బడుగులవి..సీట్లు రెడ్లవి అన్న నానుడి వుండేది. వారి పెత్తనమే ఎప్పుడూ సాగేది. అటు ఉమ్మడి రాష్ట్రమైనా ఇప్పుడు తెలంగాణ వచ్చినా అదే దోరణ కనిపిస్తోంది. మొదటి అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించినా, ఆ తర్వాత ఇద్దరూ రెడ్డి నేతలను పిసిసిలుగా నియమించారు. నేను పిసిసి అధ్యక్షుడినౌతా అంటూ విహెచ్‌. హనుమంతరావు , దామోదర రాజనర్సింహా లాంటి వాళ్లు ఎంత మొత్తుకున్నా చేసేవారు లేరు. వారి గోడు వినేవారు లేరు. కాని జగ్గారెడ్డి, కోమటి రెడ్డి లాంటి వారి వార్తలు మాత్రం చక్కర్లు కొడతాయి. ఇదీ కాంగ్రెస్‌ తీరు. మరి ఈసారైనా జెండా ఎగరేయాలంటే అదే మూస కాంగ్రెస్‌ వెళ్తుందో..లేక బడుగుల జపం చేస్తుందో చూడాలి.

లేని పెత్తనం’పొంగు’తోంది!?

`‘కమ్మ’ను దాటి ఖమ్మంలో ‘రెడ్డి’ గెలిచేనా?

`‘రెడ్డి’ ముందు ‘రావు’లు సాగిలపడేనా?

`మొత్తంగా కాంగ్రెస్‌ కొంప మునిగేనా?

`పొంగులేటి లేని పోరు కాంగ్రెస్‌ వల్ల కాదా?

 `పొంగులేటి ముందు పార్టీ మోకరిల్లడమా?

`డబ్బు చుట్టూ ఖమ్మం కాంగ్రెస్‌ రాజకీయమా?

`ఖమ్మంలో ప్రజా బలం వున్న నాయకులకు కొదువా?

-పార్టీని నిలబెడుతున్న భట్టి బలం చాలదా?

– రేణుకా చౌదరి అభయం, అనుభవం సరిపోదా?

-పార్టీని బతికిస్తున్న నాయకుల బలానికి కొదువా?

-అసలుపొంగులేటి పవరెంత?

`డాబు,డాంబికమంత!?

`డబ్బు తోనే రాజకీయాలు సాగవు?

`పైన పటారం లోన లొటారం!

`పొంగులేటి అంత బలవంతుడైతే గత ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ కు సీట్లెందుకు రాలేదు?

హైదరబాద్‌,నేటిధాత్రి:  

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని చూస్తే జాలేస్తోంది. 135 సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే పార్టీకి దిక్కూ దివానం లేనట్లు, కొత్తగా ఎవరైనా పార్టీలో చేరితేనే బతికి బట్టకడుతుందన్నట్లు సాగుతున్న వ్యవహారం విచిత్రంగా వుంది. పైగా కర్నాకట గెలుపుతోనే కాంగ్రెస్‌కు ఆశలు చిగురించినట్లు, అంతకు ముందు కాంగ్రెస్‌ పార్టీకి జీవమే లేనట్లు ఆత్మహత్యా సాదృష్యమైన ప్రచారం, ఆ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతుందే తప్ప లాభం కాదు. ఇదిలా వుంటే నేటిధాత్రి చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పింది. పొంగులేటి రాజకీయం వెనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాత్ర వున్నట్లు రాయడం కూడా జరిగింది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఏ లక్ష్యం కోసమైతే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరాడో అది నెరవేరకపోయే పరస్ధితులు ఎదురయ్యేలా సూచనలు కనిపిస్తున్న విషయం జగన్‌కు వివరించినట్లు తెలుస్తోంది. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేత ఏకంగా సొంతంగా పార్టీని ఏర్పాటు చేసే యోచన జగన్‌ చేశారని సమాచారం. అప్పటికే షర్మిల కూడా పార్టీ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో పొంగులేటి పెట్టిన పార్టీలో షర్మిల జాయిన్‌ అయినా తెలంగాణ వ్యతిరేకి అన్న సంకేతాలు వెళ్తాయి. ఒక వేళ షర్మిల పార్టీలో శ్రీనివాస్‌రెడ్డి చేరితే తాను ఏం చేయదల్చుకున్నాడో..చెప్పదల్చుకున్నాడో చెప్పకుండానే తెలిసిపోతుంది. అందుకే ఉభయకుశలోపరిగా కాంగ్రెస్‌లో పొంగులేటి జాయిన్‌ అయితే, ఆ తర్వాత షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుంది. అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిల పెత్తనం మొదలౌతుంది. ఇదీ అసలు స్కెచ్‌. అదే దారిలో పక్కా ప్రణాళిక సాగుతోంది. అందుకే షర్మిల కర్నాటకకు చెందిన డి.కే. శివకుమార్‌ను అభినిందించినట్లు ప్రచారం చేశారు. తర్వాత షర్మిల కాంగ్రెస్‌లో చేరే అవకాశాలున్నట్లు ఫీలర్లు వదిలారు. ప్రజల స్పందన తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఎక్కడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకించినట్లు కనిపించలేదు. షర్మిల ఒక్కతే తెలంగాణ రాజకీయాలు చేయడం అంత సులువు కాదు. ఆమెను నమ్మెందుకు ప్రజలు కూడ సిద్దంగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పరిస్ధితి ఎలా వుంటుందో ఇక్కడ షర్మిల రాజకీయం అంతే వుంటుందని అంచనా వేశారు. దాంతో ఎలాగైనా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల కీలకం కావాలి. చక్రం తిప్పగలగాలి. తెలంగాణ రాజకీయాలను శాసించే దాకా పెరగాలి. అందుకు జగన్మోహన్‌రెడ్డి ఆర్ధిక సహాకారం, కేవిపి. చాణక్యం తోడవ్వాలి. ఇదీ అసలు సంగతి. అందుకే రాహుల్‌ గాంధీ ఖమ్మం సభ తర్వాత గన్నవరంలో కేవిపి కలిశారు. మరునాడు ఉదయమే షర్మిల గురించి కేవిపి. రామంచంద్రరావు ప్రకటన చేశారు. ఇదంతా పైకి కనిపిస్తున్నట్లు కొత్త విషయం కాదు. చాలా కాలంగా జరిగుతున్న కసరత్తు అన్నది నేటిధాత్రి ముందు నుంచి చెబుతోంది…తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టేందుకు , గుప్పిట్లోకి తీసుకునేందుకు షర్మిలను తెలంగాణ నాయకురాలను చేసేందుకు జగన్మోహన్‌రెడ్డి వేసిన ప్లాన్‌ ఇప్పటిదికాదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎప్పుడో గమనించారు. అందుకే ఆయనను ఎప్పుడో పక్కనపెట్టారు. తెలంగాణ రాజకీయాలను , కేసిఆర్‌ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసికట్టేందుకే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బిఆర్‌ఎస్‌లోకి పొంగులేటిని పంపించారన్నది దీనితో స్పష్టమైంది. అంతే కాదు బిఆర్‌ఎస్‌నుంచి బైటకు వెళ్లిన వెంటనే పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జగన్‌ను కలవడం జరిగింది. అప్పుడే నేటిధాత్రి ఆ మైత్రిలో ఆంతర్యాన్ని అంచనా వేసింది. తర్వాత పరిణామాలను తెలియజేస్తూవస్తోంది. ఖమ్మం సభ జరిగిన తర్వాత ఇదే విషయాన్ని నేటిధాత్రి రాయడం జరిగింది. కాంగ్రెస్‌లో వైఎస్‌. అనుచరగణమంతా ఏకమౌతోంది? పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఏకాకిచేసే ఎత్తుగడ వేస్తున్నారన్నది తెలియజేయడం జరిగింది. 

ఒక్కసారి పొంగులేటి ఎపిసోడ్‌ను పూర్తిగా పరిశీలిస్తే, ఏ ఒక్క కాంగ్రెస్‌ నాయకుడు కూడా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాకను ప్రశ్నించలేదు.

 కేవలం ఒక్క రేణుకా చౌదరి మాత్రమే పొంగులేటి రాకను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆమె అదే స్టాండ్‌ మీద వున్నట్లు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే పొంగులేటి కాంగ్రెస్‌లో చేరడం అంటే అదేదో అద్భుతం జరిగిపోతుందన్నంతగా ప్రచారం చేస్తూ వచ్చారు. అసలు అంతటి ప్రచారం గతంలో ఏ కాంగ్రెస్‌ నేతకు జరగలేదు. పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా ఇందులో కనీసం పదో వంతు ప్రచారం కూడా జరలేదు. అటు, ఇటూ అంటూ గోడ మీద పిల్లిలా పొంగులేటి ఎటు చూస్తే అటు, ఆ పార్టీకి ఇక తిరుగులేదన్నట్లు ప్రచారం జరిగింది. చివరికి కాంగ్రెస్‌లోకి పొంగులేటి వెళ్లడాన్ని ఈ దశాబ్ధికే ఒక అధ్భుతమైన ఘట్టం ఆవిషృతమైనంత గొప్పగా వందిమాగదలు ప్రచారం చేశారు. కాని అసలు లోగుట్టు తెలుసుకోలేకపోయారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులే లేనట్లు, ఆ పార్టీలో చీకటిలో వున్నట్లు, పొంగులేటి ఒక వెలుగు సూర్యుడైనట్లు ఏం ప్రచామది? కాంగ్రెస్‌లోకి పొంగులేటి రావడమే ఒక వరమన్నట్లు ఇంకా ప్రచారం సాగుతూనేవుంది. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చి అంపశయ్య మీద వున్న కాంగ్రెస్‌కు తులిసి తీర్ధమందించినట్లు కూడా గొప్పలకు పోతున్నారు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్‌కు ఇన్‌స్టంట్‌ శక్తికోసం పొంగులేటి గ్లూకోస్‌ అవసరం అన్నంతగా ఆయన రాకకోసం కొందరు కాంగ్రెస్‌ నాయకులు పాకులాడారు. ఆయన ఇంటికి పరుగులు పెట్టారు. ఇక భవిష్యత్తు కాంగ్రెస్‌కు జవసత్వాలు రావాలంటే పొంగులేటి అనే హర్లీక్స్‌ లేకపోతే కాంగ్రెస్‌కు కష్టమే అన్నంతగా నాయకులు ఆయన రాకకోసం ఆరాటపడినంతగా సాగిలపడడం విచిత్రం. కొత్తగా ఇప్పుడే కాంగ్రెస్‌ నేతలు కాజు, బాదంలు తింటున్నట్లు, బలవంతులౌతున్నట్లు మరీ విచిత్రం చేస్తున్నారు. ఖమ్మం లాంటి సభలు గతంలో నిర్వహించనట్లు, నా సభ చూశారా…నా ప్రతానం చూశారా…అన్నట్లు పొంగులేటి గొప్పలు చెప్పుకోవడం చూస్తే కాంగ్రెస్‌ను శాసించేది నేనే అన్నంతగా పొంగులేటి ధీమా చూపిస్తున్నాడు. పొంగులేటి రాకతో సీనియర్‌ నాయకులుంతా పక్కకుపోయినంత పనైంది. కాని ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన భరోసా ప్లకార్డును పక్కన పెడేసినట్లు, ఎప్పుడైనా కాంగ్రెస్‌ను నిండా ముంచడం ఖాయమన్నది ఆరోజే తెలిపోయింది. అంతే కాదు నేను లేనిదే కాంగ్రెస్‌ లేదన్నట్లు, బతికి బట్టకట్టేలా లేదన్నట్లు పొంగులేటి మీడియా సమావేశాలు చూస్తే అర్ధమౌతోంది. కాంగ్రెస్‌లో రూపాయి పెట్టే శక్తి వున్న నాయకుడు ఎవరూ లేరన్నట్లు , తన డబ్బులతోనే కాంగ్రెస్‌ బతకాలన్నట్లు శాసించే స్ధాయిలో వున్నట్లు కూడా ఆయన హవభావాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇక్కడ కూడా ఘోర పరాభవాన్ని చూసే రోజులు కళ్లముందు కనిపిస్తున్నాయా? అన్న అనుమానం సగటు కాంగ్రెస్‌ కార్యకర్త కూడా వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే ఖమ్మంలో కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి బలంగానే వుంది. తెలంగాణ వచ్చాక కూడా ఖమ్మంలో 2014లో 9 సీట్లు కాంగ్రెస్‌ గెల్చుకున్నది. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ ఎక్కువ సీట్లు సాధించింది. మరి గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌లోవున్న పొంగులేటి ఆ పార్టీని ఎందుకు గెలిపించలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ చేసిన బీరాలు పలికారు. నిజంగా పొంగులేటికి అంత బలమేవుంటే సొంతంగా పార్టీ పెట్టి, తన బలం నిరూపించాలి. కాని ఆయన హిడెన్‌ ఎజెండా ఏమిటో తెలిపోయింది. బిఆర్‌ఎస్‌లో చేరి ఆపార్టీని చెడగొట్టాలని చూశాడు. కాని కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను ఖతం చేసి, షర్మిల చేతిలో పెట్టేందుకు జగన్‌ పద్మ వ్యూహంలో పొంగులేటి తనకు తానుగానే చిక్కుకుంటున్నాడు. అంతే…!

ఆ గెట్టు లక్ష..ఈ గెట్టు కోటి!

`అటు ఆంద్రా…ఇటు మహారాష్ట్ర.

` మధ్యలో తెలంగాణ… సిరుల మాగాణ.

` భూముల ధరలు ఎక్కడ విన్నా కోటి.

` తెలంగాణ వెలుగుల దివిటీ

` దేశంలోనే తెలంగాణ భూమి మేటి.

` అటు సాగులో కనీవినీ ఎరగని పురోగతి…ఇటు పారిశ్రామిక ప్రగతి.

` నిన్న బీడు నేల…నేడు బంగరు నేల.

` తెలంగాణ భూములు బొచ్చెడు పిరం…

` పొరుగు రాష్ట్రాల రైతులది దుఖం.

` నిన్న దుఖమెల్లవోసిన నేల…

`ఇప్పుడు ఎల్లకాలం నూతుల నిండా జల.

` నాడు చుక్కకేడ్చింది…నేడు పొలం మురుస్తోంది.

` పదేళ్ల కింద వలసలు…నేడు బంగారు పంటలు.

`నిన్న దేశాలు పట్టుకొని పోయి…నేడు ఊరిలో శ్రీమంతుడై..

` తెలంగాణ రైతు రాజయ్యాడు…

హైదరబాద్‌,నేటిధాత్రి:                                    

మనిషికైనా, మానుకైనా, పక్షికైనా, ప్రకృతికైనా, ఏ జీవికైనా, చెట్టుకైనా, పుట్టకైనా, భూమికైనా, పాడికైనా , పంటకైనా నీరే ఆధారం. ఆ నీరు లేక గోపడిన తెలంగాణ ఇప్పుడు నీటి గంగాళమైంది. నీటి గోస లేని తెలంగాణ ఆవిష్కృతమైంది. తెలంగాణ గోదారి నీళ్లతో కళకళలాడుతోంది. అన్నింటికీ నీరే జీవాధారం. ఒకనాడు కాకతీయ కాలమైనా, సర్కారు నిజామైనా నీటి జాడలలు తొనికసలాడిన తెలంగాణ. ఉమ్మడి రాష్ట్రంలో విలవిలలాడిరది. చుక్క నీటి కోసం ఎదురు చూసింది. కనికరం లేని ఉమ్మడి పాలకుల చేతిలో కన్నీటిని దిగమింగుకున్నది. తెలంగాణ సాగు నీటి వనరైన చెరువులు ద్వంసం చేయబడ్డాయి. ప్రాజెక్టులు సాధ్యం కాదని తేల్చి, చెప్పి రైతును కష్టాల పాలు చేశారు. ఆ పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ చైతన్య గీతికను ఆలపించి, ఉద్యమించి, పోరాటాన్ని ఉరకలెత్తించి, ఉక్కు సంకల్పంతో, పిడికిళ్లు బిగించి, మూడున్న కోట్లు గొంతులు సవరించి, జై తెలంగాణ నినాదాన్ని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి, డిల్లీ గల్లీలో కూడా తెలంగాణ రణ నినాదం చేసి తెలంగాణ సాధించిన వీరుడు కేసిఆర్‌. తెలంగాణ తలరాత మార్చిన తనయుడు కేసిఆర్‌. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌…

తెలంగాణ వచ్చింది ఏం మారింది?

ఇది తెలంగాణలోని కొంత మంది కనులుండీ చూడలేని వారి ప్రశ్న. కాని తెలంగాణ వచ్చాక తెలంగాణ పూర్తిగా మారిపోయింది. అసలు ఒకప్పటి తెలంగాణేనా అని అనిపిస్తోంది. హైదరాబాద్‌కు వెళ్లే ఎక్కడున్నామన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది తెలంగాణకు వస్తున్నవారు చెబుతున్న మాట. సీమాంధ్రకు చెందిన ఒకప్పటి పాలక నేతలు కూడా చెబుతున్న మాట. తెలంగాణ వస్తే ఇక చీకట్లే అన్న వారు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. తాము తెలంగాణ అభివృద్ది కాంక్షించలేకపోయామని, సహకరించలేకపోయామని సిగ్గుపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి సాధ్యం కాదని చెప్పి తమ చేతగాని తనాన్ని నిరూపించుకుమని అంటున్నారు. అసలు తెలంగాణ ప్రాంతమే తొండలు గుడ్లు పెట్టడానికి కూడా పనికి రావని అన్న వాళ్లు , తెలంగాణ ఇలా నీళ్లుతో తడుస్తుందని కలలో కూడ అనుకోలేదంటున్నారు. తెలంగాణ చీకటౌతుందనుకున్నాం? కాని అన్నింటినీ అధగిమించింది. సీమాంధ్రను మంచిపోయింది. తెలంగాణ కూడా అన్న పూర్ణగా మారింది. ధాన్యరాసులు పండుతున్నాయి. భూములకు విపరీతమైన ధర వస్తోంది. దేశంలోనే ఇంత డిమాండ్‌ వున్న స్ధలాలు లేవు. దిక్షిణభారత దేశంలోని రాష్ట్రాల గురించి చెప్పుకున్నా ఒకప్పుడు చెన్నై అంటే ఎంగో గొప్పగా చెప్పుకునేవారు. కాని అక్కడ మంచినీటి కటకట. కర్నాకట రాష్ట్రంలోని బెంగుళూరును సిలికాన్‌ వ్యాలీ అంటారు. కాని అక్కడ కూడా పొల్యూషన్‌ విపరీతంగా పెరిగిపోయింది. నగరం పెరిగేందుకు స్ధలం లేకుండాపోయింది. హైదరాబాద్‌ సుందరీకరణ అంటే ఒక అద్భుతం. ఎంతో మంది చెబుతున్నారు. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసిన ప్రగతి మాయాజాలం. అభివృద్ధి మంత్రం. తెచ్చిన తెలంగాణను బంగారు తునక చేయాలన్న లక్ష్యం. అందుకే తెలంగాణ ఒక అపురూపంగా మారింది. తెలంగాణ అద్భుత కట్టడాలతో అలరాలుతోంది. ప్రతి జిల్లా ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దబడుతోంది. అభివృద్ధి అన్ని జిల్లాలకు సమానంగా పంచబడుతోంది. అన్ని జిల్లాలు సర్వతోముఖాభి వృద్ధి సాధిస్తున్నాయి. హైదరాబాద్‌ సౌకర్యాలు తెలంగాణలోని దాదాపు అన్ని నరగాల్లోనూ అందుతున్నాయి. అందుకే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగింది. తెలంగాణ భూముల విలువ అమాంతం పెరిగింది. 

 తెలంగాణలో భూముల ధరలు దేశంలో ఎక్కడా లేనంతగా పెరిగాయి.

 ప్రజల స్ధిర చరాస్ధులు గణనీయంగా పెరిగిపోయాయి. అందుకు కారణం తెలంగాణ పరిపాలనలో అదొక అద్భుత ఆవిష్కారం. ఒకప్పుడు సీమాంధ్రలో ఒక ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో నాలుగు ఎకరాల స్ధలం కొనుక్కొవచ్చు అన్న మాటలే వినపడేది. కాని ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసరాల్లో ఒక ఎకరం భూమి అమ్ముకుంటే, సీమాంద్రలో కనీసం వంద ఎకరాలు కొనుగోలు చేసుకోవచ్చు. అని సాక్ష్యాత్తు ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. అంటే తెలంగాణ ఎంతలా అభివృద్ది చెందిందో అర్దం చేసుకోవచ్చు. తెలంగాణలోని ఏ ప్రాంతంలో భూముల రేట్లు చూసిన అంతే గొప్పగా వున్నాయి. ఒకప్పుడు ఆదిలాబాద్‌ జిల్లా అంటే ఎంతో వెనుకబడిన ప్రాంతం అంటూ వుండేవారు. కాని నేడు అదే ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా ఎకరం భూమి కోటి రూపాయలు దాటి పలుకుతోందంటే ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తున్నట్లు కాదు. అదే ఆ పక్కన వున్న మహారాష్ట్రలో ఎకరం కనీసం లక్ష రూపాయలు కూడా పలకడం లేదు. ఇటు వెళ్తే కర్నాకట బోర్డర్‌లో కూడా పెద్దగా భూములకు విలువ లేదు. కొద్దో గొప్పొ ఆంధ్ర ప్రాంతానికి చెందిన భూములకు విలువున్నా, తెలంగాణ భూములతో పోల్చితే ఎక్కడో అట్టుడుగునే వున్నాయి. తెలంగాణ రాక ముందు సరిగ్గా పదేళ్ల క్రితం హైదరాబాద్‌ తప్ప, తెలంగాణలోని ఏ ప్రాంతంలోనైనా ఎకరం లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల లోపే వుండేది. కాని నేడు ఏ మారు మూల ప్రాంతమైనా సరే కనీసం రూ.50లక్షలకు తక్కువ లేదు. ఏ జిల్లా కేంద్ర చుట్టు పక్కల ప్రాంతాలైనా సరే కోటి రూపాయలకు తక్కువ లేదు. ఇదీ తెలంగాణ భూముల విలువ. 

అటు ఆంధ్రా, ఇటు మహారాష్ట్ర, ఆ పక్కనున్న కర్నాకట రాష్ట్రాల ప్రజలు తెలంగాణను చూసి అబ్బుపడుతున్నారు.

మురిసిపోతున్నారు. ఒకప్పుడు మన తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాల సరిహద్దుల ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లేవారు. తెలంగాణ పల్లెలను వదిలి ప్రజలు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అంటూ వసలు వెళ్లేవారు. పాలమూరు గోస గురించి, వలస గురించి ప్రత్యేకంగాచెప్పాల్సి వస్తే రాస్తే రామాయణమంత , వింటే భారతమంతా! వుంటుంది. అదీ పదేళ్ల క్రితం తెలంగాణ బతుకు. కాని తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేని, ఓర్వలేని తనంతో ప్రతిపక్షాలు సాగిస్తున్న అసత్య ప్రచారం ప్రజలు నమ్మరు. అయినా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. నిజానికి తెలంగాణ ఇంతలా అభివృద్ది జరుగుతుందిన కాంగ్రెస్‌, బిజేపి పార్టీలు కలగనలేదు. కలలో కూడా ఊహించలేదు. తెలంగాణ వస్తే ఏం చేస్తారో…చూద్దాం అన్నట్లు సీమాంధ్ర నాయకులు ఎదురుచూశారు. తెలంగాణ అభివృద్ది అంటే నీళ్లు తేవడం అంత సులభం కాదని కాంగ్రెస్‌ అనుకుంటూ వచ్చింది. కాని తెలంగాణ తెచ్చిన మూడు నెలల్లో కరంటు వెలుగులు కనిపించే సరికి కాంగ్రెస్‌, బిజేపిల కళ్లు బైర్లు కమ్మాయి. నిరంతర విద్యుత్‌ తెలంగాణలో సరఫరా అవుతుంటే ఇదెలా సాధ్యమౌతుందంటూ ఆశ్చర్యపోయాయి. మనసుంటే మార్గం వుంటుంది. అభివృద్ది చేయాలన్న చిత్తశుద్ది పాలకుల్లో వుంటే ఏదైనా సాధ్యమౌతుంది. ఇప్పుడు తెలంగాణలో అదే జరుగుతోంది. ఊరు వదిలి వలస వెళ్లిన రైతు తిరిగి పల్లెకు వచ్చాడు. కన్న తల్లి లాంటి ఊరును వదలి, ఆస్ధిగా భావించే సాగు భూమిని వదిలి పొట పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఇప్పుడు ఆ రైతే పల్లెకు మళ్లీ చేరుకున్నాడు. కళ్ల నిండా నీళ్లు చూస్తూ, కడుపారా పొలానికి నీరందిస్తున్నాడు. బంగారు పంటలు పండిస్తున్నాడు. తెలంగాణ రైతు రాజయ్యాడు. ఇదందా సాధ్యం కావడానికి కారణం ఒక్క పేరు..అదే కేసిఆర్‌. ఆయనే తెలంగాణ తల రాత మార్చిన యుగకర్త. తన ప్రాంతం మీద మమకారంతో ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి, తెలంగాణ సాధించిన కేసిఆర్‌ ఖచ్చితంగా దైవాంశ సంభూతుడే…ఆయన పేరు తెలంగాణ చరిత్రలో తరతరాలు చెరిగిపోని నిఘంటువే!

*అభ్యర్థుల ఎంపికలో భట్టి కీ రోల్…నివేదిక కోరిన రాహుల్..?*


Rahul Gandhi gave importance to Bhatti :

తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం సభ తరువాత గన్నవరం బయల్దేరిన రాహుల్ తనతో పాటుగా భట్టిని వెంట బెట్టుకెళ్లారు.

ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపైన ఆరా తీసారు. నేతల సమన్వయంపైన చర్చించారు.రాహుల్ గాంధీ స్వయంగా తెలంగాణలో కాంగ్రెస్ పరిణామాల పై ఆరా తీస్తున్నారు. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ అధికారం దక్కించుకోవాలనే కసితో అడుగులు వేస్తోంది. ఈ సమయంలో ఎక్కడ ఏ విషయంలోనూ ఉపేక్షించ కూడదని రాహుల్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ యాత్ర ద్వారా భట్టి కష్టాన్ని రాహుల్ గుర్తించారు. తన సుదీర్ఘ యాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపటంతో పాటుగా పేదల వద్దకు పార్టీ ని తీసుకు వెళ్ళటం, వారితో మమేకం అవ్వటం, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించటం పార్టీకి మైలేజ్ పెంచిందని రాహుల్

విశ్వసించారు. అందులో భాగంగానే తానే స్వయంగా వచ్చి ఖమ్మం సభలో భట్టిని సత్కరించారు. ప్రత్యేకంగా భట్టి యాత్రను ప్రశంసించారు. సభ ముగిసిన తరువాత భట్టిని తనతో పాటుగా తీసుకెళ్లిన రాహల్ కీలక మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

రాహుల్ కారులోనే భట్టికి పార్టీ వ్యూహాల పైన కీలక సూచనలు చేసారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటి పైన భట్టి అభిప్రాయాలను కోరినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరించిన భట్టి.. టికెట్ల ఖరారు ఎంపిక పైన తన అభిప్రాయాలను వివరించారని తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా..సామాజిక వర్గాల సమీకరణాలు దెబ్బ తినకుండా పూర్తి అంచనాలతో నివేదిక కోరినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థి ఎవరైనా గెలుపే ప్రామాణికం కావాలని భట్టి, రాహుల్ మంతనాల్లో నిర్ణయించారు. మొత్తం నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిస్థితులు..అభ్యర్థుల ఎంపికలో ఆయా నియోజకవర్గాల్లో తీసుకోవాల్సిన అంశాల పైన నివేదిక కోరినట్లు సమాచారం. దీంతో, భట్టికి రాహుల్ కీలక బాధ్యతలు అప్పగించినట్లైంది.

వాళ్లంతా ఒక్కటే! రేవంత్‌ ఒంటరే!!

`రేవంత్‌ నమ్మిన పొంగులేటి కట్టప్ప రూపమే!

`రేవంత్‌ కు షర్మిల రిటన్‌ గిఫ్ట్‌ కోసమే!

`కాంగ్రెస్‌ కోసం రేవంత్‌ ఎంత కష్టపడ్డా వృధానే!

`తెలంగాణ వచ్చినా కాంగ్రెస్‌లో వున్న బానిసలంతా వైఎస్‌ వీర విధేయులే?

`ఇప్పటికీ వాళ్లు చేసేది వైఎస్‌ జపమే!

`తెలంగాణలో షర్మిల రాకకు కారకులే!

`కొట్లాడిరది రేవంత్‌ ఒక్కడే?

` రేపు రేపు రేవంత్‌ కు చుక్కలే?

`షర్మిలను ముందు పెట్టి రేవంత్‌ ను పక్కకు నెట్టుడే!

`పొంగులేటి రూపంలో పొగబెట్టుడే?

`కోమటి రెడ్డి రూపంలో ఇక మొదలైనట్లే?

`ఘర్‌ వాపసీ రేవంత్‌ మెడకే!

`షర్మిల అడుగుతో మళ్ళీ మొదటికే!

`పొంగులేటి కాంగ్రెస్‌ లో చేరడం వెనక వున్నది జగనే!

`ఇదంతా షర్మిల రాజకీయ భవిష్యత్తుకు మార్గమే!

`తెలంగాణలో వైఎస్‌ కుటుంబం పెత్తనం లక్ష్యమే?

`జగన్‌ ను కాదన్న కాంగ్రెస్‌ ను కాళ్లకాడికి తెచ్చుకోవడం కోసమే!

`కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెత్తనం ఆంద్రా వాళ్లదే?

`షర్మిలను తెచ్చుకొని నెత్తిమీద కుంపటి పెట్టుకోవడమే!

`తెలంగాణ కాంగ్రెస్‌ నేతలది బానిస మనస్తత్వమే!

`షర్మిల రాకను వ్యతిరేకించే రేవంత్‌ ను అదను చూసి సాగనంపుడే?

`బానిస నేతలు మొదటగా చేసే పని ఇదే?

 

హైదరబాద్‌,నేటిధాత్రి:                                   

కొన్ని విషయాలు లోతుగా వుంటాయి. కొన్ని సార్లు గంభీరంగా వుంటాయి. పైకి చిన్నవిగా కనిపిస్తాయి. కాని సార్లు ఉపద్రవాలు సృష్టిస్తాయి. రాజకీయాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒక వ్యక్తి కోసం కొన్ని సార్లు సాగిలపడిపోతుంటాయి. మరి కొన్ని సార్లు వ్యక్తికోసం వ్యవస్థనే కుప్పకూలుస్తాయి. ఇప్పుడు సరిగ్గా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో అదే జరుగుతుందా? అన్న అనుమానం కల్గకమానదు. ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి రేవంత్‌ రెడ్డి రావడం చాలా మందికి ఇష్టం లేదు. కాని ఆయనకు ఆయనగా పట్టుబట్టి మారీ వచ్చారు. ఇలా కాంగ్రెస్‌లోకి వచ్చిన వారు ఆ పార్టీలో మనుగడ సాగించడం చాలా కష్టం. రేవంత్‌రెడ్డి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో వాటని అదిగమిస్తూ వస్తున్నారు. అయినా అడుగడుగునా ఏదో ఒక ఉపద్రవం వచ్చి వాలుతూనే వుంది. కాని ఈసారి షర్మిల రూపంలో, కేవిపి. రామచంద్రరావు నీడలో వస్తుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇది పూర్తి స్ధాయిలో వాస్తవ రూపం దాల్చితే మాత్రం రేవంత్‌రెడ్డికి పదవీ గండం తప్పదు. కాంగ్రెస్‌ పార్టీ పతనం అంతకన్నా తప్పదు. అందుకే కాంగ్రెస్‌ను ఎవరూ చెడగొట్టలేరు. ఎవరూ బాగు చేయలేరు అంటారు. చెడొగొట్టుకున్నా వాళ్లే, బాగు చేసుకున్నా వాళ్లే అన్నది నానుడి. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను పాత రోజులకు తీసుకోవడం కోసం అందులో వున్న నాయకులే కృషి చేస్తున్నారని చెప్పకప్పదు. ఇక్కడే కేవలం కేవిపి రామచంద్రరావు తన వ్యక్తిగత స్వార్ధం కోసం, జగన్‌ కుటుంబానికి దగ్గరవ్వడం కోసం కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో కీలకం చేసి, మళ్లీ ఆ కుటుంబానికి దగ్గరవ్వాలనుకుంటున్నాడు. ఈ లోతైన విషయంపై అవగాహన లేని కాంగ్రెస్‌ నాయకులు షర్మిల రాకను చాల మంది స్వాగతిస్తున్నారు. కాని షర్మిల తెలంగాణ రాకతో మొదటగా రేవంత్‌ కు నష్టం చేస్తే, ఆపై తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆగం కావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎపిసోడ్‌ మొత్తం ఒకసారి పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెనకుండి కథ స్క్రీన్‌ ప్లే పక్భందీగా నడిపిస్తున్నారనిపిస్తోంది. 

షర్మిల తెలంగాణ రాజకీయాలలోకి వస్తూనే ఖమ్మం జిల్లా రాజకీయాలను తనవైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. నిజానికి తెలంగాణ రాజకీయాల్లో షర్మిలకు చోటు లేదు. తన మొదటి సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేసింది. పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించింది. పాదయాత్ర చేపట్టింది. అయితే కాంగ్రెస్‌ దరి చేరడం ఎలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్న సమయంలో కర్నాటక ఎన్నికల ఫలితాలు షర్మిల రాజకీయాలకు మార్గం వేశాయి. నిజానికి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు రావడానికి ఇంత కాలం పట్టడానికి కూడా జగనే కారణం అన్నది తెలుస్తోంది. అదును చూసి పొంగులేటి పాచికను జగన్‌ వాడుకున్నాడు. అందుకు పొంగులేటి కూడా సై అన్నాడు. అయితే బిజేపి వైపు మొగ్గు చూపుతున్నట్లు కొంత కాలం ఎపిసోడ్‌ నడిపారు. పొంగులేటి బిజేపిలో చేరినా షర్మిల బిజేపిలో చేరడం కుదరదు. అందుకే ముందు బిఆర్‌ఎస్‌ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని బైటకు రప్పించారు. అంతకు ముందే షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి దింపేశారు. ఈ విషయం తెలియక రేవంత్‌రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని తొలుత వ్యతిరేకించాడు. షర్మిల తెలంగాణరాజకీయాల్లోకి రావడాన్ని తప్పుపట్టారు. తెలంగాణలో మాకు మేము రాజకీయాలు చేసుకుంటామంటూ చెప్పాడు. దాంతో షర్మిల వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌ను ప్రశ్నిస్తూ వచ్చేది. రేవంత్‌రెడ్డి చేసిన పాదయాత్రపై సెటైర్లు వేస్తూ వచ్చింది. ఇదంతా ముందు నుంచి ఒక పథకం ప్రకారం సాగుతోంది. ఇది రేవంత్‌కు తెలియక పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. కాని తెరవెనుక రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వర్గంలో ముఖ్యమైననాయకులైన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి,జానారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే వున్నారు. వీరిలో దివంగత వైఎస్‌కు అనుచరులుగా వున్నవారే ఎక్కువ. వాళ్లుంతా ఇప్పుడు షర్మిల రాకను స్వాగతిస్తున్నారు. పొంగులేటి రూపంలో సహకారాన్ని తీసుకుంటూ తెలంగాణలో కాంగ్రెస్‌ రాజకీయాల్లో వైఎస్‌ కుటుంబానికి చోటు కల్పించి, కృతజ్ఞత తీర్చుకోవాలని చూస్తున్నారు. పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి తీరని ద్రోహానికి కూడా వీళ్లు పాల్పడుతున్నారు. ఖమ్మం సభపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి తయారు చేయించిన పోస్టర్‌లో పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేకపోవడం గమనార్హం. 

 వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా వుంటూ వచ్చిన కేవిపి తొలుత జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని శతవిధాల ప్రయత్నించాడు. 

కాని ఆయన ఎత్తులు పారలేదు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. సోనియాగాందీ కేవిపి. సూచనలు పట్టించుకోలేదు. అయినా సమయం చూసి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేవిపి అనుకున్నారు. కాని జగన్‌ అంత కాలం ఆగేందుకు ఇష్టపడలేదు. పైగా ఓదార్పు యాత్ర చేపటొద్దన్న అధిష్టానం సూచనలు జగన్‌ పట్టించుకోలేదు. కేవివి. జగన్‌కు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేశాడు. కాంగ్రెస్‌లోనే వుండాలంటూ జగన్‌పై ఒత్తిడి తెచ్చాడు. అయినా జగన్‌ వినలేదు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ జగన్‌పై కేసులు నమోదు.. వంటివి చకచకా జరిగిపోయాయి. ఆ సమయంలో కేవిపి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించలేదు. జగన్‌కు మద్దతుగా నిలవలేదు. ఇది జగన్‌ కుటుంబంలో అసంతృప్తిని పెంచింది. జగన్‌ కు కేవిపిని దూరం చేసింది. ఆప్పటి నుంచి జగన్‌ కుటుంబానికి కేవిపి దగ్గరయ్యే ప్రయత్నం చేసినా, జగన్‌ సానుకూలంగా స్పందించలేదు. అప్పుడు జగన్‌ వినలేదు. తాను జగన్‌వైపు నిలవలేదు. ఇప్పుడు షర్మిలకైనా రాజకీయ భవిష్యత్తును సృష్టించి మళ్లీ ఆ కుటంబానికి దగ్గరయ్యే రాజకీయం తెలంగాణలో మొదలుపెట్టారు. ఆ బాధ నుంచి తేరుకునేందుకు ఈ ఎత్తుగడ వేశాడు. కాకపోతే ఇందులో జగన్‌ కూడా షర్మిలకు పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూనే, కుటుంబ తగాదాలున్నట్లు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అసలు విషయం బైట పడుతోంది. కేవిపి. రామచంద్రరావుకు కాంగ్రెస్‌ అధిష్టానంలో మంచి పలుకుబడి వుంది. కర్నాకట ఉప ముఖ్యమంత్రి డికే.శివకుమార్‌కు వైఎస్‌కుటుంబానికి మంచి అనుబంధం వుంది. ముందు షర్మిలను అటువైపు నుంచి కాంగ్రెస్‌కు దగ్గర చేసే ఎత్తుగడ మొదలు పెట్టారు. అది సక్సెస్‌ పుల్‌ అ య్యింది. ఇక ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చేరడం మాత్రమే మిగిలి వుంది. షర్మిల ఎలాగూ రేవంత్‌ నాయకత్వంలో పనిచేయదు. కొత్తగా చేరిన నాయకులెవరూ రేవంత్‌కు మద్దతు ఇవ్వరు. ఎందుకంటే జూపల్లి కృష్ణారావు లాంటి వారు కూడా వైఎస్‌ నామస్మరణ ఇప్పటికీ చేస్తున్నవాళ్లే..అందువల్ల రేవంత్‌కాంగ్రెస్‌లో ఇక ఒంటరే… భవిష్యత్తు బైటకే…! చూద్దం ఏం జరుగుతుందో!!

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version