రెచ్చ గొడతారు.. గద్దెనెక్కుతారు!

-అమాయకుల చేత గద్దెలు కూల్పించి రాజకీయాలు చేస్తారు.

-తమ రాజకీయాల కోసం సమాజంలో చిచ్చు పెడతారు.

యువత జీవితాలు ఆగం చేస్తారు!

రాజకీయం కోసం యువతను మోసం చేస్తారు

రాజకీయ నాయకుల ఉచ్చులో పడకండి.?

జెండా గద్దెలు కూల్చండి అని చెప్పగానే రెచ్చిపోకండి?

పిలుపునిచ్చిన కవిత ఎందుకు ఒక్క గద్దె కూల్చలేదు.?

కవిత కొడుకుల చేత గద్దెలెందుకు కూల్పించలేదు?

అమాయకులైన బడుగుల పిల్లలు జైలు పాలు కావాలా.?

కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలు నాశనం చేసుకోవాలా?

వారి బంగారు భవిష్యత్తు అంధకారం చేసుకోవాలా?

జీవితాంతం రాజకీయ నాయకులకు ఊడిగం చేయాలా?

మీ పిల్లలు అమెరికాలో చదువుకోవాలా?

తెలంగాణ ఉద్యమం పేరుతొ ఒక తరం హారతి కర్పూరమైపోయింది?

-తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం కొందరికి వరమైనది?

-ఎంతోమంది ఉద్యమ కారులకు శాపం కూడా అయ్యింది

-ఆ కుటుంబాలు తెరుకోలేక పోతున్నాయి

-గర్భ శోకం తో ఆ కుటుంబాలు తల్లడిల్లి పోతున్నాయి

-ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారినే గుర్తించలేదు

-సమాచారం లేదని గుర్తింపు గాలికి వదిలేశారు

-ఆ కుటుంబాలను ఆదుకోలేదు?

ఇప్పుడు కవిత వచ్చి కొత్తగా రెచ్చగొడుతోంది?

తన రాజకీయ జీవితం కోసం యువతను బలికోరుతోంది

తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడిన కుటుంబంలో కవిత కూడ వుంది?

-కిరాయికి వున్న కవితకు బావంతులోచ్చాయి

-కూటికి లేకపోయినా కోట్ల ఆస్తులోచ్చాయి

-పదేళ్లు అనుభవించడానికి పదవులోచ్చాయి

-ఇప్పటికీ పదవులున్నాయి

-ఇంకా పెద్ద పదవుల కోసం కోటి ఆశలున్నాయి

-అందుకే జాగృతి పేరుతో దుకాణం మొదలుపెట్టింది?

-సామాజిక న్యాయం ముసుగేసుకొని వస్తోంది?

తన రాజకీయ సామ్రాజ్యం కోసం యువతను యుద్ధంలోకి దించుంతోంది?

 

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

 తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఎవరో ఉద్యమం చేయాలని చెప్పాల్సిన పనిలేదు. ఎవరో చైతన్యం రగిల్చాల్సిన అవసరం లేదు. తమకు అన్యాయం జరుగుతుందనుకున్నప్పుడు తమకు తామే ముందుకొస్తారు. పోరు సాగిస్తారు. ఆనాడైనా, ఈనాడైనా సరే ఏనాడైనా తెలంగాణ ప్రజలే ఉద్యమకారులు. ఆ ఉద్యమ కారులతో చేరి నేనే అసలైన ఉద్యమ కారులమని చెప్పుకోవడంతో నాయకులుకాలేరు. ఇప్పటికే ఉద్యమాల పేరుతో తెలంగాణ మూడు దశాబ్దాలు కోల్పోయింది. సరే తెలంగాణ ఉద్యమం వేరు. వ్యక్తిగత రాజకీయ ఉద్యమం వేరు. కొన్ని ప్రజా సమస్యల మీద నాయకులు ఉద్యమాలు చేస్తారు. నాయకుడిగా వెలుగొందుతారు. కాని తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరిదీ కాదు. అది అందరిదీ…కాని అది కొందరికే ఆ పేరు దక్కింది. చెప్పుకోవడానికి చరిత్రలో చోటు దక్కింది. కాని నాటి ఉద్యమ కారులకు ఏం దక్కింది. పదవి దకిందా? పరపతి దక్కిందా? పేరు దక్కిందా? గుర్తింపు దక్కిందా? ఏదీ దక్కలేదు. ఉద్యమంలో అలుపెరగని పోరాటం కోసం ఆస్తులు ఆవిరి చేసుకున్న వారు ఎంతో మంది వున్నారు. వాళ్లలో 99శాతం మంది పదువులు కాదు కదా? పార్టీ పిలుపు కూడా నోచుకోకుండా పోయారు. జీవితంలో తెల్లబట్టలు వేసుకునే స్ధోమత లేకుండాపోయారు. కూలీలుగా మారి, బతికేందుకు ఒక్కొ మెతుకు ఏరుకుంటున్నారు. ఎవరికోసమే త్యాగం చేసి, జీవితాలు నాశనం చేసుకున్నామని మధన పడుతున్నారు. ఇప్పటికే ఒక తరం కరిగిపోయింది. తెలంగాణ వస్తే అన్ని రంగాలు బాగు పడతాయనుకున్నారు. నీళ్లు వస్తాయనకున్నారు. తెలంగాణ నిధులతో కొన్ని వర్గాలకైనా న్యాయం జరుగుతుందనుకున్నారు. నియామకాలతో జీవితాలు వెలుగుతాయనకున్నారు. వ్యాపారులకు పనులు దొరుకుతాయనకున్నారు. కాంట్రాక్టర్లు పనులు దక్కుతాయనుకున్నారు. కాని తెలంగాణ వచ్చి పదువులు దక్కింది కొందరికే…పెత్తనం చేతికొచ్చింది కొన్ని కుటుంబాలకే..ఆదిపత్యం వచ్చింది ఉద్యమ ద్రోహులకే.. పనులు ఆంద్రా వాళ్లుకు దక్కాయి. ప్రాజెక్టులు ఆంద్రా వాళ్లకే వెళ్లాయి. ఆత్మగౌరవంతో ఉద్యమ కాలంలో అండగా నిలిచిన తెలంగాణ మీడియా కూడా కంటికి కనిపించకుండా పోయింది. ఇంకా ఆంద్రా మీడియా నీడనే బిఆర్‌ఎస్‌ కోరుకుంటుంది. ఎవరికోసం వచ్చింది తెలంగాణ? తెలంగాణ ఉద్యమకారులు ఎంత మంది ఎమ్మెల్యేలయ్యారు? ఎంత మంది మంత్రులయ్యారు? ఎంత మంది జడ్పీ చైర్మన్‌లయ్యారు. ఎంత మంది జడ్పీటీసిలు అయ్యారు. ఎంత మంది ఎంపిపిలయ్యారు. పార్టీలో పెద్దలే కార్యకర్తలను గ్రూపులుగా విభజించి, వారి మధ్య ద్వేశాలు పెంచారు. సొంత గ్రూపుల కోసం ఉద్యమ కారులకు కనీసం సర్పంచ్‌ పదవులు కూడా ఇవ్వకుండా, ఇతరులను ప్రోత్సహించి ఉద్యమకారులను ఓడిరచారు. ఉద్యమ కారులు ఎక్కడ పదువుల్లోకి వస్తే తమను నిలదీస్తారు? నిర్ధేశిస్తారు. అని భయపడ్డారు. అప్పటికీ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వాళ్లను ప్రోత్సహించి ఉద్య్ణమ కారులను పార్టీకి దూరం చేశారు. వారిని కూడా అగ్ర నాయకుల మందు చేతులు కట్టుకునేలా చేశారు. ఇదేనా ఉద్యమంటే..ఇదేనా ఉద్యమ నాయకత్వ లక్షణాలంటే…అది ఆనాడైనా..ఈనాడైనా సరే..ఉద్యమం అంటేనే యువత భవిష్యత్తును నిర్వీర్యం చేయడమే…ఆ కాలం అయిపోయింది. ఎంతో మంది జీవితాలు ఆగమయ్యాయి. తాజాగా సాగుతున్న దేవనపల్లి కవిత ఉద్యమ రాజకీయం ఎవరి కోసం? దేశం కోసమా? ధర్మం కోసమా? రాష్ట్రం కోసమా? ప్రాంతం కోసమా? సమాజం కోసమా? సమ సమాజ నిర్మాణం కోసమా? కాదు..ఫక్తు తన రాజకీయం కోసం! తన రాజకీయ సామ్రాజ్య నిర్మాణం కోసం! తన రాజకీయ భవిష్యత్తు కోసం. తెలంగాణ రాజకీయాలు తన గుప్పిట్లో పెట్టుకోవడం కోసం? అంతే ..ఇదే నిజం. కాని ప్రజల కోసమంటూ, ప్రగతి కోసమంటూ ఆమె చేసే యాత్ర వల్ల జనం బాట వల్ల ఒరిగేదేమీ లేదు. ఏ ఒక్కరికి లాభం లేదు. ఆమె వెంట నడిచే వారికి రాజకీయం దక్కదు. పదవులు రావు. పరపతిరాదు. కనీసం పార్టీలో సమాజంలో గుర్తింపు కూడా దక్కదు. కేవలం యువతలో వుండే ఆవేశాన్ని వాడుకొని తమ రాజకీయ పునాదులు నిర్మాణం చేసుకోవడం తప్ప ఏమీవుండదు. తమ రాజకీయ జీవితం వెలుగొందాలనుకునే వారు ఎవరైనా సరే రెచ్చగొడతారు..యువతలో ఆవేశాలు రగిల్చుతారు. యువతకు అన్యాయం జరుగుతుందంటారు. తనకు వ్యతిరేకరాజకీయ శక్తుల మీద తిరగబడమంటారు. మంటలు రేపుతారు. ఆ రాజకీయ మంటల్లో చలి కాచుకుంటారు. పదవులు వెతుక్కుంటారు. ఆదిపత్యం కోరుకుంటారు. ఇది యువత గమనించాలి. తమ రాజకీయాల కోసం సమాజాన్ని చీలుస్తారు. చిచ్చు పెడతారు. యువత జీవితాలను ఆగం చేస్తారు. రాజకీయాల ఉచ్చుకు బలి చేస్తారు. వారి జీవితాలను ఆగం చేస్తారు. కవిత తాజాగా బిసి రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్‌ పార్టీ జెండా గద్దెలను కూల్చమని పిలుపునిచ్చారు. ఎవరు కూల్చాలి? నిజంగా ఆమె పిలుపులో నిజాయితీ వుంటే ముందు ఆమె రంగంలోకి దిగాలి. జనం బాటలోవున్న కవిత గడ్డపార పట్టుకొని కాంగ్రెస్‌ జెండాలు కూల్చాలి. కాని కూల్చారా? ఎక్కడైనా కాంగ్రెస్‌ గద్దె ముందునిలబడి నిరసన తెలిపారా? కనీసం తన కుమారుల చేత జెండా గద్దెలు కూల్పించారా? బిసి, ఎస్సీ,ఎస్టీ పిల్లలకు రాజకీయ ఆశలు కల్పించాలి. వారి జీవితాలను అదే రాజకీయాలు బిలి కావాలా? కవిత కుమారులు అమెరికాలో చదువుకుంటున్నారు. వారు ఉన్నత చదువులు తెలంగాణలో చదవరు? కాని రాజకీయంగా కవిత బలపడితే తర్వాత కాలంలో వచ్చిన కుర్చీల్లో కూర్చుంటారు. రాజ్యమేలుతారు? కాని కవిత రాజకీయం కోసం పని చేసిన వాళ్లంతా రేపటి రోజు కవిత కుమారులకు కూడా సలాం కొట్టాలి. వారి కనుసైగలతో పనులు చేయాలి. వారికి జేజేలు కొట్టాలి. జిందాబాద్‌లు కొట్టాలి. వారి రాజకీయ భవిష్యత్తు కోసం కూడాపని చేయాలి. అవసరమైతే ఆస్ధులు అమ్ముకోవాలి. భవిష్యత్తును ఫణంగా పెట్టాలి. ఇదేనా రాజకీయమంటే..ఇదేనా యువతకు రాజకీయాలను పరిచయం చేయడమంటే? బిసిలకు రాజ్యాధికారం కావాలని కవిత మాటల చెబితే రాదు. ప్రకటనలు చాలవు. క్షేత్రస్దాయిలో దిగి ఉద్యమం చేయాలి. స్ధానిక సంస్ధల ఎన్నికల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్ననాడు కవిత ఏం చేశారు? కవిత ఎందుకు నిససన దీక్షలు చేపట్టలేదు? ఎందుకు ఆమరణ దీక్షకు కూర్చోలేదు? కవిత ఎందుకు తన జాగృతి ద్వారా పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. అన్నతో విభేదాలు వచ్చాయని జనంలోకి వచ్చారు. అన్నతో పోటీ పడలేక అక్కడ నుంచిపొమ్మన లేక పొగపెట్టుకున్నారు. బైటకు వచ్చారు. రాజకీయం చేయండి. కాని యువతను ఎందుకు ఆగం చేస్తారు? గతంలో ఏం సాదించారని మీ వెంట జనం నడవాలి. జనానికి ఏం చేశారని మీకు జిందాబాద్‌లు కొట్టాలి. కవిత తాజాగా నిజామాబాద్‌ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు అందలేదన్నారు. కామారెడ్డిలో ఒక్కఎకరానికి కూడా నీళ్లు రాలేదన్నారు. మరి ఐదేళ్లపాటు నిజామాబాద్‌ ఎంపిగా వున్నారు? అప్పుడు ఏం చేశారు? నిజామబాద్‌కు నీళ్లెందుకు తేలేదు? తర్వాత స్దానికసంస్దల ఎమ్మెల్సీగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిజామాబాద్‌ ఎండుతుంటే ఏం చేశారు? ఇప్పుడు మాట్లాడడం వల్ల వచ్చేదేముంది? అది ఎంపిగా కవిత వైఫల్యం కాదా? కవితను ఎన్నుకొని అప్పుడు జనం తప్పు చేసినట్లు కాదా? ఇంకా కవితను జనం నమ్మాలా? చేతిలో వున్న పని చేయలేదు. పార్టీ అదికారంలో వున్నప్పుడు నీళ్లు తేలేదు. ఇప్పుడు జాగృతిని జనం ఆదరించి, పార్టీ ప్రకటిస్తే గెలిపిస్తే అప్పుడు నీళ్లు ఇస్తారా? తెస్తారా? అప్పటి దాకా రైతులు సాగును వదిలేయాలా? చెప్పే మాటలకు, చేసే చేతలకు పొంతన వుండదని నిజామాబాద్‌ ప్రజలు తేల్చేశారు. ఓడిరచి పక్కన పెట్టేశారు. ప్రజలు కవిత నాయకత్వం వద్దనుకున్నారు. మరోసారి నమ్మడానికి ఇప్పటికీ సిద్దంగా లేరు. అయినా జనం బాట పట్టి ఎవరిని ప్రశ్నించాలి? ప్రస్తుతం పాలకులను నిలదీయాలి. కాని గతంలో ఏం జరగలేదు అని కవిత ఇప్పుడు చెప్పాల్సిన పనిలేదు. జనమే మార్పు కోరుకున్నారు. యువతను రెచ్చగొట్టి జెండా గద్దెలు కూల్చమని కవిత పిలుపునిచ్చారు. దాంతో జెండా గద్దె కూల్చివేసిన యువకులపై పోలీసులు కేసులు పెట్టారు. వారిని పరామర్శించేందుకు కవిత వెళ్లారా? కవిత మాటలు విని జెండా గద్దెలు కూల్చిన వారి కోసం మళ్లీ ఆమె మాటలు వినేవారు వెళ్లాలి. ఇలా యువత జీవితాలు బలి కావాలి. కవిత లాంటి వారు నాయకులుగా ఎదగడానికి యువత సమిథ కావాలి??

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version