Cancer Prevention Vaccination Drive Begins
క్యాన్సర్ నివారణ టీకాలు ప్రారంభించబడ్డాయి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని కోహీర్ మండలంలో సోమవారం మధ్యాహ్నం క్యాన్సర్ నివారణకు ప్రత్యేక టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ టీకాలను 14 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఇవ్వాలని వైద్యాధికారి నవీన్ కుమార్ మరియు విస్తరణాధికారి నరసింహ సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
