బోర్డు ‘కమీషనర్’ చెబితే వినాలా…?
వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో రోజురోజుకు అవినీతి అక్రమాలతోపాటు, డిఐఈవో లింగయ్య ఒంటెద్దుపోకడకు సంబందించిన విషయాలు కూడా బయటికొస్తున్నాయి. డిఐఈవో ఏకరంగా ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ ఆదేశాలను సైతం పెడచెవిన పెడుతూ కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తున్నది. ఒకవైపు క్యాంపు కార్యాలయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో కొత్తగా నైట్ వాచ్మెన్ రిక్రూట్మెంట్ విషయం గందరగోళానికి గురిచేస్తున్నది. డిఐఈవో లింగయ్యకు ముందు పనిచేసిన డిఐఈవొ మల్హాల్రావు విదులు నిర్వహించిన సమయంలో నైట్‌వాచ్‌మెన్ అవసరంలేదని డిఐఈవోతోపాటు ఇంటర్‌బోర్డు కూడా నిర్ణయించింది. అప్పటి నుండి లేని నైట్ వాచ్మెన్ లింగయ్య డిఐఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇంటర్‌బోర్డు తిరస్కరించి అంశం లింగయ్య మళ్లి తెర మీదికి తెచ్చాడు. నైట్‌వాచ్‌మెన్ వద్దన్న ఇంటర్‌బోర్డు నిర్ణయానికి వ్యతిరేఖంగా ఓ వ్యక్తిని లంగయ్యనే స్వయంగా ప్రైవేటుగా నియమించుకోవడంతో కార్యాలయ సిబ్బందితోపాటు ఆర్జేడి కార్యాలయ సిబ్బంది కూడా అవాక్కయినట్లు సమాచారం. బోర్డు కమీనర్ ఆదేశాలను లెక్క చేయకుండా ప్రైవేటుగా నియమించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొన్నది.
ఆర్డర్ కాపీ లేకుండా ఉద్యోగమెలా సాధ్యమయ్యింది..?
ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయాలంటే ఆయా శాఖల ఉన్నతాధికారుల నుండి అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. కాని వరంగల్ డిఐఈవో కార్యాలయంలో మాత్రం ప్రభుత్వం నుండి ఎలాంటి ఉత్తర్వులు లేకపోగా వద్దన్న పనినే డిఐఈవో పర్సనల్‌గా నైట్ వాచ్‌మెన్‌ను నియమించుకున్నారని ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున ప్రభుత్వ ఉద్యోగి కొందరితో అన్నట్లు సమాచారం. ఆర్డర్ కాపీ లేకుండా ప్రభుత్వ కార్యాలయంలో నైట్ వాచ్‌మెన్‌గా రిక్రూట్ చేసుకోవడంతో అతని వద్ద డబ్బులు ఏమన్నా తీసుకొని ఆ విదంగా నియమించుకున్నారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.